కం:కారా గారు రచయితగ నీ రాష్ట్రమునన్ బ్రసిద్ధులే కానీ యిం పారగ కచేరి జరిగెను కారాగృహమున, ధ్వనించె గాంధర్వమ్ముల్” (కాళీపట్నం రామారావు రావు గా రనే ఒక ప్రసిద్ధ రచయిత ఉండేవారు.వారిని కారా మాస్టారు అనే వారు.ఆయన రచయితగా ప్రసిద్ధు లైనా వారింట్లో ఒక సంగీత కచేరీ జరిగినట్లు.)
శా:"హే రామా !" యను బమ్మ నొక్కనిని మే మీ ఖైదు నం దుంచి నో రారన్ దిట్టుచు గొట్టినన్ గినుక లే కే పాటలో పాడు వి న్నారా మీరు జహాపనాహ్ !మథురమౌ నా శాయరీల్ పాడెడిన్ కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్” (రామదాసు గారు ఖైదులో ఎలా విచిత్రం గా ప్రవర్తిస్తున్నదీ తానీషా భటులు తానీషాకి చెప్పినట్లు. మహమ్నదీయులు రాజుని జహాపనాహ్ అని పిలుస్తారు.శాయరీ అంటే కవిత్వం.గోపన్న అనే బదులు ఆ రామా రామా అనే బమ్మన్ అన్నారు.)
Mistaken identity అండి. Which is not too very uncommon. ఇది విషాదనాలంకారమునకు ఉదాహరణ కాగలదాండి! 1970-72 మధ్య BSc సంస్కృతములో చదివినదేనండి. తెలిపిన వారికి ధన్యవాదములు
ఆరామునిదాసుడు తా
రిప్లయితొలగించండినారాధించెడి దశరథునాత్మజువేడెన్
భారము గీతాలాపన
కారాగృహమునధ్వనించెగాంథర్వమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిశ్రీరామదాసు చెరలో
శ్రీరాముని నిందలాడి సేమము గోరన్
కారుణ్య కీర్తనమ్ముల
కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
శార్దూలవిక్రీడితము
"శ్రీరామా! గుడిఁ గట్టగన్ ధనమునే చెల్లింప దోషమ్మనన్
మారాజుల్ జవదాటితంచు చెరలో మై హూనమున్ జేసి"రం
చారాధించిన రామదాసు,దయకై యర్థించి కీర్తింపఁగన్
కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపారంపర్యమె రాగ సాధనమటన్ పాండిత్య వైచిత్రికిన్
రిప్లయితొలగించండిసారంబంతయు నొక్క చోట నిలిచెన్ సద్గోష్ఠి సాగంగ సం
భారంబంతయుఁ జక్కఁ జేరె మనకై వాగ్దేవి సంగీత సం
స్కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినేరా రో పణ మీదను
రిప్లయితొలగించండిచేరెను శ్రీ రామ దాసు చెర సాలను దా
శ్రీరా ముని కీ ర్తిం ప గ
కారా గార మున ధ్వని o చె గాంధ ర్వ మ్ము ల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేరాలెన్నో జేసిన
రిప్లయితొలగించండిహారకులను రక్షకభట హస్తము తోటిన్
కర్రలతో మోదగ నా
కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారుణ శిక్షకు తాళక
రిప్లయితొలగించండిరారాయని రామదాసు రామునిబిలిచెన్
శ్రీరాముని జేరెనుగద
కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
ఆరామాలయమున్ సృజింప మదిలో నానందముప్పొంగగా
వీరావేశము పెంపుమీర ధనమున్ వెచ్చించె గోపన్నయే
శ్రీరామాయని రామదాసు వగచెన్ శిక్షార్హతన్ బొందగా
కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆరని కినుకన కంసుడు
రిప్లయితొలగించండిచారువగు తన చెలియలిని చారము ననిడన్
ఆ రమణి బిడ్డను గనగ
కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కినుకను..' అనండి.
-
రిప్లయితొలగించండిపేరున్న గాయనీమణి!
ప్రారబ్ధమ్మున తడుమన పడు పెనిమిటి ! కం
జారమ్మె సభాస్థలిగా
కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:కారా గారు రచయితగ
రిప్లయితొలగించండినీ రాష్ట్రమునన్ బ్రసిద్ధులే కానీ యిం
పారగ కచేరి జరిగెను
కారాగృహమున, ధ్వనించె గాంధర్వమ్ముల్”
(కాళీపట్నం రామారావు రావు గా రనే ఒక ప్రసిద్ధ రచయిత ఉండేవారు.వారిని కారా మాస్టారు అనే వారు.ఆయన రచయితగా ప్రసిద్ధు లైనా వారింట్లో ఒక సంగీత కచేరీ జరిగినట్లు.)
శా:"హే రామా !" యను బమ్మ నొక్కనిని మే మీ ఖైదు నం దుంచి నో
రిప్లయితొలగించండిరారన్ దిట్టుచు గొట్టినన్ గినుక లే కే పాటలో పాడు వి
న్నారా మీరు జహాపనాహ్ !మథురమౌ నా శాయరీల్ పాడెడిన్
కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వసంగీతమున్”
(రామదాసు గారు ఖైదులో ఎలా విచిత్రం గా ప్రవర్తిస్తున్నదీ తానీషా భటులు తానీషాకి చెప్పినట్లు.
మహమ్నదీయులు రాజుని జహాపనాహ్ అని పిలుస్తారు.శాయరీ అంటే కవిత్వం.గోపన్న అనే బదులు ఆ రామా రామా అనే బమ్మన్ అన్నారు.)
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం॥ సారించి నేర్చి గానము
రిప్లయితొలగించండిధారాళంబుగ వరలఁగ దౌర్భాగ్యమ్మో
నేరస్తుఁడనుచుఁ జెఱనిడఁ
గారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
శా॥ పారావారముఁ జేర్చు గానమని సంభావించి సంగీతమున్
ధారాళంబుగ నేర్చి వర్తిలనహో దౌర్భాగ్యమే క్రమ్మెనో
నేరారోపణఁ జేసి తప్పుగనటుల్ నిందించి యుంచన్ జెఱన్
గారాగారమునన్ ధ్వనించె వినుడా గాంధర్వ సంగీతమున్
Mistaken identity అండి. Which is not too very uncommon.
ఇది విషాదనాలంకారమునకు ఉదాహరణ కాగలదాండి! 1970-72 మధ్య BSc సంస్కృతములో చదివినదేనండి. తెలిపిన వారికి ధన్యవాదములు
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినేరము దేశ్యపదము. నేరస్థుఁడు, నేరారోపణ రెండు నసాధువులు.
తొలగించండిఅలంకరము:
ఇది కావ్యాలంకార చూడామణి లో నుదహరించిన 36 అలంకారములలో రసవదలంకారములలోఁ గరుణారసాలంకారమున కుదాహరణము కాఁగలదని నాయభిప్రాయము.
వారక మనోహరముగాఁ
రిప్లయితొలగించండిదారాధ్వము కంప మంద దశ దిశ లద్రువన్
మీరలు పాడిన వారలు
కారా గృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్
వే రాఁబట్టఁగ వారు కోరు నిజముం బేట్రేగి యా రాత్రి యౌ
రా రక్షా భట నామధేయు లతి గర్వాంధుల్ బలాధిక్యులై
ధారాళమ్ముగఁ గొట్టు చుండ నరులన్ దాక్షిణ్య హీనాత్ములై
కారాగారమునన్ ధ్వనించె వినుఁ డా గాంధర్వ సంగీతమున్
తీరుగకంసుని జంపగ
రిప్లయితొలగించండిశౌరియవతరించినంతజననియు ము రియన్
తీరును కష్టములనుచును
*"కారాగృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్”*
క్షీరాబ్దిన్ నిదురించు శ్రీహ రియు తా చేరెన్ భువిన్వేగమా
క్రూరాత్ముండగుకంసుచెయ్దముల టన్ కూల్చంగ నూహించు చున్
పారంద్రోలసురాళిబాధలనునింపారంగ పుట్టంగనా
*“కారాగారమునన్ ధ్వనించె వినుఁడా గాంధర్వ సంగీతమున్”*