4, ఫిబ్రవరి 2025, మంగళవారం

సమస్య - 5024

5-2-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్”
(లేదా...)
“రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్”

17 కామెంట్‌లు:

  1. కందం

    సేవించు వాహనముగన్
    గావింపంగ శివరాత్రి గరళగళునకున్
    రావణుఁగొల్చు నొకని కలఁ
    రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్!


    ఉత్పలమాల
    సేవలుఁ జేసెడున్ సరళి శ్రీగిరి నా శివరాత్రి పర్వమై
    జీవను వాహనంబుగను జేయఁగ నెప్పటి సంప్రదాయమై
    రావణు పైని భక్తిగల రాక్షస వారసుఁడొంద స్వప్నమున్
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్

    రిప్లయితొలగించండి
  2. రావణుడే దండెత్తెను
    దేవేంద్రుని స్వర్గముపయి ధీరత్వముతో
    నావేదనతో నపు డై
    రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్

    [ఐరావణము = ఐరావతము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావణ నందయంతుడమరావతి పైబడె దండయాత్రకై
      దేవతలెల్లరున్ మిగుల తేకువ నొందిరి సంభ్రమమ్ముతో
      నావహమందు రాక్షసుని కద్భుతమౌ గెలుపే లభింప నై
      రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్

      తొలగించండి
  3. పావని సీతను దోడ్కొని
    బోవగ వచ్చిరని యెదిరి పోరు సలుపగా
    యా వాజి ఘాథపు రుధిర
    స్రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్

    రిప్లయితొలగించండి
  4. 5-2-2015 (బుధవారం)
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

    ఓవింత కనంగ శివుడు
    రావణ గమనుండు, బెదరి రావణుఁ గొల్చెన్
    గావుత గిరీంద్రుడు,నరుల
    కావన్
    శ్రీశైలమల్లిఖార్జునుయ్యెన్


    ఉత్పల మాల

    బ్రోవగ నాంధ్రలో శివుడు పొందుగ నిల్చెను మల్లిఖార్జు నుం
    డై ,విడినంది నేర్పడ నొ డంబడికొప్పగ శ్రీగిరిన్ గనన్
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్
    తావిడె పర్వతాధిపతి తద్ఘన భక్తి విధంబు గాంచుటన్

    డా.గాదిరాజు మధుసూదనరాజు

    శ్రీశైల క్షేత్రంలో
    రావణ వాహనుని గా
    మల్లిఖార్జున నామధేయం తో
    శివుడు ఊరేగుతాడు

    అది గొప్ప అద్భుత ఉత్సవం.
    శ్రీ శైల పర్వతరాజు రావణుని భక్తికి జూసి అబ్బురపడి
    ఆ అవకాశం ఇచ్చాడని కొందరు భక్తులు నమ్ముతారు

    రిప్లయితొలగించండి

  5. భావమున శివుని గొల్చెడు
    చేవను గలిగిన ధనుజుని చేవైరమికన్
    తా వలదనుకుని యా యై.
    రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్.


    చేవనుజూపి శ్వేతగిరి చేతీలతో, పయికెత్తి దైత్తుడే
    తావరగర్వితుండగుచు తావిషమున్ జనె నుగ్రమూర్తితో
    నావహమేల యంచునని యా యహిమేదకుడైనయట్టి యై
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్.

    రిప్లయితొలగించండి
  6. చావది లేదు బ్రహ్మ వర సంపద చేనని లోదలంచుచున్
    దైవత వైరి కర్కశుడు దానవరాజు తపోబలమ్మునన్
    దేవ నికాయమున్ గెలువ దేవతలెల్లరు సన్నుతింపనై
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్!!

    రిప్లయితొలగించండి
  7. సేవలు జేసెడు వేళను
    రావణు ని గని భయ మంది రాక్ష సు మీదన్
    భావ మురాజీ పడ గా
    రావణ గమనుండు బెదరి రావణు గొల్చె న్

    రిప్లయితొలగించండి
  8. రావణుడెంతటి వీరుఁడు
    దావరియై దేవరాజు దర్పమణఁచగన్
    జీవము నిలుపుకొనఁగ నై
    రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్

    రిప్లయితొలగించండి
  9. రావణ కలగన విధమిది
    పావన రాముని కరమున పరిమార్చు టయున్
    ఆవేదనతో హృదినగు
    రావణ గమనుండు, బెదరి రావణుఁ గొల్చెన్

    రిప్లయితొలగించండి
  10. కం:దేవతల నాయకునకే
    యా విధి వక్రించ తొలగ నధికారము స్వే
    చ్ఛావాయు దూరుడై యై
    రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్”

    రిప్లయితొలగించండి
  11. ఉ:రావము జేయు బండి గొని "రై" యని మిత్రుడు దాను నేగగా
    రావణభక్తు లౌ జనులు రాగ దళమ్ముగ దారి కడ్డ మై
    "త్రోవ నొసంగు"డంచు ,నతి తో, వెలయించక రామభక్తి యా
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్
    (రావణవాహనుండు=విపరీత మైన మోత వచ్చే వెహికిల్ కల వాడు.వాడు స్నేహితుని తో కలిసి వెడుతుంటే రావణాసురభక్త సమూహం దారికి అడ్డంగా వస్తున్నారు.దారి ఇవ్వ మని ఈ రావణ వాహనుడు,మిత్రుడు తమ రామభక్తి పక్కన పెట్టి రావణాసురుడికి దణ్నం పెట్టారు.ఈ మధ్య రావణాసురుడి భక్తులు ఎక్కువవటం తెలిసిందే కదా!)

    రిప్లయితొలగించండి
  12. దావరియై యఖండలుడు తా దశకంఠుని చేతఁ నోడగా
    నావహమందు ప్రాణముల యంకిలిపాటుకు తత్తరిల్లుచున్
    జీవము నిల్ప రావణుని సిధ్రముఁ గోరెడు నిచ్ఛతోడనై
    రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. దేవర్షి సుసంచారియుఁ
      బావన చరితుండు మాధవపద రతుండున్
      దేవా! రక్షో నాథా!
      రావణ! గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్


      చేవయె సన్నగిల్ల ధృతి ఛిన్నము గాఁగఁ బరాజితుండునై
      రావణి చేత యుద్ధమున లంకను జేరి వినమ్ర శీర్షుఁడై
      దేవ గణాధి నాయకుఁడు దిక్కరి నాథుఁడు శుద్ధ పాండు రై
      రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్

      తొలగించండి
  14. దేవతలనుగెల్వంగను
    తావరములనందినట్టి దానవ వీరున్
    త్రోవనుగనినంతనె నై
    *"రావణ గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్”*

    రిప్లయితొలగించండి