28, ఫిబ్రవరి 2011, సోమవారం

పదవీ విరమణ సన్మాన పత్రము

శ్రీ బేతి నరసింహ స్వామి గారు, B.A., B.Ed.,
స్కూల్ అసిస్టెంట్ (ఆర్ట్స్)
ప్రాథమికోన్నత పాఠశాల, వెంకటాపురం, మం. సంగెం.
ది. 28-02-2011 నాడు పదవీ విరమణ చేయుచున్న సందర్భమున సమర్పించిన
సన్మాన నవరత్నములు

శ్రీ లక్ష్మీ నరసింహ కృ
పాలోకన లబ్ధ సుఖ శుభైక భవిష్య
త్కాలము నీ దగుత! వినుత
శీలాంచిత జీవన! నరసింహ స్వామీ!


తే.గీ.
పేరు కెక్కిన నగరమౌ నోరుగల్లు
లోన `బేతి` వంశమ్మున మాననీయు
లైన `రాజయ్య, రాజమ్మ` లనెడి దంప
తులకు జనన మందిన పుణ్య ఫలము నీవు.


తే.గీ.
పసితనము నందున ద్విచక్ర వాహనమ్ము
నభ్యసింపఁగ క్షత వామహస్తుఁడ వయి
మొక్కవోని ధైర్యముతోడ చక్కనైన
విద్యలను శ్రద్ధతోఁ జదివితివి నీవు.


తే.గీ.
పేర్మితోడ నుపాధ్యాయ వృత్తిఁ బూని
చేరి `ఆజంనగరు, మామునూరు క్యాంపు`
పిదప `తిమ్మాపురము` మరి `పెన్షనుపుర,
ఓరుగల్ కోట, కల్లెడ` నొనరఁ జేసి
చివర `వెంకటాపురము`ను చేరినావు.


కం.
తెల్లని నవ్వుల మల్లెలు
పిల్ల లనుచు నెంచి సర్వ విధముల వారిన్
జల్లఁగఁ జూచుచు జ్ఞానపు
వెల్లువలోఁ దేల్చినావు; విజ్ఞాన నిధీ!


తే.గీ.
పాఠశాలలో నుత్తమ ప్రతిభఁ జూపి
నట్టి విద్యార్థులను మెచ్చి యాదరమున
పారితోషకముల నిచ్చి వారి నెల్ల
ప్రోత్సహించిన యాదర్శ మూర్తి వీవు.


కం.
మనమున మంచితనము నీ
వనయము నెలకొల్పి మిత్రు లందరు మెచ్చన్
వెనుకడుగు వేయకను ముం
దునకే సాగితివి కష్టదూరుఁడ వగుచున్.


తే.గీ.
సాధుశీల `రాజేశ్వరి`న్ సతిగ పొంది,
`శ్వేత` కూతురై, `శర`తల్లుఁడై తనరగ,
పౌత్రుఁడైన `హేమంతు` సంబర మిడంగ,
ధీవిశాలురు సత్కీర్తిఁ దెచ్చు సుతులు
`రామకృష్ణ, గౌతము, రఘురాము` లలర
భావి జీవనమున శాంతిఁ బడయఁ గలవు.


కం.
ఎద లుప్పొంగ సమర్పిం
చెద మిదె `బేత్యన్వయ నరసింహ స్వామీ`!
కొదవయె లేని శుభముఁ గన
పదవీ విరమణ సమయ శుభాకాంక్ష లివే!


సమర్పణ
విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు
యు. పి. యస్. వెంకటాపురం, మం. సంగెం.
రచన: కంది శంకరయ్య, విశ్రాంత తెలుగు పండితుడు.

వారాంతపు సమస్యా పూరణం - (భీముఁడు భీష్ముఁ జంపె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
భీముఁడు భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 240 (తాళి గట్టినవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తాళి గట్టినవాఁడె నీ తండ్రి యగును.
ఈ సమస్యను పంపిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 239 (కలమును త్యజియించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.
ఈ సమస్యను సూచించిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

26, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 238 (వరుఁడను నా కేల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 237 (వాజపేయిని శ్రీదేవి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె.

24, ఫిబ్రవరి 2011, గురువారం

వారాంతపు సమస్యా పూరణం - (హరికి వాణియె)

కవి మిత్రులారా,
శ్రీ చింతా రామకృష్ణారావు గారు పంపిన సమస్య ఇది.
దీనిని తేటగీతిలో కాని, కందంలో కాని, ఉత్పలమాలలో కాని, చంపకమాలలో కాని పూరించ వలసిందిగా వారు కోరారు.
కంద గీత గర్భితమైన ఉత్పలమాల కాని, చంపకమాల కాని వ్రాస్తే వారికి సంతోషం.
అలాంటి పద్యాలతో ఒక శతకమే వ్రాసిన కవిశ్రేష్ఠులు వారు.
కవి మిత్రు లెవరైనా దీని నొక సవాలుగా స్వీకరించి పూరించండి. ఆ సమస్య ఇది ......
హరికి వాణియె భార్య మహాత్ము లెన్న.
శ్రీ చింతా రామకృష్ణారావు గారి సౌజన్యంతో, వారికి ధన్యవాదాలతో .....

సమస్యా పూరణం - 236 (రాతికి వందనము లిడ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్.

23, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 235 (తల్లి తల్లి మగఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల్లి తల్లి మగఁడు తాత కాదు
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 234 (చెడు గుణములతోడ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెడు గుణములతోడ శిష్టుఁ డలరె.

21, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 233 (మాతృ భాషాభిమానమ్ము)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (చంపకమాల లేల)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 232 (రామచరిత్రముఁ జదువఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

19, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 231 (కాంతాలోలుండె మోక్షగామి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్.

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 230 (దిక్కు లేనివాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దిక్కు లేనివాఁడు దినకరుండు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 229 (నా తలపైఁ బాదము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్.
ఈ సమస్యను పంపించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

16, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 228 (భాగ్యనగరమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 227 (మునికి క్రోధమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

ప్రహేళిక - 43

ఇది ఏమిటి?
మంద పీతాంబర్ గారూ పంపిన ప్రహేళిక ఇది. వారికి ధన్యవాదాలతో .....
ఆ. వె.
"కాళ్ళు లేవు గాని కదలి వెళ్ళుచునుండు,
మ్రింగ నోరు లేదు, మ్రింగు నూళ్ళు,
కడుపు నింపు, పంట ఘనముగా పండించు
తెలియు వారు దాని తెలుప గలరె ?

ఇది ఏమిటో చెప్పండి.
సమాధానాన్ని బ్లాగులో వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది చిరునామాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

14, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 226 (తల్లిని దండించువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!
దీనిని పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (అమ్మను పెండ్లియాడి)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

సమస్యా పూరణం - 225 (చీర గట్టెను పురుషుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.

12, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 224 (నను నుతియించెడి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్.
ఈ సమస్యను సూచించిన "అజ్ఞాత" గారికి ధన్యవాదాలు.

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 223 (మాఘ మందున స్నానమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు.
ఈ సమస్యను పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

10, ఫిబ్రవరి 2011, గురువారం

వారాంతపు సమస్యా పూరణం - (పతికి నమస్కరించగనె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......

పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 222 (రంగవల్లి యుద్ధ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రంగవల్లి యుద్ధరంగ మయ్యె.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 221 (గానము వినినంత ఖరము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్.
ఈ సమస్యను పంపించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 220 (భార్య పాదంబులకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 219 (చేయవలయు గురువు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చేయవలయు గురువు శిష్యపూజ.
ఈ సమస్యను పంపిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

5, ఫిబ్రవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 218 (దున్న హరినిఁ జూచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 217 (రతికై సోదరిని వేగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

3, ఫిబ్రవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 216 (ఖర నామము సుతున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

2, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 215 (వేదముఁ జదివిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.
ఈ సమస్యను పంపించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 214 (భార్యకుఁ బ్రణమిల్లె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్.
ఈ సమస్యను పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.