7-2-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను”(లేదా...)“రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై”
తేటగీతిసీతఁదెచ్చుట నిందించి, శ్రేయమొనరదాశరథి కొసంగుట మేటి ధర్మమనఁగమూడి దుర్భాషలాడుచుఁ బొమ్మనంగరావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెనుఉత్పలమాలకావరమెక్కువై మదిని కామము మీరగ నీచ భిక్షువైపావని జానకిన్ గొనియు బందిగ లంకకుఁ జేర్చుటన్నదేదీవరమన్ విభీషణుని దెప్పినయంతట కారుకూతలన్రావణుఁ ,డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై! (రావణుఁడు, + ఏగుదెంచి)
జ్యేష్ఠుడైనను రాముని యెదిరి నిలిచెరావణుఁడు ; రామభక్తుఁడై ప్రణతులిడెనుపిన్న వాడయినట్టి విభీషణుండు,అన్న దమ్ముల మధ్యన అంతరమిది
సంలయనమున నావిభీషణుడు గాంచెస్వప్నమొక్కటి యందు వాస్తవ మెఱంగిదనుజ జాతిని రక్షింప దలచి నట్టిరావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను.ఆ వసతిన్ విభీషణుడు నంతిపురమ్ము శయించు వేళలో పావనభక్తుడై కనెను స్వప్నము నొక్కటి యందు రాఘవున్ చేవనెఱంగి శీఘ్రమున సీతను రామున కప్పగించుచున్ రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై.
భావములోన నిల్పి గరువంబున లావును గూర్చు వానిగన్ జేవను గొంచు నమ్మి విభుసేవయె జీవన మార్గమంచు సంభావిత నిశ్చలాత్మ ధృతిబైకొని, మారుతి, భక్తి రక్తి మిత్రావణుఁ, డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!మిత్ర+అవణుడు=మైత్రితో యొప్పువాడు (అవణు+ఒప్పు)
తేటగీతి
రిప్లయితొలగించండిసీతఁదెచ్చుట నిందించి, శ్రేయమొనర
దాశరథి కొసంగుట మేటి ధర్మమనఁగ
మూడి దుర్భాషలాడుచుఁ బొమ్మనంగ
రావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెను
ఉత్పలమాల
కావరమెక్కువై మదిని కామము మీరగ నీచ భిక్షువై
పావని జానకిన్ గొనియు బందిగ లంకకుఁ జేర్చుటన్నదే
దీవరమన్ విభీషణుని దెప్పినయంతట కారుకూతలన్
రావణుఁ ,డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!
(రావణుఁడు, + ఏగుదెంచి)
జ్యేష్ఠుడైనను రాముని యెదిరి నిలిచె
రిప్లయితొలగించండిరావణుఁడు ; రామభక్తుఁడై ప్రణతులిడెను
పిన్న వాడయినట్టి విభీషణుండు,
అన్న దమ్ముల మధ్యన అంతరమిది
రిప్లయితొలగించండిసంలయనమున నావిభీషణుడు గాంచె
స్వప్నమొక్కటి యందు వాస్తవ మెఱంగి
దనుజ జాతిని రక్షింప దలచి నట్టి
రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను.
ఆ వసతిన్ విభీషణుడు నంతిపురమ్ము శయించు వేళలో
పావనభక్తుడై కనెను స్వప్నము నొక్కటి యందు రాఘవున్
చేవనెఱంగి శీఘ్రమున సీతను రామున కప్పగించుచున్
రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై.
భావములోన నిల్పి గరు
రిప్లయితొలగించండివంబున లావును గూర్చు వానిగన్
జేవను గొంచు నమ్మి విభు
సేవయె జీవన మార్గమంచు సం
భావిత నిశ్చలాత్మ ధృతి
బైకొని, మారుతి, భక్తి రక్తి మి
త్రావణుఁ, డేఁగుదెంచి రఘు
రామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!
మిత్ర+అవణుడు=మైత్రితో యొప్పువాడు (అవణు+ఒప్పు)