2, ఫిబ్రవరి 2025, ఆదివారం

సమస్య - 5022

3-2-2015 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సౌరభము లేదు మెచ్చిరి చంపకమును”
(లేదా...)
“సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్”

30 కామెంట్‌లు:

  1. బుద్ధమార్గముజెప్పెనుబోధి నీడ
    సరసభావంపుకవిరాజు సౌందరుండు
    సుందరాననుమందునశోభజెందె
    సౌరభములేదుమెచ్చిరి చంపకమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సౌందరుడు' అన్న ప్రయోగం లేదనుకుంటాను. 'సుందరాననమందున' టైపాటు.

      తొలగించండి
    2. సరసభావంపుకవిరాజు సౌమ్యుడతఢు

      తొలగించండి
  2. సౌందరనందముఆధారంగా
    రచన పింగళి కాటూరి

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    వేదికై యవధానము వేడ్కజేసె
    మానితముగ విచ్చిన పద్యసూనమనఁగ
    పులకరించిరి, చుట్టున్న పుష్పములను
    సౌరభము లేదు, మెచ్చిరి చంపకమును!

    ఉత్పలమాల
    నేరుపు మీరగన్ జెలఁగి నిద్దురలేపుచు పండితాళినే
    ధారగ పద్యసూనమవధానియె విచ్చఁగ గూర్చినంతటన్,
    దీరిన పుష్ప గుచ్ఛములు దేలఁగ వేదిని తావి మృగ్యమై
    సౌరభమింత లేదు. ,మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్!

    రిప్లయితొలగించండి
  4. పండిత ధురంధరుడు దన పద్యమందు
    నజభ జజజర గణముల నాటుకొనగ
    జేయ , దాని వలననె కొంచియమయినను
    సౌరభము లేదు , మెచ్చిరి చంపకమును

    రిప్లయితొలగించండి

  5. నకులుడుత్తర గోగ్రహణమ్ము వేళ
    ననిని సాగించి విజయము నందెననుచు
    విరటుడు సుతుని పొగుడుట వినిన యంత
    సౌరభము లేదు మెచ్చిరి చంపకమును.


    ఊరక వచ్చునే విజయ ముత్తర గోగ్రహణమ్ము వేళలో
    వీరుడు శూరుడౌచు నరివీరుల భీతిలజేసె నుత్తరుం
    డారణమందు నంచు ముదమందుచు పల్కు విరాటునిన్ గనన్
    సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్.

    రిప్లయితొలగించండి
  6. పూరణ రసరమ్యమగుచు పులకలిడగ
    సౌరు గలిగిన పద్యమ్ము చంపకమును
    కారకుడగు సర్వరసుని గాంచిరచట
    సౌరభము లేదు మెచ్చిరి చంపకమును

    [సౌరు = చక్కదనము]

    పూరణ చేసెనా సుకవి పూవుల తేనియ పంచినట్లుగా
    ధారుణి మెచ్చు పండితుడు ధారణ చేసిన చంపకమ్మదే
    కారణ జన్ముడై తనరు గాయకుడై వినిపించె కమ్మగా
    సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్

    రిప్లయితొలగించండి
  7. తేటగీతిని నొకకవి తేటపరచ
    సౌరభము లేదు; మెచ్చిరి చంపకమును
    పండితోత్తమ పద్యము పంచియుండ
    శంకరా భరణమునందు సభయు జరుగ

    రిప్లయితొలగించండి
  8. కవిత్వము యొక్క సౌరభాన్ని హృదయముతో చూడాలి, ముక్కుతో కాదు:

    సారము నింపు వాక్కులు ప్రసారముఁ గాగ హృదాంతరంబులన్
    నేరుగఁ దాకు పద్యమది నిర్మలమౌ కవితా రసంబునన్
    సౌరభమయ్యె! ఘ్రాణమునుఁ జాచుచు వాసన జూచి నంతటన్
    సౌరభమింత లేదు! మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'హృదంతరంబులన్' అనండి.

      తొలగించండి
  9. పట్టు బట్టియు నొక్కడు పద్య మల్ల
    సౌరభ ము లే దు :: మెచ్చిరి చంప కమును
    సభ ను జెప్పిన నవధాని చక్క నైన
    భావ పూరిత పద్య మున్ పండి తాళి

    రిప్లయితొలగించండి
  10. చేరి వధాని పృచ్ఛకులు చెప్పిన రీతిగ పద్య పూరణల్
    తీరుగ తేటగీతులను, దీయని యాటవెలంది, కందముల్
    సౌరుగ నుత్పలాది పలు చక్కని వృత్తములందు జేసినన్
    “సౌరభమింత లేదు మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్”

    రిప్లయితొలగించండి
  11. పృచ్ఛకాగ్రణు లెల్లరి యిచ్ఛ మేర
    పద్యపూరణల్ సలిపెను పండితుండు
    పద్యములయందు జేసిన వర్ణనముల
    సౌరభము లేదు మెచ్చిరి చంపకమును

    రిప్లయితొలగించండి


  12. “సౌరభమింత లేదు, మరి చంపకమాలను మెచ్చిరెల్లరున్ “

    మారెడు పత్రరాజముకె మాన్యత లోకులొసంగుటేలనో
    “సౌరభమింత లేదు, మరి చంపకమాలను మెచ్చిరెల్లరున్”
    తీరని శాపమాయెనట దేవమునివ్వగ చంపకంబుకున్
    చేరగ లేదు జంగముని సేవకు నోచుకొనంగ లేనిదై

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:తుమ్మెదకు నచ్చు నేదియో కమ్మ నైన
    సౌరభము లేదు, మెచ్చిరి చంపకమును
    నంది తిమ్మన గారు తా మందము గని
    సౌకుమార్యత గని మెచ్చిరో కవీంద్ర!
    (తుమ్మెద సంపెంగ ని మెచ్చదు అనే పద్యం రాసిన నంది తిమ్మన గారికి చంపక మంటే అంత ఇష్టం దేనికి? సౌకుమార్యము,అందము నచ్చి ఉండవచ్చు.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:చేరి రుగాదికిన్ గవులు చెప్ప కవిత్వము వారి లోన నిం
    పారగ గేయముల్ మథుర మౌగతి వ్రాయగ నెందరో కవుల్
    వారల నొక్క పద్యకవి వ్రాసెను చంపకమాల దానిలో
    సౌరభమింత లేదు, మరి చంపకమాలను మెచ్చి రెల్లరున్”
    (గేయా లెంత బాగున్నా వాటిని మెచ్చక అందం లేని చంపకమాలని మెచ్చుకున్నారు.)

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. కాకి పిల్ల కాకికి ముద్దు గాదె కరము
      కన్న వారు దోషమ్ములఁ గాంచఁ గలరె
      యాత్మ నందన కకట విద్యాఖ్య కుసుమ
      సౌరభము లేదు మెచ్చిరి చంపకమును


      ఆరయ మెందుఁ జంపకము లంచిత శబ్ద దళమ్ములుండఁగా
      నారయ మొక్క కేశరము నక్షర రాశికిఁ గొమ్ము లుండఁగా
      నారయ మెట్టి రంగులను నద్భుత వర్ణము లందగింపఁగా
      సౌరభ మింత లేదు మ‌ఱి చంపకమాలను మెచ్చి రెల్లరున్

      తొలగించండి