28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

సమస్య - 5048

1-3-2025 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ”
(లేదా...)
“కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ”

28 కామెంట్‌లు:

  1. వివరముగ విషయము దెలుప ,
    రవంతయైనను కవితల లక్షణ మందున్
    చవి జూపలేని వానికి
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ

    రిప్లయితొలగించండి
  2. నవతకు నాందీ ప లు కక
    చవు లూ రించెడు విధముగ చక్కని భావా
    ల వివరము లు లేక నె టుల
    కవితా గంధమ్ము లేని కావ్యము మే లౌ?

    రిప్లయితొలగించండి
  3. కవులున్ ప్రస్తుత కాలమందున వెసన్డ
    కావ్యంబులున్ వ్రాసియున్
    భువి పేరొందగ గోరుకొంద్రు మరియున్
    పూజించ నాశింతురే!
    చవు లూరించెడు భవ్య భావరసమున్
    ఛందంబు లేనట్టి దు
    ర్కవితా గంధము లేని కావ్యములె
    విక్యాతిన్ గడించున్ కవీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'వెస న్గావ్యంబులున్' టైపాటు.

      తొలగించండి
  4. కం॥ నవతా భావము విరియఁగ
    భువిని జనుల ప్రగతిఁ గనెడి బుద్ధి నిలుపుచున్
    జవినొసఁగి యుగ్ర వాదపు
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ

    మ॥ నవతా భావము నిండఁగన్ మిగుల సన్మానించి ప్రోయాలినిన్
    భువినిన్ గాంచఁగ మానవాభ్యుదయమున్ మోదమ్ముగా నెంచుచున్
    జవితో వ్రాయఁగ నుగ్రవాదమునటుల్ సంధించెడిన్ దుష్టమౌ
    కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ

    రిప్లయితొలగించండి
  5. వివరింపగ చెత్త యగును
    కవితాగంధమ్ము లేని కావ్యమె; మేలౌ
    కవితాగంధమ్మమరిన
    కవనములే వాసికెక్కు కవికులమందున్

    ఎవరేమన్నను లెక్కసేయక సదా హీనత్వమున్ జాటినన్
    లవలేశంబును వన్నె కెక్కవు గదా లక్ష్యంబు లోపించగా
    కవితాగంధము లేని కావ్యములె; విఖ్యాతిం గడించున్ గవీ
    కవితాగంధము ప్రస్పురించు సరళిన్ గావ్యాలుసృష్టించినన్

    రిప్లయితొలగించండి
  6. అవికల్పంబగు శాస్త్ర కావ్య సతతాభ్యాసానులబ్ధంబుగా
    స్తవనీయంబగు జ్ఞానమున్ వరలు విద్వద్వర్యులౌ బోధకుల్
    సువినీతుల్ సరసద్వివేకమతులౌ శ్రోతల్ గనన్ రానిచో
    కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ

    రిప్లయితొలగించండి
  7. కవి తాఁ సృజించు కావ్యము
    ప్రవిమలముగ నుండు రీతి రచియించ దగున్
    సవరదనముతో, వికలఁపు
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తా సృజించు' అన్నపుడు అరసున్న అవసరం లేదు. 'సవరదనము' ?

      తొలగించండి
    2. 'సవరదనము' అన్న మాటకు ఆంధ్ర భారతి అమదము, సొగసు అనే అర్థాలు సూచించింది గురువుగారూ 🙏

      తొలగించండి
  8. కవితల్ వ్రాయఁగ బూనుకొన్న కవి తా కాలానుకూలంబుగా
    యువతన్ జాగృతిగొల్పు కావ్య రచనల్ యుక్తంబుగా జేయుచున్
    భవితవ్యమ్మును దీర్చిదిద్దు పగిదిన్ వ్రాయంగ దుష్టమ్మునౌ
    కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ

    రిప్లయితొలగించండి
  9. శివసంకల్పముతోడుగాగమన మున్సేవించి వేదాంతులన్
    స్తవమున్సేయగఁబద్యధారనను శ్రీతత్వంబు దీపించుచున్
    నవభావంబులఁగప్పిఁజెప్పగను విన్నాణంబు లోపించెడు
    న్గవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  10. నవరస భరితంబగు భా
    గవత కుసుమ పద్యములను గద్యము వలెనన్
    కవి జదివిన నే విధమగు
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ?

    రిప్లయితొలగించండి
  11. కందం
    భవితవ్యము బాగుండఁగ
    యువకులు విద్ద్యార్థి దశ సమున్నతిఁగన నె
    క్కువగన్ శృంగారమనెడు
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ!

    మత్తేభవిక్రీడితము
    యువకుల్ విద్యను నేర్చెడున్ వయసునందుద్విగ్నతల్ వీడగన్
    భవితవ్యమ్ము శుభమ్ములన్ బడయగన్ పాఠ్యాంశముల్ గూర్చుచున్
    గవనాసక్తతఁ గోవిదుల్ వొగడినన్ గాఢంపు శృంగారమన్
    గవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ!

    రిప్లయితొలగించండి
  12. కం:నవ సాహిత్యపథమ్మున
    కవులకె మ్రింగుడు పడని నిఘంటు పదములున్,
    చవి లేని పాత ఛందపు
    కవితాగంధమ్ము లేని కావ్యమె మేలౌ”
    (ఇది ఛందస్సుని వ్యతిరేకించే వారి భావం.)

    రిప్లయితొలగించండి
  13. మ:అవిరామమ్ముగ పద్యకావ్యముల కై ఆరాటమేలయ్య?యీ
    యవధానమ్ముల రంథి యేలనొ? వృథా యై పోయె పద్యమ్ము, లీ
    నవలోకమ్మున పత్రికల్ కనవు కానన్ వీడు, మీ ఛందమన్
    కవితాగంధము లేని కావ్యములె విఖ్యాతిం గడించున్ గవీ”
    (పద్యాలు ఆధునికకాలం లో నడవవు కనుక మానెయ్య మని ఒకరు సలహా ఇచ్చినట్టు.)

    రిప్లయితొలగించండి
  14. అవమానము వొందకుమీ
    కవివర నీచోపమలు దగవు వ్రాయకుమీ
    కవితలు దుర్గంధముతోఁ
    గవితా గంధమ్ము లేని కావ్యమె మేలౌ


    అవు నన్నం దగ దంచుఁ గాదనిన భవ్యాభంగ ధారా ఘన
    చ్ఛవి భాసిల్లఁ గడింది ప్రీతి జను లాశ్వాదింపఁ బద్యమ్ము లం
    దు విశేషార్థ పదమ్ము లేని మఱి చాతుర్యమ్ము, నున్నట్టి వౌ
    కవితాగంధము లేని, కావ్యములె విఖ్యాతిం గడించున్గవీ

    [కవితా గంధములు + ఏని= కవితా గంధము లేని]

    రిప్లయితొలగించండి