కం:మాన్యుడు శ్రీనాథ కవికె శూన్యపు హస్తములు,పాడు జొన్నల కూడున్ వన్యప్రజ మెచ్చని వరి ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా” (శ్రీనాథుడు పల్నాటి సీమని బాగా ఆక్షేపించాడు.నా వంటి మహా కవి కే శూన్యహస్తాలు,జొన్న కూడు,రుచి లేని మోటు వరి మెతుకులు ఉన్న ఈ పల్నాడుని వదిలెయ్యండి అన్నట్టు.)
ఉ:ధాన్యము పండు గ్రామమున తక్కువ నాణ్యత తోడ,దానిచే శూన్యము లాభ మీ నడుమ జూడ పుగాకును ,ప్రత్తి యెంతయున్ మాన్యత నొంది రైతులకు మంచిగ లాభము గూర్చుచుండె నీ ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్” (వరి మొదలైన ధాన్యాల కంటే వాణిజ్య పంటలు నయం అని అలాంటి గ్రామాలకి మారటం మంచి దని ఒక రైతు ఆలోచన.)
కందం
రిప్లయితొలగించండిఅన్యుడవని నొప్పించుచు
మాన్యత విడినడుచుకొనెడు మనుజుల మధ్యన్
శూన్యమె కన! మనకప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా!
ఉత్పలమాల
తొలగించండిఅన్యుడటంచు గౌరవమునందఁగ జేయక చీటిమాటికిన్
మాన్యత వీడి వ్యంగ్యముగ మాటలనాడెడు హేలనంబునన్
శూన్యమె తోచుచుండ మది స్రుక్కక, దూషణమెంచుటందు ప్రా
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్
దైన్యము లేదు తిండికి సుధారస పూర్ణ ఫలంబులుండవే
రిప్లయితొలగించండిధాన్యము కాననెట్లు? వల దాగెను పట్టగ పావురమ్ములన్!
సైన్యము వోలె పైకెగిరి చావును తప్పుకు వెళ్లుటే తగున్
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్!!
అన్యుల పరిపాలనలో
రిప్లయితొలగించండిధాన్యపు సంపాదనకయి ధర్మము డుగగా
అన్యాయమునకె బహు ప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా
మాన్యత నీయక చులకగ
రిప్లయితొలగించండినన్యుల తో పోల్చి సతము నానా విధమౌ
విన్యా స o బులన ప్రా
ధాన్యంబు న్న ట్టి తావు దడయక విడుమా
రిప్లయితొలగించండిదైన్యపు బ్రతుకది నీదని
మాన్యత కరువైన చోట మచ్చరులగు సా
మాన్యుల కధికముగా ప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా.
మాన్యుడవైననేమి నిను మన్నన జేయక దిక్కులేని సా
మాన్యుడవంచు నెంచి యవమానము చేసెడి చోట బేలవై
దైన్యపు జీవనమ్మచట దాపురమౌ సృణి జాతికెల్ల ప్రా
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్.
ధన్యంబగు జీవితమే
రిప్లయితొలగించండిమాన్యుల గుర్తించి తగిన మాన్యత నిడగా
శూన్యతకు సమంబగు ప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా
ధన్యము గాదెజీవితము ధర్మము తప్పని మార్గమెంచినన్
దైన్యము నిండియుండి పరితాపము తొల్గక యున్న తావులన్
మాన్యుల శక్తియుక్తులకు మన్నన దక్కక శూన్యమైన ప్రా
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్
-
రిప్లయితొలగించండిమాన్యంబైనట్టి నెలవు
ధాన్యంబున్నట్టి తావు; దడయక విడుమా
మాన్యులు లేని తలమ్మును
సైన్యము గావని పుడమిని చట్టని సుమతీ
కం:మాన్యుడు శ్రీనాథ కవికె
రిప్లయితొలగించండిశూన్యపు హస్తములు,పాడు జొన్నల కూడున్
వన్యప్రజ మెచ్చని వరి
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా”
(శ్రీనాథుడు పల్నాటి సీమని బాగా ఆక్షేపించాడు.నా వంటి మహా కవి కే శూన్యహస్తాలు,జొన్న కూడు,రుచి లేని మోటు వరి మెతుకులు ఉన్న ఈ పల్నాడుని వదిలెయ్యండి అన్నట్టు.)
ధన్యతనొందఁగ బ్రతుకులు
రిప్లయితొలగించండిమాన్యుల నడుమన నిరతము మసలఁగ నొప్పున్
అన్యాయంబునకే ప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా
ధన్యతనొందు జీవనము ధర్మపథంబును వీడకుండినన్
రిప్లయితొలగించండిమాన్యులు బోవు త్రోవఁజన మన్నన బొందుదు రెల్ల వేళలన్
మాన్యతలేని ముష్కరుల మార్గమునం జెడు వర్తనమ్ము ప్రా
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్
ఉ:ధాన్యము పండు గ్రామమున తక్కువ నాణ్యత తోడ,దానిచే
రిప్లయితొలగించండిశూన్యము లాభ మీ నడుమ జూడ పుగాకును ,ప్రత్తి యెంతయున్
మాన్యత నొంది రైతులకు మంచిగ లాభము గూర్చుచుండె నీ
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్”
(వరి మొదలైన ధాన్యాల కంటే వాణిజ్య పంటలు నయం అని అలాంటి గ్రామాలకి మారటం మంచి దని ఒక రైతు ఆలోచన.)
కం॥ మాన్యత కాంచనముఁ బడయ
రిప్లయితొలగించండిధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా
యన్యము దోఁచఁగ నేలను
ధన్యత పసిడినిఁ బడయుట తస్కర విద్యన్
ఉ॥ మాన్యులు గారు వారిలను మానకఁ ద్రిమ్మరు చుండు చోరులే!
యన్యము వీడి కాంచనము నాశగ సంపద దోఁచ నెంచుచున్
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్
మాన్యత కాంచనమ్ముకని మక్కువ మీర చరించు జ్ఞానులే!
చోరులకు ధాన్యమక్కరలేదండి.
అందరు ప్రాధాన్యము నుపయోగించారు. అందుకని
మాన్యమ్ము లెన్ని యున్నను
రిప్లయితొలగించండిధాన్యం బది శూన్యమైనఁ దరమే బ్రతుకన్
దైన్యమ్ము వీడి చేరఁగ
ధాన్యం బున్నట్టి తావుఁ దడయక విడుమా
అన్య జగమ్ములం దునికి యర్హ మగుం బరికింప లోనఁ జై
తన్యము లూన నెంచిన స దార కుమార యుతమ్ము ధాత్రినిన్
శూన్యము లేక పంచుటకు సుంతయుఁ జాలక యున్న రీతినిన్
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్
మాన్యము సాగుచేయుచును మట్టిని బంగరు జేసినావు సౌ
రిప్లయితొలగించండిజన్యము తోడుతన్ సతముచక్కని సేవలు నీవు జేయుచున్
మాన్యత నొందినావు యప మార్గము నందున పోవు శత్రు ప్రా
ధాన్యము గల్గు తావును పదంపడి వీడుటె మేలు చూడగన్
మాన్యత యందని తావున
రిప్లయితొలగించండిదైన్యపుజీవనమదేల దయతోవినుమా
అన్యాయమ్మునకే ప్రా
*"ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా”*
మాన్యత లేనితావునను మత్సర బుద్ధినిచూపుచున్ సదా
యన్యుల సంపదల్ మదిని యక్రమ రీతిగపొందనెంచునా
వన్యమృగంబులట్టి జనవాహిని కేనధికమ్ము నైన ప్రా
*“ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మాన్యతయె లేని తావున,
నన్యాయము చేయువార లధికము నున్నన్
అన్యులు దుష్టులకున్ ప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా!