12, ఫిబ్రవరి 2025, బుధవారం

సమస్య - 5032

13-2-2015 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్”
(లేదా...)
“బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్”

37 కామెంట్‌లు:

  1. ఊరేగింపుగవచ్చెను
    మారాముండనుచుమదిని మరి మరి మురిసెన్
    కోరికనాయేనుగునం
    బారుంగని శ్రోత్రియుండు వహ్వాయనియెన్

    రిప్లయితొలగించండి
  2. వేరొండేమియులేనిమానసము నావిజ్ఞుండుతాదాత్మ్యుడై
    సారంబెంచిననాత్మతత్వమున తాసాలోక్యభావంబుతో
    ఆరామున్గని రాజవీథులను సయ్యాట, తోయేనుగం
    బారుంగాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వాయటంచున్గడున్

    రిప్లయితొలగించండి
  3. సూరుల సభ ముగియగనే
    భూరిగ నేర్పాటు జేసి భుక్తినొసగగా
    నారోగిణమున నిడు సాం
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్

    రిప్లయితొలగించండి
  4. కోరిన కూరలు దొరకక
    తీరని యాకలికి తాను దీనత నొందన్
    వేరుగ వండిన దౌ సా o
    బారుo గని శ్రోత్రి యుo డు వహ్వా యనియె న్

    రిప్లయితొలగించండి
  5. కందం
    దారులవన్ని ప్రయాగకుఁ
    జేరుచ సఫలీకృతునిగ 'శ్రీయోగి' కనెన్
    పారావారమటుల జన
    బారుం గని 'శ్రోత్రియుండు' వహ్వా యనియెన్!

    శార్దూలవిక్రీడితము
    సారింపంగను దృష్టి చందురునిపై సంచార శాస్ర్రజ్ఞులున్
    దారుల్ నిండి ప్రయాగఁ జేరు జనులున్ దండోపతండాలు నోం
    కారంబున్ జపియించుచున్ గనబడన్ గర్తృత్వమై 'యోగి' యా
    బారుం గాంచిన 'శ్రోత్రియుండు' మురిసెన్ వహ్వా యటంచున్ గడున్

    (యోగి = ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా! 🙏

      తమరి సవరణతో

      కందం
      కందం
      దారులవన్ని ప్రయాగకుఁ
      జేరుచ సఫలీకృతునిగ 'శ్రీయోగి' కనెన్
      పారావారమటు జనుల
      బారుం గని 'శ్రోత్రియుండు' వహ్వా యనియెన్

      తొలగించండి
  6. నారావారల విందున
    బూరెలు,గారె,పరమాన్న,పులిహోరను,కిస్
    మిస్ రవ్వపు లడ్లను, సాం
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
  7. సారంబంతయు నేర్పునట్టి చదువుల్ స్వాధ్యాయ వేదాంగముల్
    ధారా ధారణ ధోరణుల్ విపులమై తాత్పర్య భావంబులన్
    ధీరోదాత్తుల నిత్య తర్కములె యుద్దీపించుచుండంగ
    ర్బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్!!

    రిప్లయితొలగించండి

  8. వారేకాదశి యనుచును
    శ్రీరాముని దర్శనమ్ము చేసి తరింపన్
    భూరిగ జేరిన భక్తుల
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్.


    శ్రీరామాలయమందు శుద్ధ నవమిన్ జేయంగ సంతర్పణమ్
    భూరిన్ జేరగ భక్తకోటికచటన్ బోనంబునే పెట్టగా
    కూరల్ పచ్చడు లెన్నియో గలిగినన్ కూష్మాండ భంగంపు సాం
    బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్.

    రిప్లయితొలగించండి
  9. పారంగతుడేగెను వ్యా
    పారము విడనాడి విభునిఁ బ్రార్థన సలుపన్
    మారాజు పరిజనముఁ ద
    ర్బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్

    పారంపర్యము సల్పువృత్తి వలనన్ భాగ్యంబు సిద్ధింపకే
    ధారాళంబగు దానమిచ్చు విభునిన్ దర్శింప తర్కించుచున్
    మారాజే దయజూపినంత తనకున్ మాణిక్యముల్ దక్క ద
    ర్బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్

    రిప్లయితొలగించండి
  10. -
    బారెడు ప్రొద్దవకమునుపె
    సారంబొప్పగ సతియె పసందుగ చేయం
    గారో ప్రాణం బగు సాం
    బారుంగని శ్రోత్రియుండు వహ్వా యనియెన్


    రిప్లయితొలగించండి
  11. వేరొక యూరికి నేగిన
    చారికి భోజనమువెట్టు సత్రమునందున్
    కూరలు వడ్డించఁగ సాం
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్

    రిప్లయితొలగించండి
  12. వారాంతంబున సత్యమూర్తి జనియెన్ వాహ్యాళిగా నూరికిన్
    చేరెన్ సత్రమునందు నోగిరముఁదా జెయ్యంగ నా యూరిలో
    వారల్ గారెలు పాయసాన్నములనున్ వడ్డించగా నందు సాం
    బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్

    రిప్లయితొలగించండి
  13. కం:ఊ రెన్నడు విడక ,సదా
    పౌరోహిత్యమ్మె తనకు బతుకై, తన కిం
    పార సుతుడు చూపగ మల
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్”
    (ఈ బ్రాహ్మడికి తన ఊరు,పౌరోహిత్యం తప్ప మరొక లోకము తెలియదు.కొడుకు మలబారు చూపించే సరికి వహ్వా అని ఆశ్చర్య పడ్డాడు.)

    రిప్లయితొలగించండి
  14. కం॥ ప్రేరేపించఁగఁ బలుకుచు
    బారుంగని శ్రోతియుండు వహ్వా యనియెన్
    గ్రూరత్వమ్మగుఁ దప్పగుఁ
    బారావారమును హైందవపు నిష్ఠ కనున్

    శా॥ బారుంగాంచిన శ్రోతియుండు మురిసెన్ వహ్వాయటంచున్ గడున్
    బారావారముఁ జేర్చు హైందవమునున్ బల్గాకులై ధూర్తులై
    క్రూరత్వమ్మును బొంది యీపగిది సంకోచించకన్ దూరఁగన్
    బ్రేరేపించుట గాద తప్పిది సుమా ప్రేలాపనల్ మానవో!

    రిప్లయితొలగించండి
  15. శా:నీరుల్లే కనరాని పప్పు పులుసున్ నిందించగా పెండ్లిలో
    బారుల్ తీరిన భోక్త లెల్ల తనకున్ వర్జ్యమ్ము నీరుల్లి యై
    దూర మ్మందున కూరుచుండి మడి నెంతో నిష్ఠ తో నుండి సాం
    బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్”
    (ఉల్లిపాయి లేని సాంబారు చేసారని బఫే లో ఉన్న వాళ్లు నిందించారు.కానీ తనకి ఉల్లిపాయ నిషిద్ధం కనుక ఆ శ్రోత్రియుడు సంతోషించాడు.బారుల్ తీరిన భోక్తలు=బఫే లో ఉన్న వాళ్లు.నీరుల్లి=ఉల్లిపాయ.)

    రిప్లయితొలగించండి
  16. శా:"మీరల్ బ్రాహ్మణు లయ్య!దేవు డొకడే మీ కైన మాకైన ,న
    ల్లా రాముండును నొక్కడే కద విశాలత్వమ్ము తో జేరితిన్
    శ్రీ రామున్ గన దేవళమ్ము" ననుచున్ జెప్పంగ సాయేబు జ
    బ్బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్
    (ఆ ముస్లిం పేరు జబ్బార్.)

    రిప్లయితొలగించండి

  17. తీఱఁగ సత్వర మా సం
    భారమ్ముల లోటు తొలఁగ బాధలు మదిలో
    మూర ముదము చక్కని యం
    బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్

    [అంబారు = ధాన్యము]


    లేరే పంక్తికి బ్రాహ్మణప్రవర పారీంద్రమ్ము లివ్వేళలో
    రారే నన్ను దరింప నంచు వగపే రాఁ బాద సంచారులై
    యూరూరం దిరుగాడు పావనుల మున్యోఘమ్ము సంద్రమ్ముఁ బో
    ల్బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్

    [బారు = సమూహము]

    రిప్లయితొలగించండి
  18. కం:"తీరగు ధూపము మస్తాన్,
    వేరేదియు కాదటంచు వెదకి వెదకి యా
    యూరంతట మస్తాన్ ద
    ర్బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్”
    (బందరు దుర్గా ప్రసాద్ గారు "దర్బారు" అని పూరించటం తో నాకు "మస్తాన్ దర్బార్" అనే ఐడియా తట్టింది.ఒక చాదస్తుడికి మస్తాన్ దర్బార్ అగరవత్తులు తప్ప ఏ అగరవత్తులూ నచ్చవుట.)

    రిప్లయితొలగించండి
  19. కారుణ్యాలయ పుణ్యసింధు వర గంగా కుంభ పర్వంబునన్
    దారుల్ నిండెను భక్త కోటి జన సంద్రంబై యటన్ కూడగా
    తీరంబంతయు సాధు పుంగవులు శాక్తేయుల్ జటాధారులా
    (బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్)

    రిప్లయితొలగించండి
  20. కోరినయంతనె సతితా
    తీరుగసంతకుచని వడి తెచ్చుచు దుంపల్
    కూరిమితో చేయగ సాం
    *"బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్”*


    శ్రీరామాలయమందుపెండ్లి జరుగన్ చిత్తమ్ము నుప్పొంగ గా
    బారుల్ తీరుచు వచ్చిరందరటకున్ బ్రహ్మజ్ఞులౌ విప్రులున్
    ధారాళమ్ముగదీవెనల్ యొసగుచున్ తామున్ భుజించంగసాం
    *“బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ కడున్”*

    రిప్లయితొలగించండి