3, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5202

4-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్”

(లేదా...)

“కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)


13 కామెంట్‌లు:


  1. ముందున్న వనమ్మున నా
    నందముతో నడచు వేళ నారియె చూపెన్
    మందారము పై గల యా
    కుం దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్.


    ముందున్నట్టి వనమ్ములో సఖునితో బోనంబునే సేసి యా
    నందంబందున సంచరించు తరినిన్ నా కంటితో గాంచిృతిన్
    బృందా! పైన నభమ్ము నంటెడి విధిన్ వృక్షమ్ము క్రిందున్న యా
    కుం దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్.

    రిప్లయితొలగించండి
  2. శా.
    సందోహంబుగ రైతు బిడ్డ పొలమున్ సమ్మానమౌ రీతిలో
    కందుల్ నాటుచునుండ దూరమున నా కన్వింపుగా గింజలన్
    విందుల్ వోలిక చూచి చక్కగ దినం వీతెంచి యా నీటిఁ దా
    కుం, దేలున్, వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్ !

    రిప్లయితొలగించండి
  3. కందం
    అందాలొలుకుచు ముంగిట
    చిందులు వేయు పసిపాపఁ జేరంగ వడిన్
    ముందుకు ప్రాకి కదుప నా
    కుం, దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    శార్దూలవిక్రీడితము
    అందాలొల్కుచు పాపయే పెరట దోగాడంగ కన్విందుగన్
    జిందుల్ వేసెడు పిల్లలున్ మసలగన్ జేరంగ తేలచ్చటన్
    సందేహింపక దైవలీలఁ గన నాశ్చర్యమ్ము! ప్రాకంగ నా
    కుం, దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్

    రిప్లయితొలగించండి
  4. పొందికగ పిండి తోడనె 
    చందముగ తయా రు జేసె జంతువుల బొమల్ 
    తొందరగ నెండ బెట్టగ
    కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  5. సుందర రూపమ్ము కలిగి
    సందడి చేయుచు తిరిగిన చరణాయుధమే
    తొందర పాటువిడిచి కడ
    కుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    [కడకున్ + దేలును]

    పందెంబంచు వరించితెచ్చెనతడే ప్రఖ్యాతమౌ రీతి పెం
    పొందింపంగ లభించినట్టిరకమే పోట్లాటలో గెల్వగా
    సందోహంబుగ కూడియుండ జనులే సంపూర్ణమౌ పూతరే
    కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్

    [పూతరేకున్ + దేలున్]

    రిప్లయితొలగించండి
  6. కం:అందముగ నున్న దని నే
    కుందేలును బెంచ తేలు గోడల నెరియల్
    సందుల దాటుక జేరన్
    కుందేలును- గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  7. కం॥ అందము వింతలు చెలఁగఁగ
    విందని చిత్రముననట్లు పిల్లల కొరకై
    పొందుగఁ దీయఁగ నందునఁ
    గుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    శా॥ చిందుల్ వేసెడి పిల్లలేరి కనఁగన్ జిత్రంబు లెన్నో గృహ
    మ్మందుఁ జూడఁగ దూరదర్శినిని సామాన్యంబుగన్ వీడరే
    యందున్ జిత్ర విచిత్ర సాహసములే యాశ్చర్య మేపారఁగన్
    గుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండఁగన్

    అందరు ఆకుం దేలు అని విడగొట్టినందున నేను పిల్లల కార్టూన్ తీసుకున్నానండి

    రిప్లయితొలగించండి
  8. అందపు చక్కర బొమ్మల
    పొందిక గా పేర్చి పాప మురిసె డి వేళ న్
    ముందర గాంచియు న య్యె డ
    కుందేలును కోడి పిల్ల గు టు కున మ్రింగె న్

    రిప్లయితొలగించండి
  9. శా:విందుల్ జేయగ శేష మై చెడిన యా బీట్ రూటు, చింతాకు నున్
    బొందన్ వేయగ దేలు దొర్లినది,"బాబో!" యంచు నే నర్వ గా
    విందేదో లభియించె నంచు నతి యౌ వేగమ్ము తో చింత యా
    కుం, దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్”

    రిప్లయితొలగించండి
  10. విందుమె వింత సురనదీ
    నందనుని శిఖండి గూల్చె నరుఁ డరయఁగ నా
    చందం బది యెట్లన్నం
    గుందేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్


    సందేహింపక సుంతయేన్ శునక రక్షాకల్పితప్రాంత మం
    దందందం దిరుగాడు చుండి వితతం బానంద ముప్పొంగఁగాఁ
    జిందుల్ వేయుచు నుండఁ గాంచి పటిమం జిక్కంగ లంఘించి యా
    కుందేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండఁగన్

    [కుక్కుటము = కుక్క]

    రిప్లయితొలగించండి
  11. మందార వనము నందున
    సుందరనారీమణి యొక చోద్యము గాంచెన్
    పొందుగ దాగిన నొకయా
    కుం దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  12. అందున్ కేళి వనంబునందు నొక యందాలొల్కు కంజాక్షికిన్
    విందుల్ గొల్పుచు మందమారుతము కన్విందున్ ప్రచారించు నా
    నందంబుం జవిగొంచు గాంచెనట విన్నాణంబుగా దాగనా
    కుం, దేలున్ వడి మ్రింగెఁ గుక్కుటము సంకోచమ్ము లేకుండగన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మందార చెట్టు క్రిందను
    పొందుగ గాంచితిని కోడి పురుగులఁదినుచున్
    ముందు కరిగి మందారా
    కుం దేలును గోడిపిల్ల గుటుకున మ్రింగెన్.

    రిప్లయితొలగించండి