31-7-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
(లేదా...)
“ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో మంచినీళ్ళ సరస్వతి గారి సమస్య)
వేద్యుడు సాందీపని దరి విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే విద్యాకరి నచ్చోటను ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.*(శిశువు = శిష్యుడు)*హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్ విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?
ఉద్యతి దుష్టుల దునుమగ చోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్హృద్యమగు రీతి నామోనుఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
సద్యశమొందిన బలినేచోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువేహృద్యంబైన విధంబుననాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమేచోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులందాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
-చోద్యంబుగ రఘురాముండాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్వేద్యంబుగ ఋషిమునులన్పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
https://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
ఆద్యుడు గా సృష్టి కి నా మో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా చోద్య ము గా నన సూ య కు నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్సద్యో జాతుని చాపమున్ విరిచెఁతా సంకల్ప మాత్రంబునన్చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్ ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్
హృద్యము కృష్ణుని లీలలువిద్యార్థిగ జేరి గురుని వేదన దీర్చెన్విద్యార్జనయను మిషతోనాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
హృద్యంబౌ పరమాత్ము లీలలు గనన్ కృష్ణావతారంబునన్విద్యాభ్యాసము నేర్పినట్టి గురువున్ విద్యార్థియై భక్తితోసద్యస్స్ఫూర్తిగ గొల్చి సేవనములన్ సంతుష్టునింజేసి తానాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
కందంవద్యమన జగన్మాతయెసద్యస్ఫూర్తి భువిపైన జన్మించమనన్చోద్యమ్ముగ కమలాక్షుడునాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్శార్దూలవిక్రీడితమువద్యమ్మైనది ధర్మ రక్షయని పన్పంగన్ జగన్మాతయేసద్యస్ఫూర్తిని ధాత్రిపైన హరియే జన్మించె లీలాత్ముఁడైచోద్యమ్ముల్ బహు చూపి గోకులమునన్ జోరుండుగన్ బ్రహ్మమైయాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
రిప్లయితొలగించండివేద్యుడు సాందీపని దరి
విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే
విద్యాకరి నచ్చోటను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.
*(శిశువు = శిష్యుడు)*
హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్
విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో
విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా
నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?
ఉద్యతి దుష్టుల దునుమగ
రిప్లయితొలగించండిచోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్
హృద్యమగు రీతి నామోను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
సద్యశమొందిన బలినే
రిప్లయితొలగించండిచోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువే
హృద్యంబైన విధంబున
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమే
చోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్
విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులం
దాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
-
రిప్లయితొలగించండిచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
తొలగించండిhttps://youtube.com/shorts/gn0zeM4Gj6k?is=uM5BDdHsvUQhpKNo
ఆద్యుడు గా సృష్టి కి నా
రిప్లయితొలగించండిమో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా
చోద్య ము గా నన సూ య కు
నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్
రిప్లయితొలగించండిసద్యో జాతుని చాపమున్ విరిచెఁతా సంకల్ప మాత్రంబునన్
చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్
ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్
హృద్యము కృష్ణుని లీలలు
రిప్లయితొలగించండివిద్యార్థిగ జేరి గురుని వేదన దీర్చెన్
విద్యార్జనయను మిషతో
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
హృద్యంబౌ పరమాత్ము లీలలు గనన్ కృష్ణావతారంబునన్
రిప్లయితొలగించండివిద్యాభ్యాసము నేర్పినట్టి గురువున్ విద్యార్థియై భక్తితో
సద్యస్స్ఫూర్తిగ గొల్చి సేవనములన్ సంతుష్టునింజేసి తా
నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
కందం
రిప్లయితొలగించండివద్యమన జగన్మాతయె
సద్యస్ఫూర్తి భువిపైన జన్మించమనన్
చోద్యమ్ముగ కమలాక్షుడు
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
శార్దూలవిక్రీడితము
వద్యమ్మైనది ధర్మ రక్షయని పన్పంగన్ జగన్మాతయే
సద్యస్ఫూర్తిని ధాత్రిపైన హరియే జన్మించె లీలాత్ముఁడై
చోద్యమ్ముల్ బహు చూపి గోకులమునన్ జోరుండుగన్ బ్రహ్మమై
యాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్