వసంత్ కిశోర్ గారూ, మీ నాలుగు పూరణలూ దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణలో "కోట్లకు + అవినీతి" అన్నప్పుడు యడాగమం రాదు. "లక్ష కోట్లైన యవినీతి" అందాం. మూడవ పూరణలో "సత్యభామగ వేషమ్ము సలుపు వేళ" కంటే "సత్యభామగ పాత్ర పోషణము జేయ" అంటే బాగుంటుందేమో? నాల్గవ పూరణలో "లేని + ఒక" అన్నప్పుడు ద్రుతం రాదు. యడాగమం వచ్చి "లేని యొక" అవుతుంది.
"క్రొత్త కాపురమది ; ప్రీతి కోరి కోరి చేత గోరింట నలది యా చెలువ మురిసె ; ప్రేమ దినిపించె , ద్రాగించె , పిదప సతికి చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక!" డా. విష్ణు నందన్ గారూ! ఎంత చక్కని పూరణండి! అభినందనలు!
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు.
01)
_______________________________________
లక్ష కోట్లకు యవినీతి - రచ్చకెక్క
మంత్రి వర్యుల దుశ్చేష్ట -మాప లేక
సిగ్గు యెగ్గులు వదలెను - సింగు గారు !
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.
_______________________________________
02)
రిప్లయితొలగించండి______________________________________
సోనియా తల్లి చెప్పుల - శుభ్ర పరచ
నాత్మ గౌరవ మంతయు - నావి రయ్యె !
తెలుగు జాతికీ దుర్గతి - తీరు నెపుడు !
చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
______________________________________
కిశోర్ మహోదయా మీరు కూడా రాజకీయాల్లో రాటుదేలిపోయారు. అద్భుతం.
రిప్లయితొలగించండిమీరు జూపిన దారియే ,మిస్సనన్న !
రిప్లయితొలగించండిధన్యవాదాలు !
03)
రిప్లయితొలగించండి_______________________________________
"పారిజాతాప హరణము" - ప్రాకటముగ
పేరు గాంచెను; పేర్రాజు - పెద్ద నటుడు !
సత్య భామగ వేషమ్ము - సలుపువేళ !
చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
________________________________________
04)
రిప్లయితొలగించండి_________________________________________
పుత్రి కే లేని నొక యింట - పురుషు లేడు
గురు గలరు ! వారి యందొక - కుర్ర వాని
తరుణి గను జూడ నెంచిన - తల్లి దండ్రి !
చీర గట్టెను పురుషుండు - సిగ్గుపడక.
__________________________________________
ఇంతు లయ్యిరి మంత్రులు నిందిరమ్మ
రిప్లయితొలగించండిపురుష భావము నొందగ పుణ్య మనుచు
పడతు లందఱు నడువగ పంచ లందు
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక
ఆర్యా కిశోర్ జీ మిమ్మలని కాపీ కొట్ట నిస్తారా, ఒక్కసారి,
రిప్లయితొలగించండినాటకమ్మున స్త్రీ పాత్ర నటన జేయ
అక్కినేనికి తప్పదె యల్లనాడు
కలికి చేష్టలు,మాటలు చలన మయ్యు
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.
కిశోర్ జీ మరోసారి ( కాపీ )
రిప్లయితొలగించండిరంగు రంగుల చీరలు సింగు కిచ్చె
సోనియమ్మకు మిగులుగ,శోభ గూర్చ
శిరము దాల్చెను భక్తిగ, సింగు వాని
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక
నిన్నటి జి.యస్ జీ ,నేటి కిషోర్,మూర్తి గారి బాటలోనే నేను..
రిప్లయితొలగించండికిరణు పై జాలి వేసెనో ? కిటుకు లేమొ!
గాల మేసెను సోనియా గాంధి, చిరుకు,
గంతు లేయుచు కాంగ్రేసు వింత లీను
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !
కిశోర్ జీ మీ పద్యాలు బాగున్నాయి, అందుకే గా కాపీ కొట్టింది ! శ్రీ మందా పీతాంబర్ గారూ అదిరింది మీ పూరణ !
రిప్లయితొలగించండిరేయి గడచిన యగువాడు రేడు భువికి
రిప్లయితొలగించండితనదు పినతల్లి వాక్కుల తలను దాల్చి
జటిల వనవాస యాత్రకు చనగ నార
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.
సాంబ శివునిఁజూడ శివుఁడు సగము గిరిజ
రిప్లయితొలగించండిసగము, పులి తోలు చీరయు సగము సగము,
నిగమ పురుషుండె యీరీతి మగడు కాగ
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.
క్రొత్త కాపురమది ; ప్రీతి కోరి కోరి
రిప్లయితొలగించండిచేత గోరింట నలది యా చెలువ మురిసె ;
ప్రేమ దినిపించె , ద్రాగించె , పిదప సతికి
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక !
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిచీరను పలు పలు విధముల కట్టిజూపిన కవిమిత్రులకు అబినందనలు.నేనొక విధముగ కట్టిజూపుటకు ప్రయత్నించెదను.
వనితలిర్వురు కొనరాగ వస్త్రములను
సేల్సు మ్యానట జూపుచు చీరనొకటి
కట్టనిటులుండు నన్నిటు కాంచుడనుచు
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందరూ చీరలు రకరకాలుగా పంచేసుకొన్నారు.
రిప్లయితొలగించండినాకొక్క చీర కూడా లేదు. అందుకని:
పాలు పితికెడు వేళలో పాడి యావు
గట్ట రాటను రండని కాంత మగని<
జీర, కట్టెను పురుషుండు, సిగ్గు పడక
పాలు గొనుడనె తనయాడ పడుచు రాగ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమృతమ్మును పంచగ హరుడు వెడలె
రిప్లయితొలగించండిసురలు యసురులు యేకమై సర్ధు కొనిరి
అమృత భాండమ్ము చేబట్టె హొయలు కురియ
చీర గట్టెను పురుషుండు చిగ్గు పడక !
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలూ దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో "కోట్లకు + అవినీతి" అన్నప్పుడు యడాగమం రాదు. "లక్ష కోట్లైన యవినీతి" అందాం.
మూడవ పూరణలో "సత్యభామగ వేషమ్ము సలుపు వేళ" కంటే "సత్యభామగ పాత్ర పోషణము జేయ" అంటే బాగుంటుందేమో?
నాల్గవ పూరణలో "లేని + ఒక" అన్నప్పుడు ద్రుతం రాదు. యడాగమం వచ్చి "లేని యొక" అవుతుంది.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలూ మువ్వన్నెలతో అలరిస్తున్నాయి. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
"గాలమేసెను"కు "గాలమును వేసె" అనీ, "గంతులేయుచు"కు "గంతులే వేసి" అనీ నా సవరణలు.
హరి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
"గడచినన్ + అగు = గడచిన నగు" అవుతుంది.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
డా. విష్ణు నందన్ గారూ,
ఉత్తమోత్తమం మీ పూరణ. శంకరాభరణం బ్లాగుకు ద్విగుణీకృత శోభ నిస్తున్న మీకు ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ విలక్షణంగా చక్కగా ఉంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ పూరణకు తిరుగు లేదు. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
పంచడానికి వెళ్ళింది హరుడు కాడు, హరి కదా! "హరుడు వెడలె"ను "హరి వెడలెను" అనండి. అలాగే "సురలు నసురులు" అనండి. అలాగే "సర్దుకొనిరి" అంటే యతి తప్పుతుంది. "సరుదు కొనిరి" అంటే ప్రాసయతి కుదురుతుంది.
జిగురు సత్యనారాయణ గారి పద్యం అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిమొగుడుపెండ్లము ఉద్యోగములను వెలగ
రిప్లయితొలగించండిబెట్టుచుండు రోజులివిరో! ప్రీతిఁ సతికి
అండఁ ఉతికి ఎండబెట్టఁ కండె మందు
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక
నమస్కారములు గురువు గారు ! మీ సూచన ప్రకారం ఇలా రాసాను ఇప్పుడు కుదురు తుందేమొ అని మీ సహనమునకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిఅమృతమ్మును పంచగ హరియె వెడలె
సురలు నసురులు నటునిటు సరుదు కొనగ
అమృత భాండము చేబట్టి హొయలు కురియ
చీర గట్టెను పురుషుండు సిగ్గు విడచి
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిమరియు అభినందనలు.
మూర్తిగారూ !
మీ మూడూ పూరణలూ
ముచ్చటగా నున్నవి.
కాపీ కొట్టినా మార్కు లెక్కువ మీకే వచ్చినై !
పీతాంబరధరా !
కిరణుకూ చిరూకూ కలిపి కట్టేసారు చీర !
బావుంది !
హరిగారు ! నారచీరతో
రాముణ్ణి గుర్తు చేసిన మీ పూరణ
ప్రత్యేకతను సంతరించుకుంది.
జి.ఎస్.జీ ! అర్థ నారీశ్వరుణ్ణి
సాక్షాత్కరింపజేసిన మీ పూరణ !అద్భుతం !
విష్ణు నందనా !సుందరా !
సమస్యకు వ్యతిరేక భావాన్ని
సాధించడంలో సిద్ధ హస్తులు మీరు!
సతికే చీర గట్టిన మీ ప్రతిభ, అమోఘం !
శాస్త్రి గారూ !
సేల్స్ మేన్ తో చీర కట్టిచడం!బావుంది !
మిస్సన్న మహాశయా !
సమస్యను తెగనరకడంలో
మీ ప్రత్యేకత మీదే !
ఇంతకీ చీరను ఏం చేసారు ?
మీ ఇంట్లో దాచేసుకున్నారా !
అక్కయ్యా !
జగన్మోహినిని సాక్షాత్కరింపజేసావు!
మనోహరంగా ఉంది !
రవీజీ !
చీర కట్టడమే కాదు ఉతికి ఆరెయ్యడం కూడానా !
సమస్యనే ఉతికి ఆరేసారు !
బావుంది !
"క్రొత్త కాపురమది ; ప్రీతి కోరి కోరి
రిప్లయితొలగించండిచేత గోరింట నలది యా చెలువ మురిసె ;
ప్రేమ దినిపించె , ద్రాగించె , పిదప సతికి
చీర గట్టెను పురుషుండు సిగ్గు పడక!"
డా. విష్ణు నందన్ గారూ!
ఎంత చక్కని పూరణండి!
అభినందనలు!