14, ఫిబ్రవరి 2025, శుక్రవారం

సమస్య - 5034

 15-2-2025 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోటికిం గట్టె రాముని ద్రోవది సతి”
(లేదా...)
“రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్”

20 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వేరు యుగముల పాత్రల విస్తుగొలుపు
    వాక్యమల్లగఁ గోరఁగ ప్రాణ సఖుఁడు
    నా శకారుఁడున్ బూనగ నంటివేమొ?
    "రోటికిం గట్టె రాముని ద్రోవది సతి"

    ఉత్పలమాల
    తోటను మిత్రులున్ గలిసి తోచక యాడిరి భిన్న రీతినిన్
    మాటలు నల్లగన్ బనికిమాలిన కూతల మెప్పుఁ బొందఁగన్
    సాటి శకారుడున్ దగని శైలిని గూసె నొకండు నిట్టులన్,
    "రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్"

    రిప్లయితొలగించండి
  2. అర్థ వంతము లేనట్టి హాస్యముగ ను
    జెప్పు వాక్య ము నొక్కటి చెన్ను మీర
    ననుచు కోర గ వాడిట్టు లనియె
    రోటి కి o గట్టె రాముని ద్రోవది సతి "

    రిప్లయితొలగించండి
  3. తల్లి కృష్ణుని శిక్షించ నల్లరిఁగని
    తనను జేకొనె జానకి పెనిమిటిగను
    యేవురిని పెండ్లియాడిన దెవ్వరొక్కొ
    రోటికిం గట్టె, రాముని, ద్రోవది సతి

    రిప్లయితొలగించండి
  4. బోటి యశోద కోపమున పోరడు కృష్ణుని నేమి జేసెనో?
    తాటకఁ జంపుమంచు ఘన తాపసి యెవ్వనిఁ గోరె? నగ్నిలో
    మేటిగఁ బుట్టెనెవ్వరది? మేలుగ రుక్మిణి పుట్టెనెచ్చటన్?
    రోటికిఁ గట్టె, రాఘవుని, ద్రోవది, కుండిన పట్టణమ్మునన్!!

    రిప్లయితొలగించండి
  5. ధాటిగ మాటలాడు పలు ధార్మిక వేత్తల సూక్తులన్నిటిన్
    మాటికి మాటికిన్ నిముసమైనను వీడక దూరదర్శినిన్
    పాటిగ విన్న బాపడిక స్వప్నమునన్ గనెనెల్ల మిశ్రమై
    రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. రమ్యమగు రీతిని సమస్యలను బరిష్క
    రింతు వనియెంచి యిచ్చినారీ విధముగ
    నింపుగ సమస్యను దగ పూరింపవలయు
    'రోటికిం గట్టె రాముని ద్రోవది సతి'

    మేటిగనెల్లవేళలను మేమిడు చిక్కుల సాధకుండవై
    దీటగు పూరణమ్ములిడు ధీమతివీవని యిచ్చియుంటిరే
    నేటిసమస్యనివ్విధిని నీవిక పద్యము పూరగింపుమా
    'రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాటముగాయశోద తన బాలుడు వెన్నునిగట్టెనెచ్చటన్?
      మేటిమహీజ తానచట మెచ్చినదెవ్వనిఁ? బంచభర్తలన్
      మేటిగ పొందెనెవ్వరిట? మెల్తుక రుక్మిణి జన్మమెచ్చటో?
      రోటికిఁ గట్టె; రాఘవుని; ద్రోవది; కుండిన పట్టణమ్మునన్

      తొలగించండి
  7. ఏటికి నల్లరంచు జనయిత్రి విధించెను శిక్ష కృష్ణుకున్,
    దీటుగ పెండ్లియాడె సుదతీమణి సీత స్వయంవరమ్మునన్,
    పాటిగ కుంతిపుత్రులకు వల్లభ, రుక్మిణి పుట్టె నిచ్చటన్
    రోటికిఁ గట్టె, రాఘవుని, ద్రోవది, కుండిన పట్టణమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. క్రమాలంకారమునందు

    తే॥ కృష్ణునిం గట్టె నంబయె కినుక వడసి
    ధర్మమిలను రూపునొదవి తాల్చె నంద్రు
    పంచభర్తృకగ భువిని పరిఢవిల్లె
    రోటికిం గట్టె రాముని ద్రోవది సతి

    ఉ॥ ఆటల నల్లరిన్ గనఁగ నంబయె దేనికి గట్టెకృష్ణునిన్
    మేటిగఁ గొల్తురీతనిని మేదిని నేవురు భర్తలన్ గనెన్
    బోటిని రుక్మిణిన్ గొనియె బుద్ధిగ కోరఁగఁ గృష్ణుఁడిచ్చటన్
    రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:కృష్ణ లీల లద్భుతము లీ పృథ్వి పైన
    బాలు డనుకొని మాయ లో పడి యశోద
    రోటికిం గట్టె, రాముని ద్రోవది సతి
    వేడెనే రక్షకై గృష్ణు వేడె గాని?
    (లీల లన్నీ కృష్ణావతారం లోనే ఉంటాయి కానీ రామావతారం లో కాదు.యశోద తో కట్టేయించుకున్నా కృష్ణుడే,ద్రౌపదిని కాపాడినా కృష్ణుడే కానీ రాముడు కాదు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:పాటల బాడు నా సతి శుభమ్మని పచ్చగ నొక్క దారమున్
    రోటికిఁ గట్టె, రాఘవుని, ద్రోవది, కుండిన పట్టణమ్మునన్
    ధాటిని జూపు గృష్ణు పయి తాళము రోకలి పోటె కాగ బల్
    పాటలు బాడె సందడిగ బంధువు లెల్లరు సంతసించగన్ .
    (పెళ్లి పనులలో రోటికి పసుపు దారం కడతారు.ఆ అమ్మాయి రోట్లో రోకలి తో దంచుతూ రాముడి మీద,ద్రౌపది మీద,రుక్మిణీ కళ్యాణం మీద పాటలు పాడింది.పల్లె టూళ్లలో శ్రామికులు కూడా ఇలా జానపదగీతాలు పాడే వాళ్లు.ఆ రోకలి పోటే ఆమె పాటకు తాళం.)

    రిప్లయితొలగించండి
  11. గిరిధరుని తోడుగ యశోద గృహమునగల
    రోటికిం గట్టె రాముని ; ద్రోవది సతి
    పయిట కొంగునందున గట్టె పాండవులను
    వనితల విధమిటుల నుండు వసుధయందు

    రాముడు = బలరాముడు

    రిప్లయితొలగించండి
  12. ద్వాపరయుగ,త్రేతాయుగ ద్వయము నేక
    పదముగ కలిపి పరమగు వాక్యమొకటి
    చెప్పమని నడుగగురువు, చెప్పె పాఠి
    రోటికిం గట్టె రాముని ద్రోవది సతి

    రిప్లయితొలగించండి
  13. ఇంత తర్కింప నీ కెద నేల నయ్య
    కన్న వెల్ల సత్యమ్ములు కావు సుమ్ము
    ఘోర మిట్లనఁ గుండకు నేరు నమ్మ
    రోటికిం గట్టె రాముని ద్రోవది సతి

    [నమ్మరు + ఓటికిం= నమ్మ రోటికిం]


    పాటవ మొప్పసంతతము పద్మ దళాక్షుఁడు దుష్ట శిక్ష నా
    నాట సెలంగ ద్వాపరము నందు రమా పతి రామచంద్రుఁ డ
    వ్వీట జనింపఁ గృష్ణునిగ వేదనఁ గృష్ణ స్వకీయ భక్తి య
    న్రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్

    [ద్రోవదికి + ఉండిన = ద్రౌపది కున్న; ఆసమయములో ద్రౌవది కున్న పట్టణము హస్తినాపురము]

    గమనిక:
    ఇక్కడ “ఱోటికి” లోని శకట రేపము “భక్తి యన్రోటికి” లో లఘు రేఫమగుట గమనార్హము. అప్పుడు యతి చక్కఁగా సరిపోవును. ఱ- ర లకు యతి నేను వాడను.

    రిప్లయితొలగించండి
  14. క్రమాలంకార పూరణలు

    వెన్న దొంగిలించ యశోద వెన్నునపుడె
    కనకమృగముకోరెనుసీత కానలోన
    పంచ భర్తృకగనిలను ప్రతిథి నందె
    *"రోటికిం గట్టె, రాముని, ద్రోవది సతి"*

    చీటికి మాటికిన్ విడక చిందులు వేసెడిగోపబాలునిన్
    బోటియుకోరెనెవ్వరిని పూజ్యుడటంచు తలంచెనెవ్వరిన్
    మేటిగపంచభర్తృకనమేదిని,రుక్మిణివాసముండె తా
    "రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్"




    రిప్లయితొలగించండి
  15. శ్రీ కందిశంకరయ్య గురువులకు నమస్సులతో, విన్నకోట విజయసాగర్.

    తే.
    చిన్నికృష్ణు నల యశోద సేసె నేమి
    సీత కృష్ణవర్ణు నెవనిఁ జెలిమిఁ జేరె
    కృష్ణు నే కృష్ణ ప్రార్థించెఁ గీడు గల్గ
    రోటికిఁ గట్టె, రాముని, ద్రోవదిసతి!

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కట్టె కృష్ణుని దేనితో పట్టి తల్లి?
    అవనిజ సభలో పరిణయమాడె నెవని?
    పంచభర్తృక యను పేరు బడసె నెవరు?
    రోటికింగట్టె; రాముని; ద్రోవది సతి.

    రిప్లయితొలగించండి