మేయ వలయు గడ్డి - మేదిని మనుజులు ! చేయ వలయు గురువు - శిష్య పూజ ! తాగ వలయు తండ్రి - తనయుతో మధువును ! అన్న తప్పు గాదె ! - నార్యులార ! ________________________________________
కిశోర్ జీ ధన్యవాదాలు. మీ పద్య ప్రవాహానికి ఎవ్వరూ సాటి రారు.అంబుదము, స్రవంతి, ప్రభంజనము ఒకటేమిటి ఎలాగైనా వర్ణించ వచ్చు. హరిగారూ హనుమఛ్చాస్త్రి గారూ బాగున్నాయి మీ మీ పద్యాలు. రాజేశ్వరి గారూ అద్భుతంగా ఉంది మీ పూరణ.
మా గురువుగారు కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్య సమస్యా పూరణంగా కాకుండా, సహజంగానే ఎన్నో ఏళ్ళ క్రింద వ్రాసిన ఒక పద్యంలోని నాలుగవ పాదం ఇది. ఆ పద్యం ... "అహము కొంత లేక, ఆత్మ వంచన లేక గొప్ప ఎంతయున్న గురువు కాడు! శిష్యుడగుట సులువు జిజ్ఞాస యున్నచో చేయవలయు గురువు శిష్య పూజ! " ఈ పద్య పాదాన్నే చమత్కారంగా సమస్యగా సూచించిన కోడీహళ్ళి మురళీమోహన్ గారిని అభినందిస్తున్నాను.
కవి మిత్రులకు నమస్కృతులు. కార్యార్థినై నేను వరంగల్ వచ్చి ఉన్నాను. ఈ మూడు రోజులూ ఇక్కడే. అవకాశం దొరికినప్పుడల్లా బ్లాగు చూస్తూ ఉంటాను. మీ పూరణలు, వ్యాఖ్యలు, విశ్లేషణలను కొనసాగించండి. ఏదో ఒక సమయంలో ప్రతి రోజూ సమస్యలైతే ఇస్తూ ఉంటాను. మన్నించమని కోరుతూ .... మీ కంది శంకరయ్య.
డా.ఆచార్య ఫణీంద్ర గారూ, శ్రీమాన్ నండూరి రామకృష్ణమాచార్యుల వారి మనోహరమైన పద్యము పంచుకొన్నందులకు కృతజ్ఞతలు. ఈ పద్యము శ్రీ రామకృష్ణమాచార్యుల వారి వ్యక్తిత్వమునకు దర్పణము.
కిశోర్ జీ శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు వారు విశిష్ట భావములు గల పుణ్యపురుషులు. వారి కవితలను అందజేస్తున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి మరోసారి కృతజ్ఞతాభివందనలు.
శ్రీని వాసు జేయ,చిక్కుల లెక్కలు; కూర్చ దలచి బాగ, కూలి పోయె గురువు పరువు బోయె గుట్టు గుండె; చేయవలయు గురువు శిష్యపూజ. (శ్రీనివాస రామనుజనుకు గురువు పాఠశాలలో చిత్ర విచిత్రమైన లెక్కలిచ్చి ఆయన చేత గాదు అనిపించాలని పలుమార్లు ప్రయత్నం జరిగిందట. ఒక సారి 1 నుండి 100 వరకు కూడి తెమ్మంటే, ఒకే నిముషం లో సమధానం చెప్పాడట. 1+100 = 101, 2+99 =101 ఇల 50+51 = 101 మొత్తం 50 జతలు 50 ని 101 తో గుణించి 5050 అని జవాబు చెప్పగానే గురువు అవాక్కయ్యాడట. ఆసక్తి దాయకమని ఇచ్చాను. తప్పైతే క్షమించండి.)
అందరికీ నమస్కృతులు. ఇప్పుడే హైదరాబాదు చేరుకున్నాను. అందరూ ఒకరిని మించి మరొకరు చక్కని పూరణలు అందించారు. అందరికీ అభినందనలు. ప్రయాణపు అలసట వల్ల పూరణలను ప్రత్యేకంగా, సమగ్రంగా పరిశీలించలేక పోతున్నాను. మన్నించండి. రేపు తీరిగ్గా చూసి వ్యాఖ్యానిస్తాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
_______________________________________
మేయ వలయు గడ్డి - మేదిని మనుజులు !
చేయ వలయు గురువు - శిష్య పూజ !
తాగ వలయు తండ్రి - తనయుతో మధువును !
అన్న తప్పు గాదె ! - నార్యులార !
________________________________________
02)
రిప్లయితొలగించండి________________________________________
శిష్యు లనగ నెవరు - స్థిరముగ గురువును
దలచి మ్రొక్కు వారె ! - ధర్మ మిదియె !
కళ్ళు బోవు నయ్య ! - కాలధర్మము మార్చి
చేయ వలయు గురువు - శిష్య పూజ !
(యటన్న)
________________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి03)
రిప్లయితొలగించండి_______________________________________
కడుపు జీల్చి వచ్చె - కచుడంత శుక్రుని !
ప్రాణ మిచ్చి బ్రోచె - పరమ గురుని !
ప్రాణ మిచ్చు వాడు - పరమాత్మ గావున
చేయ వలయు గురువు - శిష్య పూజ !
_______________________________________
రాజకీయాలలో :
రిప్లయితొలగించండిఅన్నదమ్ము డైన ననుగు శిష్యుడు నైన
పీట లాగి పిదప పీఠ మెక్కు
చదువు జెప్ప, ఫలము పదవికి నష్టమౌ
చేయవలయు గురువు శిష్య పూజ !
కత్తి చూపి గురువు గజగజ వణకంగ
రిప్లయితొలగించండిచూచి వ్రాసు కొనిరి శిష్య గణము.
గురువు లన్న నిపుడు గోడకుర్చీలు వేయుచు
చేయ వలయు గురువు శిష్య పూజ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిశిష్యుడేగురువుకు చెప్పక తనకుతా
చేయవలయు, గురువు శిష్య పూజ
గాని, దక్షిణలను గాని యిమ్మనుచును
కోరడెపుడు, గురువు గొప్ప వాడు.
మూర్తి గారూ !
రిప్లయితొలగించండిఅదిరింది మీ పూరణ !
అబ్బ ! మీకు మీరే సాటి !
మీకు రెండు వీర తాళ్ళు !
(ప్రస్తుతం లేవు గాని వచ్చాక యిస్తాను !)
పీట లాగి పీఠ మెక్కడం !
వ్వావ్ ! simply superb !
అక్కాయ్! బావుంది !
కాని గణములు ,యతి సరి చూచుకుంటే
ఇంకా బావుంటుంది !
గురువు గారికి శ్రమ తగ్గుతుంది !
04)
_______________________________________
శిష్య గురు లిరువురు - శిక్షణా లయమున
శిక్షకులుగ జేర - శిష్యు డేను !
సమము నా కిరువురు ! - సమయోచితము గాన
చేయ వలయు , గురువు; శిష్య; పూజ !
_______________________________________
ధనము నాశ పడక దాపరిక మదిలేక
రిప్లయితొలగించండివిద్య నొసగు గురువు వింత నేడు
ఫీజు గట్ట కున్న వెళ్ళగొట్టును నేడు
చేయవలయు గురువు శిష్యపూజ.
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిఆబ్దికదినమునకు అవసరార్ధమువచ్చె
శిష్యు డొకడు గురువు చెప్పగానె,
భోక్త యతడు గాన భక్తితో తప్పక
చేయవలయు గురువు శిష్య పూజ.
గురువుగారూ నమస్కారములు. మీరు విశ్రాంత పండితులు.మహరాజులు,
రిప్లయితొలగించండియీ పూరణలు చేస్తున్నందులకు మన్నించండి.
అతని తండ్రి పెద్ద యధికారి యైనచో
తాత ఖర్మకాలి నేత యైన
తల్లి మంత్రి యౌర ! ఒల్లని చిత్తమ్ము
చేయవలయు గురువు శిష్య పూజ !
కిశోర్ జీ ధన్యవాదాలు. మీ పద్య ప్రవాహానికి ఎవ్వరూ సాటి రారు.అంబుదము, స్రవంతి, ప్రభంజనము ఒకటేమిటి ఎలాగైనా వర్ణించ వచ్చు.
రిప్లయితొలగించండిహరిగారూ హనుమఛ్చాస్త్రి గారూ బాగున్నాయి మీ మీ పద్యాలు. రాజేశ్వరి గారూ అద్భుతంగా ఉంది మీ పూరణ.
హరి గారూ ! బావుంది !
రిప్లయితొలగించండిశాస్త్రి గారూ !
సమయోచితముగా నున్నది మీ పూరణ !
మూర్తి గారూ !
ఏమిటీ గందరగోళం !
మీ రెండవ పూరణ మింగుడు పడడం లేదు
కొంచెం మీ భావాన్ని విడమరిస్తే
ఆనందించడానికి వీలవు తుంది
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండి"లక్ష్మి పూజ నిపుడు లక్షపూవులతోడ
చేయవలయు" గురువు "శిష్య! పూజ
కొరకు తగిన పూలు కొనితెమ్ము" అనిచెప్ప
సంతకేగి తేగ సంతసించె.
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిచిన్ననాటి తనదు శిష్యుండు యొకనికి
ప్రీతి పుత్రి నిచ్చి పెండ్లి చేయ
వరుడు యతడు గాన,గురువు నేననకను
చేయవలయు గురువు శిష్య పూజ.
అయ్యా యిది అమెరికా తెలుగేమో !. శిష్యుని బంధు జనులు పెద్ద పదవులలో ఉంటే గురువులకు శిష్య పూజ తప్పదని నా భావము.
రిప్లయితొలగించండిమూర్తిగారూ !
రిప్లయితొలగించండిఇప్పుడు తేట తెల్లమయింది
మీ భావన ! బావుంది !
శాస్త్రి గారూ !
మీ లక్ష్మీ పూజ !బావుంది !
శిష్యుణ్ణి వరుణ్ణి జేసిన విధమూ బావుంది!
05)
______________________________________
చిన్న వాడు తనదు - అన్నకు గురువైన
మెచ్చుకొందు రిలను - హెచ్చుగాను !
తరుణ మొకటి వచ్చు - దహరుకు దప్పదు !
చేయ వలయు గురువు - శిష్య పూజ !
______________________________________
దహరుడు = తమ్ముడు
______________________________________
06)
రిప్లయితొలగించండి______________________________________
హనుమకు గురు వయ్యె - నంబర రత్నము !
అజుని యంశ గాదె - హనుమ యనగ !
రుద్రు డేమొ గురువు - లోక రక్షకునకు !
చేయవలయు గురువు - శిష్య పూజ !
______________________________________
07)
రిప్లయితొలగించండి_______________________________________
హరియు (1)గురువు గాదె - నాది శేషునకును
శేషుడు (2)గురువయ్యె - శ్రీ కృష్ణ మూర్తికి
(2)గురువు గార వించ - (3)గురువుకు దగునయ్య !
చేయ వలయు గురువు - శిష్య పూజ !
_______________________________________
(1)గురువు = గొప్ప
(2)గురువు = అన్న
(3)గురువు = అలఘువు = హరి
_______________________________________
మా గురువుగారు కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్య సమస్యా పూరణంగా కాకుండా, సహజంగానే ఎన్నో ఏళ్ళ క్రింద వ్రాసిన ఒక పద్యంలోని నాలుగవ పాదం ఇది. ఆ పద్యం ...
రిప్లయితొలగించండి"అహము కొంత లేక, ఆత్మ వంచన లేక
గొప్ప ఎంతయున్న గురువు కాడు!
శిష్యుడగుట సులువు జిజ్ఞాస యున్నచో
చేయవలయు గురువు శిష్య పూజ! "
ఈ పద్య పాదాన్నే చమత్కారంగా సమస్యగా సూచించిన కోడీహళ్ళి మురళీమోహన్ గారిని అభినందిస్తున్నాను.
నంద సుతుఁడె గురువు నారద మౌనికి,
రిప్లయితొలగించండివ్యాస తాప హారి, భక్తి సూత్ర
దాత, ధాత సుతుడు, దైవర్షి యగుటచే
చేయవలయు గురువు శిష్యపూజ.
కవి మిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండికార్యార్థినై నేను వరంగల్ వచ్చి ఉన్నాను. ఈ మూడు రోజులూ ఇక్కడే. అవకాశం దొరికినప్పుడల్లా బ్లాగు చూస్తూ ఉంటాను. మీ పూరణలు, వ్యాఖ్యలు, విశ్లేషణలను కొనసాగించండి. ఏదో ఒక సమయంలో ప్రతి రోజూ సమస్యలైతే ఇస్తూ ఉంటాను.
మన్నించమని కోరుతూ ....
మీ
కంది శంకరయ్య.
konchem kastamina samsya aina okariki minchi marokaru aneka vidhamuluga purinchi na vidhanam potapotee ga sagutu anandanni kalugachestunnadi. namassulato...srinivas, hyderabd
రిప్లయితొలగించండికంద పద్యమునకు కడపటి వర్ణము
రిప్లయితొలగించండిచేయవలయు గురువు శిష్య!పూజ
తీసి వైచి యుంచు పూజననే మాట
చక్క గాను కుదురు చెక్కి నట్లు.
డా.ఆచార్య ఫణీంద్ర గారూ, శ్రీమాన్ నండూరి రామకృష్ణమాచార్యుల వారి మనోహరమైన పద్యము పంచుకొన్నందులకు కృతజ్ఞతలు. ఈ పద్యము శ్రీ రామకృష్ణమాచార్యుల వారి వ్యక్తిత్వమునకు దర్పణము.
రిప్లయితొలగించండిమూర్తి గారూ !
రిప్లయితొలగించండిదీనిని గూడా తిలకింపుడు !
అత్యద్భుత మైన పద్యము !
*******************************************
అంతము చెందు; ఈ భువి స - మస్తము, సృష్టియు ,దిగ్దిగంత వి
శ్రాంత మశాశ్వతంబు , రవి - చంద్రుల తోడ ;మనుష్యు చావు , నో
వింత ఉదంతమా ? వికట - వేదన లెందుకు ? సర్వ తాప ని
ష్క్రాంత మవశ్య మంగళము !- చావొక స్వస్తి ; వర ప్రసాదమే !
*******************************************
నండూరి రామకృష్ణమాచార్యుల వారిదే !
ఆచార్యుల వారికి శతకోటి వందనములు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికిశోర్ జీ
రిప్లయితొలగించండిశ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు వారు విశిష్ట భావములు గల పుణ్యపురుషులు. వారి కవితలను అందజేస్తున్న డా. ఆచార్య ఫణీంద్ర గారికి మరోసారి కృతజ్ఞతాభివందనలు.
పూజ్యులు కృష్ణమాచార్యుల వారి పద్య రత్నాల నుటంకించి ఆహ్లాదాన్ని కల్గించిన ఆచార్యులవారికి, కిషోర్ గారికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశ్రీని వాసు జేయ,చిక్కుల లెక్కలు;
రిప్లయితొలగించండికూర్చ దలచి బాగ, కూలి పోయె
గురువు పరువు బోయె గుట్టు గుండె;
చేయవలయు గురువు శిష్యపూజ.
(శ్రీనివాస రామనుజనుకు గురువు పాఠశాలలో చిత్ర
విచిత్రమైన లెక్కలిచ్చి ఆయన చేత గాదు అనిపించాలని
పలుమార్లు ప్రయత్నం జరిగిందట. ఒక సారి 1 నుండి 100 వరకు
కూడి తెమ్మంటే, ఒకే నిముషం లో సమధానం చెప్పాడట.
1+100 = 101, 2+99 =101 ఇల 50+51 = 101 మొత్తం 50 జతలు
50 ని 101 తో గుణించి 5050 అని జవాబు చెప్పగానే గురువు
అవాక్కయ్యాడట. ఆసక్తి దాయకమని ఇచ్చాను. తప్పైతే క్షమించండి.)
అందరికీ నమస్కృతులు.
రిప్లయితొలగించండిసమయాభావం వల్ల పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను. 9-2-2011 వరకు ఇదే పరిస్థితి. నన్ను మన్నించండి.
అందరికీ నమస్కృతులు.
రిప్లయితొలగించండిఇప్పుడే హైదరాబాదు చేరుకున్నాను. అందరూ ఒకరిని మించి మరొకరు చక్కని పూరణలు అందించారు. అందరికీ అభినందనలు.
ప్రయాణపు అలసట వల్ల పూరణలను ప్రత్యేకంగా, సమగ్రంగా పరిశీలించలేక పోతున్నాను. మన్నించండి. రేపు తీరిగ్గా చూసి వ్యాఖ్యానిస్తాను.