కం:కాంతునకు భక్తి లేకయు సుంతయు తన తోడు రాక చూడగ నవమిన్ స్వాంతమున గోరి సీతా కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్” (ఆమెకి గుడికి వెళ్లటానికి తోడు కావాలి.భర్తకి భక్తి లేదు కనుక రాదు.కొడుకుని తీసు కెళ్లింది.)
ఉ:ఎంతయు బ్రేమ బిల్వ తమ యింటనె పెండ్లికి బుట్టినింటి వా, రింత మనమ్ము లేక దన కిష్టము లేదన భర్త,చూపుచున్ పంతము వంట జేయకయె,పాచియు జిమ్మక,దిట్టి పోయుచున్ కాంతుని, పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్” (తన పుట్టింటి వాళ్లు పెళ్లికి పిలిస్తే మొగుడు రాక పోతే భార్యకి కోపం రాదా? వాడి నెత్తిన వంట,పాచి కూడా వదిలేసి కొడుకు తో పాటు పోయింది.)
కందం
రిప్లయితొలగించండిపంతమున బాల్య సఖి ని
శ్చింతకు వృద్ధాప్యమందు చేకొన మనువున్
వింతగ, విడాకులిచ్చిన
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్!
ఉత్పలమాల
వింతయె కాదు నేడిదియు వృద్ధుల పెళ్లి పెటాకులౌచు ని
శ్చింత పునర్వివాహమును జేకొని సాగుట విశ్వమందునన్
బంతము పట్టి పిల్వ సఖి, వాస్తవమెర్గుక మున్పు వీడెనన్
గాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసాంతము పురమున నుండిన
రిప్లయితొలగించండికాంత లజుని పెండ్లి సలుప ఖలముడుగు ననే
భ్రాంతిని దేవళమున శ్రీ
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనే' అనడం వ్యావహారికం. *ఖల ముడుగుననన్* అనండి.
🙏
తొలగించండిఅంతయు తానె యుండెడి యనంతుడె వచ్చెను రామచంద్రుడై
రిప్లయితొలగించండివంతలు దీర్చె కంటక నివారణమేర్పడ దైత్యమృత్యువై
సంతసమొంద భక్తులిట సాలుకు సాలుకుఁ జేయ జానకీ
కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచింతలు దీరునో రమణి చెంతనె దేవళమందు నేడు సా
రిప్లయితొలగించండిమంతముగా రమాధవుని మంగళ సేవ యటంచు దెల్పగా
స్వాంతమునందనన్యమగు భక్తి విధేయత దోడ వేగ శ్రీ
కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి*శౌరిని నెంచిన* అనండి.
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికాంత జలధిజ వరించెను
వింతగ పాల్కడలిఁ బుట్టి విశ్వంభరునే
సంతస మేపార రమా
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్
పంతముబూని త్రచ్చిరట పాలసముద్రముఁ దేవదానవుల్
వింతగ నుద్భవించి గన వీక్షితమైనవి పెక్కు వస్తువుల్
సంతసమొప్పఁ బుట్టి సిరి శౌరిని నెంచిన మీదటన్ రమా
కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్
చెంతన దేవళ మందున
రిప్లయితొలగించండిపంతులు శ్రీహరి కి జరుపు పరిణ య మున కున్
కాంతుడు తోడు గ రా శ్రీ
కాంతుని పెండ్లికి జనె నొక కాంత సుతు ని తోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి-
రిప్లయితొలగించండిభ్రాంతి కలుగ జేయు పదము
లంతయె! వింతగలదేమి సుంతయు కవిరాట్
సొంతంబన్నయగు, రమా
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ వింతగ పెండ్లినిఁ జేయుచు
రిప్లయితొలగించండిసంతస మొందరె మనుజులు సర్వేశునకున్
జింతలఁ బాపునని రమా
కాంతుని పెండ్లికిఁ జనెనొక కాంత సుతునితోన్
ఉ॥ వింతగ పెండ్లిఁ జేయచును వేడరె దేవుని మానవాళియే!
సంతస మొంది దైవమును సర్వులఁ బ్రోచు నటంచు నెంచరే
చింతలఁ బాపి యెల్లపుడు చిత్రము మ్రొక్కగ నిట్టులన్ రమా
కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజుని తోడఁ బ్రీతితోన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఎంతయొ భక్తి నెక్కొనఁగ నెల్లరు గూడిరి దేవళంబునన్
రిప్లయితొలగించండివంతలుదీర్చు వెన్నుని వివాహము వేడుకతోడ గాంచఁగన్
భ్రాంతి తొలంగి నెమ్మనము శ్రాంతమునొందఁగగోరి శ్రీరమా
కాంతుని పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:కాంతునకు భక్తి లేకయు
రిప్లయితొలగించండిసుంతయు తన తోడు రాక చూడగ నవమిన్
స్వాంతమున గోరి సీతా
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్”
(ఆమెకి గుడికి వెళ్లటానికి తోడు కావాలి.భర్తకి భక్తి లేదు కనుక రాదు.కొడుకుని తీసు కెళ్లింది.)
ఉ:ఎంతయు బ్రేమ బిల్వ తమ యింటనె పెండ్లికి బుట్టినింటి వా,
రిప్లయితొలగించండిరింత మనమ్ము లేక దన కిష్టము లేదన భర్త,చూపుచున్
పంతము వంట జేయకయె,పాచియు జిమ్మక,దిట్టి పోయుచున్
కాంతుని, పెండ్లికేగె నొక కాంత తనూజునితోడఁ బ్రీతితోన్”
(తన పుట్టింటి వాళ్లు పెళ్లికి పిలిస్తే మొగుడు రాక పోతే భార్యకి కోపం రాదా? వాడి నెత్తిన వంట,పాచి కూడా వదిలేసి కొడుకు తో పాటు పోయింది.)
కంది వారూ
రిప్లయితొలగించండిఈ పాదం బేమైనా కైపదంబూరణకు పనికి వచ్చునా ! ప్రచురించ గలరు
పాపంబదె చింత పడెను పాపుల్లారా !
వింతగ వేయ జనౌఘము
రిప్లయితొలగించండిగంతులు ఘన పారితోషకమ్ములు గొని శు
ద్ధాంతఃకరణు లడరి భూ
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్
సంతస మంతరంగమున సందడి సేయఁగ సంభ్రమించి శ్రీ
మంతుల యింటఁ బుట్టిన కుమార వరేణ్యుని సద్గుణైక ధీ
మంతుని సోదరోత్తముని మాన్యు నిశాకర సన్నిభప్రభా
కాంతుని పెండ్లి కేఁగె నొక కాంత తనూజుని తోడఁ బ్రీతితోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్యాపూరణం
రిప్లయితొలగించండి*కాంతుని పెండ్లికేగె, నొక కాంత తనూజునితోడ బ్రీతితోన్!*
కాంతుని ప్రేమపొందుచును కాపుర మందున సౌఖ్యమందుచున్
చెంతన యున్నకోవెలకు సేవలు జేయుచు భక్తి తోడుతన్
చింతలు దీర్చువాడు కడు శ్రేయము గూర్చెడు దైవమైన శ్రీ
కాంతుని పెండ్లికేగె నొకకాంత తనూజుని తోడ బ్రీతితోన్
ఆర్కే శర్మ
భ్రాంతి తొలఁగి నెమ్మనమున
రిప్లయితొలగించండివంతలు దీరంగ పరమ పావన మూర్తిన్
శ్రాంతమునిమ్మనుచు రమా
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సొంత మరది పెండ్లి జరుగ
పంతముతో రానటంచు పతియే పలుకన్
సంతసముగ తమ్ముడు శ్రీ
కాంతుని పెండ్లికి జనె నొక కాంత సుతునితోన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంతము బూనుచు రానన
రిప్లయితొలగించండికాంతుడు నేమనగ లేక కానుక గొనుచున్
స్వంతసహోదరుడౌ శ్రీ
*కాంతుని పెండ్లికి జనె నొక కాంత సుతుని తోన్*
చింతలుదీర్చుదైవమన. శ్రీరఘురాముడటంచునెంచుచున్
చింతలపూడి గ్రామమునచేయుచునుండగ సంబరమ్ముతో
స్వాంతమునందునిండగను శ్రద్ధయుమానసమందుజానకీ
*కాంతుని పెండ్లి కేగె నొక కాంత తనూజని తోడ ప్రీతితోన్*