16, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 228 (భాగ్యనగరమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. మిత్రులారా మా విశాఖపట్టణమును ఓ సారి సందర్శించండి !

    సిం హ దేవుని పదముల శిరము నిలపి
    సంద్ర దరి లోన వెలసిన ఇంద్ర పురము
    చక్కదనముల కిది, మా విశాఖ చనుడు
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు .
    మూర్తి గారూ !
    ముచ్చటగా ఉంది మీ విశాఖ !

    01)

    _______________________________________

    కూర్మి గురిపించి , మురిపించు - కోన సీమ
    నరయ రండయ్య , కనులార - అన్న లార !
    హరిత వర్ణము నలరారు - అమల పురము
    భాగ్య నగరమ్ము ! హైదరా - బాదు కాదు.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  3. హైదరాబాదు నేమంద్రు? మోదమలర
    నాటి కుతుబుషా నిర్మిత నగరమేది?
    సద్గుణాఢ్యులు దుష్టులా? సరిగ చెపుడు.
    భాగ్యనగరమ్ము. హైదరాబాదు. కాదు.

    రిప్లయితొలగించండి
  4. కిశోర్ జీ అమలాపురము కూడా చాలా సుందరంగా ఉంది. కోనసీమ అందాలు చెప్పాలా ?
    నిన్నటి మీ పూరణలన్నీ చాలా బాగున్నాయి. మావి శాఖ అన్నప్పుడు మిమ్మలను గుర్తుపెట్టుకొనే వ్రాసా.దానిపై వసంత కోకిల (?)

    శ్రీ చింతా రామకృష్ణారావు గారు వారి అమృతాన్ని యిక్కడ కూడా చిలికిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  5. నరసింహ మూర్తి గారూ మీ పూరణ చాలా బాగుంది విశాఖ లాగే. మావి శాఖపై కోకిల విసువు లేకుండా కమ్మగా కూస్తూనే ఉంటుంది. అనుమానం అక్కర లేదు.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి.

    సొంపైన పూరణలనందించిన మూర్తిగారికి,కిశోర్ గారికి,చింతా వారికి అభినందనలు.
    --------------------------------------
    భాగమతి పేర వెలసిన పట్నమేది?
    నగరమైనట్టి ఆపట్న నామమేది?
    తమిళనాడుకు అది రాజధానియౌన?
    భాగ్యనగరమ్ము,హైదరాబాదు,కాదు.

    రిప్లయితొలగించండి
  7. మూర్తిగారూ ! ఔనా !
    ఐతే మన విశాఖ వర్ణన బావుంది !

    చింతా వారు !
    ప్రశ్నల వర్షంతో మురిపించారు !

    02)
    __________________________________________

    నాల్గు మీనారు కూడలి - న్వెల్గు చుండ
    చిత్ర చిత్రాతి మ్యూజియం - చేరి గనుడు
    భాగ్య నగరమ్ము హైదరా - బాదు ! కాదు
    స్వర్గ మైనను సరిసాటి ! - సత్యముగను!
    ___________________________________________

    చిత్ర చిత్రాతి మ్యూజియం = సాలారు జంగు మ్యూజియం
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  8. "భాగ్యనగరము మాదిలే బాగుబాగు"
    తెలుగువారికి ప్రియము లీపలుకు లెపుడు
    నలుగుచుండెను వర్గాల నడుమ, నేడు
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ విశాఖ గురించి బాగా చెప్పారు. అభినందనలు.
    "సంద్ర దరిలోన వెలసిన" అనడం కంటే "సంద్రము దరిని వెలసిన" అంటే బాగుంటుంది.

    వసంత్ కిశోర్ గారూ,
    ఇప్పటికి చేరిన రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    అటు అమలాపురాన్నీ, ఇటు హైదరాబాదును ప్రశంసించి పక్షపాత రాహిత్యాన్ని చాటుకున్నారు.

    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ ప్రశ్నోత్తరాల పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరూ చింతా వారి మార్గాన పూరించి మెప్పించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి.

    భాగ్యనగరిని చేయకు భాగములను
    హైదరాబాదుయొక్కరి హక్కుకాదు
    కొంతమందికి చెందిన స్వంత ఆస్థి
    భాగ్యనగరమ్ము హైదరాబాదు-కాదు.

    రిప్లయితొలగించండి
  11. తమిళ 'చెన్నై' ని చూడు ; మద్రాసు కాదు ;
    మాతృభాషపై వారల మక్కువదియ !
    స్వచ్చమైనట్టి తెలుగులో పలుకుమింక
    'భాగ్యనగరమ్ము'! హైదరాబాదు కాదు!!!

    రిప్లయితొలగించండి
  12. విభిన్నమైన పూరణలతో అలరిస్తున్న కవివర్యులకు అభినందనలు.
    విష్ణునందన్ గారి చురక బాగున్నది. ఇలా చెప్పేవారు తెలుగువారికి కావాలి.

    రిప్లయితొలగించండి
  13. శాస్త్రి గారూ !
    మీ ప్రశ్నోత్తర శర పరంపర !బావుంది !

    రెండవ పూరణలో కొత్త demand ఎక్కడా వినలేదే ?
    కాదు-3,4 పాదాల్లో దేనికి ?

    మిస్సన్న మహాశయా ! ఇంతకీ భాగ్య నగరం
    ఔనంటారా ? కాదంటారా ?
    ఔననీ కాదనీ ! గొప్పగా పూరించారు !

    విష్ణు నందనా ! సుందరా !
    అందరికీ బుద్దొచ్చేలా చెప్పారు !
    మీకు మీరే సాటి !


    03)

    _________________________________________

    ప్రజల కోర్కెలు దీర్చెడి - ప్రభువతండె
    కరుణ వెలసెను దైవము - కలి యుగాన !
    తిరుమ లేశుడు కొలువున్న - తిరుపతి యన
    భాగ్యనగరమ్ము ! హైదరా - బాదు కాదు.
    __________________________________________

    రిప్లయితొలగించండి
  14. పెద్ద ధనవంతుడో నిరుపేద యైన
    బ్రతుక వచ్చిన వారి కాపాడు నట్టి
    భాగ్యనగరమ్ము హైదరాబాదు, కాదు
    ల్యాండు మాఫియా కాలవాలమ్ము నేడు.

    రిప్లయితొలగించండి
  15. 04)

    __________________________________________

    వర్ష మొచ్చిన , కావలె - పడవ లచట !
    ఇరుకు సందులు , కూపాలె - మురికి నీటి
    దారుణమ్మగు జాములు - దారి గనము !
    భాగ్య నగరమ్ము ,హైదరా - బాదు కాదు.
    __________________________________________

    జాములు = ట్రాఫిక్కు జాములు
    __________________________________________

    రిప్లయితొలగించండి
  16. హరీజీ !
    ఐతే , భాగ్య నగరమేనంటారు !
    మహా భాగ్యం !

    05)

    _________________________________________

    భాగ్యమును పేర నిడుకొన్న - పట్టణమ్ము ?
    రమ్యమౌ నాంధ్ర ప్రదేశ్ - రాజ ధాని ?
    నాలు గైదులు కూడిన - నలుబ దైదు ?
    భాగ్య నగరమ్ము - హైదరాబాదు - కాదు.
    _________________________________________

    రిప్లయితొలగించండి
  17. 07)

    _________________________________________

    కీర్తి శేషుల ముద్దుల - మూర్తు లచట !
    చరిత జెప్పును నింపుగ - జెవుల యందు !
    భాగ్య నగరమ్ము హైదరా - బాదు ! కాదు
    లే ,యనందువా పోట్లాట - లెక్కు వగును !
    __________________________________________

    (టాంక్ బండ్)
    __________________________________________

    రిప్లయితొలగించండి
  18. 06)

    _________________________________________

    వింత గొలుపును బుద్దుని - విగ్రహమ్ము !
    బిర్ల మందిర మందున - బెద్ద వేల్పు !
    భాగ్య నగరమ్ము హైదరా - బాదు ! కాదు
    కాదది యన్నను నేరీతి - గాక పోవు ?
    _________________________________________

    హుస్సేన్ సాగర్ - బిర్లా మందిర్
    _________________________________________

    రిప్లయితొలగించండి
  19. ప్రస్తూ పరిస్థితికి అద్దం పట్టారు మీ పూరణలో. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే. రాజకీయ నాయకులు "హైదరాబాదు"తో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఆ విషయాన్ని మీ పూరణలో స్పష్టం చేసారు. బాగుంది. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    మనోహరమైన పూరణ మీది. ధన్యవాదాలు.

    మందాకిని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. వసంత్ కిశోర్ గారూ,
    మీ "సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్"గా వచ్చిన ఐదు పూరణలూ బాగున్నాయి. ధన్యవాదాలు.
    మూడవ పూరణలో "భాగ్యమైన నగరం" అంటే తిరుపతే అన్నారు. వాస్తవం.
    4, 6, 7 వ పూరణలలో హైదరాబాదు మంచి చెడులను ప్రస్తావించారు. బాగుంది.
    5వ పూరణ ప్రశ్నోత్తరాలతో చమత్కారాన్ని మేళవించి వ్రాసారు. అద్భుతం!
    4వ పూరణలో "వర్షము + వచ్చిన" అనేది వర్షమొచ్చిన కాదు. ఒచ్చిన అనేది గ్రామ్యం. "వాన వచ్చిన" అందాం.
    5వ పూరణలో "ఆంధ్రప్రదేశ్" అన్నప్పుడు "ధ్ర" గురువై గణదోషం వస్తున్నది. "రమ్య మయిన యాంధ్రప్రదేశ్" అందాం.
    6వ పూరణలో "కాదది యన్నను" అన్నప్పుడూ గణదోషమే. "కాదటన్నను" అంటే సరి.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా!కిశోర్ జీ! ధన్యవాదములు.విలక్షణ పూరణలు చేసిన మిస్సన్న,హరి, విష్ణునందన్ గార్లకు అభినందనలు.పూ'రణ ' మును కొనసాగిస్తున్న కిశోర్ గారికి ప్రత్యేక అబినందనలు.కిశొర్ గారూ..డిమాండ్ లేకపోయినా మన(సు)లోకి వెళ్ళి భవిష్యత్ ఊహించి వ్రాయటం మన కవి క(కు)లానికి తప్పులేదేమో...

    గోలిహనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  22. గోలిహనుమచ్ఛాస్త్రి.

    భాగ్యనగరమ్ము హైదరాబాదు- కాదు
    అనకు యెపుడైన, చూడగ అందులోన
    తెలుగు ఉర్దులు ఒకచోట కలసి నట్లు
    హిందు ముస్లిములు కలసి ఉందురచట.

    రిప్లయితొలగించండి
  23. హరి గారూ,
    చక్కని పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

    గోలిహనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    "అనకు యెపుడైన"కు బదులు "అనకు మెపుడైన" అనండి.

    రిప్లయితొలగించండి
  24. నా పూరణ ....................

    అలసి భాగ్యమ్మతో భర్త పలికె నిట్లు
    "బంధువర్గమ్ముఁ జూడఁగా వచ్చినాము;
    భాగ్య! నగరమ్ము హైదరాబాదు; కాదు
    సులభ మిక్కడ వారుండు చో టరయుట"

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! భాగ్యనగరాన్ని
    భాగ్యమ్మను చేసేసారు ! చాలా బావుంది !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యా! పూరణమును విభిన్న కోణములో పూరించారు.అదిరింది.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి