13-10-2025 (సోమ వారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు"
లేదా"పావల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్"
(విరించి గారికి ధన్యవాదాలతో...)
జనుల మోసగించగ నెంచి జరుపుటకయిపావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పుననుకొనగ నది యేమాత్ర;మనువు కాదు .నీతిననుసరించి బ్రతుకు నెరపనగును
నౌకరి యటంచు నటవెట్టి చాకిరేలవర్తకమ్ము జేయ సిరుల వర్ష మేను తెలివి గలిగిన వారకు తెలుప వశమె పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు.తావిష తీరమందు సరదాపడి గేహిణి తో చరించెడిన్ సావిని వెక్కమ్ముగ విసారము లన్ గని పల్కె నింతియే చైవది లేదు లేదని విచార మదేల యనంగనే గురప్పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్.
విశ్వమందు కుబేరులు విపణిలోనచెలగి కూడబెట్టిరి చూడ చిత్రము గద!విశదమౌ త్వరితగతిని పెట్టిబడినిపావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పుజీవితమన్న రోసి తన చింతల నన్నియుఁ దెల్పి వెంటనేచావుకు సిద్దమైన తన సాటి మనుష్యుని తోననెన్ విరూపా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్జీవితమేగదా మనకు జీవన సిద్ధినొసంగు మార్గమౌ
నేటి వ్యాపార వేత్తలు నేర్చు కొన్న లాభ ముల బొందు మార్గమ్ము సంభ వమ్ము పెట్టు బడి గాను కొంచెము విత్త ముంచి పావలా పెట్టి లక్షల బడ య వచ్చు
జీవిక కోసమై పనులు చేయగ నెంచుచు పట్నమందునన్దైవము లాంటి మానిసికి దాస్యము చేయగ భక్తితోడ నాసేవకు మెచ్చి నాతడును శీఘ్రమె భాగమొసంగఁ భూమిలో “పావల “చేతబట్టి సముపార్జన జేసితి బెక్కు లక్షలన్
జనుల మోసగించగ నెంచి జరుపుటకయి
రిప్లయితొలగించండిపావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు
ననుకొనగ నది యేమాత్ర;మనువు కాదు .
నీతిననుసరించి బ్రతుకు నెరపనగును
రిప్లయితొలగించండినౌకరి యటంచు నటవెట్టి చాకిరేల
వర్తకమ్ము జేయ సిరుల వర్ష మేను
తెలివి గలిగిన వారకు తెలుప వశమె
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు.
తావిష తీరమందు సరదాపడి గేహిణి తో చరించెడిన్
సావిని వెక్కమ్ముగ విసారము లన్ గని పల్కె నింతియే
చైవది లేదు లేదని విచార మదేల యనంగనే గుర
ప్పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్.
విశ్వమందు కుబేరులు విపణిలోన
రిప్లయితొలగించండిచెలగి కూడబెట్టిరి చూడ చిత్రము గద!
విశదమౌ త్వరితగతిని పెట్టిబడిని
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు
జీవితమన్న రోసి తన చింతల నన్నియుఁ దెల్పి వెంటనే
చావుకు సిద్దమైన తన సాటి మనుష్యుని తోననెన్ విరూ
పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్
జీవితమేగదా మనకు జీవన సిద్ధినొసంగు మార్గమౌ
నేటి వ్యాపార వేత్తలు నేర్చు కొన్న
రిప్లయితొలగించండిలాభ ముల బొందు మార్గమ్ము సంభ వమ్ము
పెట్టు బడి గాను కొంచెము విత్త ముంచి
పావలా పెట్టి లక్షల బడ య వచ్చు
జీవిక కోసమై పనులు చేయగ నెంచుచు పట్నమందునన్
రిప్లయితొలగించండిదైవము లాంటి మానిసికి దాస్యము చేయగ భక్తితోడ నా
సేవకు మెచ్చి నాతడును శీఘ్రమె భాగమొసంగఁ భూమిలో
“పావల “చేతబట్టి సముపార్జన జేసితి బెక్కు లక్షలన్