క్షేమముఁ గూర్చ రైతుకును జేసె ప్రభుత్వము పాడి పంట భీ మా!మును ముందు పెట్టుబడి మానెనురైతు ధనంబు లేకయే! క్షామముగూర్చెనో పురుగు, కష్టముఁ బూడ్చగనా ప్రభుత్వమే, యేమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్!!
ఉ:క్షేమము లేక చిత్రమగు చీడలు పట్టగ కంది చేల,మా గ్రామము లోన నొక్క డది కాంచెను, ముందుగ మందు వేసి తా సేమము నొందె, నందరికి చేటయి యీతడు లాభ మొందె గా ఏమిది వింత? చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్” (చీడపురుగు వల్ల దేశం లో అందరి పంటా పోయి వీడి పంటకి డిమాండ్ పెరిగి లాభం వచ్చింది.ఒక సామెత ఉంది.భారతదేశపు రైతు విత్తనం వేస్తూ పంట బాగా పండా లని దణ్నం పెడతాడట.అమెరికన్ రైతు పంట పండ కూడదని ,దాని వల్ల తన పంటకి రేటు రావాలనీ కోరుకుంటా డట.)
This is psychological phenomenon అండి. సామాన్యంగా sub-conscious apprehensions కలలో వస్తాయండి. ఉదా పెండ్లికి నగలు కొందామని డబ్బు తెచ్చి పెట్టి యుంటే రాత్రి కలలో దొంగలు పడి దోచుకున్నట్టు, విద్యార్థి పరీక్షలో ఫెయిల్ యైనట్టు కలలు రావడము సామాన్యమండి.
తేటగీతి
రిప్లయితొలగించండినాలుగేల్లుగ నష్టాల నలిగిరెంతొ
చదివి వచ్చిన యువకుని సత్ప్రయోగ
ఫలితమన పిచికారదె చెలఁగ, వీడి
చీడపురుగు, రైతుకు మేలుఁ జేసెనెంతొ!
ఉత్పలమాల
మేమిక సేద్యమున్ విడచి మృత్యువుకౌగిట చిక్కమేలగన్
సేమము గూర్చరెవ్వరని చింతిల చేసిన సత్ప్రయోగమై,
హోమము నందు రాలిపడి హూనమునందిన రీతి వీడ లే
దేమిది వింత చీడపురు, గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్
పండిన యతని పంటకు పట్టె కొంత
రిప్లయితొలగించండిచీడపురుగు ; రైతుకు మేలుఁ జేసెనెంతొ
చీడనాశక మందును చేను నంత
జల్ల గనె , పంట రాబడి జాస్తి యయ్యె
ఆరుగాలము కష్టించి అహరహమ్ము
రిప్లయితొలగించండిపంట చేతికందెడువేళ పట్టెనయ్యొ
చీడపురుగు, రైతుకు మేలుఁ జేసెనెంతొ
పురుగుమందులు జల్లగ పొలమునందు
శాస్త్ర విజ్ఞా న ము వలన సాయ పడగ
రిప్లయితొలగించండిపంట పొలములు దర్శించి బాగు సేయ
నవ్య మందుల తో నాశ న మొన రింప
చీడ పురుగు :: రైతుకు మేలు చేసె నెంతొ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపైరు నంతకు చీడయు పట్టెనంత
రిప్లయితొలగించండిఫలిత మెటులనుండుననియు దలచి నపుడు
జల్లె బలిమి పురుగుమందు,చనిననంత
చీడపురుగు; రైతుకు మేలుఁ జేసెనెంతొ
రిప్లయితొలగించండిఏపుగను పెరిగిన పైరు కెట్లు సోకెనొ
తెగులటంచు బాధపడక తెలివి తోడ
మంచి మందులు వాడ నశించుచు నట
చీడపురుగు , రైతుకు మేలుఁ జేసెనెంతొ.
రాముని దర్శనమ్మునకు రాక్షసుడే యట కేగుదెంచగా
క్షేమము కాదు శత్రువని కీశములెల్ల దలంచనేమి సం
గ్రామమునన్ విభీషణుడె రావణు జావుకు హేతువయ్యెనే
యేమిది వింత , చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్.
క్షేమముఁ గూర్చ రైతుకును జేసె ప్రభుత్వము పాడి పంట భీ
రిప్లయితొలగించండిమా!మును ముందు పెట్టుబడి మానెనురైతు ధనంబు లేకయే!
క్షామముగూర్చెనో పురుగు, కష్టముఁ బూడ్చగనా ప్రభుత్వమే,
యేమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్!!
చీడ పీడల బారిన చిక్కినతరి
రిప్లయితొలగించండితగిన పరిశోధన సలిపి తాను తెచ్చి
నవ్యమైన నోషధిఁ జల్ల నాశమొంది
చీడపురుగు రైతుకు మేలుఁ జేసెనెంతొ
తామొక పంటవైచినను తత్ఫల మేలభియింపకుండగా
మోమున కాంతిలేక కృషి మొత్తము నిష్ఫలమైన వేళలో
ధీమసమొప్పగా నటకు తెచ్చిన మందును చల్లిచూడ రా
దేమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్
--
రిప్లయితొలగించండిపంట లెల్ల నాశంబాయె బైజికమ్ము
చీడపురుగు; రైతుకు మేలుచేసె నెంతొ
ఫర్టిలైజర్లు విరివిగ పాడిపంట
లెల్ల వృద్ధిచెందెను చూడ లెస్సగాను
భూమినిదున్ని సేద్యమును పొల్పుగ జేయగ నన్నదాత యా
రిప్లయితొలగించండిభూమిఁ జనించు పైరులకు భోరున బట్టెను చీడ యంతటన్
క్షేమముఁగూర్చు మందులను జిల్కగ పంటలు పండె మెండుగన్
యేమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్
తే.గీ:మిత్రమా ! నీవు సూచించు మేటి దైన
రిప్లయితొలగించండిపురుగు మందును జల్ల మా పొరుగు రైతు
లొక్క దినమున నశియించుచుండ చేన
చీడపురుగు, రైతుకు మేలుఁ జేసెనెంతొ”
ఉ:క్షేమము లేక చిత్రమగు చీడలు పట్టగ కంది చేల,మా
రిప్లయితొలగించండిగ్రామము లోన నొక్క డది కాంచెను, ముందుగ మందు వేసి తా
సేమము నొందె, నందరికి చేటయి యీతడు లాభ మొందె గా
ఏమిది వింత? చీడపురు గెంతయొ మేలొనఁగూర్చె రైతుకున్”
(చీడపురుగు వల్ల దేశం లో అందరి పంటా పోయి వీడి పంటకి డిమాండ్ పెరిగి లాభం వచ్చింది.ఒక సామెత ఉంది.భారతదేశపు రైతు విత్తనం వేస్తూ పంట బాగా పండా లని దణ్నం పెడతాడట.అమెరికన్ రైతు పంట పండ కూడదని ,దాని వల్ల తన పంటకి రేటు రావాలనీ కోరుకుంటా డట.)
తే॥ రైతు దేవుని యాచించ శ్రమకు ఫలముఁ
రిప్లయితొలగించండిగలను చీడపురుగొకటి కలత వెట్ట
తగిన పగిది జాగ్రతఁగనఁ దనరె ఫలము
చీడపురుగు రైతుకు మేలుఁ జేసె నెంతొ
ఉ॥ నేమము తోడ సేద్యమును నిత్యముఁ గాంచఁగ స్వప్నమందునన్
దోమలు చీడపుర్వుఁ గన దోహద మయ్యెను జాగరూకుఁడై
యేమరుపాటు వీడి చన నెంతయొ రక్షను గాంచి సర్వదా
యేమిది వింత చీడపురు గెంతయొ మేలొనఁ గూర్చె రైతుకున్
This is psychological phenomenon అండి. సామాన్యంగా sub-conscious apprehensions కలలో వస్తాయండి. ఉదా పెండ్లికి నగలు కొందామని డబ్బు తెచ్చి పెట్టి యుంటే రాత్రి కలలో దొంగలు పడి దోచుకున్నట్టు, విద్యార్థి పరీక్షలో ఫెయిల్ యైనట్టు కలలు రావడము సామాన్యమండి.
వంత తొలఁగె రైతన్నకుఁ బాము వలన
రిప్లయితొలగించండివాని భాగ్యమ్ము నేమని పలుక నేర్తు
మూషికమ్ముల భక్షించి మూఁగకున్నఁ
జీడ పురుగు రైతుకు మేలుఁ జేసె నెంతొ
[పురుగు = పాము]
కామిని సేరి శూర్పణఖ క్రన్నన నన్నకు నిచ్చె నాకమున్
గోముగఁ జేరి మంధర ప్రకోపిని రాజ్య మొసంగెఁ గైకకున్
భూమిని ధార్తరాష్ట్రుఁడు విభూతినిఁ గర్ణున కిచ్చె చెల్మిమై
యే మిది వింత చీడపురు గెంతయొ మే లొనఁగూర్చె రైతుకున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పంట నష్టము కలిగించ ప్రతిదినంబు
చీడపురుగు; రైతుకు మేలుఁ జేసెనెంతొ
సేంద్రియపు మందు చల్లగ చెట్ల పైన
బలమునకు సేంద్రియపుటెర్వు వాడగాను.