9, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 221 (గానము వినినంత ఖరము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్.
ఈ సమస్యను పంపించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు.

  01)
  _______________________________________

  జాను తెనుంగున పద్యము
  గాణుడు, మన ఘంటసాల - గానము సేయన్ !
  మానవ లోకంబు , నమృత
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  _______________________________________

  రిప్లయితొలగించండి
 2. 02)
  _______________________________________

  మానవ బుణ్య వశంబున
  గానము సేయగ బుట్టెను - గంధర్వుడిలన్ !
  ప్రాణము దీసెడు , వెంకని
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  _______________________________________

  వెంకడు = గాన గంధర్వుడు ఘంటసాల
  ______________________________________

  రిప్లయితొలగించండి
 3. ఇదీ గాన గంధర్వుని గురించే :

  03)
  _______________________________________

  శ్రీనారాయణు మహిమలు
  నానా విధముల నుతించు - నారద మునియే
  మానవ రూపము నొందిల !
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  _______________________________________

  రిప్లయితొలగించండి
 4. 04)
  _______________________________________

  గానామృత పానంబును
  మానవుల కొసంగ జేయు - మాధవు మురళీ
  గానమెగ , ఘంట సాలన !
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  _______________________________________

  రిప్లయితొలగించండి
 5. ఇదీ గాన గంధర్వుని గురించే :

  05)
  _______________________________________

  స్నాన మొ నరింపజేయును
  వానగ , నమృతమును నింపి - పాటల నిలలో !
  వానికి సాటెవ్వరు; ఘన
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 6. ఇదీ ఘంటసాల వారి గురించే :

  06)
  ________________________________________

  మేనులు పులకించు; నమృత
  సోనలు చిలికించి యతడు - స్తోత్రము జేయన్ !
  శ్రీనాధుడు ,పడి చచ్చును !
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 7. ఇదీ ఘంటసాల వారి గురించే :

  07)
  _______________________________________

  పానీయ మౌను, రాళ్ళే !
  వీణా పాణైన , మింటి - వేల్పులె యైనన్
  న్యూనా భావము నొందెడు
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  _______________________________________

  రిప్లయితొలగించండి
 8. ఔను తలలూచు నాగులు!
  ఔనేడ్పును మాని శిశులు హాయిగ వినరే!
  ఔనేమి వింత? తీయని
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి

  ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సందర్భముగా నేను కూడా ఆయననే గుర్తుకు తెస్తున్నాను.

  ఔనిందున వింతేమిటి?
  గానములో ఘంటసాల గంధర్వుడెగా!
  వీనుల విందగు ఆయన
  గానము వినినంత, ఖరము గంధర్వుడగున్.

  (భ్రమర కీటక న్యాయముగా)

  రిప్లయితొలగించండి
 10. వసంత కిశోర్ గారూ ఇప్పటికి ఏడు ఖరములను గంధర్వులుగా మార్చారు. అబినందనలు.
  'శిశుర్వేత్తి పశుర్వేత్తి '....గుర్తుకు తెచ్చిన మిస్సన్న గారికి అబినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న మహాశయులకూ
  శాస్త్రి గార్లకు
  వందనములు
  అభినందనలు
  మరియు
  ధన్యవాదములు.


  08)
  __________________________________________

  వేనోళ్ళ బొగడ , శక్యమె
  శ్రీనాధుని పాన్పుకైన ! - శ్రీ , శ్రీ కైనన్ !
  గాణాధిపు , ఘంటసాలన్ !
  గానము వినినంత , ఖరము - గంధర్వుడగున్ !
  __________________________________________

  శ్రీ = లక్ష్మి
  శ్రీ = సరస్వతి
  __________________________________________

  రిప్లయితొలగించండి
 12. మా ఇంటిదగ్గర రోజూ రాత్రి రెండు గాడిదలు చేరి అరుస్తుంటాయ్.

  ఏనాటి జన్మబంధమొ,
  గానామృతపానమత్తఖరదంపతులై
  ప్రాణముఁ గొనెదరు. ఖరసఖి
  గానము వినినంత , ఖరము గంధర్వుడగున్ !

  రిప్లయితొలగించండి
 13. వసంత్ కిశోర్ గారూ,
  మీ పద్యాష్టకం చూసాను. బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం ఉంది. "గానము సేయంగఁ బుట్టె" అంటే సరి.
  ఎనిమిదవ పూరణ మూడవ పాదం "గాననిధి ఘంటసాలన్" అంటే గణదోషం ఉండదు.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రవి గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. రవి గారు !
  అభినందనలు !
  అద్భుతంగా ఉంది మీ పూరణ !
  సఖి గానం వింటే ఏ గాడిదైనా
  గాడిద కొడుకైనా గంధర్వుడవ్వ వలసిందే !
  తప్పదు మరి !
  మీకు రెండు వీర తాళ్ళు !
  (ప్రస్తుతం లేవు గాని , వచ్చాక ఇస్తాను)

  రిప్లయితొలగించండి
 15. హనుమచ్చాస్త్రి గారూ, కిషోర్ గారూ ధన్యవాదాలు.
  రవిగారి పూరణ ఈరోజు హైలైట్.

  రిప్లయితొలగించండి
 16. "గుజరాత్ గాడిదల వైభవ ప్రచార పురుషుడు అమితాభ్ బచన్"

  కానగ గుజరాత్ నందున్
  ధ్యానము జేయుచు వినగనె ధడధడ మనుచున్
  "పాను బనారస్ వాలా"
  గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్

  రిప్లయితొలగించండి

 17. వీనుల విందుగ మోహన

  గానము చేయుటకు చేత కాదను స్థిరమౌ

  దీనత తొలగుచు డిస్కో

  గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్

  రిప్లయితొలగించండి