వసంత్ కిశోర్ గారూ, మీ పూరణల పరంపరలో ఇప్పటికి చేరిన మూడింటిని చూసాను. అన్నీ బాగున్నాయి. మొదటిది అత్యుత్తమంగా ఉంది. రెండవ పూరణ మొదటి పాదంలో "నరకునిని" అనకుండా "అసురుఁ డైన నరకు నంతమొందిపఁగా" అంటే బాగుంటుంది కదా. అలాగే మూడవ పూరణలో "దుష్ట రావణాఖ్యు" అంటే బాగుంటుందని నా సలహా!
వసంత్ కిశోర్ గారూ, మీ నాల్గవ పూరణ అద్భుతంగా ఉంది. ఈ మద్య వీరతాళ్ళు రావడం లేదన్నారు కదా! మొదటి పూరణ కొకటి, నాల్గవ పూరణకు రెండు, వెరసి మూడు వీరతాళ్ళు మీకు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి విషయంతో పూరించారు. అభినందనలు. "పరుగున + వచ్చి" పరుగునొచ్చి అనడం సరి కాదు. "పరుగు తీసి వచ్చి" లేదా "పరుగుతోడ వచ్చి" అనండి. "శ్రీతొ" అనడమూ సరికాదు. "రక్ష సేయ శ్రీవిరాజితుం డగుచు ముం" అంటే ఎలా ఉంటుంది?
వసంత్ కిశోర్ గారూ, మీ "లేటెస్ట్" నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. 5వ పూరణలో చమత్కారం అలరించింది. "గడ్డము" అంటే సరిపోతుండగా "గెడ్డము" అన్నా రెందుకు? 6వ పూరణలో జగన్మోహినీ రూపమందున్న హరి అనడం బాగుంది. ప్రశ్నార్థకంగా 7వ పూరణ బాగుంది. మూడవ పాదంలో "మనిషి + ఔను" అన్నచో సంధి లేదు. "మహిషి మనుజుఁ డౌను" అంటే సరి. 8వ పూరణలో హరి శబ్దానికి యముడనే అర్థాన్నిచ్చిన విధం బాగుంది.
ఈ సారి ప్రతి పూరణమూ కమనీయ కవితా తోరణమై భాసిల్లుచున్నది . మిస్సన్న గారి పద్యపు నడక రమణీయం. శాస్త్రి గారి,హరి గారి , సత్యనారాయణ గార్ల పూరణలు మురిపముగా కనిపిస్తున్నాయి . ఇక వసంత కిషోర్ గారి విజృంభణం గురించి చెప్పేదేముంది? శంకరయ్య గారి పూరణం రసభరితం . ఇందరిన్ని విధాలుగా ' దున్నేసిన ' తరువాత చివరికి మాకేం మిగులుతుందీ???
గురువు గారి పూరణ వారి గురుత్వానికి తగ్గట్లుగా ఉంది. వసంత కిషోర్ గారి అన్ని పూరణలూ ఒకదాన్ని మించి ఒకటి అలరారుతున్నాయి. విష్ణు నందను గారూ ధన్యవాదాలు. మీ పూరణ మిగిలిన వాటికి విభిన్నంగా ఉండి రమణీయంగా ఆకట్టుకొంటూంది. మిగిలిన మిత్రులందరి పూరణలూ యెంతో మనోహరంగా ఉన్నాయి.
విష్ణు నందన్ గారు దున్నిన విధము ప్రత్యేకతను సంతరించుకొంది.
మిత్రులందరిపూరణలూ మనోహరముగానున్నవి.
మూర్తి గారూ ! సమస్యలో హరి ఉండడం వలన దాన్ని లాలూకే అన్వయించడం జరిగింది.
కాని పగ్గాలు తెంచుకొని సిగ్గూ లజ్జా విడిచిన వాళ్ళందరూ తోలు మందం గాళ్ళే నని మీరు చక్కగా నిరూపించి సమస్యా పూరణలో మీకు హద్దులు లేవని చాటు కున్న విధం చాలా బాగుంది.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండితనను రక్షించిన హరిని ప్రహ్లాదుడు :
01)
___________________________________________
పరమ హింస బెట్టి - పాతకములు జేసి
కడకు మడిసె కనక - కశిపుడంత !
ఆర్త రక్ష సేయ - నవతరించి , తన , ముం
దున్న హరిని జూచి - సన్నుతించె !
____________________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిమాఘమాసమందు మహిలోన హరిజూడ
తీర్థ యాత్ర కొరకు తిరుపతేగి
వేంకటేశురూపు వెలిగిపోతు తనముం
దున్న హరిని జూచి సన్నుతించె.
02)
రిప్లయితొలగించండి_________________________________________
అసురుడు నరకునిని;- అంత మొందింపగా
సర్వ జగము రక్ష - సేయ గోరి
చిత్ర రథుడు , సురలు;- శేష శయనము , నం
దున్న హరిని జూచి - సన్ను తించె !
__________________________________________
చిత్ర రథుడు = దేవేంద్రుడు
__________________________________________
భరతుడు తోగూడి
రిప్లయితొలగించండిఅయోద్యాపుర వాసులు
అనంతమైన ఆనందముతో :
03)
_________________________________________
దుష్ట రావణునిని - దునుమాడి లంకలో
రాము డంత జేరె - రాచ నగరు !
మిగుల భక్తి తోడ - మృగరాజ పీఠమం
దున్న హరిని జూచి సన్నుతించె !
__________________________________________
'కల్ప వృక్ష మితడె, కామ ధేనువు వీడె,
రిప్లయితొలగించండిచింతలన్ని దీర్చు శ్రీశుడితడె'
అన్నమయ్య యిట్లు ఆశేష తల్పమం-
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణల పరంపరలో ఇప్పటికి చేరిన మూడింటిని చూసాను. అన్నీ బాగున్నాయి.
మొదటిది అత్యుత్తమంగా ఉంది.
రెండవ పూరణ మొదటి పాదంలో "నరకునిని" అనకుండా "అసురుఁ డైన నరకు నంతమొందిపఁగా" అంటే బాగుంటుంది కదా.
అలాగే మూడవ పూరణలో "దుష్ట రావణాఖ్యు" అంటే బాగుంటుందని నా సలహా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది.
"తిరుపతేగి" అనక "తిరుపతిఁ జని" అనీ, "వెలిగిపోతు" అనక "వెలిగిపోగ", "వెలుగుచుండ" అనీ ఉంటే బాగుంటుంది.
మిస్సన్న గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
సురలు ,నసురులు :
రిప్లయితొలగించండి04)
______________________________________
పాము ,తాడు జేసి - పర్వ తమును జుట్టి
క్షీర సాగ రమును, - జిలుకు వేళ
మంధరమును దేల్చ - మాషాదముగను , క్రిం
దున్న హరిని జూచి సన్నుతించె !
______________________________________
మాషాదము = తాబేలు
_______________________________________
వసంత్ కిశోర్ గారి మొదటి పూరణ స్ఫూర్తితో నా పూరణ ....
రిప్లయితొలగించండిఇందు గలఁడు దేవుఁ డందు లేఁడనక నెం
దెందు వెదకి చూడ నందె గలఁడ
టంచు నమ్మి భక్తుఁ డణువాది విశ్వమం
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమీ మెరుగులతో
నా పూరణలు
మెరుగై
మురిపెముగ నున్నవి.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ నాల్గవ పూరణ అద్భుతంగా ఉంది. ఈ మద్య వీరతాళ్ళు రావడం లేదన్నారు కదా! మొదటి పూరణ కొకటి, నాల్గవ పూరణకు రెండు, వెరసి మూడు వీరతాళ్ళు మీకు.
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండికావుమనుచు నాడు గజరాజు వేడగా
పరుగు పరుగునొచ్చి ప్రాణములను
రక్షజేసి శ్రీతొ రమ్యముగ తనముం
దున్న హరిని జూచి సన్నుతించె.
శంకరార్యా !
రిప్లయితొలగించండికడుంగడు ధన్యవాదములు!
మీ పూరణ పోతన్న గారిని
దలపించు చున్నది.
అణువాది యనిన నేమో
అర్థము గాకున్నది
మన్నించి వివరించుడు
శంకరయ్య గారూ ధన్యవాదములు. అణువుమొదలు విశ్వమంతా హరిని జూచిన మీపూరణ చాలాబాగుంది.వసంతకిశోర్ గారు ఆటవెలదులతో ఆడుకుంటున్నారు.విస్సన్న గారి పూరణ బాగుంది. అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి
శంకరార్యా !
రిప్లయితొలగించండిఅద్భుతం !
శాస్త్రి గారి వివరణతో
అర్థమైనది
అణువాది అంటే
అణువు ఆదిగా గల విశ్వమని !
శాస్త్రి గారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండి____________________________________
మా అమ్మాయి
శాంతి సూచన యిది :
"గడ్డి తినే వాళ్ళను
దున్న మెచ్చు కొన్నట్లు
వ్రాయమని "
_____________________________________
పూర్వము లాలూ ప్రసాదు యాదవ్
అని ఒక ప్రముఖు డుండే వాడు .
పశువులు తినే గడ్డిని తానే మేసి
200 కోట్లకు పైగా కుంభకోణం
నెఱపిన ఘన చరిత్ర గలిగిన వాడు.
అతనిని గాంచిన దున్న పోతు :
05)
_______________________________________
గడ్డి మేయు టందు - గెడ్డము నెరిసిన
యముడు గాన ఎల్ పి - యాదవు గని
మిన్నె హద్దు , నీకు - నన్నె , మించితి వని
దున్న హరిని జూచి - సన్నుతించె !
_______________________________________
హరి = శ్రీ కృష్ణుడు = యాదవ ప్రముఖుడు
యాదవ ప్రముఖుడు = లాలూ ప్రసాదు యాదవ్
_______________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదున్న ఒకటి వచ్చి తిన్నదనుచు గడ్డి
రిప్లయితొలగించండిపార్కుగార్డు వచ్చి బాదుచుండ
పద్యకవిత నాపి వచ్చి కాపాడగ
దున్న 'హరి'ని జూచి సన్నుతించె!
భస్మాసురుని బారి నుండి
రిప్లయితొలగించండిగాపాడిన హరిని గాంచి హరుడు :
06)
______________________________________
తనదు వరమె తనకు - తాపమై ,తనరార
హరియె తనను గాచ; - నసురు జంపి !
ముదము నొంది , జగము - మోహించు రూపునం
దున్న హరిని జూచి - సన్నుతించె !
_______________________________________
07)
రిప్లయితొలగించండి________________________________________
మిన్ను మీద పడును ! - మేదిని భస్మమౌ !
దున్న హరిని జూచి - సన్నుతించె !
మనిషి మహిషి యౌను ! - మహిషే మనిషౌను !
నన్న విన్న జనులు - నమ్మ గలరె ?
________________________________________
08)
రిప్లయితొలగించండి________________________________________
ధాత కైన , వాని - తాత కైనను గాని
ప్రాణములను దీసి - పాశ ముక్తి !
కర్మ దీరి నంత - కలిగింతు వీవని
దున్న హరిని జూచి - సన్నుతించె !
________________________________________
హరి = యముడు
________________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయంతో పూరించారు. అభినందనలు.
"పరుగున + వచ్చి" పరుగునొచ్చి అనడం సరి కాదు. "పరుగు తీసి వచ్చి" లేదా "పరుగుతోడ వచ్చి" అనండి. "శ్రీతొ" అనడమూ సరికాదు. "రక్ష సేయ శ్రీవిరాజితుం డగుచు ముం" అంటే ఎలా ఉంటుంది?
వసంత్ కిశోర్ గారూ,
మీ "లేటెస్ట్" నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
5వ పూరణలో చమత్కారం అలరించింది. "గడ్డము" అంటే సరిపోతుండగా "గెడ్డము" అన్నా రెందుకు?
6వ పూరణలో జగన్మోహినీ రూపమందున్న హరి అనడం బాగుంది.
ప్రశ్నార్థకంగా 7వ పూరణ బాగుంది. మూడవ పాదంలో "మనిషి + ఔను" అన్నచో సంధి లేదు. "మహిషి మనుజుఁ డౌను" అంటే సరి.
8వ పూరణలో హరి శబ్దానికి యముడనే అర్థాన్నిచ్చిన విధం బాగుంది.
హరి గారూ,
రిప్లయితొలగించండిమీ పేరునే సమస్యాపూరణకు వాడుకున్నారు. బాగుంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ, శాస్త్రి గారూ,
నా పూరణలో "అణువాది" కాకుండా "అణ్వాది" అని ఉండాలి.
చేరి మృగములన్ని సింహమును నిలిపె
రిప్లయితొలగించండివనికి రాజుగ, మరి వాని మంత్రి
దున్న పోతు, ముదము మిన్నంటగ సభలో
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
హరి = సింహము
శంకరార్యా !
రిప్లయితొలగించండిమీ మెరుగులకు
నా కైమోడ్పులు !
ఈ సారి ప్రతి పూరణమూ కమనీయ కవితా తోరణమై భాసిల్లుచున్నది . మిస్సన్న గారి పద్యపు నడక రమణీయం. శాస్త్రి గారి,హరి గారి , సత్యనారాయణ గార్ల పూరణలు మురిపముగా కనిపిస్తున్నాయి . ఇక వసంత కిషోర్ గారి విజృంభణం గురించి చెప్పేదేముంది? శంకరయ్య గారి పూరణం రసభరితం . ఇందరిన్ని విధాలుగా ' దున్నేసిన ' తరువాత చివరికి మాకేం మిగులుతుందీ???
రిప్లయితొలగించండిహాలికుండతండు , హరిని బూజించును
తొట్టదొలుత కార్యమెట్టిదయిన!
తొలకరి గమనించి, పొలము చదును జేసి
దున్న , హరిని జూచి సన్నుతించె !!!
శంకరయ్య గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిదున్నను రక్షించిన హరి గారికి,
మంత్రి పదవినిచ్చిన సత్యనారయణగారికి అభినందనలు.
ఎనిమిది ఆటవెలదులందించిన కిశొర్ గారికి మరియొకసారి అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి
విష్న్ణునందన్ గారూ
రిప్లయితొలగించండిఅందరు దున్నేసినా మీరు పండించారుగా.అందుకోండి అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.
గురువు గారి పూరణ వారి గురుత్వానికి తగ్గట్లుగా ఉంది.
రిప్లయితొలగించండివసంత కిషోర్ గారి అన్ని పూరణలూ ఒకదాన్ని మించి ఒకటి అలరారుతున్నాయి.
విష్ణు నందను గారూ ధన్యవాదాలు. మీ పూరణ మిగిలిన వాటికి విభిన్నంగా ఉండి రమణీయంగా ఆకట్టుకొంటూంది.
మిగిలిన మిత్రులందరి పూరణలూ యెంతో మనోహరంగా ఉన్నాయి.
మకరి తోడ బోరు మాతంగమును గాచి
రిప్లయితొలగించండిభక్త జనుల కెల్ల ముక్తి నొసగి
శిరము వంచి మ్రొక్కి శేష తల్పమునం
దున్న హరిని జూచి సన్ను తించె
యముని దున్న - ఉచ్ఛైశ్రవాన్ని గూర్చి
రిప్లయితొలగించండికాలుని రథమేను గాఁక యా తురగము
పాల కడలి నుండి వచ్చెఁ గనుక
గొప్పదేను సుమ్మి నప్పటముగ యని
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
(హరి = గుర్రము)
మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి. గురువు గారి పూరణ బ్రహ్మాండము.
రిప్లయితొలగించండికిశోర్ జీ లాలూవేనా ? నాయకు లందఱూ అలాగే ఉన్నారు కదా !
త్వక్కు దట్ట మయ్యె దనకు హద్దులు లేమి
దేశ నాయ కుండు లేశ మైన
సిగ్గు లేక మసల పగ్గమ్ము విడివడి
దున్న హరినిఁ జూచి సన్నుతించె.
త్వక్కు = చర్మము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిష్ణు నందన్ గారు దున్నిన విధము
రిప్లయితొలగించండిప్రత్యేకతను సంతరించుకొంది.
మిత్రులందరిపూరణలూ
మనోహరముగానున్నవి.
మూర్తి గారూ !
సమస్యలో హరి ఉండడం వలన
దాన్ని లాలూకే అన్వయించడం జరిగింది.
కాని పగ్గాలు తెంచుకొని
సిగ్గూ లజ్జా విడిచిన
వాళ్ళందరూ
తోలు మందం గాళ్ళే నని
మీరు చక్కగా నిరూపించి
సమస్యా పూరణలో
మీకు హద్దులు లేవని చాటు కున్న
విధం చాలా బాగుంది.
ఈ రోజు గురువు గారి దగ్గర
రిప్లయితొలగించండి3 వీర తాళ్ళు సంపాదించాను.
జిగురు సత్యనారాయణ గారూ !
మీకు 15-01-2011 న ఇవ్వ వలసిన దొకటీ
మరల 17-01-2011 న ఇవ్వవలసినవి రెండూ
వెఱసి 3 వీరతాళ్ళూ చెల్లు !
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది పూరణ. అభినందనలు.
"శేషతల్పమ్మునం" అంటే గణదోషం తొలగిపోతుంది.
రవి గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ మీ పూరణలు బాగున్నాయి. అభినందనలు.
వసంత్ కిషోర్ గారు,
రిప్లయితొలగించండినేను వ్రాసిన ఒకటి అర పూరణలకు మీరు వీరతాళ్లు ఇస్తే, మీ పద్యేక్షు రస ప్రవాహానికి మేమేమి యివ్వగలము.