చం:"రయముగ గాలి వీచిన తిరమ్ముగ నిల్చునె మేఘ?" మంచు సం శయమును లేక యక్షు డొక చక్కని ప్రేమను దెల్పె భార్యకున్ మొయిలు గమించెఁ బైపయినఁ, బుల్కలు గల్గెను భూమిపై భళా! దయ గల ప్రేమకావ్య మది తట్టె మహాకవి కాళిదాసుకున్ (ఆకాశం లో మేఘం పోతుంటే భూమి పైన ఒక మహాకవికి పులకింత కలిగి మేఘసందేశకావ్య మైంది." గాలి వీస్తే చెల్లా చెదరయ్యే మేఘం ప్రేమసందేశాన్ని చేరుస్తుందా?" అనే ప్రశ్న కూడా యక్షునికి కలగ లేదు.ప్రేమావేశం లో ఉన్న వాడికి వివేకం ఉండదని కూడా కాళిదాసే అన్నాడు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితేటగీతి
తొలగించండివానలేదంచు తపియించె వసుధమిగుల
రాకరాక మచ్చితివీవు ప్రజలుమెచ్చ
కుండపోతగ వర్షింప గోరినంత
మొయిలు పైపైనఁ! బులకలు భూమిపైన!
చంపకమాల
దయగనవేలనో వరుణ! దైన్యము గాంచవె తల్లడిల్లగన్
నియమిత కాలమీ ఋతువు నేరకయుంటిమి నీదురాకకై
చయముగ వచ్చితీవు చలచల్లని గాలుల స్వాగతమ్మనన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
టైపాటు సవరణతో తేటగీతి
తొలగించండితేటగీతి
వానలేదంచు తపియించె వసుధమిగుల
రాకరాక వచ్చితివీవు ప్రజలుమెచ్చ
కుండపోతగ వర్షింప గోరినంత
మొయిలు పైపైనఁ! బులకలు భూమిపైన!
చ.
రిప్లయితొలగించండిభయమిక లేదు కర్షక తపమ్ములు పండెను చూడు శీర్షమె
త్తి యిపుడు కారుగాలమున తీవ్ర రవి ప్రభలాగి వచ్చెన
య్య యెదల దోచు రీతులను హాయిని పంచి చిర్జల్లు చిల్కగన్
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాన కురిసెను దండిగ వసుధపైన
రిప్లయితొలగించండిసదనమున కొకరుగ వ్యాధి జవిగొనంగ ,
మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన
వగచ నింగికి నేలకు వావి కలదె ?
రిప్లయితొలగించండివర్షములు లేక రైతులు బాధపడెడి
తరుణమందున నురుములు మెరుపు లవియె
మొదలగుచును భారముగను కదులు చుండ
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన.
భయపడి రయ్యొ కర్షకులు వర్షము లన్నవి లేక నచ్చటన్
మెయియది వ్రయ్యలయ్యెనని మిక్కిలి బాధను చెందు వేళలో
బయలును మేఘడంబరము ప్రాయణమౌచు మృదుత్వమందునన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా.
వేడి గాడ్పులు భువిపైన విచ్చలుగను
రిప్లయితొలగించండిజనుల నుక్కిరిబిక్కిరి సలిపి వెడలె
స్వాస్థ్యమును గూర్చ నరుదెంచె జలమునుఁగొని
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన
దయితునితో సమాగమము దక్కని ప్రేయసి యూరుపో యనన్
రిప్లయితొలగించండిదయ విడనాడి వేసవిని తద్దయు నూష్మము సందడించగన్
రయముగ నంతరిక్షమున రంజన గూర్చుచు మానవాళికిన్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా
భయమునఁ గృషీవలురచట వర్షములకుఁ
రిప్లయితొలగించండిస్వయముగ పరికింపఁ దొడగె శబ్దగుణము
హొయలుగ తరలు మబ్బులు ద్యోతకమయె
మొయిలు పైపైనఁ బులకకు భూమిపైన
భయపడు కర్షకాళి తమ పంటలకున్ దగు నీటి కోసమై
స్వయముగ వీక్షసేసిరట సత్పధమందున వాన జాడకై
హొయలుగ సాగుచున్నవట వ్యోమమునందున మేఘమాలికల్
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా
వరుణ దేవుడు క రు ణించి వర్ష మొ సగ
రిప్లయితొలగించండినిర్ణయించి న వేళ లో నిర్మ లంపు
గగన మందున దట్ట మై కాను పించె
మొ యిలు పైపై న పులకలు భూమి పైన
తే॥ వర్షమరుదుగన్ గురియుచు హర్షమునిడు
రిప్లయితొలగించండిగనఁగ రాయల సీమను కలత తొలగ
రయమగ కురియు చుండఁగ
రైతు మురియు
మొయిలు పైపైనఁ బులకలు భూమిపైన
చం॥ నియతిగ వాన కుర్వగను నెమ్మిని గాంచుచు మోద మందరే!
దయఁగనె దైమమీ పగిది ధన్యతఁ గాంతుమటంచుఁ దెల్పరే
మొయిలు గమించెఁ బైపయిన బుల్కలు గల్గెను భూమిపై భళా
రయమున వాన తాకిడికి రాయలసీమను హర్ష మొందగన్
తే.గీ:వర్ష కాలాన గలిగెను హర్ష మనగ
రిప్లయితొలగించండిమెరుపు రూపాల విరిసెను మురియ జగతి
మొయిలు పైపైనఁ బులకలు, భూమిపైన”
నెమలి యది గని తమి దీర నృత్య మాడె.
సమస్య:
రిప్లయితొలగించండిమొయిలు గమించె బైపయిన బుల్కలు గల్కెను భూమి పై భళా !
చం.మా :
కయిత జనించె శ్రీహరి దిగంగ బిరాన గజేంద్రు రక్షకై !
మొయిలును బోలు దేహమును మోహన రూపుని గాంచ ధన్యమే !
దయితను గూడి రాగ భువి రక్షణ సేయ దశావతారియై
మొయిలు గమించె బైపయిన బుల్కలు గల్కెను భూమి పై భళా !
చం:"రయముగ గాలి వీచిన తిరమ్ముగ నిల్చునె మేఘ?" మంచు సం
రిప్లయితొలగించండిశయమును లేక యక్షు డొక చక్కని ప్రేమను దెల్పె భార్యకున్
మొయిలు గమించెఁ బైపయినఁ, బుల్కలు గల్గెను భూమిపై భళా!
దయ గల ప్రేమకావ్య మది తట్టె మహాకవి కాళిదాసుకున్
(ఆకాశం లో మేఘం పోతుంటే భూమి పైన ఒక మహాకవికి పులకింత కలిగి మేఘసందేశకావ్య మైంది." గాలి వీస్తే చెల్లా చెదరయ్యే మేఘం ప్రేమసందేశాన్ని చేరుస్తుందా?" అనే ప్రశ్న కూడా యక్షునికి కలగ లేదు.ప్రేమావేశం లో ఉన్న వాడికి వివేకం ఉండదని కూడా కాళిదాసే అన్నాడు.)
వింత గాదె కడలి నీరు విన్నుఁ జేరి
రిప్లయితొలగించండితిరిగి వసుధా తలమ్మునఁ గురియు చుండు
నింపుగఁ గదలాడుచు నుండు, నింప నీరు,
మొయిలు పైపైనఁ, బులకకు భూమి పైన
[పులక = అనాస చెట్టు]
కయితల సున్నితత్వ మఁట కానఁగ రా దది వింత చేతలం
బయికి ముదమ్ము దోఁపఁగను బర్వెను దుఃఖ చయమ్ము లోపలన్
హొయ లడరంగ బాహ్యమున నుల్లము నందుఁ జెలంగె వంతలే
మొయిలు గమించెఁ బైపయినఁ బుల్కలు గల్గెను భూమిపై భళా
[పులు+కలు= పుల్కలు; చిన్న రాయి]