25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 237 (వాజపేయిని శ్రీదేవి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె.

11 కామెంట్‌లు:

  1. వాజపేయంబు నొకఁడు సంపదలకొఱకు
    సలుపఁ దలపెట్టె దానికై సక్రమముగ
    ఋత్విజులు సోమరసముతో నిష్టిఁ జేయ
    వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె

    రిప్లయితొలగించండి
  2. క్రమాలంకారం వాడుకోవటం పెద్దగా రుచించక పైరీతిగా పూరించానండీ.

    రిప్లయితొలగించండి
  3. వాజ పేయముల్ జేసిన ఫలిత మేమి?
    ఎపుడు అశ్వాల వధియించి ఎరుకగన్న
    వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె?
    మేలు బోనీకపూరు ఆ మేర కైన

    రిప్లయితొలగించండి
  4. రాఘవ గారూ,
    కడు చక్కని పూరణ. అభినందనలు.

    హరి గారూ,
    చమత్కార భరితమైన పూరణ మీది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి.

    ప్రజలు మెచ్చగ ఒకనాడు వలచి వచ్చె
    భరత భూమికి ప్రధాన మంత్రి పదవి
    వాజపేయిని; శ్రీదేవి వలచి వచ్చె
    భర్త గానెంచి బోనీని బాలివుడున.

    రిప్లయితొలగించండి
  6. జనత మెచ్చిన నేతకు జయము గలిగి,
    భరత భువినేలు భాగ్యమ్ము మరల గలుగ
    పిలిచె నాడు కలాముడు ప్రియము గొలుప
    వాజపేయిని ,శ్రీదేవి వలచి వచ్చె!

    (కలాముడు =అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారు .
    శ్రీదేవి = కీర్తికాంత.)

    రిప్లయితొలగించండి
  7. సత్త్వ సంపన్న ధీశాలి చతురుడును
    వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె
    పదవి రూపాన, పదవికి వన్నె దెచ్చె
    మచ్చ లేనట్టి చరితను మాన్యు డగుచు.

    రిప్లయితొలగించండి
  8. చలన చిత్ర నిర్మాణంపు సంస్థ నిలిపి,
    వాజపేయమ్ము వోలె వ్యాపార వృత్తి
    నిర్వహణము సాగించు ’బోనీ కపూరు’
    వాజపేయిని ’శ్రీదేవి’ వలచి వచ్చె!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి భావంతో పరణ చేసారు. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం, యతిదోషం రెండూ ఉన్నాయి.
    "భరత భూమి ప్రధానియౌ భవ్య పదవి" అందాం.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం ....పాదాంతంలో "చతురుఁ డైన" అంటే సరి!

    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ఉత్తమ మైన పూరణ మీది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. శంకరం మాస్టారు గారూ ..గణ దోషమును గమనించలేదు. సవరణ తెలియజేసినందులకు ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ గణ దోషమును గమనించలేదు. సవరణ తెలియజేసినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి