6, ఫిబ్రవరి 2025, గురువారం

సమస్య - 5026

7-2-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్”
(లేదా...)
“జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా”

17 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. గురుదేవుల సవరణతో...

      కందం
      రావయ్య! పురుష పుంగవ!
      సేవింతును కౌగిట యని చిందులతోడన్
      గావించు సాని సైగల
      జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్!

      ఉత్పలమాల
      మోవిని జిందెడున్ మధువు ముద్దుల జుర్రుచు కౌగిలింతలన్
      సేవల పొందుగూర్తునని చిందుల పాడుచు కన్నుగీటుచున్
      బావయ! మేని సోయగము పట్టుమటంచును సాని సైగలన్
      జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా!

      తొలగించండి
  2. నావంటి సుగుణి పలుకుల
    కావేశము నొందుచుండి యవమానించన్
    నా వాకు పయి ర చించిన
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్

    రిప్లయితొలగించండి
  3. కావరమెక్కి కన్నులవి గానక సిగ్గును వీడి స్వార్థమే
    పావనమైన రాజులను భార్గవ రామ కుఠార ఘాతముల్
    చావుకు విందు సేయవె! నిశాచర వర్తనులైరి జూడ! రా
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా!!

    రిప్లయితొలగించండి

  4. కోవిడు చేరిన తరుణము
    నీ వసుధను జనులబాధ నేమని తెలుపన్
    జీవితమందున వచ్చు రు
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్.


    భావము నందునా పరమ పావన రూపుని నిల్పి కొల్వగా
    కోవెల కేగ ధర్మమగు, క్షుద్రులబాసులు దొంగబాబలన్
    దేవుడటంచు నెంచుచును దేబెల జేరుచు జేయీనట్టి పూ
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా.

    రిప్లయితొలగించండి
  5. జీవనమే సఫలమనగ
    జావళులే హాయినొసగి శాంతమునిడుగా
    జీవన గమనమున శిరో
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్

    జావళులే ప్రసిద్దమిట శ్రావ్యతతో రసరాగ భోగమై
    జావళులే ప్రశాంతమిడి సత్వర నిద్రకు హేతువౌ; శిరో
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా
    కావున బౌద్దభిక్షులకు క్షౌర సమగ్రత నీమమాయెరా

    రిప్లయితొలగించండి
  6. బావా!యని పిలుచుచు నిటు
    రావా!సుఖమిచ్చెద విటురాలు ఫణితికిన్
    నీవటు పోయిన పాడెడు
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్

    రిప్లయితొలగించండి
  7. కం॥ హావము భావములఁ దెలుప
    జావళి నెంచుచు ధనమును సంపద తానై
    ఆవిధి వెచ్చించఁగ నా
    జావళి హరియించు సౌఖ్య సంపదలెల్లన్

    ఉ॥ హావము భావముల్ తెలుప నాశగ జావళి నెంచి మక్కువన్
    జావళిఁ బాడు వారలను జక్కగ పిల్చి కచేరి లంచు తా
    నై విహితమ్ము వీడుచు రుణమ్ములఁ గైకొని పూన్చగాను నా
    జావళి సర్వ సౌఖ్యముల సంపదల్ హరియించు చుండెరా

    ఒక వారము పాటు బెంగుళూరులో లేనందున పూరణలను పెట్టలేక పోయానండి

    రిప్లయితొలగించండి
  8. కం:జావయొ,పరమాన్నమ్మో
    సేవించెడు భార్య యిడగ చేదై,వేశ్యా
    జావళి మునిగి యెరింగితి
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్”

    రిప్లయితొలగించండి
  9. పావన వస్త్రధారణము భారతనారికి జీవగఱ్ఱనై
    శ్రీవిధి హావభావములశేముషిదక్కెను నాటినృత్యముల్,
    కావగ లేకనేడునయ గారములందెడి వేషభాషలౌ
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఆవిరి కాగ నీరములె, అగ్గిగ మారగ క్ష్మా తలమ్ము, వా
    తావరణమ్ము మారగ, భయంకర తాపము రెచ్చి మానవుల్
    త్రావగ నీరు లేక జలదమ్ముల జాడయు లేక, లేక భూ
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా”

    రిప్లయితొలగించండి
  11. హావము భావము లేకను
    రావము సల్పుచు ను పాడు రాగము తోడన్
    కావించి బా ధ పెట్టె డి
    జావళి హరియించు సౌ ఖ్య సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  12. కావలె సచ్చరితము స
    ద్భావము కరుణా గుణమ్ము ధరణి జనులకున్
    నీ వెఱపు మత్సరము గ
    జ్జావళి హరియించు సౌఖ్య సంపద లెల్లన్

    [గజ్జు = మదము; ఆవళి = ఉపద్రవము]


    ఈ వసుధాతలమ్మున నహీన విశేషము లెన్ని యుండునో
    జావళి సర్వ సౌఖ్యములఁ జక్కఁగ నిచ్చును మానవాళికిన్
    చావు నొసంగఁ బుచ్చుకొన సత్వర మెల్లర కింత యేని నం
    జావళి సర్వ సౌఖ్యముల సంపదలన్ హరియించు చుండెరా

    [నంజు + ఆవళి = నంజావళి; నంజు = విషము; ఆవళి = సమూహము]

    రిప్లయితొలగించండి
  13. భావన చేయఁగ మగువలు
    గావించునలంకరణము కన్నులవిందౌ!
    జీవము కనరాని శిరో
    జావళి హరియించు సౌఖ్యసంపదలెల్లన్

    రిప్లయితొలగించండి
  14. (3)ఉ:జావళి వ్రాయ నేర్చి "యిది చా"లని యీ సినిమాల దూరగా
    "నీ విధి వ్రాయ నాట్యమున కెవ్వతె సిద్ధ?" మటంచు "క్రొత్తగా
    లే"వను చుండిరే!నగదు లేదిక కూర్చొని మెక్క నిచ్చటన్
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా!
    (పాతకాలపు జావళీలు రాయ నేర్చిన కవి సినిమా ఛాన్సుకి బయల్దేరాడు.ఇప్పటి ఐటం సాంగ్స్ రాయక నీ జావళీలకి ఎవరు నాట్యం చేస్తారు? అని సినిమా వాళ్లు తిరగ్గొడుతున్నారు.కవి గారికి ఉన్న సొమ్ములు కూడా ఐపోయాయి.)




    రిప్లయితొలగించండి
  15. జావళివోలె జీవనము సాగును భామిను లందగత్తెలై
    భూవలయమ్మునందు విరబూసిన పువ్వులవోలెనుండనా
    జావళి సర్వసౌఖ్యముల సంపదలన్ హరియించుచుండెరా
    భావనలందు లాలసను భామలు చూపుచు చంచలించగా

    రిప్లయితొలగించండి

  16. చేవను చూపెద ననుచును
    త్రోవల కడ్డముబడుచునుదుడ్డొసగనిచో
    జీవముతీసెదననుమను
    జావళి హరియించు సౌఖ్య సంపదలెల్లన్

    రిప్లయితొలగించండి