13, ఫిబ్రవరి 2025, గురువారం

సమస్య - 5033

14-2-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ”
(లేదా...)
“చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్”

33 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఎండవేడికిఁ దిరుగుచు నీసడించి
    కనులుమండంగ నాన్నమ్మ గదురుకొనఁగ
    చలువ కళ్లజోడొసగంగ తొలఁగి వేడి
    చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ

    ఉత్పలమాల
    పెల్లునమండుచున్ గగనవీధులరేగుచునెల్లవారికిన్
    తల్లడమందఁజేయు దరి తాళకనుండ పితామహిన్ గనన్
    చెల్లెడు రీతిగన్ జలువఁ జేసెడు జోడునొసంగ కళ్లకున్
    చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్

    రిప్లయితొలగించండి
  2. రాత్రివేళలరుగుదెంచి రజనికరుడు
    *చల్లఁదనమిచ్చె, సూర్యుఁడు చందనముగ*
    చలువ గూర్చు నుదయమందు చక్కగా ను
    సూర్యచంద్రుల తోడనే చూడుమీజ
    గతియు వెలుగులను పరచు కాంతి తోడ.


    పెల్లున మండవాలమట భీతిని చెందక రాముదల్చగన్
    *చల్లదనంబు నిచ్చెను గృశాణుడు చందన చర్చ పోలికన్*
    ఉల్లము నందు రాఘవు ని నొప్పుగ నుంచిన వారికేవెతల్
    తల్లడ మందజేయవని తానటచాటెగ నాంజనేయుడే

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మండు టెండల మ్రగ్గెడు మానవులకు
      నల్పపీడనమెపుడు నాహ్లాదమొసగు
      నల్లమబ్బుల మాటున నక్కియుండి
      చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ

      వెల్లడిచేయ మానసము వీక్షకులెల్లరి యంతరంగముల్
      ఝల్లన రామభద్రుడట జానకిఁ శీలపరీక్ష కోరగా
      తల్లిమహీజ దూకెగద తానట నిప్పుల గుండమందునన్
      చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్

      [కృశానుడు = అగ్నిదేవుడు]

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. తల్లడపెట్టగన్ జనుల తర్షుఁడు గ్రీష్మమునందు కీలియై
    నల్లని మేఘసంచయము నల్దెసలన్ నెలవొందె నంతటన్
    మెల్లగ వాన తుంపరలు మేనును తాకఁగ మండుటెండలో
    చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్

    రిప్లయితొలగించండి
  5. వెట్ట కాలమందున సూరి వెలసియుండ
    దట్టముగ మేఘము గవియ ధరణి లోన
    చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ
    ననుచు మానవులందరు యనుకొనిరట

    రిప్లయితొలగించండి
  6. ఎల్లరు దానవుల్ గలసి యింగలమున్ హనుమంత దాంతునిన్
    త్రుళ్లుచు బట్టి పెట్టగను తోకకు పుట్టదు మంట చూడగన్
    తల్లి ధరాత్మసంభవ సుధామతి జానకి వేడినంతటన్
    చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్!!

    రిప్లయితొలగించండి
  7. - శ్రీవళ్లి రాన్‌ అంతా చల్లని అముల్ ఐస్ క్రీమే :)

    మల్లె మాలల ఘుమఘుమ ! మత్తుగాలి!
    వళ్లి సుకుమారి వయ్యారి వచ్చె గుండె
    జల్లు మనె పుష్పకున్ సూడ సక్కగుండె
    చల్లదనమిచ్చె సూర్యుడు చందనముగ





    రిప్లయితొలగించండి
  8. మంచు కొండల కేగిన మనుజు డొకడు
    కాంచి పరవశ మందుచు కమ్మ నైన
    చల్లగదన మి చ్చె సూర్యుడు చంద నముగ
    ననుచు భావించి మనము న హర్ష మందె

    రిప్లయితొలగించండి
  9. ఊష్మమెల్లెడఁ గ్రమ్మఁగ గ్రీష్మమందు
    కారుమబ్బులు నెలవొందె గగనమందు
    వానజల్లుగ గురియఁగ వసుధయందు
    చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ

    రిప్లయితొలగించండి
  10. తే॥ జనులు హేమంత రుతువున చలికి వడఁకు
    చుండిరట తాళఁ జాలక నెండవేడి
    యుత్తరధ్రువంపు దరిని యుండదాయె
    చల్లదనమిచ్చె సూర్యుఁడు చందనముగ

    ప్రహ్లాద వృత్తాంతమండి

    ఉ॥ ఎల్లలు భక్తి భావమున కెప్పుడుఁ గాంచకఁ గొల్చగన్ హరిన్
    ఝల్లనఁ తండ్రి గుండె తన శత్రువునే సుతుఁడట్లు మ్రొక్కఁగన్
    మెల్లగ నచ్చఁజెప్పినను మెచ్చఁ గ విష్ణునిఁ ద్రోయనగ్నిలో
    చల్లదనంబునిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్

    శ్రీ కంది శంకరయ్య గారు సూచించిన సవరణల పిదప

    రిప్లయితొలగించండి
  11. ఉ:ప్రల్లదనమ్ము సల్పి తన వాలము గాల్చగ నగ్గి వెట్ట నా
    యల్లరి దైత్యవీరతతి యగ్నికి నంజలి జేసి నిల్చి శో
    భిల్లెడు పావనిన్ గరుణ వీక్షణ జేసియు, వాయుమైత్రి చే
    చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్”
    (హనుమంతుని వాలానికి రాక్షసులు అగ్ని పెట్టినా అగ్ని హనుమ భక్తికి మెచ్చి చల్లదనం చూపాడు.వాయు మైత్రి అంటే అగ్ని వాయువు మిత్రుడు.హనుమ వాయుకుమారుడు కూడా.)

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:రాత్రి వెన్నెల యెల్ల నీ రాక కొరకు
    వేచి యుండగ నా లోన వేడి పెంచె
    ఉదయమే నీదు రాక నా యెదను తనిపె
    చల్లఁదనమిచ్చె సూర్యుఁడు చందనముగ”
    (ప్రబంధనాయికలకి విరహ బాధ లో చంద్రుని వెన్నెల వేదన కల్గిస్తుంది.ప్రియుడు ఉదయమే కనబడటం తో సూర్యుడు చల్లగా అనిపించాడు.)

    రిప్లయితొలగించండి
  13. చల్లని వేళ మానసము సాగగ నూహల, కుంతి చిత్తమున్
    పల్లవ మొందకోర్కెలు తపస్వి యొసంగిన మంత్రమెంచి, రా
    జిల్లెడి సూర్యునిన్ గొలువ చేరి సమీపము కౌగిలింతతో
    చల్లదనమ్ము నిచ్చెను కృశానుడు చందనచర్చ పోలికన్

    రిప్లయితొలగించండి
  14. పెల్లుగ వార్ధి దాటి గని పేర్మిని సీత నశోకవాటినిన్
    కొల్లగ గొట్టి రక్కసుల గోరి సభాస్థలి జేర రావణుం
    డల్లరి కోతి తోక కిడె నగ్గిని గాని మహీజ దీవనన్
    చల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందనచర్చ పోలికన్

    రిప్లయితొలగించండి
  15. అడరి పఠియింప మంత్రమ్ము నాలకించి
    కూర్మి సెలరేఁగ మదిలోనఁ గొడుకు నొసఁగఁ
    గుంతిఁ గరుణించి యరుదెంచి చెంత కంతఁ
    జల్లఁదన మిచ్చె సూర్యుఁడు చందనముగ


    ఎల్లరు నంద నచ్చెరు వహీనము గాల్చెను లంక నెల్లనుం
    దల్లడ మంది డెందమునఁ దల్లి మహీసుత యగ్ని వేఁడఁగా
    సల్లలితమ్ముగా నడరి సత్వర మంజన పట్టి కత్తఱిం
    జల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందన చర్చ పోలికన్

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    చల్లదనంబు నిచ్చెను గృశానుడు చందనచర్చ పోలికన్.

    అల్లన వెన్నదొంగ వని యామని వేళల రాస క్రీడకున్
    మెల్లన రమ్మనన్ చెలులు మేలని వత్తురు ఝామెఱుంగకే
    చల్లని పల్కులన్ మునుల శాపము బాపుచు ముక్తి దారినిన్
    వెల్లువ పొంగు ప్రేమలను వేకువ రాతిరి భేదమెంచరే
    చల్లదనంబు నిచ్చెను గృశానుడు చందనచర్చ పోలికన్.

    (నరకాసుర బందీలుగా ఉన్న 16 ,000 మునుల కోరిక అంతరార్దమే బృందావని రాసక్రీడ )

    రిప్లయితొలగించండి
  17. సమస్య:
    చల్లదనంబు నిచ్చెను గృశానుడు చందనచర్చ పోలికన్.

    అల్లన వెన్నదొంగ వని యామని వేళల రాస క్రీడకున్
    మెల్లన రమ్మనన్ చెలులు మేలని వత్తురు ఝామెఱుంగకే
    చల్లని పల్కులన్ మునుల శాపము బాపుచు ముక్తి దారినిన్
    వెల్లువ పొంగు ప్రేమలను వేకువ రాతిరి భేదమెంచరే
    చల్లదనంబు నిచ్చెను గృశానుడు చందనచర్చ పోలికన్.

    (నరకాసుర బందీలుగా ఉన్న 16 ,000 మునుల కోరిక అంతరార్దమే బృందావని రాసక్రీడ )

    చల్లని కాలమేగి భువి చక్కని భానుడు వేడిమీయగన్
    మెల్లగ వృక్ష సంతతియు మేను విదల్చెడు రీతి దోచెనే
    వెల్లలు వేయు గీములకు వేడుక పెండిలి మాఘ మాసమే
    ఝల్లను మానసంబులను జంటలెఱుంగని ప్రొద్దు పొడ్పులన్
    చల్లదనంబు నిచ్చెను గృశానుడు చందనచర్చ పోలికన్.

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మండుటెండలో పనిచేయు మనుజులకును
    మారిపోవ ప్రకృతి యకస్మాత్తు గాను
    నల్లమబ్బులు క్రమ్మగా నలు దిశలను
    చల్లదనమిచ్చె సూర్యుడు చందనముగ.

    రిప్లయితొలగించండి