చంపకమాల మేటియగు చక్కని ఉత్పలమాల పై నెటుల్ చంపకమాలలో మొదటి జంట లఘుద్వయ మందు గుర్వుతో చంపకమాల మారుగద జక్కగ ఉత్పల మాల రూపుగా చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.
చంపకు మిట్లు నన్ను , నొక చక్కని పద్యము నేర్చి కూర్చి నా కింపును గూర్పలేవె? యిది యేమిటి ? ఛందము నేర్వలేదె ? ఈ 'చంపక ' మన్న నీ పదము చక్కగ దొల్లి పదమ్ము జేయగా చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్ !!!
(చంపకమనే పదాన్ని తొలి పదముగా చంపక మాలలో ఎలా వాడాలా అని తంటాలు పడుతోన్న విద్యార్థితో అతని గురువు - చంపకమనే పదం తొలి పదం గా వాడడానికి చంపకమాల ఎందుకు ? ఉత్పలమాలలున్నాయి కదా ఆ మాత్రం తెలీదా అంటూ !!!)
(రెండు గురువులను వెంట వెంట వ్రాయాలంటే చంపక మాల పనికి రాదు. ఉత్పల మాలయితే ఒక గురువును పాదము చివరలోను రెండవ గురువును తరువతి పాదము మొదటి అక్షరముగా వేసి "UU" ని సాధించవచ్చు.)
చంపకమాల మేటియగు చక్కని ఉత్పలమాల పై నెటుల్
రిప్లయితొలగించండిచంపకమాలలో మొదటి జంట లఘుద్వయ మందు గుర్వుతో
చంపకమాల మారుగద జక్కగ ఉత్పల మాల రూపుగా
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.
చంపకు మిట్లు నన్ను , నొక చక్కని పద్యము నేర్చి కూర్చి నా
రిప్లయితొలగించండికింపును గూర్పలేవె? యిది యేమిటి ? ఛందము నేర్వలేదె ? ఈ
'చంపక ' మన్న నీ పదము చక్కగ దొల్లి పదమ్ము జేయగా
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్ !!!
(చంపకమనే పదాన్ని తొలి పదముగా చంపక మాలలో ఎలా వాడాలా అని తంటాలు పడుతోన్న విద్యార్థితో అతని గురువు - చంపకమనే పదం తొలి పదం గా వాడడానికి చంపకమాల ఎందుకు ? ఉత్పలమాలలున్నాయి కదా ఆ మాత్రం తెలీదా అంటూ !!!)
విష్ణు నందన్ గారూ! ఎంత మనోహరమైన పూరణము!
రిప్లయితొలగించండిచంపక మాలలో లఘువు చక్కగ నిల్చును ముందు చూడగా
రిప్లయితొలగించండినింపగ నుత్పలంబుగను నేర్పున నిల్చును గుర్వు ముందుగన్
సొంపుగ వెంట వెంటగను జూప గురుద్వయమున్ గణాలలో
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.
(రెండు గురువులను వెంట వెంట వ్రాయాలంటే చంపక మాల పనికి రాదు. ఉత్పల మాలయితే ఒక గురువును పాదము చివరలోను రెండవ గురువును తరువతి పాదము మొదటి అక్షరముగా వేసి "UU" ని సాధించవచ్చు.)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఈ రోజు ఈనాడు దిన పత్రిక లో
రెండు చక్కని వ్యాసాలు
చదవడం జరిగింది
1)సినిమా మనది...పేరేమో పరాయిది
2)మన తెలుగుకు కొత్త వెలుగు
తెలుగు వాళ్ళంతా చదివి
క్షీణిస్తున్న తెలుగు భాష గురించి తీవ్రంగా ఆలోచించాలి !
అంతరిస్తున్న భాషల జాబితాలో చేరిన తెలుగు భాష
అతి త్వరలో ఆ జాబితా అగ్ర స్థానం వహిస్తుందని రెండో వ్యాసం సారాంశం !
తెలుగు సినిమాలకు ఇంగ్లీషు పేర్ల మీద దండ యాత్ర మొదటి వ్యాసం !
ఇదే నా పూరణకు ప్రేరణ !
ఈ పూరణకు ముందో వెనకో దయచేసి
ఆ వ్యాసాలు కూడా చదవండి !
01)
_______________________________________________
ఇంపొద వింపజేయు , మన - ఇక్షు, సుధా రస , తెల్గు మాటలన్
పెంపుగ చిత్ర రాజముల - పేర్లకు పెట్టుట మాని; దర్శకుల్
కంపును గొట్టెడి పలు , వి - కారపు పేర్లను పెట్టుచుండిరే !!!
చంపక మాలలేల ? కడు - చక్కని ఉత్పల మాల లుండగన్ !
_______________________________________________
చంపకమాలలోన తొలి స్థానములోని లఘుద్వయంబు తొ
రిప్లయితొలగించండిల్గింపగ, దానిచో - గురువునే యొకదానిని గూర్చ, నద్దియే
యింపుగ మారిపోయి కనిపించదె యుత్పలమాల పద్యమై!
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్!
ఇంపగు శారదాంబకును నీక్షణ తామర లీన గాంతులున్
రిప్లయితొలగించండినింపగు నాననమ్మదియు నీరజ మేని నవాంబుజోజ్వముల్
సొంపగు హస్తముల్ జలజ శోభిత కంఠము పాదపద్మముల్
చంపక మాల లేలఁ గడుఁ జక్కని యుత్పల మాలలుండగన్ !
ఆచార్యుల వారి పూరణ
రిప్లయితొలగించండిరమ్యముగా నున్నది !
మూర్తి గారి పూరణ
ముచ్చటగా నున్నది !
భక్తుడు భగవంతునితో :
02)
___________________________________________
చంపక పూవులన్ వనము - చౌర్యము దప్పదు మాలలల్లగన్ !
ఇంటికి దగ్గరే గలవు - ఇంపుగ చెర్వున నుత్పలమ్ములున్ !
సొంపుగ నీదుపూజ, కడు - చోద్యము జేసెద; గావు మమ్మిలన్ !
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పల మాల లుండఁగన్.
___________________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిన్న పిల్లల్ని ఇంగ్లీషుతో చంపే నర్సరీలకు మాన్పించి
రిప్లయితొలగించండితేనెలు చిల్కెడి తెలుగు భాష నేర్పించి
మాతృ భాషకు పట్టాభిషేక
మొనరించ వినతి :
03)
___________________________________________
చంపుచు నుంటిరే ,చిగురు - శాబము లన్నిట , నింగిలీషు తో !
సొంపుగ వీనులన్ సుధలు - సోకును , తీయని తెల్గు భాష ణన్ !
పంపకు డింక;నర్సరిల ! - పట్టము గట్టుడి; మాతృ భాషకున్ !
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పల మాల లుండఁగన్.
___________________________________________
చిగురు శాబము = చిన్న పిల్ల
___________________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండివివిధ రకాలుగా ఉత్పల మాల లల్లుచూ చక్కని పూరణలు చేస్తున్న కవి మిత్రు లందరకు అభినందనలు.
---------------------------------------
చంపకమాల లల్లితిని చక్కగ ఉత్పల మాల,లల్లితిన్
సొంపుగ రెండు పద్యములు చంపక, ఉత్పల,మాత పూజకై;
చంపకమాల వాడినది,చంపక మందున దోష ముండెగా
చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్.
ఇద్దరు సంతానమెందుకు, ఒక్కరు చాలు అన్న భావంతో, (రెండు లఘువులేల చంపకమాలలోలాగా ఒక్క గురువు చాలుగదా ఉత్పలమాలలోలాగా)
రిప్లయితొలగించండిదంపతులింట వాసిగ సదా యనురాగపు మాలలెన్నొ పెం
పందగ గూర్చు కాపురముఁ పండఁగ బిడ్డగ నందజాలరే
ఇంపుగ నొక్కరు? లఘువు లెన్నగ రెండు గలుంగునట్టులన్
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.
మిస్సన్న గారి పూరణ:
రిప్లయితొలగించండిచంపకముత్పలమ్ము తమ సౌరభ మం దెనలేనివయ్యు నీ
సంపెగ తావి మేటి యగు చయ్యన పెంచగ రాగ భావమున్
ఇంపుగ నూత్న దంపతుల, కీశున కర్పణ సేయు వేళలన్
చంపక మాల కన్న కడు జక్కన యుత్పల మాల చూడగన్!
శంకరార్యా !
రిప్లయితొలగించండిఇక్కడ ఉత్పల మాలలు ఎన్నాళ్ళు గానో
మీకోసం ఎదురు చూచు చున్నవి !
అవధరింపుడు !
బంపరు నిర్వదొక్కటివి బారులు తీరెడు నక్షరాలతో
రిప్లయితొలగించండికంపర మెత్తు తీరునను గాభర పెట్టుచు పాదపాదమున్
చంపుచు నాలుగౌ జగణ జంపులు కూర్చగ తల్లడించెడిన్
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్