2, ఫిబ్రవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 215 (వేదముఁ జదివిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.
ఈ సమస్యను పంపించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. కాదనివారింపవినక
    సాధనజేయకనెచటను స్వరయుక్తముగా;
    మీదన్,పాడ్యమి నాళ్లే ( లేక నాళ్లన్)
    వేదముఁ జదివిన, పురుషుఁడు వెధవగ మారున్.

    రిప్లయితొలగించండి
  2. కాదనలేకనెదండ్రిని,
    వేదనతోనిష్టమైనవిద్యను బాసీ
    ఏదోయొకటను పెనుని
    ర్వేదముఁ జదివిన పురుషుఁడు, వెధవగ మారున్.

    రిప్లయితొలగించండి
  3. వేదముఁ గులీనుఁడు గురువు
    బోధనఁ సేయఁగఁ జదివినఁ బుణ్యము కలుగున్.
    కాదని స్వయముగ తానే
    వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి.

    జూదములాడుచు నాస్తిక
    వాదులదరిజేరి మాంసభక్షకుడై తా
    నేదరి నీమముపట్టక
    వేదము జదివినపురుషుడు వెధవగమారున్.

    రిప్లయితొలగించండి
  5. పేదని బాపని జాలిగ,
    వేదము గరుపగ తిరిగెను వెర్రిగ; యాహా!
    ఖేదమె మిగిలెను చివరకు
    వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు.
    ______________________________________

    ఊకదంపుడుగారూ ! బావుంది !
    పాడ్యమినాళ్ళు -కొంచెం వివరిస్తే
    ఇంకా బావుంటుందేమో !
    పెను నిర్వేదము ! శహభాష్ ! చాలా బావుంది !

    రవి గారు ! బావుంది !

    శాస్త్రి గారూ ! బావుంది !
    _______________________________________

    01)

    సాధన జేయని గాణుడు
    జూదము మరిగిన మనుజుడు - చూడుడిలన్
    వేదామ్నాయము నెరుగక
    వేదము జదివిన పురుషుడు - వెధవగ మారున్ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  7. వెంకటప్పయ్య గారూ ! బావుంది !
    నిజం చెప్పారు ! ఈ రోజుల్లో జరిగేదదే గదా !

    _________________________________________

    02)

    వాదన మరచిన లాయరు
    క్రోధము పై గొన్న క్రోధి - కూటము నందున్
    నాదము నించుక దెలియక
    వేదము జదివిన పురుషుడు - వెధవగ మారున్ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  8. 03)
    ________________________________________

    ఈదుట దెలియని దాశుడు !
    చోదన మెరుగని నియంత ! - చోక్షముగా నా
    స్వాదన లేకను , మరి మరి
    వేదము జదివిన పురుషుడు ! - వెధవగ మారున్ !
    ________________________________________

    దాశుడు = జాలరి
    నియంత = సారథి
    చోక్షము = సమర్థము
    _________________________________________

    రిప్లయితొలగించండి
  9. వేదముకాదరణ తరిగి
    భూదేవునకును తినుటకు బువ్వే కఱువై
    వీధిన పడిరిక విప్రుల్
    వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్.

    రిప్లయితొలగించండి
  10. జి యస్ జీ ! నిజం !
    వేదం పరిస్థితి కళ్ళకు కట్టే టట్టు చూపారు ! బావుంది !

    రిప్లయితొలగించండి
  11. వేదభువినందు మార్కొని
    ఆదేశముతోప్రబలగ ఆంగ్లపు విద్యల్
    ఛీ!దానిమాయననిరే-
    "వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్."

    రిప్లయితొలగించండి
  12. ఊకదంపుడు గారూ ! బావుంది !
    కాని ఈ మార్కొనీ ఎవరో ???

    రిప్లయితొలగించండి
  13. మిత్రులకు చిరు కానుక!
    _____________________________________

    @@@@@వేమన పద్య దశకము@@@@@
    ______________________________________

    01)

    చెప్పులోని రాయి ! - చెవిలోని జోరీగ !
    కంటి లోని నలుసు ! - కాలి ముల్లు !
    ఇంటి లోని పోరు - ఇంతింత కాదయా !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    02)

    అల్పు డెపుడు బల్కు - నాడంబరము గాను !
    సజ్జనుండు పలుకు - జల్ల గాను !
    కంచు మ్రోగు నట్లు - కనకంబు మ్రోగునా ?
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    03)

    ఎంత చదువు చదివి - యెన్నిటి విన్నను
    హీను డవ గుణంబు - మాన లేడు !
    బొగ్గు పాల గడుగ - బోవునా నైల్యంబు !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    04)

    ఓగు నోగు మెచ్చు - నొనరంగ నఙ్ఞాని
    భావ మిచ్చి మెచ్చు - బరమ లుబ్ధు !
    బంది బురద మెచ్చు - బన్నీరు మెచ్చునా !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    05)

    కసవు దినును గాదె - పసరంబు లెప్పుడు
    చెప్పి నట్లు వినుచు - జేయు బనులు !
    వాని సాటి యైన - మానవు డొప్పడా ?
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    06)

    కసవును దినువాడు - ఘన ఫలంబుల రుచి
    గాన లేడు గాదె ! - వాని యట్లు
    చిన్న చదువు లకును - మిన్న ఙ్ఞానము రాదు !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    07)

    పొట్ల కాయ రాయి - పొదుగ ద్రాటను గట్ట
    లీల తోడ వంక - లేక పెరుగు !
    కుక్క తోక గట్ట - గుదురునా చక్కగా ?
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    08)

    ఎలుగు తోలు తెచ్చి - యెన్నాళ్ళు నుదికిన
    నలుపు నలుపె గాని - తెలుపు కాదు !
    కొయ్య బొమ్మ దెచ్చి - కొట్టిన పలుకునా ?
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    09)

    గంగి గోవు పాలు - గంటె డైనను చాలు !
    కడవె డైన నేమి - ఖరము పాలు !
    భక్తి గల్గు కూడు - పట్టె డైనను చాలు !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !

    10)

    నిక్క మైన మంచి - నీల మొక్కటి చాలు !
    తళుకు బెళుకు రాలు - తట్టె డేల !
    చదువ పద్య మరయ - జాలదా యొక్కటి !
    విశ్వ దాభి రామ - వినుర వేమ !
    ___________________________________

    @@@@@(వేమన శతకము నుండి)@@@@@
    ____________________________________

    రిప్లయితొలగించండి
  14. వ్యాధులు దెలియును నాయు
    ర్వేదము జదివిన!! పురుషుడు వెధవగ మారున్
    బాధలు కలిగించుజనా
    మోదము లేనట్టి పనుల మురుయుచు జేయన్!

    వేదన మూలము దెలియును
    వేదము జదివిన !!పురుషుడు వెధవగ మారున్
    ఖేదము గలుగించెడు చెడు
    వాదమ్మును జేయగాను వసుధన నెపుడున్ !

    రిప్లయితొలగించండి
  15. వేదము లిపుడలవి కాదట
    బాధలు వేధించ గలవు బహురీతులటన్ !
    పేదకు లేదన విలువయు
    వేదము జదివిన పురుషుడు వెధవగ మారున్ !

    రిప్లయితొలగించండి
  16. పీతాంబరధరా !
    మీ రెండు పూరణలూ బాగున్నవి !

    రాజక్కాయ్ !
    మీ పూరణ కూడా బావుంది !
    కాని మొదటి పాదంలో ఒక అక్షరం ఎక్కువైనట్లుంది !
    గురువు గారున్నారుగా !

    రిప్లయితొలగించండి
  17. వసంత్ కిషోర్ గారూ, పాడ్యమి నాళ్లలో చదివితే చదువు రాదట. "విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు"లో విశ్వనాధవారు చెప్పిన మాట.

    మార్కొని తప్పే, మెకాలే అన్న విషయమ్ మరచి మార్కొని అన్నాను.
    సవరించిన పద్యం మళ్లా ఇక్కడ రాస్తున్నాను. ధన్యవాదములు.

    వేదభువిలోమెకాలే
    ఆదేశముతోప్రబలగ ఆంగ్లపు విద్యల్
    ఛీ!దానిమాయననిరట-
    "వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్."

    రిప్లయితొలగించండి
  18. తమ్ముడు గారూ ! మీరు ఒక్క అక్షరమె ఎక్కువన్నారు కానీ నాకనిపిస్తుంది "మొదటి పాదం మొత్తంలొ " [ వేదములు + ఇపుడు + అలవికానిది + అట ]" ఇందులొ ఎన్ని యెడాగమాలొ ,ఎన్ని లుప్తములొ,ఇంకెన్ని ఆగమములొ ? బాబోయ్ చందస్సు.

    రిప్లయితొలగించండి
  19. ఊకదంపుడు గారూ !
    ఔనా !అది విశ్వనాథ వారు చెప్పిన మాటయా ?
    నేనది చదివి పాతికేళ్ళు పైనే అవుతుంది.
    ఆ పుస్తకం ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా???
    అసలది net లో అందరికీ అందుబాటులో ఉండవలసిన పుస్తకం !

    అక్కయ్యా ! నీకు పాదాభివందనం !
    నోరారా తమ్ముడూ అని పిలుస్తూ మళ్ళీ ఆ గారెందుకు !! వద్దు !
    తియ్యగా తమ్ముడూ అని పిలిస్తే చాలు!

    అక్కాయ్ ! నీకు భయమెందుకు !
    మొదట్లో అందరం నీలాగ వ్రాసిన వాళ్ళమే!
    వేమన్న గారేమన్నారు ?? మనలాంటి వాళ్ళ కోసమే!

    "అనగ ననగ రాగ - మతిశయించుచు నుండు
    పెనగ పెనగ సతికి - ప్రేమ బుట్టు !
    తినగ తినగ వేము - తియ్యనై యుండురా!
    విశ్వదాభి రామ - వినుర వేమ !"
    ( వేమన శతకం నుండి )

    సి*నా*రె* ఏమన్నారు?
    "బిందువు బిందువు కలిసి సింధువౌతుంది"ఔనా !!!

    మరి అదేదో సినిమాలో ఆయనెవరో ఏమన్నారు?

    "చినుకులా రాలి
    నదులుగా మారి
    వరదలై పొంగి"
    అన్నారు గదా !!!

    ఇంకో సినిమాలో ఇంకో ఆయన
    " ఎదగడాని కెందుకురా తొందరా " అన్లేదూ !!

    తప్పులు చేస్తేనే గదా ! అవి తప్పులని తెలిసేది !!!
    తప్పు చేస్తాం !దిద్దుకుంటాం ! మెల్ల మెల్లగా నేర్చు కుంటాం !!

    బిందువు ల్లాంటి మన మందరం
    కలసి ఏ నాటి కైనా సింధువుగా మారతాం!

    చివరిగా ఒక్క మాట !
    పాతాళ భైరవి లో తోట రాముడే మన్నాడు ?
    "ధైర్యే సాహసే లక్ష్మీ" అన్నాడు గదా !!!
    అందు చేత ధైర్యంగా నీకు నచ్చింది వచ్చింది వ్రాసెయ్ !
    ఆ పైన శంకరులెలాగూ ఉండనే ఉన్నారు గదా!!!!!

    రిప్లయితొలగించండి
  20. ఊకదంపుడు గారూ,
    మీ మూడు పూరణలూ విభిన్నాంశాలతో బాగున్నాయి. స్వయంగా దోష సవరణ చేసికొన్నారు. సంతోషం! అభినందనలు.

    రవి గారూ,
    నిజమే! ఊకదంపుడు గారు చెప్పినట్లు వేదం గురుముఖతః స్వరయుక్తంగా నేర్వ వలసిందే. ఆ విషయాన్ని మీ పూరణలో స్పష్టంగా చెప్పారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    "గుణనిధి"ని అచ్చంగా మీ పూరణలో దించారు. బాగుంది. అభినందనలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    ఈ కాలంలో వేదం నేర్పి పొట్టపోసుకోవా లనుకొన్నవాడు వెధవే అవుతాడు. పూరణ బాగుంది. అభినందనలు.
    "పేదని బాపడు" అనేది "పేద ద్విజన్ముఁడు" అయితే?

    రిప్లయితొలగించండి
  21. వసంత్ కిషోర్ గారు, ఆ పుస్తకం net లో వెతికితే దొరకవచ్చు. లేకపోతే నాకు వేగు పంపండి.

    రిప్లయితొలగించండి
  22. వసంత్ కిశోర్ గారూ,
    ముందుగా నా పక్షాల మిత్రుల పూరణలను పరామర్శిస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం! "జూదము మరిగిన చెడు మనుజుడు చూడు డిలన్" అన్నా, "జూదము మరిగిన మనుజుడు చూడంగ నిలన్" అన్నా సరిపోతుంది.

    జిగురు సత్యనారాయణ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    "వేదమునకున్ + ఆదరణ" అని పదవిభాగం. "వేదము కాదరణ" అనరాదు. దానికి "వేదమునకు వన్నె తరిగి" అని నా సవరణ.

    రిప్లయితొలగించండి
  23. మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "ద, ధ"లకు ప్రాసమైత్రి కూర్చారు. దధప్రాస కొందరు ప్రసిద్ధ కవులూ ప్రయోగించిన మాట వాస్తవమే కాని ... బాగుండదు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పూరణ బాగుంది. వసంత్ కిశోర్ గారు చెప్పారు కదా. మొదటి పాదంలో గణదోషం!
    "వేదము లిపుడయె చులకన" అందామా?
    మీరు కూడా దధప్రాస వేసారు.

    రిప్లయితొలగించండి
  24. జూదము విలాస పానపు
    ఖేదము మితిమీరి తాను ఖిన్నుండగుచున్
    రోదన జేయుచు కొక్కొక
    వేదముఁ జదివి పురుషుఁడు వెధవగ మారున్

    వేదము : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Meaning
    n.
    1. knowing, knowledge;

    రిప్లయితొలగించండి
  25. శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. సేద గనక నలుగురితో
    ఖైదిగ డయమండు స్పేడు క్లావరు హార్టుల్
    చేదగు నాలుగు ముఖముల
    వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్

    రిప్లయితొలగించండి