13, ఫిబ్రవరి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (అమ్మను పెండ్లియాడి)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

26 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.

    అందరికీ ఆహ్వానం.
    ఈ రోజు జరుగు -రాహులు-శ్రీ వరాలమ్మ
    వివాహానికి వచ్చి వధూ వరుల నాశీర్వ దించి
    మా సత్కారము లందుకొని మమ్మానందింపజేయ ప్రార్థన.

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొమ్మను ,ముద్దుగుమ్మ నుచు - కోరి వరించిన ,పుత్రు యొక్క ఖ
    ర్మమ్మని ,తండ్రి యెంచి , తన - రాహులు తోడను పెండ్లిసేయ; భా
    గ్యమ్మని యెంచి ,నా సుతుడు - కాపుల మంటప మందు ,శ్రీ వరా
    లమ్మను పెండ్లియాడి ముద - మందెను పుత్రుడు తండ్రి మెచ్చగన్ !
    _____________________________________________

    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారు,
    మీ ఆహ్వానము పూరణలు బాగున్నాయి. వీలు చూసుకొని తప్పకుండా వస్తాము.
    ఇక్కడ "నా సుతుడు" "రాహులు' అంటున్నారు, ఇంతకీ ఈ "రాహులు' యతి కోసము వచ్చిన రాహులా? మీ సుతుడు రాహులా?
    ఒక వైపు "పుత్రుడి ఖర్మ" అంటున్నారు, ఇంకో వైపు తండ్రి మెచ్చాడంటున్నారు. ఇంతకీ తండ్రి మెచ్చుకున్నాడా? నొచ్చుకున్నాడా?

    రిప్లయితొలగించండి
  3. కమ్మని ప్రేమ పంచి , తన కష్టసుఖమ్ముల నెంచి మించి , త్యా
    గమ్మునకొక్క రూపమయి గాటముగా మమకార భావనల్
    జిమ్మెడి యమ్మ వృద్ధ యయి చింతిల , సౌఖ్యములందు దేల్పగా
    అమ్మను , పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

    ( ఎన్నో విధాలుగా తన ఎదుగుదలకోసం యెన్నో త్యాగాలు చేసి , వృద్ధాప్యంలో ఇంటిపనీ ,వంటపనీ చేసుకోలేక సతమతమయ్యే అమ్మను , సౌఖ్యాలలో తేల్చవలెనని కోడలిని తెచ్చి అమ్మకు కష్టాలు దూరంచేసిన కొడుకు - సంతోషపడిన తండ్రి )

    రిప్లయితొలగించండి
  4. విష్ణు నందను గారూ కడు చక్కని పూరణ నిచ్చారు. నమస్కారాలు.

    రిప్లయితొలగించండి
  5. వసంత్ కిశోర్ గారూ,
    పుత్రుదు వరాలమ్మను పెండ్లి చెసికొని ఆనందిస్తే తండ్రి మెచ్చాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అన్నట్టు జిగురు వారి ప్రశ్నలకు సమాధానా లివ్వండి. లేకుంటే వదలరు. అసలే ఫెవికాల్ జిగురు.

    డా. విష్ణు నందన్ గారూ,
    ధన్యోస్మి. శ్రేష్ఠమైన పూరణ నిచ్చారు. బ్రహ్మ పాండిత్యం, మన్మథుని లాలిత్యం మీ పద్యాల్లో లాస్యం చేస్తుంటాయి. ఇద్దరూ విష్ణునందనులే కదా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీయుత శంకరయ్య గారికి ధన్యవాదాలు !!!!

    ధన్యంబయ్యెను మత్కవిత్వమిదె విద్యా వార్ఠి ! శ్రీ శంకరా !
    మాన్యంబై మృదువాగ్విలాస కలితమ్మై యొప్పు సత్పాండితీ
    విన్యాసమ్మొక వైపు , సాటి కవులన్ బ్రీతిన్ బ్రశంసించు సౌ
    జన్యంబింకొకవైపు , అద్భుతము ! మీ సౌశీల్యమాశ్చర్యమౌ !!!!

    మిస్సన్న గారూ ..... నమామి ! కృతజ్ఞతానీకం !!!

    రిప్లయితొలగించండి
  7. నెమ్మది యైనపిల్ల, పని నేర్చిన యట్టిది, అందమందువా?
    బొమ్మయె నిక్కమేను! ఒక ముద్దును ముచ్చట యిప్పుడే గదా!
    ఝామ్మని బెండ్లియాడమన, సైయనె సంతసమొందజేయగా
    అమ్మను, పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  8. అమ్ముని వెంట నేగుచును ఆ మిథిలా పురి, మార్గ మందు శా-
    పమ్మున ధూళియైన ముని పత్నికి రూపము నిచ్చి, శంభు చా-
    పమ్మును ద్రుంచి ఫెళ్లుమని బంగరు బొమ్మను భూమి జాత సీ-
    తమ్మను పెండ్లియాడి ముద మందెను, పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి.

    అమ్మగమారె పుత్రుగని, ఆనక భర్తను గోలుపోయె, నీ
    విమ్ముగ భావి జీవితము నిమ్మని, ఇచ్చెద ఆస్తి యంచు ఆ
    అమ్మడి తండ్రి వేడుకొన, ఆదరమొప్పగ వ్యక్తి యొక్కడా
    అమ్మను పెండ్లియాడి ముదమందెను- పుత్రుడు, తండ్రి మెచ్చగన్.

    రిప్లయితొలగించండి
  10. వివిధ రకాలుగా వివాహములు చేయుచున్న కవిమిత్రులందరికీ అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ, రామన్న పై మీ పూరణ బాగున్నది.
    అందరూ బాగా పూరించారు.

    రిప్లయితొలగించండి
  12. డా.విష్ణు నందన్ గారి పూరణ ఎప్పటి లాగే అద్భుతం .మిస్సన్న గారి పూరణ నేటి అత్యద్భుతం .చాలా బాగుంది .

    వరాలమ్మ పెండ్లి అయ్యిందిగా ! ఆమె చెల్లి నాగ వెంకమ్మ పెండ్లి గూడా ఈ విధంగా జరిగింది తిలకించండి!


    కొమ్మను జూసెనో వలపు కోరిక జిమ్మగ తా మనమ్ములో
    కమ్మని భావనల్ గదిలి కాలము నాపగ ,ప్రేమ తెమ్మరల్
    గ్రమ్మగ బట్టెనా కరము గ్రమ్మున రమ్మని కేల,నాగ వెం
    కమ్మను పెండ్లియాడి ముదమందెను పుత్రుడు తండ్రి మెచ్చగన్!

    రిప్లయితొలగించండి
  13. అందరి పూరణలు బాగున్నాయి.
    డా. విష్ణు నందన్ , రవి గార్లు అమ్మను విడదీసినా కమ్మగా విడదీశారు.
    వసంత కిశోర్ గారు వరాలమ్మకు పెళ్లిచేస్తే మిస్సన్న గారు సీతమ్మకు పెళ్లి చెయ్యించారు.
    గోలి వారు సంఘసంస్కర్తగా మారి వితంతు వివాహము చేపించారు.
    పూరించిన కవి మిత్రులకు పెళ్లి పెద్దలకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నేను కూడా గోలివారిలాగా సంఘ సంస్కర్తనై వరకట్నాన్ని వ్యతిరేకిద్దామని...

    కమ్మని పెళ్లిలోన వర కట్నము వద్దని జెప్పి తండ్రియే
    యిమ్ముగ పల్కెనీ పగిది "యీతడు నా కొమరుండు గాన నే
    నమ్మను"; పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్
    సొమ్మును స్వీకరించకయె సూత్రముఁ గట్టెను ప్రేమ మీరగన్!!

    నేను + అమ్మను = నేనమ్మను

    రిప్లయితొలగించండి
  15. జి.ఎస్.జీ !
    నా ఆహ్వానాన్ని మన్నించి
    పెళ్ళి కొచ్చినందుకు సంతోషం !

    నా సుతుడు కాదు ! యతి సుతుడే !
    బహుశా "యా సుతుడు " అనాలేమో ?!

    ఎవరో అమ్మాయిని కొడుకు ప్రేమించా నంటే
    సరే నీ కర్మ ఎలా ఉంటే అలా అనుభవించమని
    తనకిష్టం లేకపోయినా ,కుమారుణ్ణి కాదనలేక
    పెళ్ళి జరిపించిన తండ్రి,

    కోడల్ని చూశాక , తన అభిప్రాయం మార్చుకొని
    కొడుకును మెచ్చుకొన్నాడు!
    ఏం తప్పా ???

    రిప్లయితొలగించండి
  16. విష్ణు నందనా ! సుందరా !
    మీ ప్రతిభ అమోఘం !అద్భుతం !
    సమస్యలో భావాన్ని తారు మారు చేసేస్తారదేంటో మరి !
    ఏ అమ్మతో పెళ్ళి చెయ్యాలా ? అనే ఎవరైనా ఆలో చిస్తారు!
    కాని మీరు " అమ్మ కోసం " అనే భావన తీసుకొచ్చి అందర్నీ
    ఆశ్చర్య ఆనందో ద్వేగాలకు లోను గావించారు !
    గురువు గారన్నట్టు సార్థక నామధేయులు మీరు !

    మీ శార్దూలం కూడా అధ్బుతం గా ఉంది !

    రవిగారూ ! మీరుకూడా అమ్మ కోసం తెచ్చిన
    నెమ్మదైన పిల్ల ! బావుంది !

    మిస్సన్న మహాశయా !
    అహల్య శాప విమోచనం
    సీతారామ కల్యాణం
    కళ్ళముందు నిలిపారు !అభినందనలు !

    శాస్త్రిగారూ !
    అమ్మకు మళ్ళీ పెళ్ళి చేసి
    ఆదర్శవంతంగా పూరించారు!
    అభినందనలు !

    పీతాంబరధరా !
    నాగవెంకమ్మ పెళ్ళి పనులలో పడి
    వరాలమ్మ పెళ్ళి రాలేదన్న మాట !బావుంది !

    జి.ఎస్. జీ !
    ఆదర్శవంతమైన పెళ్ళి జరిపించారు ! ఆనందం !

    రిప్లయితొలగించండి
  17. పెళ్ళిళ్ళన్నీ ఒకదాన్ని మించి మరొకటిగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.డా.విష్ణు నందనుల వారి పద్యాలను పొగడడము నా శక్తికి మించిన కార్యము. గురువర్యులతో సంపూర్ణముగా యేకీభవిస్తున్నాను అని పలకడము విజ్ఞత అనుకొంటున్నాను. మిస్సన్నగారూ రాముడి పెండ్లి మంగళ తూర్యాలతో జరిపించారు. హనుమఛ్ఛాస్త్రిగారు,సత్యన్నారాయణ గారు సంస్కరణ వివాహాలు జరిపించారు. కిశోర్ గారు,మందా వారు యిద్దరమ్మలకు, రవి గారు మరో పిల్లకు పెళ్ళిళ్ళు చేయించారు. కల్యాణ మంటపాలు ఖాళీ ల్లేకుండా ఉన్నాయి. అయినా ,


    నిమ్మకు నీరు నెత్తినదొ,నిద్దపు తేజుడ నీకు ముద్దుగాఁ
    గొమ్మను జూచి వచ్చితిమి కుందన మందున దీర్చె బ్రహ్మ దా
    నిమ్ముగ పెండ్లియాడు మని యింపుగఁ జెప్పగ గౌరవించెనే
    యమ్మను ; పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  19. మూర్తి గారూ .. మంటపాలు ఖాళీ లేకపోయినా ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి పెండ్లి చేశారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  20. మూర్తి గారూ !
    మహా బుద్ధి మంతులు మీరు !
    అమ్మ జూసిన పిల్లతోనే పెళ్ళి చేసారు !
    అదీ కల్యాణ మంటపాలు ఖాళీ లేకపోయినా !

    రిప్లయితొలగించండి
  21. శాస్త్రి గారూ, కిశోర్ గారూ ధన్యవాదములు. అప్పుడప్పుడు తప్ప సాధారణంగా బుధ్ధిమంతుడినే సామీ !

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతి గారూ, పీతంబార్ గారూ, సత్యనారాయణ గారూ, నరసింహమూర్తి గారూ, కిశోర్ మహోదయా ధన్యవాదాలు. మీ అందరి పూరణలూ అద్భుతంగా శోభిల్లుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  23. నమ్ముము దేవుడీయనయె నాన్న, యికమ్మయొ చీకటుల్ గదా
    యిమ్మహి లేక యామె, చెలి కిట్లని చూపెను నాన్న నాపయిన్
    అమ్మను, పెండ్లి యాడి ముదమందెను పుత్రుడు నాన్న మెచ్చగన్,
    అమ్మ కనుల్ చెమర్చగను, అక్కయు బావయు సంత సింపగన్.

    (స్వల్పమైన మార్పుతో)

    రిప్లయితొలగించండి
  24. కవి మిత్రులకు నమస్కృతులు.
    కార్యార్థినై బయటకు వెళ్తున్నాను. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్నది. మీ పూరణలపై తరువాత స్పందిస్తాను.

    రిప్లయితొలగించండి
  25. రవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    సీతమ్మను రాముడు పెళ్ళాడిన వృత్తాంతంతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    నాగ వెంకమ్మ పెండ్లి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    "అమ్మను" శబ్దాన్ని మరోకోణంతో ప్రయోగిస్తూ సమస్యను పూరించిన మీ నైపుణ్యానికి జోహార్లు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి