21, ఆగస్టు 2025, గురువారం

సమస్య - 5220

22-8-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వారధినిఁ గట్టినారఁట పాండుసుతులు”

(లేదా...)

“వారలు పంచపాండవులు వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్”


12 కామెంట్‌లు:

  1. రామబంటులు రాముడు లంకఁ జేర
    వారధినిఁ గట్టినారఁట, పాండుసుతులు
    సంతసమునొంద మయుఁడొక వింతగొలుపు
    సభను నిర్మించి యిచ్చెను రభసముగను

    రిప్లయితొలగించండి
  2. విరించిగురువారం, ఆగస్టు 21, 2025 9:48:00 PM

    వానరులు లంక జేరగ వార్ధిపైన
    కట్టిరేమి? శత్రువులన కౌరవులకు
    నెవరని యడిగితి తెలుపు మింపుగ నన
    వారధినిఁ గట్టినారఁట , పాండుసుతులు.

    వారిజ నేత్రి ద్రోవది వివాహమునాడిన వీరు లెవ్వరో?
    శ్రీ రఘు రామ కార్యమని చివ్వను గోరుచు శీఘ్రమందునన్
    వారిధి దాటనెంచుచును వానరు లచ్చట జేసిరేమనన్?
    వారలు పంచపాండవులు , వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్.

    రిప్లయితొలగించండి
  3. భారత యుద్ధరంగమున భైరవ
    మొప్పగ బోరి గెల్చి ర
    వ్వారలు పంచపాండవులు, వారధి
    గట్టిరి లంక జేరగన్
    ధీరులు రామసేన కపి తేజులు
    మిక్కిలి సహసంబుతో
    క్రూరుడు రావణాసురుని గూల్చియు
    సీతను దేనయోద్యకున్



    రిప్లయితొలగించండి
  4. ఉ.
    తారలు విస్తుపోవు గతి తామర బంధువు వృద్ధి చెంద నే
    భారతరామగాథలను స్వప్నమునందు విరుద్ధ రీతిలో
    సారెకు గంటి, కౌరవుల జంపెను రాముడు, కృష్ణు చుట్టలౌ
    వారలు పంచపాండవులు వారధిఁ గట్టిరి లంకఁ జేరగన్ !

    రిప్లయితొలగించండి
  5. వారలమేయ విక్రములు వారు గుణాఢ్యులు వర్తనమ్మునన్
    వారలు పంచపాండవులు, వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్
    వారలు వానరుల్ పరమభక్తులు శ్రీరఘురామమూర్తికిన్
    బోరన రామునాజ్ఞఁ గొని పోరును సల్పఁగ రాక్షసాళితో

    రిప్లయితొలగించండి
  6. వనిత కుజను తెచ్చుటకయి వానరముల
    దండు యచ్చటి కడలిని దాటనెంచి
    వారధినిఁ గట్టినారఁట ; పాండుసుతులు
    కలిసి కృష్ణకు సూత్రము కట్టినటుల

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    హ నుమ నలనీల జాంబవుఁడంగదుండు
    ముఖ్యులేవురు శ్రమియించి పొందువడగ
    ననుటె రాఘవపాండవీయార్థ భ్రమను
    "వారధినిఁ గట్టినారఁట పాండుసుతులు"

    ఉత్పలమాల
    తీరుగ నర్థమున్ దెలియు దృష్టిని రాఘవపాండవీయమున్
    నేరిచి పల్కినంత నలనీల సుసేణులు హన్మ జాంబవుల్
    గూరిన ముఖ్యులేవురని గొప్పగజెప్పుట, తాఱుమాఱునన్
    "వారలు పంచపాండవులు వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్"

    రిప్లయితొలగించండి
  8. దాశరథి కండదండగా తాము నిల్చి
    వానరుల్ పట్టువీడక పరువుపైన
    వారధినిఁ గట్టినారఁట; పాండుసుతులు
    పట్టు బిగియించి గెల్చిరి భారతమున

    భారత రామ కావ్యముల బల్లిదులే గనవచ్చు చుంద్రుగా
    కోరుచు రాజ్యసౌభగము ఘోరవిదారము సల్పినారుగా
    వారలు పంచపాండవులు; వారధిఁ గట్టిరి లంకఁ జేరఁగన్
    వారలు వానరుల్ తరలి వచ్చిరి రాముని కండదండగా

    రిప్లయితొలగించండి
  9. క్రమాలాంకారం లో ---
    కపులు లంకను జేరంగ గట్టి రే ది?
    జూదమున నోడి వెడలియు మోద ముడిగి
    గడిపి రె వ్వరు వనవాస కఠి న దీక్ష?
    వారధి ని గట్టి నారట :: పాండు సుతులు

    రిప్లయితొలగించండి


  10. కపట‌ కౌరవ‌ వ్యూహాల‌ కడలిదాట‌
    కృష్ణ భగవాను‌డందించు‌ కృపను‌చేత
    నిష్ఠ నిలుపుచు‌ జయముకై‌ గట్టి ధర్మ‌
    వారధి‌నిఁ గట్టినారఁట పాండుసుతులు‌

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:రాయబారిగ గృష్ణుడే రాగ శకుని
    పలికె రారాజు తో నిట్లు"పలికి నాడు
    బీరముల నెన్నొ నీ మేలు కోరి స్నేహ
    వారధినిఁ గట్టినారఁట పాండుసుతులు”
    (జూదం సందర్భం లో ఈ పాండవులు పెద్ద ప్రతిజ్ఞలు చేసారు కదా!ఇప్పు డేదో నీ మంచి కోసం స్నేహవారధి కట్టారటోయ్! అని శకుని దుర్యోధనుడి తో వేళాకోళం గా అన్నట్టు.)

    రిప్లయితొలగించండి