9, ఫిబ్రవరి 2025, ఆదివారం

సమస్య - 5029

10-2-2015 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోషకాల మొసఁగు తోషమెంతొ”
(లేదా...)
“దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్”

33 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    చిత్తమందునిల్పి శివరాత్రి పర్వాన
    పార్వతీశుఁ గొల్చి భక్తిఁ బూని
    ప్రీతి వేచి చూడ లింగోద్భవమగు ప్ర
    దోషకాల మొసఁగు తోషమెంతొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      ప్రేషంబై మదినిల్వ భక్తి శివరాత్రిన్ శ్రీమహాదేవునిన్
      వేషాతీతులుగన్ భజించుచుఁ దగన్ విశ్వాసమేపారగన్
      శ్లేషార్థంబుల నిందలన్ బొగడగన్, లింగోద్బవమ్మొప్పు ప్రా
      దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. నయముతోడ హరియు నారసింహుడుగాగ
    కంబమందుబుట్టిఖలునిజంపె
    మూడుసంజలచట ముడివడు వేళప్ర

    ప్రదోషకాలమొసఁగుతోషమెంతొ

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. దోషజ్ఞుల్ తగనిర్ణయించినను సంతోషమ్ము కల్గించునా
      దోషంబేమియులేనిదైన జన సందోహమ్ము చేకూరునా
      శేషావస్థను కల్గియున్న ముదుకల్ శ్రేష్ఠంబుగానెంచు ని
      ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "విభవ మొసగు ననుచు" అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురూజీ 🙏

      విభవమొసగుననుచు శుభముహూర్తములెల్ల
      వెదకి మంచివెంచి పెండ్లికొరకు
      వ్రాసి యుంచినట్టి లగ్నములందు ప్ర
      దోషకాల మొసఁగు తోషమెంతొ

      తొలగించండి
  4. చిత్త మందు శివుని చిన్మయ రూపమ్ము
    భక్తి తోడ నిల్పి శక్తి కొలది
    కొలుచు వాని కపుడు కోరిక తీరి ప్ర
    దోష కాల మొ సగు తో ష మెం తొ

    రిప్లయితొలగించండి
  5. సాహితీసదమున శ్రమనొంది యింటికి
    తిరిగి వచ్చి యలుపు తీర్చు కొనుచు
    బత్ని చెప్పు వలపు పలుకులను విను ప్ర
    దోషకాల మొసఁగు తోషమెంతొ

    రిప్లయితొలగించండి

  6. చిత్తశుద్ధితోడ శివరాత్రి దినసాన
    భవుని గొలువవలయు భక్తి తోడ
    నభవమిచ్చు వాని యభిషేక మదియె ప్ర
    దోషకాల మొసఁగు తోషమెంతొ.


    ఆషాఢమ్మున కూడదందురిల కళ్యాణమ్ములన్, వద్దనన్
    రోషావేశము లేలరా బుధులు పౌరోహిత్యమున్ జేసెడిన్
    భాషాయోషకు తుల్యుడే తెలిపెనే ప్రాశస్త్య మైనట్టి ని
    ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  7. తోషంబెల్ల నశించి మానవులకున్ దుఃఖంబె సంప్రాప్తమౌ
    దోషంబైన ముహూర్తమందు పనులన్ తూర్ణమ్ముగా సల్పినన్
    ఆషామాషిగ గాక చేయు పనులందాసక్తి పెంపార ని
    ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి పద్య తెనుగున లిఖియించి
    పండితోత్తమునకు ప్రథమ జూప
    తప్పులుండి దిద్ది దండించునపుడు నా
    దోషకాల మొసఁగు తోషమెంతొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్య, ప్రథమ' అని విభక్తి ప్రత్యయాలు లేకుండా వ్రాయరాదు. "తేటగీతి నొకటి తెనుగున లిఖియించి । పండితునకు మొదట పరగ జూప..." అనండి.

      తొలగించండి
  9. ఈషన్మాత్రము నాత్రమేల మరి చేయిన్ బట్టి పెండ్లాడగన్
    మేషంబే నిలయంబు భాస్కరునకున్ మేలైన లగ్నంబదే
    భాషాభర్తల నిర్ణయంబె మనలన్ బంధంబునన్ నిల్పు ని
    ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్!!

    రిప్లయితొలగించండి


  10. మాఘ మాస మందు మారహరునెపుడు
    మదిని తలచి జనులు మాను గాను
    *"పరమ శివుని పూజ భక్తితో చేయ ప్ర
    దోషకాలమొసగు తోషమెంతొ

    దోషంబెల్లతొలంగునంచుతెలుపన్ తోషంబుతోడన్హరున్
    పాషాణమ్ములవంటిపాపములవే బారున్ మమున్వీడుచున్
    ద్వేషంబున్ విడిమానసంబుననుసర్వేశున్ సదాకొల్చు ని
    *“ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్”*

    రిప్లయితొలగించండి
  11. ఆ॥ ఆగఁగ సుముహూర్తమంచు మూఢతఁ గని
    పనులు తోషమగునె ఫలము నొదవ
    భ్రమయగునయ హేతు వాదమునఁ జనఁగ
    దోషకాల మొసఁగు తోషమెంతొ

    శా॥ దోషంబన్నది హేతు వాదమున లేదోయీ భ్రమమ్మేలనో
    దోషంబంచును మానెడున్ జడతయే తోషంబ వాదించఁగన్
    వేషంబేనిది మూఢతత్వముఁ గనిన్ భీతిల్లఁ దప్పే సుమా
    దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

    (కేవలం పూరణ కోసమే నండి. ఎవరి వాదన వారిది. ప్రదోష అందరూ ముందుగా వ్రాసియుంటారని)
    వేషంబేను ఇది అనుకొని వేషంబేనిది చేసానండి


    రామబ్రహ్మం పెనుకొండ బెంగళూరు

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. ఆర్యు లెల్ల సకల కార్య సమారంభ
      ముల గణింత్రు వివరముగను దీని
      వర్జ్య కాల మెల్ల వర్జింప నవ్వీత
      దోషకాల మొసఁగుఁ దోషమెంతొ


      పాషాణాభ మనో విరాజితులు విశ్వాసింత్రు నిక్కమ్ముగా
      నీషన్మాత్రము నైన డెందముల శంకింపంగ రా దెన్నఁడుం
      గాషాయాంబర ధారి చెప్పఁగను దీక్షాయుక్త మింపార ని
      ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్

      తొలగించండి
  13. ఆ.వె:దోషకాల మందు దూరె బ్రత్యర్థి గా
    దోషకాల మొసగు దోష మెంతొ
    యతనికే,ఫలించు నదియె మనకు నట్టి
    దోషకాల మొసగు దోషమెంతొ
    (రెండు,నాలుగు పాదాలు ఒకటే.రెండవ పాదం లో దోషము అంటే దోషము.నాలుగవ పాదం లో దోషము అంటే తోషము.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పుడు నాల్గవ పాద మిట్లుండ వలెను." ...మొసఁగుఁ దోష మెంతొ". అరసున్న తప్పని సరి.

      తొలగించండి
  14. గురువు గారు! మొదటి ఆట వెలది సమస్య కూడా దోష కాల మొసగు దోష మెంతొ" అవ్వాలి.అక్కడ తోషము లో తో సరళం గా మారుతుంది కదా!
    🙏🏽

    రిప్లయితొలగించండి
  15. శా:ఘోషన్ బెట్ట కిదే ముహూర్త మునకై ,కోపమ్ము తో తీవ్రమౌ
    భాషన్ వాడకు వారి పుత్రికిని లాభ మ్మిచ్చు నో లేదొ !ఆ
    శేషయ్యన్ బరికించి చెప్పు మనుమా! శ్రీ లిచ్చు,నిర్వంకలన్
    దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్”
    (ఇక్కడ దోషంబైన అంటే తోషంబైన అని అర్థం.ఈ ముహూర్తమే అని పట్టు పట్టకు.అమ్మాయికి కూడా మంచిది కావాలి కదా!అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  16. స్నానమాచరించి సద్భక్తితో నీశుఁ
    గొలువ నొసఁగు ముక్తి కోకనదుఁడు
    భక్తిఁ సలుప పూజ భవతాపహరుని ప్ర
    దోషకాల మొసఁగు తోషమెంతొ

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    విశ్వమునకు శ్వేత వెలుగులు పంచగ
    ప్రతి దినంబు వచ్చు భాస్కరునకు
    నర్ఘ్య మిత్తురు ప్రజ లానందముగను ప్ర
    దోష కాలమందు తోషమెంతొ.

    రిప్లయితొలగించండి