గురువు గారు ! నమస్కారములు మీ రందరు నన్ను అక్కగా అమ్మగా ఆదరించి ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం చాలు ఇంకా ఇంకా వ్రాయడానికి.మీ అందరికి ధన్య వాదములు + కృతజ్ఞతలు
డా. విష్ణు నందన్ గారూ, మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. ధన్యవాదాలు. మొదట "మోక్షగామి కనంగన్" అనే టైపు చేసాను. సందేహం వచ్చి "గనంగన్" అన్నాను. ఇక్కడ "ద్రుతప్రకృతికముల మీది పరుషంబులకు సరళంబు లగు" అనే సూత్రం గాకుండా (మోక్షగామి తర్వాత అర్ధానుస్వారం లేదు) "ప్రథమ మీది కచటతపలకు గసడదవ లగు" సూత్రాన్ని చూడాలి కదా. శాస్త్రి గారిని నేను "వదిలేస్తే" మీరు "విడనాడక" పట్టుకున్నారు. ధన్యవాదాలు.
@శంకరయ్య గారు, ధన్యవాదాలు . నిజానికి మోక్షగామి అన్నప్పుడు అది ప్రథమా విభక్తి తుల్యమౌతుందా అని సందేహం కలిగింది . తరువాత కలిగిన సమాధానం ప్రకారం , ఒక వేళ ప్రథమా తుల్యమైనా , గసడదవలు ' బహుళముగానగు ' కనుక రెండు రూపములూ , " మోక్షగామి కనంగన్ " , మరియు " మోక్షగామి గనంగన్" సాధించవచ్చు ననిపించింది . ( ఇది మోక్షగామి పదం ప్రథమా తుల్యమైతే ) . ఏది వ్రాసినా సరైనదే అని తోచింది . సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదాలు .
వసంత కిశోర్ గారు, పద్యము కాస్త అస్పష్టముగా ఉన్నమాట నిజమే. నేపథ్యము: సీతాపహరణము - రావణ వథ మొగసాల భటులు - ద్వార పాలకులకులు అనటానికి బదులుగా
భావము: విష్ణు మూర్తి ద్వారపాలకులైన జయ విజయలు శాపవశమున రావణ కుంభకర్ణులుగా జనించిరి. కాంతుడిగా (రాముడు) విష్ణువు, కాంత గా లక్ష్మి (సీతగా) జనించిరి.. అప్పటి మొగసాల భటులు కాంతుడైన విష్ణువును చేరాలని మదిలో భావించి అందుకు ఉపాయముగా అతని భార్య అయిన సీతను అపహరించినారు. అప్పుడు సీతాకాంతుడైన రాముడు వీరిని సంహరించెను. కావున పైకి కాంతాలోలురుగా కనిపించినా నిజానికి రావణ కుంభకర్ణులు మోక్ష కాములు.
శంకరార్యులకు,విష్ణునందన్ గారికి ధన్యవాదములు.ఎంతో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చుచున్నందులకు కృతజ్ఞుడను.విష్ణునందన్ గారి సవరణ ప్రశస్తముగా ఉన్నది.మీ సూచన ప్రకారం నేను 'వదిలేసి 'ని వదిలేసి 'విడనాడి ' ని విడనాడ కుండా పట్టుకుంటాను.
డా.విష్ణునందన్ గారు మ కార పంచకం రిఫెరెన్స్ ఇవ్వటం పూరణని ఇంకా విశదపరచింది. "కనంగన్" మరియు "గనంగన్" సందేహ నివృత్తి అయింది. ధన్యవాదాలు. వేమన మీదుగా ఎవరయినా పూరిస్తారేమో చూడాలి.
శంకరయ్యగారి అనుమతితో - వారి తరగతి గదిలో నా యీ ప్రసంగం .....
రోజుకన్నా కాస్త యెక్కువ తీరిక చిక్కి , పద్యాలన్నీ సావకాశంగా పరిశీలించ గలిగినందువలన ఒక రెండు మాటలు.
వసంత కిశోర్ గారూ , మీ పద్యాలు బావున్నాయి కానీ మొదటిపద్యం లో కాస్త యతి సరిచూడగలరు.
జిగురు సత్యనారాయణ గారూ , మీ వివరణ బాగుంది . భావమింకా పద్యంలో సరిగ్గా చొప్పించబడలేదు . ఎలాగూ మరింత భావ స్ఫోరకంగా వ్రాయగల ప్రతిభ మీ సొంతం కదా ...భటుడు కర్త అయితే పట్టెన్ అని క్రియ ద్రుతాంతమవుతుంది . భటులు కర్తలయినప్పుడు , పట్టిరి క్రియారూపం. ఇది చాలా సర్వసాధారణం గా అసంకల్పితంగా జరిగే ఒక అన్వయదోషం .మధ్య యుగపు చాటు కవుల్లో బహువచన గుర్వంతం కోసం "పట్టిర్" అని వ్రాసిన వారున్నారు కానీ యిప్పటికాలానికి అది పాతబడిన ప్రయోగమే !
శంకరయ్యగారూ అనుమతి లేకుండా నల్లబల్ల వాడుకున్నందుకు మన్నింతురు గాక!
వసంత కిశోర్ గారు, మీరు చెప్పిన తరువాత అలోచించా. ఇక్కడ "రాముఁడు జంపెను" లో సరళాదేశము కాకూడదనుకుంటా. నేను వ్రాయ దలిచిన సంధి పూర్వ రూపము :- రాముఁడు + చంపెను
నాకు కొన్ని సందేహాలు కలిగాయి, దయ చేసి ఎవరైన తీర్చగలరు. 1. "డు కారము" తరువాత ద్రుతము వచ్చే అవకాశము ఉన్నదా? ఉదా: రాముఁడున్ + చంపెను. అవకాశము ఉంటే అది ఏ విభక్తి అవుతుంది? 2. రాముఁడు + చంపెను = "రాముఁడు జంపెను" అని సరళాదేశము చెయ్యటము తప్పని భావిస్తున్నాను. నా భావన సరైయినదేన? 3. రాముఁడు + చంపెను = "రాముఁడు సంపెను" అని "గసడదవాదేశ సంధి" చెయ్య వచ్చా?
కిశోర్ జీ..సవరించి చేసిన పూరణలు చాల బాగున్నవి.అబినందనలు. రాజేశ్వరి గారూ...మంచి ప్రయత్నము చేశారు. అభినందనలు. కాని మొదటి పద్యములో ప్రాస సరిచేయాలి,రెండవ పద్యం లో అక్షరములు యెక్కువైనవి. గమనించ గలరు.
వసంత్ కిశోర్ గారూ, బాగుంది. మీ పూరణలు ... వాటిపై మిత్రుల వ్యాఖ్యలు ... మీ సవరణలూ..... బ్లాగులో సందడి పెరిగింది. సంతోషం! సవరించిన రెండవ పూరణ మొదటి పాదంలో చివర ఒక అక్షరం లోపించింది. "దురాశయు" అందాం. నాల్గవ పూరణ రెండవ పాదం రెండవ గణం "జగణం" అయింది. "ఏ/కాంతమ్మున నున్న సీత కారణ మయ్యెన్" అందాం. ఆరవ పూరణలో "మోక్షదాత"ను "మోక్షగామి"గా చేసారు.
డా. విష్ణు నందన్ గారూ, వ్యాఖ్యలు పెట్టడనికి, మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించడనికి నా బ్లాగులో అందరికీ సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చాను. మీ వంటి వారు మిత్రుల పూరణలను పరామర్శిస్తే అంతకంటె కావలసిం దేమిటి? నాకు శ్రమ కూడా తగ్గుతుంది. ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వేమన విషయంగా మీ పూరణ బాగుంది. కాని రెండవ పాదంలో గణదోషం ఉంది. "పంతముతో వేమన మరి వైరాగ్యముతో" అందామా?
రాజేశ్వరి గారూ, మొదటి పూరణలో మూడవ పాదం అర్థం కాలేదు. గణదోషం కూడా ఉంది. "మాతగ శాసించెను శిఖి" అంటే గణదోషం పోతుంది కాని, అర్థం? రెండవ పూరణ మూడు పాదాల్లోను గణదోషం ఉంది. నా సవరణ .... కాంతల యొడినిం బడి కడు భ్రాంతికి లోనైనవాఁడు భ్రష్టుఁడు కాఁగన్ వింతనఁగ రాదు వేమన కాంతా ........
మందా పీతాంబర్ గారూ, మంచి పూరణ. అభినందనలు. కాంతా కనకమ్ముల"ను" కదా. "కవి నిడె" అనేది "కవి యిడె" కదా.
@ సత్యనారాయణ గారు ఏకవచన ప్రథమా విభక్తి యైన రాముడు కర్తయై , ఎవరినైనా చంపితే , రాముడు + చంపెను = రాముడు సంపెను ; రాముడు చంపెను (సత్వ రూపము , గసడదవాదేశ సంధి- సంధి బాహుళ్యము; ప్రథమ మీది పరుషములకు సరళములు బహుళముగానగు ! )
మరొక్క వుదాహరణలో , రాముడు , కృష్ణుడు కలిసి ఆ మనుష్యుని చంపినారు అన్నప్పుడు "రాముడును కృష్ణుడును - జంపిరా మనుజుని " . ఇక్కడ ద్రుతప్రకృతిక సంధి సాధ్యం . ( ద్రుతము మీది పరుషములకు సరళములగు )
@ వసంతకిశోర్ గారూ , ప్రథమా తుల్యమో కాదో పక్కన బెడితే , మీరు నన్ను పిలిచే సంబోధనా ప్రథమా విభక్తి మారిందేమి ? 'మోక్షగామి ' ప్రథమా తుల్యమని నేను గట్టిగా చెప్పలేను . ఒకవేళ ప్రథమా తుల్యమైతే రెండు రూపాలూ సిద్ధిస్తాయి . అనగా , 1.మోక్షగామి కనంగన్ , 2.మోక్షగామి గనంగన్. నేనైతే సందేహముంటే మొదటి రూపాన్ని ఎంచుకొంటాను . ఈ సందేహం శంకరయ్య మాస్టారే తీర్చాలి . వారే సాధికారికమైన తీర్పరి.
వసంత కిశోర్ గారు, " కాంతుఁడు రాముఁడు చంపెను " అన్నప్పుడు కర్మ లోపించటము లేక అస్పష్టముగా ఉండటము గురించి అయితే నేను ఒప్పుకుంటాను. కాని "రాముడే రాముణ్ణి చంపాడు" అనే అర్థము వస్తుందని నేను ఒప్పుకో లేక పోతున్నను.
ఇక్కడ "కాంతుఁడు" "రాముఁడు" - రెండు పదాలు ప్రథమా విభక్తిలోనే ఉన్నవి. కాబట్టి రెండునూ కర్తలే. మొదటి పదము రెండవ పదమునకు విశేషము అవుతుందనుకుంట. రాముడు కర్మ కాదనే ఇప్పటికీ అనుకుంటున్నాను.
జి ఎస్ జీ ! నేనేదైతే సవరణ సూచించానో దాన్నే గురువు గారు కూడా సవరణ పద్యం లో ఒక్క అక్షరం తేడా లేకుండా మూడవ పాదం లో చూపారు.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందో నా కర్థం కావడం లేదు. వ్యాకరణం మీద చర్చించ గలిగిన వాణ్ణి కాను నేను.
"కాంతుడిగా(రాముడు)విష్ణువు,కాంత గా లక్ష్మి(సీతగా)జనించిరి" ఇది మీరు వ్రాసిన భావం లోని వాక్యం. మీ కాంతుడు ఎవరో తెలుసు కోవాలనే భావం అడిగాను. రాముడు అని మీరే స్పష్టంగా చెప్పారు ! అటువంటప్పుడు "కాంతుడు రాముడు జంపెను" అంటే అర్థం మీరే చెప్పండి
అక్షరాలా నేను వైద్యవృత్తిలో స్పెషలిష్టు డాక్టరునే. సందేహమక్కర లేదు . తెలుగు , సంస్కృత భాషల్లో నాకే డిగ్రీలూ లేవు . మీరేమైనా పూనుకుని అందులో కూడా గౌరవ డాక్టరేట్ ఇప్పిస్తే సంతోషంగా పుచ్చుకుంటా . :)
శంకరయ్య గారూ.. ధన్యవాదములు.మీరు సూచించేవరకూ నేను గమనించలేదు.నేను వేమన గురించి చేసిన పూరణలొ పొరపాటున ఒక గణము తొలగి పోయినది.సొగసైన సవరణ చేసినందులకు కృతజ్ఞతలు.
విష్ణు నందనా ! సుందరా ! నిజం డాక్టరేట్లే మీ ముందు నిలువలేరు ! అటువంటప్పుడు గౌరవ డిగ్రీలు మీ విలువను తగ్గిస్తాయేమో గాని పెంచలేవు ! ______________________________________
అంతయునీశ్వరుడేయని
రిప్లయితొలగించండికొంతయు శంసయముఁ గొనక కుదురుగఁ చిత్త
భ్రాంతిని వీడిన ముని, శ్రీ
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్
రవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
కాంతయె క్రాంతికి మార్గము
రిప్లయితొలగించండికాంతయుత పూజ ముక్తి కాంతను గొలుపున్.
కాంతయె ముక్తికి మూలము
కాంతా లోలుండె మోక్షగామి గనంగన్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండికాంతాలోలుణ్ణి భిన్నకోణంలో దర్శించారు. ఉత్తమమైన పూరణ. ధన్యవాదాలు.
కాంతా లోలుండంచును
రిప్లయితొలగించండిఅంతా కోడై కూయగ ఐజీ పైనన్
వింతగ పదోన్నతి గలిగె
కాంతా లోలుండె మోక్షగామి గనంగన్.
ఎంతయు నుడువ వినడిపుడు,
రిప్లయితొలగించండిఅంతర్గతలౌల్యమడగ నతడే మారున్
చింతన్ బడనేలింతనె (బడనేల - ఇంతనె ?)
కాంతా? లోలుండె మోక్షగామి గనంగన్.
హరి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో "ఏల + ఇంతనె" అన్నప్పుడు సంధి లేదు. "చింతఁ బడనేల యింతనె" అంటే బాగుంటుందేమో?
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిఅంతయు, లోపల వెలుపల
భ్రాంతులు వదిలేసి, మిగుల భక్తిని, లలితా
చింతన జేసెడి ఆశివ
కాంతా లోలుండె, మోక్ష గామి గనంగన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
వింతగ మకార పంచక
రిప్లయితొలగించండిమెంతయు నందించు మోక్షమిది నిక్కపు సి
ద్ధాంతము వామాచారికి
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్!!!
( మద్యం మాంసం చ మీనం చ ముద్రా మైథునమేవ చ
ఏతే పంచ మకారాః స్యుర్ మోక్షదా హి యుగే యుగే !!!! - వామాచార ప్రోక్త సిద్ధాంతం )
@ శాస్త్రి గారు
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది . రెండవ పాదంలో భ్రాంతులు ' విడనాడి ' అంటే మేలేమో కాస్త ఆలోచించగలరు .
@ శంకరయ్య గారు
రిప్లయితొలగించండిసమస్య మోక్షగామి గనంగన్ అనియా లేక మోక్షగామి కనంగన్ అనియా ? ఏదో సందేహం . సంధి కార్యము వివరింపగలరు !
గురువు గారు ! నమస్కారములు
రిప్లయితొలగించండిమీ రందరు నన్ను అక్కగా అమ్మగా ఆదరించి ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం చాలు ఇంకా ఇంకా వ్రాయడానికి.మీ అందరికి ధన్య వాదములు + కృతజ్ఞతలు
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. ధన్యవాదాలు.
మొదట "మోక్షగామి కనంగన్" అనే టైపు చేసాను. సందేహం వచ్చి "గనంగన్" అన్నాను. ఇక్కడ "ద్రుతప్రకృతికముల మీది పరుషంబులకు సరళంబు లగు" అనే సూత్రం గాకుండా (మోక్షగామి తర్వాత అర్ధానుస్వారం లేదు) "ప్రథమ మీది కచటతపలకు గసడదవ లగు" సూత్రాన్ని చూడాలి కదా.
శాస్త్రి గారిని నేను "వదిలేస్తే" మీరు "విడనాడక" పట్టుకున్నారు. ధన్యవాదాలు.
వింతగ మొగసాల భటులు
రిప్లయితొలగించండికాంతుని జేర మదినెంచి కాంతను బట్టెన్,
కాంతుఁడు రాముఁడు జంపెను,
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్!!
@శంకరయ్య గారు, ధన్యవాదాలు .
రిప్లయితొలగించండినిజానికి మోక్షగామి అన్నప్పుడు అది ప్రథమా విభక్తి తుల్యమౌతుందా అని సందేహం కలిగింది . తరువాత కలిగిన సమాధానం ప్రకారం , ఒక వేళ ప్రథమా తుల్యమైనా , గసడదవలు ' బహుళముగానగు ' కనుక రెండు రూపములూ , " మోక్షగామి కనంగన్ " , మరియు " మోక్షగామి గనంగన్" సాధించవచ్చు ననిపించింది . ( ఇది మోక్షగామి పదం ప్రథమా తుల్యమైతే ) . ఏది వ్రాసినా సరైనదే అని తోచింది . సందేహ నివృత్తి చేసినందులకు ధన్యవాదాలు .
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
ముచ్చట గూర్చు చున్నవి.
జీ.ఎస్. జీ !
మీ పద్యానికి నేపథ్యం
కొంచెం వివరించ గలరా ?
ఆ చేత్తోనే భావం కూడా !
01)
పాండురంగ మహత్మ్యం సినిమాలో
పుండరీకుడు జూపిన దారి :
_________________________________________
మాతా ,పిత , పాదార్చన
సాతము జేయు , తనయునికె - సాధ్యం బిలలో !
ద్యూతము లాడెడు , ఝర్జర
కాంతా లోలుండె , మోక్ష - గామి; గనంగన్ !
_________________________________________
సాతము = సంతోషము
ఝర్జర = వేశ్య
_________________________________________
02)
రిప్లయితొలగించండి_________________________________________
కాంతారమునున్న , కటిక
ద్వాంతము నందున్న, శశ్వి - దానుడె యైనన్ !
ఎంతో భక్తిని , విద్యా
కాంతా లోలుండె , మోక్ష - గామి; గనంగన్ !
_________________________________________
కాంతారము = అడవి
ధ్వాంతము = చీఁకటి
శశ్వి దానుడు = పాపి
__________________________________________
03)
రిప్లయితొలగించండి_________________________________________
నేతలు; లూతలు , పీతలు
కోతులు , కడు పొగరు బోతు; - కుంటెన గాళ్ళౌ !
చింతే లేదులె; ఇటలీ
కాంతా లోలుండె , మోక్ష - గామి; గనంగన్ !
_________________________________________
వసంత కిశోర్ గారు,
రిప్లయితొలగించండిపద్యము కాస్త అస్పష్టముగా ఉన్నమాట నిజమే.
నేపథ్యము: సీతాపహరణము - రావణ వథ
మొగసాల భటులు - ద్వార పాలకులకులు అనటానికి బదులుగా
భావము: విష్ణు మూర్తి ద్వారపాలకులైన జయ విజయలు శాపవశమున రావణ కుంభకర్ణులుగా జనించిరి. కాంతుడిగా (రాముడు) విష్ణువు, కాంత గా లక్ష్మి (సీతగా) జనించిరి.. అప్పటి మొగసాల భటులు కాంతుడైన విష్ణువును చేరాలని మదిలో భావించి అందుకు ఉపాయముగా అతని భార్య అయిన సీతను అపహరించినారు. అప్పుడు సీతాకాంతుడైన రాముడు వీరిని సంహరించెను. కావున పైకి కాంతాలోలురుగా కనిపించినా నిజానికి రావణ కుంభకర్ణులు మోక్ష కాములు.
జీ.ఎస్.జీ !
రిప్లయితొలగించండిఅంతవరకూ బాగానే ఉంది !
సీతనపహరించిన "పరకాంతా లోలుణ్ణి "
(వింశతి బాహువును) మోక్షగామి చేద్దామని
నాకూ ఆలోచనొచ్చింది !
అప్పుడు మీ మూడవపాదం
"కాంతుడు రావణు జంపెను"
అంటే సరిపోతుంది !
పొరపాటుగా "రాముని" అన్నారు
అందుకే అసందిగ్దంగా ఉంది !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యులకు,విష్ణునందన్ గారికి ధన్యవాదములు.ఎంతో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చుచున్నందులకు కృతజ్ఞుడను.విష్ణునందన్ గారి సవరణ ప్రశస్తముగా ఉన్నది.మీ సూచన ప్రకారం నేను 'వదిలేసి 'ని వదిలేసి 'విడనాడి ' ని విడనాడ కుండా పట్టుకుంటాను.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
వసంత కిశోర్ గారు,
రిప్లయితొలగించండినేను "రాముని" అనలేదండి "రాముడు" అని అన్నాను.
ఇక్కడ చంపిన వాడు రాముడే.
డా.విష్ణునందన్ గారు మ కార పంచకం రిఫెరెన్స్ ఇవ్వటం పూరణని ఇంకా విశదపరచింది. "కనంగన్" మరియు "గనంగన్" సందేహ నివృత్తి అయింది. ధన్యవాదాలు. వేమన మీదుగా ఎవరయినా పూరిస్తారేమో చూడాలి.
రిప్లయితొలగించండిశంకరయ్యగారి అనుమతితో - వారి తరగతి గదిలో నా యీ ప్రసంగం .....
రిప్లయితొలగించండిరోజుకన్నా కాస్త యెక్కువ తీరిక చిక్కి , పద్యాలన్నీ సావకాశంగా పరిశీలించ గలిగినందువలన ఒక రెండు మాటలు.
వసంత కిశోర్ గారూ , మీ పద్యాలు బావున్నాయి కానీ మొదటిపద్యం లో కాస్త యతి సరిచూడగలరు.
జిగురు సత్యనారాయణ గారూ , మీ వివరణ బాగుంది . భావమింకా పద్యంలో సరిగ్గా చొప్పించబడలేదు . ఎలాగూ మరింత భావ స్ఫోరకంగా వ్రాయగల ప్రతిభ మీ సొంతం కదా ...భటుడు కర్త అయితే పట్టెన్ అని క్రియ ద్రుతాంతమవుతుంది . భటులు కర్తలయినప్పుడు , పట్టిరి క్రియారూపం. ఇది చాలా సర్వసాధారణం గా అసంకల్పితంగా జరిగే ఒక అన్వయదోషం .మధ్య యుగపు చాటు కవుల్లో బహువచన గుర్వంతం కోసం "పట్టిర్" అని వ్రాసిన వారున్నారు కానీ యిప్పటికాలానికి అది పాతబడిన ప్రయోగమే !
శంకరయ్యగారూ అనుమతి లేకుండా నల్లబల్ల వాడుకున్నందుకు మన్నింతురు గాక!
కిశోర్ జీ ... మీ మూడు పూరణలు బాగున్నాయి.కాని కాంతా లోలునకు మోక్షమిచ్చే తొందరలో 1,3 పద్యాలలో ప్రాస సరిగా చూసుకోలేదు. బిందు పూర్వక 'త ' ఉండాలికదా.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
డా. విష్ణు నందన్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నిజమే. నిజానికి సీతా దేవిని తెచ్చింది ఒక్కడే కాబట్టి, "వింతగ మొగసాల భటుడు" అనటము సంజసమేమో.
ఇదే భావముతో మరో పూరణ.
చింతించెను మండోదరి
కాంతుడు తన ముక్తి కొఱకు , కమలాక్షిని శ్రీ
కాంతను దొంగిలి తెచ్చెను
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్!!
జీ ఎస్ జీ !
రిప్లయితొలగించండిమీ మూడో పాదాన్ని
copy&paste చేస్తున్నాను !
" కాంతుఁడు రాముఁడు జంపెను "
భావం మీరే చెప్పండి !
విష్ణు నందన్ గారికి
రిప్లయితొలగించండిధన్యవాదములు !
శాస్త్రిగారికి ధన్యవాదములు .
మీరు చెప్పాక కూడా
నాకు చాలా సమయం పట్టింది
తప్పేంటో తెలుసుకోడానికి !
అన్య మనస్కంగా ఉన్నాను.
విష్ణు నందన్ గారూ !
రిప్లయితొలగించండిఇంతకీ "మోక్ష గామి "
ప్రథమా తుల్యమా ? కాదా ?
అన్నది అసందిగ్దంగానే ఉంచేసారు !
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారు ఇచ్చిన ఆలోచనతో వేమన గురించి వ్రాయటానికి ప్రత్నించాను.చంద్ర శేఖర్ గారికి ధన్యవాదములు.
కాంతల మరిగెను విడువక
పంతముతో వేమన, మరి యోగై
వింతగ అంతయు విడిచెను
కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్.
పాండురంగ మహత్మ్యం సినిమాలో
రిప్లయితొలగించండిపుండరీకుడు జూపిన దారి :
1-అ)(1 కి సవరణ)
_________________________________________
స్వాంతన మాతాపిత కా
సాంతము కలిగించు వాడు - సౌశీల్యు డిలన్ !
సంతత జూదా, ఝర్జర
కాంతా లోలుండె మోక్ష - గామి గనంగన్ ???
_________________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేటి నేతలు :
రిప్లయితొలగించండి2అ)[2 కి సవరణ]
__________________________________________
అంతము లేని దురాశ !
సాంతము బొక్కెడు ప్రయాస ! - సంసత్తులకున్ !
చింతే లేదులె; ఇటలీ
కాంతా లోలుండె, మోక్ష - గామి; గనంగన్ !
__________________________________________
వసంత కిశోర్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన తరువాత అలోచించా. ఇక్కడ "రాముఁడు జంపెను" లో సరళాదేశము కాకూడదనుకుంటా.
నేను వ్రాయ దలిచిన సంధి పూర్వ రూపము :- రాముఁడు + చంపెను
నాకు కొన్ని సందేహాలు కలిగాయి, దయ చేసి ఎవరైన తీర్చగలరు.
1. "డు కారము" తరువాత ద్రుతము వచ్చే అవకాశము ఉన్నదా? ఉదా: రాముఁడున్ + చంపెను.
అవకాశము ఉంటే అది ఏ విభక్తి అవుతుంది?
2. రాముఁడు + చంపెను = "రాముఁడు జంపెను" అని సరళాదేశము చెయ్యటము తప్పని భావిస్తున్నాను. నా భావన సరైయినదేన?
3. రాముఁడు + చంపెను = "రాముఁడు సంపెను" అని "గసడదవాదేశ సంధి" చెయ్య వచ్చా?
సీతాపహరణమే,రావణ మోక్షం :
రిప్లయితొలగించండి04)
________________________________________
కాంతార వాసమున , నే
కాంతమున నున్న , ధరసుత - కారణమయ్యెన్ !
కాంతాళు విముక్తికి ! పర
కాంతా లోలుండె, మోక్ష - గామి; గనంగన్ !
________________________________________
అయ్యో !జి ఎస్ జీ !
రిప్లయితొలగించండినేను చెప్పేది భావం గురించి
కాంతుడు రాముడు జంపెను
అంటే
రాముడే రాముణ్ణి చంపాడని గదా !
వ్యాకరణం నాకు రాదు !
05)
________________________________________
కాంతల భ్రాంతిని , మరియును
భ్రాంతిగ బంగారు సృష్టి; - భాగ్యము విడచెన్ !
శాంతిని పొందెను వేమన !
కాంతా లోలుండె, మోక్ష - గామి; గనంగన్ ???
________________________________________
వసంతకిశోర్ గారూ, "ఇటలీ కాంతా..." అని పూరించి అదర గొట్టారుగా! జోహార్లు. భజనపరులు ఎక్కువై ఇటలీ కాంత హద్దులు మీరుతున్న వైనం బయట పడుతోంది. మీ పూరణకి, సమయస్ఫూర్తికి జోహార్లు.
రిప్లయితొలగించండిసీతను దొంగిలి తెచ్చిన
రిప్లయితొలగించండిపాతకు రావణుని జంపె పతి రాముడనన్ ! !
మాతగ శాసించె హుతాశుడు
కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్ !
-------------------------------
కాంతల ఒడినింబడి
భ్రాంతికి లోనై యిహపర మున భ్రష్టుడు కాగన్ !
వింతనగ కాదు " యోగి " వేమన
కాంతా లోలుండె మోక్ష గామి గనంగన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్ర శేఖరులకు
రిప్లయితొలగించండిధన్యవాదములు
_________________________________________
మరి శ్రీ కృష్ణుడో :
06)
_________________________________________
కాంతలు నెనమండ్రు ! పిదప
వింతగ , పదియారువేల - వెలదుల తోడన్ !
భ్రాంతిని నడయాడెడు , పలు
కాంతా లోలుండె, మోక్ష - గామి; గనంగన్ !
_________________________________________
కాంతా కనకములకు భూ
రిప్లయితొలగించండికాంతుల కమ్మక,కవినిడె కన్యను సీతా
కాంతున కాభాగవతా
కాంతాలోలుండె మోక్ష గామి గనంగన్ !
కిశోర్ జీ..సవరించి చేసిన పూరణలు చాల బాగున్నవి.అబినందనలు. రాజేశ్వరి గారూ...మంచి ప్రయత్నము చేశారు. అభినందనలు. కాని మొదటి పద్యములో ప్రాస సరిచేయాలి,రెండవ పద్యం లో అక్షరములు యెక్కువైనవి. గమనించ గలరు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయాన్నే ఎత్తుకున్నారు. అభినందనలు.
పూరణలో సందిగ్ధార్థం గురించిన చర్చ చూసాను. ఇలా వ్రాస్తే బాగుంటుందేమో?
వింతగ మొగసాల భటుఁడు
కాంతునిఁ జేర మది నెంచి కాంతను గొన శ్రీ
కాంతుఁడు రావణుఁ జంపెను
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్.
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ సవరించిన పూరణను ఇప్పుడు చూసాను. ముందే చూస్తే నా సవరణ ఇచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు పూరణ సర్వాంగ సుందరంగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది. మీ పూరణలు ... వాటిపై మిత్రుల వ్యాఖ్యలు ... మీ సవరణలూ..... బ్లాగులో సందడి పెరిగింది. సంతోషం!
సవరించిన రెండవ పూరణ మొదటి పాదంలో చివర ఒక అక్షరం లోపించింది. "దురాశయు" అందాం.
నాల్గవ పూరణ రెండవ పాదం రెండవ గణం "జగణం" అయింది. "ఏ/కాంతమ్మున నున్న సీత కారణ మయ్యెన్" అందాం.
ఆరవ పూరణలో "మోక్షదాత"ను "మోక్షగామి"గా చేసారు.
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండివ్యాఖ్యలు పెట్టడనికి, మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించడనికి నా బ్లాగులో అందరికీ సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చాను. మీ వంటి వారు మిత్రుల పూరణలను పరామర్శిస్తే అంతకంటె కావలసిం దేమిటి? నాకు శ్రమ కూడా తగ్గుతుంది. ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివేమన విషయంగా మీ పూరణ బాగుంది. కాని రెండవ పాదంలో గణదోషం ఉంది. "పంతముతో వేమన మరి వైరాగ్యముతో" అందామా?
రాజేశ్వరి గారూ,
మొదటి పూరణలో మూడవ పాదం అర్థం కాలేదు. గణదోషం కూడా ఉంది. "మాతగ శాసించెను శిఖి" అంటే గణదోషం పోతుంది కాని, అర్థం?
రెండవ పూరణ మూడు పాదాల్లోను గణదోషం ఉంది. నా సవరణ ....
కాంతల యొడినిం బడి కడు
భ్రాంతికి లోనైనవాఁడు భ్రష్టుఁడు కాఁగన్
వింతనఁగ రాదు వేమన
కాంతా ........
మందా పీతాంబర్ గారూ,
మంచి పూరణ. అభినందనలు.
కాంతా కనకమ్ముల"ను" కదా. "కవి నిడె" అనేది "కవి యిడె" కదా.
@ సత్యనారాయణ గారు
రిప్లయితొలగించండిఏకవచన ప్రథమా విభక్తి యైన రాముడు కర్తయై , ఎవరినైనా చంపితే , రాముడు + చంపెను = రాముడు సంపెను ; రాముడు చంపెను (సత్వ రూపము , గసడదవాదేశ సంధి- సంధి బాహుళ్యము; ప్రథమ మీది పరుషములకు సరళములు బహుళముగానగు ! )
మరొక్క వుదాహరణలో , రాముడు , కృష్ణుడు కలిసి ఆ మనుష్యుని చంపినారు అన్నప్పుడు "రాముడును కృష్ణుడును - జంపిరా మనుజుని " . ఇక్కడ ద్రుతప్రకృతిక సంధి సాధ్యం . ( ద్రుతము మీది పరుషములకు సరళములగు )
@ వసంతకిశోర్ గారూ ,
ప్రథమా తుల్యమో కాదో పక్కన బెడితే , మీరు నన్ను పిలిచే సంబోధనా ప్రథమా విభక్తి మారిందేమి ? 'మోక్షగామి ' ప్రథమా తుల్యమని నేను గట్టిగా చెప్పలేను . ఒకవేళ ప్రథమా తుల్యమైతే రెండు రూపాలూ సిద్ధిస్తాయి . అనగా , 1.మోక్షగామి కనంగన్ , 2.మోక్షగామి గనంగన్. నేనైతే సందేహముంటే మొదటి రూపాన్ని ఎంచుకొంటాను .
ఈ సందేహం శంకరయ్య మాస్టారే తీర్చాలి . వారే సాధికారికమైన తీర్పరి.
పై నుదాహరణలో మరీ నిక్కచ్చిగా వ్రాయాలంటే " రాముడును గృష్ణుడును జంపిరా మనుజుని " అని వ్రాయాలి - కృష్ణుడు కు కూడ సరళాదేశం జరుగుతుందక్కడ
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారు,
రిప్లయితొలగించండిఉదాహరణలతోటి వివరించినదుకు ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారు,
రిప్లయితొలగించండి" కాంతుఁడు రాముఁడు చంపెను " అన్నప్పుడు కర్మ లోపించటము లేక అస్పష్టముగా ఉండటము గురించి అయితే నేను ఒప్పుకుంటాను. కాని "రాముడే రాముణ్ణి చంపాడు" అనే అర్థము వస్తుందని నేను ఒప్పుకో లేక పోతున్నను.
ఇక్కడ "కాంతుఁడు" "రాముఁడు" - రెండు పదాలు ప్రథమా విభక్తిలోనే ఉన్నవి. కాబట్టి రెండునూ కర్తలే. మొదటి పదము రెండవ పదమునకు విశేషము అవుతుందనుకుంట. రాముడు కర్మ కాదనే ఇప్పటికీ అనుకుంటున్నాను.
సత్యనారాయణగారు , ఈ అంశానికి సంబంధించిన రెండు సంధులు విడివిడిగా -
రిప్లయితొలగించండిగసడదవాదేశ సంధి : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు
ద్రుతప్రకృతిక సంధి ; ద్రుతప్రకృతికము మీది పరుషములకు సరళములగు
జి ఎస్ జీ !
రిప్లయితొలగించండినేనేదైతే సవరణ సూచించానో
దాన్నే గురువు గారు కూడా సవరణ పద్యం లో
ఒక్క అక్షరం తేడా లేకుండా మూడవ పాదం లో చూపారు.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందో నా కర్థం కావడం లేదు.
వ్యాకరణం మీద చర్చించ గలిగిన వాణ్ణి కాను నేను.
"కాంతుడిగా(రాముడు)విష్ణువు,కాంత గా లక్ష్మి(సీతగా)జనించిరి"
ఇది మీరు వ్రాసిన భావం లోని వాక్యం.
మీ కాంతుడు ఎవరో తెలుసు కోవాలనే భావం అడిగాను.
రాముడు అని మీరే స్పష్టంగా చెప్పారు !
అటువంటప్పుడు
"కాంతుడు రాముడు జంపెను"
అంటే అర్థం మీరే చెప్పండి
విష్ణు నందనా ! సుందరా !
రిప్లయితొలగించండిమీ వివరణాత్మక వివరణకు
కడుంగడు ధన్య వాదములు !
మీరేమో డాక్టరు గారు !
వైద్య వృత్తిలోనా లేక తెలుగు సంస్కృత భాషల్లోనా ?
తెలుగు సంసృత భాషలలోనే అనుకుంటాను !
భాష మీద మీ సాధికారం
పూరణలలో మీ ఆలోచనా విధానం
నా కైతే , నేను నేలమీదా
మీరు నింగి లోనూ ఉన్నారనిపిస్తూ ఉంటుంది.
ఎగిరితే అందే ఎత్తుల్లో ఉండరు !
మిమ్మల్ని అందుకోవడం ఎలాగో ??????
మీరొక "వ్యాకరణం బడి" మొదలు పెట్టొచ్చు గదా !
మూకుమ్మడి గా మేమందరం అందులో జేరి పోతాం !
లేదంటే ఏదైనా "లంకె"(link) ఇవ్వండి !
వసంత్ కిశోర్ గారూ
రిప్లయితొలగించండిఅక్షరాలా నేను వైద్యవృత్తిలో స్పెషలిష్టు డాక్టరునే. సందేహమక్కర లేదు . తెలుగు , సంస్కృత భాషల్లో నాకే డిగ్రీలూ లేవు . మీరేమైనా పూనుకుని అందులో కూడా గౌరవ డాక్టరేట్ ఇప్పిస్తే సంతోషంగా పుచ్చుకుంటా . :)
శంకరయ్య గారూ.. ధన్యవాదములు.మీరు సూచించేవరకూ నేను గమనించలేదు.నేను వేమన గురించి చేసిన పూరణలొ పొరపాటున ఒక గణము తొలగి పోయినది.సొగసైన సవరణ చేసినందులకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిష్ణు నందనా ! సుందరా !
రిప్లయితొలగించండినిజం డాక్టరేట్లే మీ ముందు నిలువలేరు !
అటువంటప్పుడు
గౌరవ డిగ్రీలు మీ విలువను తగ్గిస్తాయేమో గాని
పెంచలేవు !
______________________________________
భాష మీదెంతొ విపరీత - పట్టు గలదు !
వాణి కే పాట నేర్పెడి - పాటవంబు !
తెలుగు భాషకు నీబోంట్లె - దిక్కు సుమ్ము !
చెత్త బిరుదులు నీకేల ? - చిలుక రౌత !
చౌక డిగ్రీలు నీకొద్దు ! చైత్ర సఖుడ !
వసంత్ కిశోర్ గారు , నేనా వ్యాఖ్య సరదాకు చేసినదే . నిజంగా కాదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు .పద్యానికి జోతలు.
రిప్లయితొలగించండిగురువు గారూ,
రిప్లయితొలగించండిధన్య వాదములు, సంధి విషయమై రాసేటప్పుడు అనుమానం ఉండినది. మీ సవరణకు, అందరి సందేహాలు తీరుస్తూ ఇస్తున్న వివరణలకు కృతజ్ఞతలు.
భవదీయుడు
ఊకదంపుడు
వింతగ రాముని కృష్ణుని
రిప్లయితొలగించండికొంతయును గదాధరుండు కొలువక తానే
పంతమ్ముగ నా కాళీ
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చింతలు దీర్చుచు సతతము
రిప్లయితొలగించండిముంతలతో కాఫినిడుచు మురిపించుచునున్
భ్రాంతిని తరిమెడు తనదౌ
కాంతా లోలుండె మోక్షగామి గనంగన్