అందరికీ వందనములు. ------------------------------ మా శాంతి గురించి ఆందోళనలో ఉన్నా నిన్నాళ్ళూ !
హైదరాబాదులో స్నేహితురాలి దగ్గర క్షేమంగా ఉన్నట్లు తెలిసి స్వస్థుడనయ్యాను !
-------------------------------
శాస్త్రి గారూ ! చక్కగా ఉంది !
మిస్సన్న మహాశయా ! తండ్రిని చుట్టాన్ని చేసేసి చక్కగా పూరించారు !
మూర్తిగారూ !పద్యం బాగానే ఉందికాని మీరు మాత్రం నాకు మింగుడు పడరు ! అదేంటో !!!!!!!!!!!! ఇల్లరికమంటారు ? ఇల్లు వీడమంటారు ? కాపేంటో మోపేంటో ? కొంచెం వివరిస్తే మీ సొమ్మేం పోతుంది ? మీ భావాన్నందుకోగల స్థాయి అందరికీ ఉంటుందా ? !
చంద్ర శేఖరా ! మీ స్వాను భవాన్ని చక్కగా వివరించారు !
నిన్న మొన్నటి వరకును - నిన్ను గాచు నేను తండ్రిని ,ధన్యుడ ! - నేటి నుండి నిన్ను పోషించి రక్షించి - నెనరు జూపు తాళి గట్టిన వాడె నీ - తండ్రి యగును ! (సముడు) _________________________________________
అనగా భర్తే సర్వస్వ మని భావం నెనరు = ప్రేమ _________________________________________
అయ్యా ఆంగ్లము మాట్లాడుతే యిక్కడ వాళ్ళు ' హాఁ ! ' అంటారు. తెలుగు వ్రాస్తే మీరు 'హూఁ! ' అంటున్నారు. రెంటికీ చెడిన ...సరే వసంతకిశొర్ గారూ మీ శాంతి క్షేమమగా భాగ్యనగరములో ఉన్నట్లు మంచి వార్త చెప్పారు.చాలా సంతోషము.
పద్యానికి తాత్పర్యము :
తల్లీ! నీది ఇల్లరికపు పెళ్ళి. తాళి గట్టిన వాడే ( నీ భర్తే ) ఇల్లు వదలి మనింటికి వస్తాడు. వాడికి మీ నాన్న కాపలా కాస్తుంటారు, అంతే కాదు వాడి నెత్తి మీద కూడా అప్పుడప్పుడు కూర్చొంటారు. వాడి అవస్థలు నువ్వు చూచి నువ్వు హాయిగా ఆనందించ వచ్చు !
ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది మీ పూరణ ! ముందే ఇచ్చి ఉంటే బాగుండేది వివరణ ! అర్థమయ్యేది నాలాంటి సాధారణ పాఠకునికి కూడా మీ ధారణ !
కాని మీ భావానికి తేటగీతి సరిపోలేదు ! మత్తేభమో ,శార్దూలమో లేక సీసమో ఎత్తుకుంటే సరిపోయేదేమో !
ఈ సందర్భంగా చిన్న కథ గుర్తుకొస్తోంది !(కోప్పడకండే) ఒక పెద్దమనిషి (మీ లాంటివాడే) రామాయణం చెబుతానని ఊరంతా చాటింపు వేయించి అట్టహాసంగా సభ ఏర్పాటు చేసి "కట్టె " - కొట్టె" - "పట్టె" అని చెప్పి మంగళం పాడేసాడట ! ఇదేమి రామాయణమయ్యా !అని అడిగితే ఇది వాల్మీకి రామాయణానికి - నా తెనుగు సేత ! అన్నాడట ! మాకేమీ అర్థం కాలేదు కొంచెం వివరించు మహాప్రభో అని వేడు కుంటే !
అఙ్ఞానులారా ! ఇందులో అర్థం కాకపోవడానికేముందీ
అయోధ్యకు రాజవ్వ వలసిన రాముడు పినతల్లి కోరిక మేరకు అడవికి వెళ్ళి,సీతను పోగొట్టుకొని వానరుల సాయంతో వారధి " కట్టె " !
పిదప బంధు మిత్ర పుత్ర సపరివార సహితంగా రావణాసురుని " కొట్టె " !
పిమ్మట సతీ సోదర సమేతముగా తిరిగి వచ్చి సింహాసనము చే "పట్టె " ! అని శలవిచ్చాడట !(గెట్లుంది ?)
వసంత మహాశయా, ధన్యుడిని, భాషా జ్ఞానము పెంచుకొందులకు యీ వయస్సులో ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. నాకు కోపము రాదు సామీ, మీరేమైనా అనవచ్చు.అయినా చంద్రశేఖరులను స్వానుభవము అని ఎందులకన్నారు ? ఆయన కసలే మొహమాటము.మా వూరు వస్తానంటూనే రావడము లేదు. ఊకదంపుడు గారి విశేషణము నాకు కూడా తెలియ లేదు.
మీ కధ బాగానే ఉంది గాని ఆ కట్టె,కొట్టె,పట్టె లతో ఆటవెలది మూడు గణాలే వచ్చాయి, మరి కొన్ని మాటలు చేర్చితే గాని పద్యముగా గురువు గారు ఒప్పుకొరే !
మూర్తీజీ ! ఏమనుకోలేదుకదా ! అనుకోరు లెండి ! ఎందుకంటే తిట్టడానిక్కూడా నాకు హక్కులిచ్చేసారుగా !
ఈ సందర్భంగా "పింగళి" గారు గుర్తొస్తున్నారు ! గుండమ్మ కథ లో "పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను ------------------------------- ఐనా మనిషి మారలేదూ ఆతని కాంక్ష తీరలేదూ" అన్నారుగా !
మీ హృదయం విశాలం మీ భావాలు అనంతం మీ సేవలు నిరంతరం మా కందాలి గరంగరం
తెలివైన మీ భావాల్ని తేలికైన చిన్నితేటగీతి తెల్లబోతూంది మాకు తెలుప సాధ్యం గాక
వసంతకిశోర్ గారూ, మీ భావం నాకు అర్థమయ్యింది. కానీ మీరు ఇంకొంచెం పొడిగించి "గంగా గౌరీ సమేత..." అని అంటారేమో అని భయమేసి వూరకున్నాను. ధన్యవాదములతో, చంద్రశేఖర్
వసంత(గారి)పునరాగమనానికి సంతసము నిండెను నా మనసంత. విష్ణు నందన్ గారు..మరికొందరు కవిమిత్రులు బ్లాగు సభకు వచ్చుట లేదు.పనివత్తిడిపై వెళ్ళిన విద్వద్భ్రమరాలు తిరిగి సభా కల్పతరువు మీదికి రావాలని కోరుతూ...
మందాకిని గారూ, మధ్య మధ్యలో మీ బ్లాగు సందర్శించాను. మీ భాష,భావాలు చాలా మధుర మైనవి. ఛందస్సు ఒక్కసారి తిరగెయ్యండి. మరీ కష్టము కాదు. మీరు మీ భాషతో సులభముగా వ్రాయ గలరు, తేటగీతులు,ఆట వెలదులు,కందాలు.
కిశోర్ జీ మీరు సహజ కవులు. మీరు తిట్టినా అవి ఆశీర్వచనాలే, నిజంగానే మీకు హక్కులున్నాయి. నేను ఏమీ అనుకోను. చంద్ర శేఖర్ మిత్ర వర్యా ! గంగ కూడా కావాలంటే కష్ట మేమిటి ? చెంబుడు నీళ్ళు నెత్తి మీద పోసుకొండి ! తాళి కట్టాలా యేమిటి ?
ధన్యురాలిని మూర్తిగారూ, అదే ప్రయత్నంలో ఉన్నాను. సరస్వతీ కృపాకటాక్షం, మీ లాంటి పెద్దల ఆశీర్వచనాలు ఉండగా నాకేల జంకు? మీ ప్రోత్సాహానికి బహుధా కృతజ్ఞురాలిని.
వసంత్ కిశోర్ గారూ, మీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు. ఇక మీరు చెప్పిన "కట్టె, కొట్టె, పట్టె" కత ఇంకెట్లుంటది? మస్తు గున్నది, జబర్దస్తు గున్నది.
మందాకిని గారూ, మంచి భావం. కాకుంటే పద్యలక్షణాలు లోపించాయి. మీ భావానికి నా పద్య రూపం.
తరుణ మేతెంచె పుత్రరత్నమ! కను మిదె ఒనరె మాకును షష్టిపూర్త్యుత్సవమ్ము నీదు మాతకు నాప్తు లామోదమంద తాళి గట్టినవాఁడె నీ తండ్రి యగును.
ఊకదంపుడు గారూ, మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ, మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు. కాకుంటే కొన్ని చిన్న దోషాలు. "తాడు + ఏడుగడ" అన్నప్పుడు యడాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం. "భరత భూమిని పడతికి పసుపు తాడె యేడుగడ యటందురు విజ్ఞు లెపటి కైన" అందాం.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిఇల్లు, అలుకతో వీడెను ఇరువదేండ్లు,
తిరిగి వచ్చెను చూడుము తెలియ నిజము,
అతడు ప్రేమించి, నాడు మీ అమ్మ మెడను
తాళి గట్టిన వాడె, నీ తండ్రి యగును.
మెట్టి నింటను వినయాన మెలగ వలయు
రిప్లయితొలగించండికష్ట సుఖముల నీతోడు గనుము బిడ్డ
తాళి గట్టిన వాడె, నీ తండ్రి యగును
వట్టి చుట్టమే నిను జూడ వచ్చి పోవు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారి పూరణ బాగుంది - బాలు మంత్రిప్రగడ
రిప్లయితొలగించండిమిస్సన్న గారి పూరణ చాల బాగుంది
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
గురువుగారూ నమస్కారములు.
రిప్లయితొలగించండిమంత్రిప్రగడ వారూ, నరసింహ మూర్తి గారూ ధన్యవాదాలు.
మిస్సన్న గారు! మీ పూరణలో విరుపు ఒక మెరుపు.అభినందనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
ఓ తల్లి కూతురికి పెళ్ళి ముందఱ ధైర్యము చెప్తూన్నాది ;
రిప్లయితొలగించండిఇల్లరికమిది తల్లిరొ ! యిల్లు వీడు
తాళి గట్టిన వాఁడె,నీ తండ్రి యగును
గాపు వానికి, గాకను మోపు నేమొ
మగని పాటులు చూతువు మగువ నీవు !
దక్షసుత! మదినెంచగ రక్ష యయ్యె
రిప్లయితొలగించండితాళి గట్టిన వాడె, నీ తండ్రి యగును
నీకు శత్రువు పిలవక నేగినన్, పి
లవని పేరంటము వలదు లలన వింటె !
మనవి: "పిలవని పేరంటమునకు పోరాదు" అనే నానుడి దక్షయజ్ఞం లోంచే వచ్చిందంటారు.
హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు. మీరు కూడా ఏమీ తీసి పోలేదు.
రిప్లయితొలగించండిమూర్తి గారూ, చంద్రశేఖర్ గారూ మీ మీ పూరణలు మనోజ్ఞంగా ఉన్నాయి.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండి------------------------------
మా శాంతి గురించి
ఆందోళనలో ఉన్నా నిన్నాళ్ళూ !
హైదరాబాదులో స్నేహితురాలి దగ్గర
క్షేమంగా ఉన్నట్లు తెలిసి
స్వస్థుడనయ్యాను !
-------------------------------
శాస్త్రి గారూ !
చక్కగా ఉంది !
మిస్సన్న మహాశయా !
తండ్రిని చుట్టాన్ని చేసేసి
చక్కగా పూరించారు !
మూర్తిగారూ !పద్యం బాగానే ఉందికాని
మీరు మాత్రం నాకు మింగుడు పడరు !
అదేంటో !!!!!!!!!!!!
ఇల్లరికమంటారు ?
ఇల్లు వీడమంటారు ?
కాపేంటో మోపేంటో ?
కొంచెం వివరిస్తే మీ సొమ్మేం పోతుంది ?
మీ భావాన్నందుకోగల స్థాయి
అందరికీ ఉంటుందా ? !
చంద్ర శేఖరా !
మీ స్వాను భవాన్ని చక్కగా వివరించారు !
01)
రిప్లయితొలగించండి______________________________________
తరుణి జన్మకు ధన్యత - తల్లి యగుటె !
దాని నొనరంగ జేయును - ధవుడు ,నీకు
తాళి గట్టిన వాడె ! నీ - తండ్రి యగును
తాత ! ముత్తాత నీసుతు - తనయు లకును !
______________________________________
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావన. అభినందనలు.
వసంత్ కిశోర్ గారికి వచ్చిన సందేహమే నాకూ వచ్చింది. వివరణ ఇవ్వండి.
చంద్రశేఖర్ గారూ,
మీ పిలవని పేరంటపు పూరణ చాలా బాగుంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
వాహ్! తండ్రిని తాతను, ముత్తాతను చేసారు. అద్భుతం. అభినందనలు.
02)
రిప్లయితొలగించండి_________________________________________
నిన్న మొన్నటి వరకును - నిన్ను గాచు
నేను తండ్రిని ,ధన్యుడ ! - నేటి నుండి
నిన్ను పోషించి రక్షించి - నెనరు జూపు
తాళి గట్టిన వాడె నీ - తండ్రి యగును ! (సముడు)
_________________________________________
అనగా భర్తే సర్వస్వ మని భావం
నెనరు = ప్రేమ
_________________________________________
వేళ వచ్చెను నాదు పుత్రరత్నమ!
రిప్లయితొలగించండిషష్ఠి పూరితి అయ్యెనింకను
నీదు మాతకు మరొక్కమారు
తాళి గట్టిన వాడె నీ తండ్రియగును.
అయ్యా ఆంగ్లము మాట్లాడుతే యిక్కడ వాళ్ళు ' హాఁ ! ' అంటారు. తెలుగు వ్రాస్తే మీరు 'హూఁ! ' అంటున్నారు. రెంటికీ చెడిన ...సరే వసంతకిశొర్ గారూ మీ శాంతి క్షేమమగా భాగ్యనగరములో ఉన్నట్లు మంచి వార్త చెప్పారు.చాలా సంతోషము.
రిప్లయితొలగించండిపద్యానికి తాత్పర్యము :
తల్లీ! నీది ఇల్లరికపు పెళ్ళి. తాళి గట్టిన వాడే ( నీ భర్తే ) ఇల్లు వదలి మనింటికి వస్తాడు. వాడికి మీ నాన్న కాపలా కాస్తుంటారు, అంతే కాదు వాడి నెత్తి మీద కూడా అప్పుడప్పుడు కూర్చొంటారు. వాడి అవస్థలు నువ్వు చూచి నువ్వు హాయిగా ఆనందించ వచ్చు !
అచ్చ తెలుగు కుంతి:
రిప్లయితొలగించండికడుపు తీపియె యందువో కఠినురాల
నందువో ఎరుగనుగాని,అంగ రాజ!
సత్యమిది, కంటినేను,ఆ ఛాయ మెడను
తాళి గట్టిన వాడె నీ తండ్రియగును.
మూర్తిగారూ !
రిప్లయితొలగించండిఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది మీ పూరణ !
ముందే ఇచ్చి ఉంటే బాగుండేది వివరణ !
అర్థమయ్యేది నాలాంటి సాధారణ
పాఠకునికి కూడా మీ ధారణ !
కాని మీ భావానికి తేటగీతి సరిపోలేదు !
మత్తేభమో ,శార్దూలమో
లేక సీసమో ఎత్తుకుంటే సరిపోయేదేమో !
ఈ సందర్భంగా చిన్న కథ గుర్తుకొస్తోంది !(కోప్పడకండే)
ఒక పెద్దమనిషి (మీ లాంటివాడే)
రామాయణం చెబుతానని ఊరంతా చాటింపు వేయించి
అట్టహాసంగా సభ ఏర్పాటు చేసి
"కట్టె " - కొట్టె" - "పట్టె"
అని చెప్పి మంగళం పాడేసాడట !
ఇదేమి రామాయణమయ్యా !అని అడిగితే
ఇది వాల్మీకి రామాయణానికి - నా తెనుగు సేత ! అన్నాడట !
మాకేమీ అర్థం కాలేదు
కొంచెం వివరించు మహాప్రభో అని వేడు కుంటే !
అఙ్ఞానులారా ! ఇందులో అర్థం కాకపోవడానికేముందీ
అయోధ్యకు రాజవ్వ వలసిన రాముడు పినతల్లి కోరిక మేరకు
అడవికి వెళ్ళి,సీతను పోగొట్టుకొని వానరుల సాయంతో వారధి " కట్టె " !
పిదప బంధు మిత్ర పుత్ర సపరివార సహితంగా రావణాసురుని " కొట్టె " !
పిమ్మట సతీ సోదర సమేతముగా తిరిగి వచ్చి సింహాసనము చే "పట్టె " !
అని శలవిచ్చాడట !(గెట్లుంది ?)
ఊకదంపుడు గారూ !
రిప్లయితొలగించండిమీ పూరణ బావుంది !
కాని కుంతికి ఆ విశేషణం దేనికి వాడారో ???
తెలుసుకోవచ్చా ?
మందాకిని గారు !
రిప్లయితొలగించండిషష్ఠిపూర్తికి మళ్ళీ తాళి కట్టమన్న
మీ పూరణ మనోహరముగా నున్నది !
వసంత మహాశయా, ధన్యుడిని, భాషా జ్ఞానము పెంచుకొందులకు యీ వయస్సులో ప్రయత్నము చేస్తూనే ఉన్నాను. నాకు కోపము రాదు సామీ, మీరేమైనా అనవచ్చు.అయినా చంద్రశేఖరులను స్వానుభవము అని ఎందులకన్నారు ? ఆయన కసలే మొహమాటము.మా వూరు వస్తానంటూనే రావడము లేదు. ఊకదంపుడు గారి విశేషణము నాకు కూడా తెలియ లేదు.
రిప్లయితొలగించండిమీ కధ బాగానే ఉంది గాని ఆ కట్టె,కొట్టె,పట్టె లతో ఆటవెలది మూడు గణాలే వచ్చాయి, మరి కొన్ని మాటలు చేర్చితే గాని పద్యముగా గురువు గారు ఒప్పుకొరే !
మూర్తీజీ ! ఏమనుకోలేదుకదా !
రిప్లయితొలగించండిఅనుకోరు లెండి ! ఎందుకంటే
తిట్టడానిక్కూడా నాకు హక్కులిచ్చేసారుగా !
ఈ సందర్భంగా "పింగళి" గారు గుర్తొస్తున్నారు !
గుండమ్మ కథ లో
"పిడికిలి మించని హృదయంలో
కడలిని మించిన ఆశలు దాచెను
-------------------------------
ఐనా మనిషి మారలేదూ
ఆతని కాంక్ష తీరలేదూ"
అన్నారుగా !
మీ హృదయం విశాలం
మీ భావాలు అనంతం
మీ సేవలు నిరంతరం
మా కందాలి గరంగరం
తెలివైన మీ భావాల్ని
తేలికైన చిన్నితేటగీతి
తెల్లబోతూంది మాకు
తెలుప సాధ్యం గాక
మూర్తీజీ !
రిప్లయితొలగించండిదక్ష సుత ,దక్షయఙ్ఞం,పిలవని పేరంటం
ఇవన్నీ చంద్రశేఖరునికి గాక
మీకూ నాకూ స్వాను భవా లౌతాయా ?
వసంతకిశోర్ గారూ, మీ భావం నాకు అర్థమయ్యింది. కానీ మీరు ఇంకొంచెం పొడిగించి "గంగా గౌరీ సమేత..." అని అంటారేమో అని భయమేసి వూరకున్నాను.
రిప్లయితొలగించండిధన్యవాదములతో,
చంద్రశేఖర్
భరత భూమిని పడతికి పసుపు తాడు
రిప్లయితొలగించండియేడుగడ యందురు విజ్ఞులు యెపటి కైన
తాళి లేకున్న సతికెగ తాళి గాన
తాళి గట్టిన వాడె ! నీ తండ్రి యగును !
ధన్యవాదాలండీ, ఏదో ఈ రకంగా ఎవరూ రాయలేదే అని ఆర్తితో రాసుకున్నాను. ఛందోనియమాల మీద పట్టు లేదు మరి.
రిప్లయితొలగించండిపెద్దల మందలింపులైనా సరే శిరోధార్యం అనుకుని రాశాను.
వసంత(గారి)పునరాగమనానికి సంతసము నిండెను నా మనసంత.
రిప్లయితొలగించండివిష్ణు నందన్ గారు..మరికొందరు కవిమిత్రులు బ్లాగు సభకు వచ్చుట లేదు.పనివత్తిడిపై వెళ్ళిన విద్వద్భ్రమరాలు తిరిగి సభా కల్పతరువు మీదికి రావాలని కోరుతూ...
గోలి హనుమచ్ఛాస్త్రి.
మందాకిని గారూ, మధ్య మధ్యలో మీ బ్లాగు సందర్శించాను. మీ భాష,భావాలు చాలా మధుర మైనవి. ఛందస్సు ఒక్కసారి తిరగెయ్యండి. మరీ కష్టము కాదు. మీరు మీ భాషతో సులభముగా వ్రాయ గలరు, తేటగీతులు,ఆట వెలదులు,కందాలు.
రిప్లయితొలగించండికిశోర్ జీ మీరు సహజ కవులు. మీరు తిట్టినా అవి ఆశీర్వచనాలే, నిజంగానే మీకు హక్కులున్నాయి. నేను ఏమీ అనుకోను.
చంద్ర శేఖర్ మిత్ర వర్యా ! గంగ కూడా కావాలంటే కష్ట మేమిటి ? చెంబుడు నీళ్ళు నెత్తి మీద పోసుకొండి ! తాళి కట్టాలా యేమిటి ?
ధన్యురాలిని మూర్తిగారూ, అదే ప్రయత్నంలో ఉన్నాను. సరస్వతీ కృపాకటాక్షం, మీ లాంటి పెద్దల ఆశీర్వచనాలు ఉండగా నాకేల జంకు?
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహానికి బహుధా కృతజ్ఞురాలిని.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.
ఇక మీరు చెప్పిన "కట్టె, కొట్టె, పట్టె" కత ఇంకెట్లుంటది? మస్తు గున్నది, జబర్దస్తు గున్నది.
మందాకిని గారూ,
మంచి భావం. కాకుంటే పద్యలక్షణాలు లోపించాయి. మీ భావానికి నా పద్య రూపం.
తరుణ మేతెంచె పుత్రరత్నమ! కను మిదె
ఒనరె మాకును షష్టిపూర్త్యుత్సవమ్ము
నీదు మాతకు నాప్తు లామోదమంద
తాళి గట్టినవాఁడె నీ తండ్రి యగును.
ఊకదంపుడు గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
నేదునూరి రాజేశ్వరి గారూ,
మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
కాకుంటే కొన్ని చిన్న దోషాలు. "తాడు + ఏడుగడ" అన్నప్పుడు యడాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం.
"భరత భూమిని పడతికి పసుపు తాడె
యేడుగడ యటందురు విజ్ఞు లెపటి కైన" అందాం.
ధన్యవాదములు గురువుగారూ!
రిప్లయితొలగించండితరళ ప్రాయము నందునే తనువు వీడి
రిప్లయితొలగించండితరలి వెళ్ళెను నీతండ్రి ,మరలి రాడు
నీకు ,నాకును నీడగా నిలువ నెంచి
తాళి గట్టిన వాడె నీ తండ్రి యగును.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
తాళి గట్టు ఆచారం ఉత్తారాదిన లేదని విన్నానండీ - అందుకని అలా అన్నాను,తప్పో ఒప్పో పెద్దలు మీరే చెప్పాలి.
మంద పీతాంబర్ గారూ,,
రిప్లయితొలగించండిబావుందండీ, నేనూ ఇలాంటి భావం తో పూరిద్దమనుకున్నాను గానీ, పదాలు జాగ్రత్తగా ఎంచుకోవలసి ఉండటం చేత కుదరలేదు.
పీతాంబరధరా !
రిప్లయితొలగించండినీడగా నిలిచే వాడే నిజమైన తండ్రి !
చాలా ఉదాత్తమైన పూరణ !
వూకదంపుడు గారూ !
ఆచారం సంగతి తెలియదు గానీ
అనుమానం తీర్చినందుకు ధన్యవాదములు !