విష్ణు నందన్ గారూ! ధన్యవాదాలు. వృద్ధుల మనోవేదనను ప్రతిఫలిస్తూ మీ పూరణ వైవిధ్యంగా ఒప్పుతోంది. శాస్త్రిగారూ మీ పూరణ చాల బాగుంది. పీతంబార్ గారూ, సత్యనారాయణ గారూ మీ పూరణలు ఎంతో బాగున్నాయి.
మిస్సన్నగారూ ధన్యవాదములు. సుత్రాముడంటే ఇంద్రుడు అని తెలుసు. నతము అంటే శబ్దరత్నాకరములో వంకర అనే అర్ధము ఉంది. వక్ర రీతిలో వర్తంచు ఇంద్రుడనేనా భావము ? వసంత మహాశయా మీ మనస్సు వెన్న. దానికి మందు లక్కర లేదు. చిన్నప్పటి నా స్నేహితులు నన్ను జివిఎన్ అని పిలుస్తారు. మీరొక్కరు మాత్రము నన్ను జి.పి.ఎన్ అని పిలువవచ్చు.
ఉదయం సమస్యా పూరణము చేసిన తరువాత గ్రామాంతరము వెళ్ళి వచ్చి ఇప్పుడే కవి మిత్రుల పూరణములు చూశాను.అన్నీ దేనికదే విలక్షణతను సంతరించుకొని రసవత్తరంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.
వసంత మహోదయా! మూర్తి మిత్రమా! మళ్ళా నా పాత డైలాగే చెప్పాల్సి వస్తుంది. తాత గారికి దగ్గులు నేర్పాలా? నతులు, నుతులు అంటారు గదా. నతులు అంటే నమస్కారాలు. నుతులు అంటే స్తోత్రాలు. నతసుత్రాముడు అంటే సుత్రాముని చేత నమస్కరింప బడే వాడు. విష్ణు నందనులైతే ఇంతకన్నా చక్కగా వివరించగలరు.
ఇందులో మూడవది అన్వయించుకోవచ్చు. నాకో పిచ్చి సందేహం వచ్చింది "ఇంద్రుడూ రాముడూ ముఖా ముఖీ ఎక్కడ ఎప్పుడు తారస పడ్డారూ ? ఇంద్రుడెప్పుడు రామ శరణా గతి పొందాడూ " అని ! ఎందుకంటే పూరణలన్నీ రాముని పరంగా నడుస్తున్నాయి గదా ! మిస్సన్న గారిని అదే అడిగాను.
నాకు తరువాత అర్థమైంది ! ఆ పూరణలో అసలు రాముడే లేడని అది విష్ణు పరంగా చెప్పబడిందనీనూ ఇంద్రు డెప్పుడూ విష్ణువునే గద శరణు కోరేది !
మిస్సన్న గారు , మీ వివరణ సంపూర్ణం. నత సుత్రాముడు = నతః సుత్రామః యస్య సః , ఎవనికి ఇంద్రుడు నమస్కరించునో వాడు , విష్ణువు అని వ్యుత్పత్తి. ఇకపోతే యిది బహువ్రీహి సమాసం . మీకు తెలిసినట్టుగానే ' అన్య పదార్థ ప్రధానః బహువ్రీహిః ' సమాసం లో నుండే యే ఒక్క పదానికీ గాక మూడో పదానికి ప్రాముఖ్యత యిక్కడ.. నతః కాదూ , సుత్రామః కాదు , విష్ణువు వచ్చి చేరాడన్న మాట. ఇకపోతే కొన్ని సందర్భాలలో ఈ సమాసాన్వయం లో పొరబడే ప్రమాదాలున్నాయి. జిత రావణుడు సీతాదేవిని పెండ్లాడెను అంటే అదేమీ? రావణుడు సీతమ్మను పెండ్లాడెనా అని భ్రమపడే అవకాశాలు ఉన్నాయి కదా..... జితః రావణః యేన సః = ఎవని చేత రావణుడు గెలవబడెనో వాడు (రాముడు) అని విగ్రహ వాక్యం చెప్పుకుంటే ఇంతేనా అనిపిస్తుంది ఇదే సమస్యా పూరణకు గానూ వినియోగించుకోవచ్చు జిత మూడవపాదంలో వేసుకుని. మొత్తానికి చాలా గడసరి ప్రయోగం చేశారు . అభివాదాలు . నన్నంటూ ఆమంత్రించారు కాబట్టి ఈ మాత్రం వివరణ. ధన్యవాదాలు .
విష్ణు నందను గారూ! కడుంగడు ధన్యవాదములు. బహువ్రీహి సమాసం గురించి చాల చక్కని వివరణ ఇచ్చారు. నేనైతే నా అల్ప పరిజ్ఞానంతో 'నతసుత్రాముడు' తృతీయా తత్పురుష సమాసమేమో అనుకొన్నాను. బడి చదువులు మరుగున పడిపోతున్నాయి. మరొక్క సారి ధన్యవాదములు.
కిశోర్ మహోదయా! ధన్యవాదములు. మీ సందేహానికి చాల చక్కటి పరిజ్ఞానాన్నిచ్చే సమాధానం ప్రసాదించారు విష్ణు నందనులు. మీ కూలంకష పరిశీలన ఎంతోమందికి జ్ఞానవృద్ది చేస్తూ ఉపయోగకరంగా ఉంటోంది. ఇదంతా ఇంతకీ గురువుగారి చాలవ. వారికి నమస్సులు. మీ పరిశీలన కొనసాగించండి.
అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న ఉదయం ఒక పెళ్ళికి వెళ్ళి ఇంతకు ముందే ఇల్లు చేరాను. అందరి పూరణలు, వాటిపై మిత్రుల స్పందనలు, ప్రశంసలు, సందేహాలు, వివరణలు అన్నీ చూసి సంతోషించాను. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, మంద పీతాంబర్ గారు, మిస్సన్న గారు, డా. విష్ణు నందన్ గారు, జిగురు సత్యనారాయణ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, వసంత్ కిశోర్ గారు, ఊకదంపుడు గారు, రాజేశ్వరి నేదునూరి గారు ..... అందరి పూరణలు వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. "నత సుత్రాముడు", ప్రహ్లాదుని రామాయణ పఠనం తదితరాంశాల చర్చ ఉల్లాసంగా సాగింది. ఎలాగూ పరస్పర గుణదోష సమీక్షలు జరిగాయి కనుక సమయాభావం వల్ల నేను విడివిడిగా మీ పూరణలను ప్రస్తావించకుండ అందరికీ సామూహికంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండికామము, క్రోధము తగ్గును
ప్రేమలు మదిలోన పొంగి పెంపగుచుండున్
వ్యామోహము నీ దరికే
రామ చరిత్రము చదువగ; రాదు కుమారా!
శ్యామా నేడును చదివెడు
రిప్లయితొలగించండిదేమిటి?తెలుగా! పరీక్ష లిప్పుడు నీకున్
సామాన్య శాస్త్ర మంటివి
రాముని చరిత్రము జదువగరాదు కుమారా!
ఏమిది దానవ బాలుడు
రిప్లయితొలగించండిసామాన్యుని కథల వినుట, చదువుట తగునే?
పామరుడ వేమి నతసు-
త్రామ చరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!
చంద్ర శేఖరులకు పునః స్వాగతం.
రిప్లయితొలగించండిఏమో నా పాపము ? ' గ్లా
రిప్లయితొలగించండికోమా ' యను కంటి జబ్బు కూడెను ముదిమిన్ ,
రామా కృష్ణా యని , శ్రీ
రామచరిత్రముఁ జదువఁగ, రాదు కుమారా !
(చదువగ రాదు అనేది , చదవకూడదు అనే ఆజ్ఞా వాచకంగానూ - చదవడానికి రాదు అని ప్రకటన రూపంలోనూ వాడవచ్చు కదా...ఇది ఒక భిన్నరూపమైన పూరణ కోసం )
అన్ని విభిన్నమైన పూరణలే చాలా బాగున్నాయి ...మిస్సన్నగారు ! నత సుత్రాముడు దివ్యమైన ప్రయోగం !!!
రిప్లయితొలగించండిలేమ యొకతి వ్రాసెను ఘన
రిప్లయితొలగించండిరామ చరితము విష వృక్ష రాజమ్మనుచున్
రాముని తిట్టుచు వ్రాసిన
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!
విష్ణు నందన్ గారూ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివృద్ధుల మనోవేదనను ప్రతిఫలిస్తూ మీ పూరణ వైవిధ్యంగా ఒప్పుతోంది.
శాస్త్రిగారూ మీ పూరణ చాల బాగుంది.
పీతంబార్ గారూ, సత్యనారాయణ గారూ మీ పూరణలు ఎంతో బాగున్నాయి.
మిత్రులందఱికీ వందనములు. మీ చక్కని పూరణలు చదువుతూనే యున్నాను.
రిప్లయితొలగించండిఓ ముని కోకిల పాటా ?
కామంబులుఁ దీర్పఁ జేరు కల్పద్రుమమా ?
ఆ మేర దాటి వ్రాసిన
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా !
( మునికోకిల = వాల్మీకి, మేర = మర్యాద )
నరసింహ మూర్తి గారూ మీ పద్యం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిశాస్త్రి గారూ !
రిప్లయితొలగించండిచక్కగా నున్నది మీ పూరణ !
పీతాంబరధరా !
చాలా బావుంది !
మిస్సన్న మహాశయా !
హిరణ్య కశిపుడై పోయారు !
భేషుగ్గా ఉంది !
విష్ణునందన పండితుల మెప్పు పొందారు !
నతసుత్రాముడు అంటే ఏమిటో
కాస్త అర్థ సందర్భాలు చెబితే
పామర జనరంజకం గూడా ఔతుంది గదా !
విష్ణు నందనా ! సుందరా !
వినూత్నమైన పూరణ !
అందరిలా మీ రెందు కాలోచించరు?
విష్ణు నందన!సుందరా! - విబుధ వరులు
మెచ్చు నట్లుండు! నీపద్య - మేది యైన !
హంస లందున రమ్యమౌ- హంస వీవు !
మనము నందెక్కు డిడుగడ ! - మాన్ప గలవె?
నాకేదైనా మందివ్వండి డాట్టరుగోరూ !
జి ఎస్ జీ !
విష వృక్షం చదవొద్దనడం ! బావుంది !
మూర్తి గారూ ! చాలా బావుంది!
కాని మీ రెక్కు పెట్టిన బాణం ఎవరిమీదో ?
మిస్సన్నగారూ ధన్యవాదములు. సుత్రాముడంటే ఇంద్రుడు అని తెలుసు. నతము అంటే శబ్దరత్నాకరములో వంకర అనే అర్ధము ఉంది. వక్ర రీతిలో వర్తంచు ఇంద్రుడనేనా భావము ?
రిప్లయితొలగించండివసంత మహాశయా మీ మనస్సు వెన్న. దానికి మందు లక్కర లేదు. చిన్నప్పటి నా స్నేహితులు నన్ను జివిఎన్ అని పిలుస్తారు. మీరొక్కరు మాత్రము నన్ను జి.పి.ఎన్ అని పిలువవచ్చు.
ఉదయం సమస్యా పూరణము చేసిన తరువాత గ్రామాంతరము వెళ్ళి వచ్చి ఇప్పుడే కవి మిత్రుల పూరణములు చూశాను.అన్నీ దేనికదే విలక్షణతను సంతరించుకొని రసవత్తరంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
కాముని పండగ గదరా!
రిప్లయితొలగించండిరామ చరిత్రము జదువగ రాదు కు "మారా"!
కాముడు మదిలో నుండగ
రాముండేతీరు నుండు రాగవిధేయా!
వసంత మహోదయా! మూర్తి మిత్రమా!
రిప్లయితొలగించండిమళ్ళా నా పాత డైలాగే చెప్పాల్సి వస్తుంది.
తాత గారికి దగ్గులు నేర్పాలా?
నతులు, నుతులు అంటారు గదా.
నతులు అంటే నమస్కారాలు. నుతులు అంటే స్తోత్రాలు.
నతసుత్రాముడు అంటే సుత్రాముని చేత నమస్కరింప బడే వాడు.
విష్ణు నందనులైతే ఇంతకన్నా చక్కగా వివరించగలరు.
పీతాంబర ధరా మంచి పద్యం.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ ధన్యవాదములు. పీతాంబర్ గారూ చాలా బాగుంది మీ రెండవ పూరణ.
రిప్లయితొలగించండినామదికిఁ నేడు సీతా
రిప్లయితొలగించండిరాములపట్టాభిషేకరసవద్ఘట్టం
బే మరిచాలును,ఉత్తర
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా !
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
ఇప్పుడు మీ పద్యం
పండిత పామర జన రంజకం !
జి వి ఎన్ జీ !
ఈ అర్థాలు చూడండి !
నతము = వంకరైనది
నతి = నమస్కారము
నతవైరి = శరణాగతుడైన శత్రువు
(ఆంధ్ర భారతి నుండి)
ఇందులో మూడవది అన్వయించుకోవచ్చు.
నాకో పిచ్చి సందేహం వచ్చింది
"ఇంద్రుడూ రాముడూ ముఖా ముఖీ
ఎక్కడ ఎప్పుడు తారస పడ్డారూ ?
ఇంద్రుడెప్పుడు రామ శరణా గతి పొందాడూ " అని !
ఎందుకంటే పూరణలన్నీ రాముని పరంగా నడుస్తున్నాయి గదా !
మిస్సన్న గారిని అదే అడిగాను.
నాకు తరువాత అర్థమైంది !
ఆ పూరణలో అసలు రాముడే లేడని
అది విష్ణు పరంగా చెప్పబడిందనీనూ
ఇంద్రు డెప్పుడూ విష్ణువునే గద
శరణు కోరేది !
విష్ణు నందనుల స్ఫూర్తి తో :
రిప్లయితొలగించండి01)
____________________________________
ఏమీ కనబడ కున్నది
మామక నయనంబు శుక్ల - మధిక మగుటచే !
ఆమంత్రణ జేసి జనుల
రామ చరిత్రము , జదువగ - రాదు కుమారా !
_____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారి స్ఫూర్తితో :
రిప్లయితొలగించండిహిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో :
02)
___________________________________________
రాముడె శ్రీహరి గావున
రామ చరిత్రము జదువగ - రాదు కుమారా !
రాముని నామము పలికిన
నేమీ ఫలముండ బోదు - నిజమిదె , గనుమా !
___________________________________________
శాస్త్రి గారి స్ఫూర్తితో :
రిప్లయితొలగించండి03)
__________________________________________
రామా యని సతతము రఘు
రాముని ,హనుమే జపించి - రాక్షసు దునిమెన్ !
ఏ మాయయు నీ చెంతకు
రామ చరిత్రము జదువగ; - రాదు కుమారా !
__________________________________________
మిస్సన్న గారు , మీ వివరణ సంపూర్ణం. నత సుత్రాముడు = నతః సుత్రామః యస్య సః , ఎవనికి ఇంద్రుడు నమస్కరించునో వాడు , విష్ణువు అని వ్యుత్పత్తి.
రిప్లయితొలగించండిఇకపోతే యిది బహువ్రీహి సమాసం . మీకు తెలిసినట్టుగానే ' అన్య పదార్థ ప్రధానః బహువ్రీహిః '
సమాసం లో నుండే యే ఒక్క పదానికీ గాక మూడో పదానికి ప్రాముఖ్యత యిక్కడ..
నతః కాదూ , సుత్రామః కాదు , విష్ణువు వచ్చి చేరాడన్న మాట.
ఇకపోతే కొన్ని సందర్భాలలో ఈ సమాసాన్వయం లో పొరబడే ప్రమాదాలున్నాయి.
జిత రావణుడు సీతాదేవిని పెండ్లాడెను అంటే అదేమీ? రావణుడు సీతమ్మను పెండ్లాడెనా అని భ్రమపడే అవకాశాలు ఉన్నాయి కదా.....
జితః రావణః యేన సః = ఎవని చేత రావణుడు గెలవబడెనో వాడు (రాముడు) అని విగ్రహ వాక్యం చెప్పుకుంటే ఇంతేనా అనిపిస్తుంది ఇదే సమస్యా పూరణకు గానూ వినియోగించుకోవచ్చు జిత మూడవపాదంలో వేసుకుని.
మొత్తానికి చాలా గడసరి ప్రయోగం చేశారు . అభివాదాలు . నన్నంటూ ఆమంత్రించారు కాబట్టి ఈ మాత్రం వివరణ. ధన్యవాదాలు .
వసంత మహోదయా ! హృద్యమైన మీ పద్యానికి ధన్యవాదాలు . గన్నవరపు వారన్నట్టు , మీ మనసు కడు మెత్తనిది . మందూమాకులవసరం లేనిదే లెండి. :)
రిప్లయితొలగించండిప్రేమలు కరువయ్యె నిపుడు
రిప్లయితొలగించండికామ క్రోధములు పెరిగి కామాంధు లయెన్ !
నీమములు వీడి నిలలొ
రామ చరిత్రముఁజదువఁగ రాదు కుమారా !
04)
రిప్లయితొలగించండి___________________________________________
హోమము జేయుట పాపము !
రామ చరిత్రము జదువగ - రాదు కుమారా !
కామము నెన్నడు విడువకు !
స్వామీ ! యిటు జెప్ప ; పూత - సత్యం బగునా ?
___________________________________________
పూత = అసత్యము
___________________________________________
05)
రిప్లయితొలగించండి_________________________________________
భామను నెత్తుకు పోయిన
పామరుడా రావణుండు - పరమ పదించెన్ !
ఏ మాత్రము పాప మిలను
రామ చరిత్రము జదువగ; - రాదు కుమారా !
_________________________________________
06)
రిప్లయితొలగించండి__________________________________________
ఆ మాయావిని రావణు
సామూహికముగ వధించు - సాహసి కథలన్
కామము నశించు ! పాపము
రామ చరిత్రము జదువగ; - రాదు కుమారా !
___________________________________________
కిశోర్ జీ... వివిధ విధ పూరణలు ముచ్చటగా ఉన్నాయి.నాదొక సందేహం.హిరణ్య కశ్యపుని కాలంలోనే రామచరిత్రము ఉన్నదా?ప్రహ్లాదుని చదవద్దని అన్నాడా?
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
శాస్త్రిగారూ ! శుభోదయం !
రిప్లయితొలగించండిమీ సందేహం సమంజసమే !గాని
సమస్యా పూరణలో
తర్కానికి తావుండదేమో !
మనకు తెలిసినంత వరకూ
ఆ కాలంలో రాముడు లేడు మరి !!!!
అదే శ్రీ కృష్ణు డైతే గోలోక కృష్ణుడనీ
అదనీ ఇదనీ చాలా చోట్ల అనేక కాలాల్లో ఉన్నాడు !
అలాగే గోలోక రాము డెక్కడైనా ఉన్నాడేమో
తెలిసిన వాళ్ళెవరైనా చెప్పాలి !
విష్ణు నందను గారూ! కడుంగడు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిబహువ్రీహి సమాసం గురించి చాల చక్కని వివరణ ఇచ్చారు.
నేనైతే నా అల్ప పరిజ్ఞానంతో 'నతసుత్రాముడు' తృతీయా తత్పురుష
సమాసమేమో అనుకొన్నాను. బడి చదువులు మరుగున పడిపోతున్నాయి.
మరొక్క సారి ధన్యవాదములు.
కిశోర్ మహోదయా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ సందేహానికి చాల చక్కటి పరిజ్ఞానాన్నిచ్చే సమాధానం ప్రసాదించారు విష్ణు నందనులు.
మీ కూలంకష పరిశీలన ఎంతోమందికి జ్ఞానవృద్ది చేస్తూ ఉపయోగకరంగా ఉంటోంది.
ఇదంతా ఇంతకీ గురువుగారి చాలవ. వారికి నమస్సులు.
మీ పరిశీలన కొనసాగించండి.
అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండినిన్న ఉదయం ఒక పెళ్ళికి వెళ్ళి ఇంతకు ముందే ఇల్లు చేరాను. అందరి పూరణలు, వాటిపై మిత్రుల స్పందనలు, ప్రశంసలు, సందేహాలు, వివరణలు అన్నీ చూసి సంతోషించాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారు, మంద పీతాంబర్ గారు, మిస్సన్న గారు, డా. విష్ణు నందన్ గారు, జిగురు సత్యనారాయణ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, వసంత్ కిశోర్ గారు, ఊకదంపుడు గారు, రాజేశ్వరి నేదునూరి గారు ..... అందరి పూరణలు వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి.
"నత సుత్రాముడు", ప్రహ్లాదుని రామాయణ పఠనం తదితరాంశాల చర్చ ఉల్లాసంగా సాగింది.
ఎలాగూ పరస్పర గుణదోష సమీక్షలు జరిగాయి కనుక సమయాభావం వల్ల నేను విడివిడిగా మీ పూరణలను ప్రస్తావించకుండ అందరికీ సామూహికంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ధీమంతుడు కాంగ్రెసులో
రిప్లయితొలగించండిగోముగ పప్పూను గొల్చి గొప్పగ జారెన్
భీముడు రమేషు డా జై
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోముగ యశమును కోరుచు
రిప్లయితొలగించండినామముకై వ్రాసినట్టి నాస్తిక రచనౌ
భామది ముప్పాళమ్మది
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా!