జీవితమన్న రోసి తన చింతల నన్నియుఁ దెల్పి వెంటనే చావుకు సిద్దమైన తన సాటి మనుష్యుని తోననెన్ విరూ పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్ జీవితమేగదా మనకు జీవన సిద్ధినొసంగు మార్గమౌ
తే.గీ:పావలా నువ్వు గింజల బట్టి యొకడు పలికె నీరీతి"వీనిని పార బోసి తోట బెంచ నా తోట యెంతో ధన మిడు పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు" (పూర్వం నువ్వు గింజ సామెత ఒకటి ఉండేది..ఒకడికి నువ్వు గింజల దొరకగానే దాన్ని తోటలో వేసి తోట పెరిగితే లక్షలు వస్తాయి,వాటిని ఏమి చెయ్యాలి? అని ఆలోచిస్తుండగా ఆ నువ్వు గింజ ఎక్కడో జరి పోయింది. )
ఉ:ఈ వల బూను వర్ణమున నే జనియించితి ,నిట్టి వృత్తి లో నే వసియించి,జాలరుల కే యొక నేతగ నైతి,వారికిన్ సేవలు జేయు నా కిపుడు చెల్లదె చేపల మంత్రి నౌట? త ప్పా? వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్ (ఇతను బెస్త కులం లోనే పుట్టి, చేపలు పట్టి సంపాదించి ,ఆ కులానికి నాయకుదై వాళ్లకి సేవలు చేసాడు.మరి మత్స్యశాఖా మంత్రిగా ఇతను ఉండటం తప్పా!తప్పకుండా ఇతనే అర్హుడు.)
జనుల మోసగించగ నెంచి జరుపుటకయి
రిప్లయితొలగించండిపావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు
ననుకొనగ నది యేమాత్ర;మనువు కాదు .
నీతిననుసరించి బ్రతుకు నెరపనగును
రిప్లయితొలగించండినౌకరి యటంచు నటవెట్టి చాకిరేల
వర్తకమ్ము జేయ సిరుల వర్ష మేను
తెలివి గలిగిన వారకు తెలుప వశమె
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు.
తావిష తీరమందు సరదాపడి గేహిణి తో చరించెడిన్
సావిని వెక్కమ్ముగ విసారము లన్ గని పల్కె నింతియే
చైవది లేదు లేదని విచార మదేల యనంగనే గుర
ప్పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్.
విశ్వమందు కుబేరులు విపణిలోన
రిప్లయితొలగించండిచెలగి కూడబెట్టిరి చూడ చిత్రము గద!
విశదమౌ త్వరితగతిని పెట్టిబడిని
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు
జీవితమన్న రోసి తన చింతల నన్నియుఁ దెల్పి వెంటనే
చావుకు సిద్దమైన తన సాటి మనుష్యుని తోననెన్ విరూ
పా! వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్
జీవితమేగదా మనకు జీవన సిద్ధినొసంగు మార్గమౌ
నేటి వ్యాపార వేత్తలు నేర్చు కొన్న
రిప్లయితొలగించండిలాభ ముల బొందు మార్గమ్ము సంభ వమ్ము
పెట్టు బడి గాను కొంచెము విత్త ముంచి
పావలా పెట్టి లక్షల బడ య వచ్చు
జీవిక కోసమై పనులు చేయగ నెంచుచు పట్నమందునన్
రిప్లయితొలగించండిదైవము లాంటి మానిసికి దాస్యము చేయగ భక్తితోడ నా
సేవకు మెచ్చి నాతడును శీఘ్రమె భాగమొసంగఁ భూమిలో
“పావల “చేతబట్టి సముపార్జన జేసితి బెక్కు లక్షలన్
రిప్లయితొలగించండిజీవితమందునన్పొదుపు జేసిననబ్బును సౌఖ్యమంచు నే
భావితరమ్ము వారసుల భాగ్యముఁ గోరియు నిన్నినాళ్ళుగా
పావల వంతు జీతమును బాయక దాచితి నివ్విధమ్ముగా
పావల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్
తే.గీ:పావలా నువ్వు గింజల బట్టి యొకడు
రిప్లయితొలగించండిపలికె నీరీతి"వీనిని పార బోసి
తోట బెంచ నా తోట యెంతో ధన మిడు
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు"
(పూర్వం నువ్వు గింజ సామెత ఒకటి ఉండేది..ఒకడికి నువ్వు గింజల దొరకగానే దాన్ని తోటలో వేసి తోట పెరిగితే లక్షలు వస్తాయి,వాటిని ఏమి చెయ్యాలి? అని ఆలోచిస్తుండగా ఆ నువ్వు గింజ ఎక్కడో జరి పోయింది. )
రిప్లయితొలగించండితే॥ బ్రదుకున నొడిదుకులలమ బండ్లగు గద
యోడలు మరి యోడలు బండ్లు చూడఁ గాను
దైవ కృపఁ గని జగతినిఁ దనరునపుడు
పావలా పెట్టి లక్షలఁ బడయుటొప్పు
ఉ। నావను రేవు చేర్చునని నమ్మితి దైన్యతఁ బాపఁ గొల్చితిన్
సేవలఁ జేసి కష్టపడి చేయఁగ నేర్పుగ వర్తకమ్మునున్
దైవ కృపావలంబనను ధన్యతఁ గాంచుచు వృద్ధిఁ బొందితిన్
బావల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్
(రమారమి దీరూభాయ్ అంబానీ యెదుగల అండి)
ఉ:ఈ వల బూను వర్ణమున నే జనియించితి ,నిట్టి వృత్తి లో
రిప్లయితొలగించండినే వసియించి,జాలరుల కే యొక నేతగ నైతి,వారికిన్
సేవలు జేయు నా కిపుడు చెల్లదె చేపల మంత్రి నౌట? త
ప్పా? వల చేతఁ బట్టి సముపార్జనఁ జేసితిఁ బెక్కు లక్షలన్
(ఇతను బెస్త కులం లోనే పుట్టి, చేపలు పట్టి సంపాదించి ,ఆ కులానికి నాయకుదై వాళ్లకి సేవలు చేసాడు.మరి మత్స్యశాఖా మంత్రిగా ఇతను ఉండటం తప్పా!తప్పకుండా ఇతనే అర్హుడు.)