14, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 226 (తల్లిని దండించువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!
దీనిని పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

50 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.
    సమస్యలో చిన్న మార్పు జేసితి;
    తప్పలేదు; తప్పుకాదు గదా ?

    01)
    _________________________________________

    కల్లలు, జూదము లాడుచు
    తల్లికి నెదురాడుచున్న - దమ్ముని మార్చన్
    ఉల్లము రంజిల్లగ యా
    తల్లికి; దండించు వాడు - ధన్యుడు గదరా !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  2. మితిమీరిన కోపంతో భరతుడు :

    02)
    _________________________________________ఎల్లరి

    ఎల్లరి మనములు కుందగ
    నల్లరి , నడవులకు రాము - నంపిన కైకన్
    ఎల్లలు దాటిన, కోపము;
    తల్లిని దండించువాఁడు - ధన్యుఁడు గదరా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  3. ఎనిమిదవ సంతాన మైన
    భీష్ముని గూడా నదిలో
    పారవేయు చున్న సమయంలో
    గంగను శంతనుడు :

    03)
    ________________________________________

    ఉల్లము కడు కఠినమ్మై
    పిల్లల నందరిని నదిని - వేసిన గంగన్
    పెల్లుబికిన కోపముతో
    తల్లిని దండించువాఁడు - ధన్యుఁడు గదరా!
    ________________________________________

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి.

    తల్లీ! తండ్రీ! అనుచును
    పిల్లల ప్రేమించుచుంద్రు పెద్దలు కానీ
    అల్లరి మించిన, తండ్రీ
    తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రి గారూ !
    తల్లిని దండించమంటే , మీరు
    పిల్లల్ని దండిస్తున్నారే !!! బావుంది !

    రిప్లయితొలగించండి
  6. తల్లిని దండన సేయగా
    నొల్లననక తలను నరికె నుద్ధతి యతడే
    బల్లిదఁపు పరశు రాముఁడు,
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    రిప్లయితొలగించండి
  7. రవి గారూ !
    పరశు రాముణ్ణి బరిలోకి దింపారు !
    బావుంది !
    _____________________________________

    శ్రీ శ్రీ గారు రచించిన
    "కలకానిది విలువైనదీ" అనే పాట గలిగిన
    "వెలుగు నీడలు" అనే సినిమాలో
    పిల్లలు లేక ఒక అమ్మాయిని పెంచుకొన్న
    సూర్య కాంతం తనకొక కూతురు పుట్టగానే
    దత్త పుత్రికను , పలు పాట్ల పాల్జేస్తుంది :
    యశస్వి(ఎస్.వి.ఆర్) ఆమెను దండించ లేక పోతాడు.
    ఒకవేళ దండించ గలిగితే ధన్యు డై యుండే వాడు గదా !
    అదీ నేపథ్యం :

    04)
    ________________________________________
    అల్లారు ముద్దు బెంచియు
    చెల్లాయే రాగ , విడచె - సూర్యా కాంతం
    పిల్లను నిడుముల బెట్టెడు
    తల్లిని దండించువాఁడు - ధన్యుఁడు గదరా!
    ________________________________________

    రిప్లయితొలగించండి
  8. అల్ల పరశురాముని పిత
    తల్లిని వధియించు మనగ, తండ్రికి యతడున్
    వెల్లడి జేయక ప్రశ్నలు -
    తల్లిని దండించు వాడు ధన్యుడు గదరా!

    రిప్లయితొలగించండి
  9. ఆచార్యా !
    పరశు రామునితో
    తల్లిని దండింప జేసి
    మమ్మల్ని ధన్యుల్ని జేసారు !

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి.

    కిశోర్ జీ ధన్యవాదాలు.రకరకాలుగా దండిస్తున్న మీపూరణలు బాగున్నాయి. రవి గారూ అభినందనలు.

    పిల్లలు ఇద్దరు ఒకటే!
    పిల్లను, అది ఆడదైన, పిండమునాడే
    ఒల్లక హత్యను జేసే
    తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!

    రిప్లయితొలగించండి
  11. శాస్త్రి గారు అద్భుతం !
    భ్రూణ హత్యలు చేసే తల్లులను
    తప్పక దండించ వలసిందే !అభినందనలు !
    __________________________________________

    సారంగధరుని సవతి తల్లి చిత్రాంగి
    రాజ రాజ నరేంద్రునితో ఎన్నో అబద్దాలు చెప్పి
    అతని మృతికి కారణ మౌతుంది.
    ఆమెను సారంగ ధరుడు దండించ గలిగితే !!!

    05)

    _________________________________________

    తల్లి ననుచు దలవక నను !
    మెల్లగ , నా పురము జొచ్చె ! - మోహము తోడన్ !
    కల్లల నాడిన తన పిన
    తల్లిని దండించువాఁడు - ధన్యుఁడు గదరా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ అద్భుతంగా ఉన్నాయి, మీ పద్యాలు. శాస్త్రిగారూ, పురణలు దంచేస్తున్నారు. రవి జీ బాగుంది మీ పూరణ, కాని గుండె దడగా ఉంది. చల్లని పద్యము మరి ఒకటి చెప్పండి.

    చిల్లులు పొడిచిన చట్టము
    నిల్లే గుల్లయుగ జేసె నిందిర నాడున్
    పిల్లై నిలుచుట కంటే

    తల్లిని దండించువాడు ధన్యుడు గదరా !

    (జయప్రకాష్ నారాయణండీ నా మనస్సులో ఉన్నది.)

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మూర్తి గారూ,కిశోర్ గారూ ధన్యవాదాలు. మూర్తి గారూ,ఫణీంద్ర గారూ మీపూరణలు బాగున్నాయి అభినందనలు.

    తల్లిగ చూడక, కోడలి
    నొల్లకనే చంపివేసి నల్లిగ నెంచే
    కిల్లర్, వర్రెస్టు మహా
    తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!

    రిప్లయితొలగించండి
  14. "గొల్లని రోటికి గట్టితి
    ఇల్లిది నా ప్రేమ" యంచు ఏడ్వ దొడంగెన్
    తల్లి యశోదయున్ "ఈ గతి
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!


    ఎల్లలు ఎరగని ప్రేమకు నిలువుటద్దం యశొదా కృష్ణులు (వేలంటైన్స్ డే శుభ సందర్భంలో)

    రిప్లయితొలగించండి
  15. మూర్తిగారూ !
    చట్టానికి చిల్లులు పొడిచిన
    ఇందిరమ్మను దండించ మన్నారు !బావుంది !
    కాని దండించిన జయ ప్రకాష్ నారాయణ గురించి
    కొంచెం వివరించక పోతే ఎలాగ ?
    ఇప్పుడొకాయన ఉన్నాడు గదా !

    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాస్త్రి గారూ !
    కోడళ్ళను నల్లిలా నలిపే తల్లుల్ని
    అస్సలు వదల గూడదు !బావుంది !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
    శ్రీపతి గారూ !
    యశోదా కృష్ణుల ప్రేమ! బావుంది !
    ముడవ పాదంలో న కార పొల్లు అక్కర లేదు గదా !

    రిప్లయితొలగించండి
  16. రవి గారూ ! తల్లిని దండన సేయగా టైపాటు అనుకుంట "సేయగ" ఏమో కదా !

    రిప్లయితొలగించండి
  17. సనత్ గారూ అద్భుతము గా ఉంది మీ పూరణ. శాస్త్రి గారూ, కందాలలో ప్రాస యతి కుదరదు. ' నొ 'కి 'న 'కి యతి చెల్లదు. మీరు సవరించాలి.

    రిప్లయితొలగించండి
  18. కిశోర్ గారూ, పురాణాలలో ' విశ్వామిత్రుడు ' లాగ అంటారు. అంతేనా ? చూద్దాము ఇప్పటి జయప్రకాష్ నారాయణ గారి గురించి నాకు సదభిప్రాయమే ఉంది,కాని భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆయన సత్తా గురించి.

    రిప్లయితొలగించండి
  19. పూర్వం
    "మనుషులు మారాలి " అనే సినిమా లో
    తప్పని సరి పరిస్థితుల్లో
    తల్లైన శారద తన పిల్లలకు అన్నంలో
    విషం కలిపితినిపిస్తుంది !
    ఆ సినిమాను గుర్తు చెయ్యాలని
    ఆ తల్లిది తప్పో ఒప్పో ???
    తెలుసుకోవాలని

    సమస్యలో చిన్న సవరణతో :

    06)
    ___________________________________________

    చల్లగ , అన్నము నమృతము
    పిల్లల కిడి జంప జూచి - వేదన జెందెన్
    తల్లగు శారద! మరియా
    తల్లిని దండించువాడు - ధన్యుడు యగునా ?
    ___________________________________________

    అమృతము = విషము
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  20. తొల్లి భృగుపత్ని వ్రతమున
    తల్లడఁ బెట్ట దివిజులను, దానిని సంద్ర
    మ్మల్లుడు జంపెను, శుక్రుని
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    సంద్రమ్ము + అల్లుడు = సంద్రమ్మల్లుడు (విష్ణువు)
    (పూర్వము భృగుమహర్షి భార్య, శుక్రుని తల్లి అయిన "ఉశన", దేవతలను సంహరించడానికి ధృడ వ్రతము చేయుచుండగా, విష్ణువు ఆమెను సంహరించినాడు.)

    రిప్లయితొలగించండి
  21. సనత్, నిజమే. టైపాటు. సరిచేసేలోగా, జాలంలో దూసుకెళ్ళింది.

    మూర్తి గారు, ఇదుగోండి, చల్లని (గోరెవచ్చని?) పద్యం :). ఎలాఉందో మీరే చెప్పాలి.

    మొల్లల దంతములించుక
    వెల్లడిగాఁ పిల్లడు చిఱు విహసితములతో,
    యల్లన చిచ్చిని వోయుచు
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    రిప్లయితొలగించండి
  22. అల్లన పూతన ఆ రే
    పల్లెను చనుబాలనిచ్చి బాలుని యుసురుల్
    చెల్లింపజూసె ; మాయల
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    రిప్లయితొలగించండి
  23. జి.ఎస్.జీ.!
    విష్ణువు తో దండించారా
    తల్లిని ! బావుంది !

    రవి గారూ !
    చిచ్చి దండన !చాలా చిలిపిగా ఉంది!

    విష్ణునందనా !సుందరా !
    మాయల తల్లిని దండించారు !మంచిగా !
    _________________________________________

    ఉప్పొంగే ప్రేమ నుగ్గబట్టుకొని
    అప్పుడే బుట్టిన చిన్నవాణ్ణి నదిలో వదలిన కుంతి :

    07)
    ________________________________________

    పల్లవించు , ప్రేమ ద్రుంచుచు
    కల్లకు భయపడి , తనయుడు - కర్ణుని విడచెన్
    అల్లాడుచు తోయములను!
    తల్లిని దండించువాఁడు - ధన్యుఁడు గదరా!
    ________________________________________

    రిప్లయితొలగించండి
  24. 08)
    _________________________________________

    కల్లయె గాకిది ,నిజమా ?
    తల్లిని దండించువాడు - ధన్యుడు గదరా !
    తల్లియె నిలలో దైవము
    తల్లిని గొలిచిన వాడే - ధన్యుడు సుమతీ !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  25. 09)
    __________________________________________

    బెల్లము చీమలు దినవులె !
    అల్లము దియ్యగ నుండు ! - నది ఎట్లన్నన్
    " పెళ్ళాలను పూజించుచు
    తల్లిని దండించు " వాడు - ధన్యుడు గదరా !
    __________________________________________

    రిప్లయితొలగించండి
  26. 10)
    __________________________________________

    ఎల్లెడ స్త్రీలను జూచిన
    తల్లజమౌ తల్లి యైన - తరుణియె సుమతీ !
    ఇల్లిడ సత్యం బౌనే ?
    "తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా "!
    __________________________________________

    రిప్లయితొలగించండి
  27. 11)
    _______________________________________

    ఉల్లంబున ప్రేమ బెరుగు

    తల్లై పెను సంతుగల్గు - తరుణిని జూడన్ !

    కల్లౌనది కలనైనను

    "తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా "!
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  28. 12)

    ___________________________________________

    కాళ్లే ఇటలీ లలనవి
    మళ్లీ కాంగ్రెస్సు వెంట - మరలిన చిరునే
    ఇల్లే పీకేసి ప్రజా -(రాజ్యం)
    తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా !

    రిప్లయితొలగించండి
  29. 13)

    ___________________________________________

    భళ్లున తెల్లారగనే
    పెళ్లున లేచింటి బనులు - ప్రేముడి జేయున్ !
    కళ్లే పోవును నిట్లన !
    "తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా "
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  30. 14)

    __________________________________________

    కళ్లాపి జల్లి; కాంగ్రెసు
    కాళ్లే పట్టెను, ఘనచిరు - కానుక లొందన్ !
    ముల్లే గద పరమార్థము !
    తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా
    __________________________________________

    రిప్లయితొలగించండి
  31. 15)

    __________________________________________

    తల్లే జగథా ధారము !
    తల్లే యేడుగడ; మేను - తాలుపుల కిలన్
    తల్లే సర్వం ! బెట్లౌ
    "తల్లిని దండించు వాడు - ధన్యుడు గదరా "
    __________________________________________

    ఏడుగడ = రక్షణము
    మేనుతాలుపు = ప్రాణి
    __________________________________________

    రిప్లయితొలగించండి
  32. తల్లిని ,చెల్లిని నాలిని
    నుల్లము నందుంచు వాని నుత్తము డనరా !
    పిల్లను కని వదిలెడు చెడు
    తల్లిని దండించు వాడు ధన్యుడు గదరా!

    రిప్లయితొలగించండి
  33. రవి గారూ మీ గోరు వెచ్చని పద్యము రమ్యంగా ఉంది.మధ్య మధ్యలో అలా మల్లెలు,మొల్లలు కొంటూ ఉండండి !

    రిప్లయితొలగించండి
  34. పీతాంబర్ గారూ మీ పద్యము చాలా బాగుంది. కిశోర్ జీ గోదావరి ప్రవాహము బాగుంది,
    విష్ణు నందనుల వారి పద్యము సుందరమే ! సనత్, ఆ కృష్ణుడి బొమ్మ మీరు వేసినదేనా ??

    రిప్లయితొలగించండి
  35. గురువు గారి ధర్మమా అని మన మిత్రులందరి మధ్యా స్నేహపూర్వక మైన పోటీ పెరిగి ఎన్నెన్నో అందమైన పూరణలు, పద్యాలూ పుట్టుకు వస్తున్నాయి.ఈ సందర్భంలో వసంత మహోదయుల పాత్ర శ్లాఘనీయం. ఆయన అందర్నీ తన పద్య తోరణాలతో రెచ్చ గొట్టేసి ఆణి ముత్యాల్లాటి పద్యాలను మిత్రుల దగ్గరినుంచి రాబట్టుతున్నారు. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.

    కల్లయె కాల్పురి కేగుట
    తల్లిని దండించు వాడు? ధన్యుడు గదరా
    తల్లిని, తండ్రిని ముదిమిని
    చల్లగ కను రెప్పవోలె సాకెడు వాడున్.
    (తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడువ కుండా)

    రిప్లయితొలగించండి
  36. ఆర్యా! సుమారు ముప్పదికి పైగా పూరణలతో అలరారుతున్న మీశంకరాభరణం కవి పండితులకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సతాధిక పూరణలతో మీకూపిరిసలపనంతగా పూరణలు చేసే కవులు మీ శంకరాభరణ లోలురవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
    మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

    మకుటము నొక్కదాని నిడి మంచిగ పూరణ చేయుడన్నచో
    సుకవులనేకులాపగిది శోభిలుపద్య శతంబు వ్రాసినన్
    సుక పిక సంకులారవము సుందరమై వినఁ జక్కనున్నటుల్
    ప్రకటిత మౌను సత్ శతక పాండితి పండిత వర్యు లెన్నగన్.

    ఎంతో ఉత్సాహంతో నిరంతరాయంగా అద్భుతమైన పూరణలతో పాఠక లోకాన్ని అలరింప జేస్తున్న కవి పండితులకందరికీ నా శూభాభినందన పూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  37. మిత్రు లందరికీ వందనాలు.
    ప్రొద్దున్నే వరంగల్ వెళ్ళి బంధువుల ఇంట్లో ఒక శుభకార్యంలో పాల్గొని ఇప్పుడే తిరిగి ఇల్లు చేరాను. బ్లాగు తెరిచి ఇన్ని పూరణలను, వాటిపై మిత్రుల స్పందనలను చూసి అమందానందాన్ని పొందాను. ప్రయాణపు అలసట వల్ల ఒక్కొక్క పూరణను పరిశీలించి వ్యాఖ్యలు పెట్టలేక పోతున్నాను. రేపు ఉదయం అన్నీ వివరంగా సమీక్షిస్తాను. అందరూ నన్ను మన్నిస్తారనే నా నమ్మకం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  38. శ్రీ చింతా రామకృష్ణా రావు గారూ, చక్కని పద్యముతో మమ్మలను సంతోషింప చేసారు. మీకు వందనములు.
    ఈ పద్య ప్రవాహములో ధ్రువుడు,ఉత్తాన పాదుడు,సురుచులను కిశోర్ జీ మరచిపోయారా ?

    చెల్లదొ సుతునకు నెక్కగ
    నుల్లము నుల్లాస మొంద యూరువు నాథున్
    ఒల్లక క్రిందకు లాగెడి
    తల్లిని దండించు వాఁడు ధన్యుఁడు గదరా !

    రిప్లయితొలగించండి
  39. తల్లీ ! పాలిథిన్ అమ్మా !!
    ఎల్లెడలా నీవె యుండ నేమౌనుర్విన్?
    చెల్లవు అటలు ఫొమ్మని
    తల్లిని దండించు వాఁడు ధన్యుఁడు గదరా !

    పర్యావరణ పరిరక్షణకై ....

    రిప్లయితొలగించండి
  40. తల్లై ఈర్ష్యాసూయలు
    మళ్ళించవె మనసు గతిని ! మాధవ ! మాకీ
    చిల్లర బ్రతుకే వద్దని
    తల్లిని దండించు వాఁడు ధన్యుఁడు గదరా !

    రిప్లయితొలగించండి
  41. వసంత్ కిశోర్ గారూ,
    మీ 15 పూరణలూ చూసాను. ఇంకొక్కటి వ్రాస్తే షోడశ కళలతో భాసించేవారు. అన్నీ బాగున్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
    నాల్గవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించలేక పోతున్నాను.
    ఆరవ పూరణలో "తల్లి + అగు" అన్నప్పుడు యడాగమం రాదు. "అల్లి యయిన శారద, యా" అందాం.
    ఏడవ పూరణ మొదటి పాదంలో గణదోషం ఉంది. "పల్లవిత ప్రేమఁ దునిమి" అందాం. "అల్లాడుచు" కంటే "అల్లాలెడి" బాగుంటుందేమో?
    ఎనిమిదవ పూరణ చివరి పాదంలో "వాడే" అని గగం వేసారు. అక్కడ తప్పనిసరిగా జగణమో, నలమో ఉండాలి కదా. "తల్లిని గొలిచిన తనయుఁడె ధన్యుఁడు" అందాం.
    తొమ్మిదవ పూరణ రెండవ పాదంలో "తియ్యగ" అంటే గణదోషం. "తియ్యంగ" అంటే సరి.
    పదవ పూరణలో "ఇల్లిడ" అర్థం కాలేదు.
    పదకొండ పూరణ మూడవ పాదంలో "కల్ల +ఔనది"లో సంధి లేదు. "కల్లయె యది" అందాం.

    రిప్లయితొలగించండి
  42. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "తండ్రీ తల్లిని" అన్నారు. "తండ్రీ తల్లుల" అనాలి కదా. "తండ్రిని, తల్లిని" అంటే సరి.
    రెండవ పూరణ మొదటి పాదంలో "పిల్లలు + ఇద్దరు + ఒకటే" అన్నప్పుడు సంధి జరిగి "పిల్ల లిద్ద రొకటే" అవుతుంది కదా. "పిల్ల లన నిద్ద రొకటే" అందాం.
    మూడవ పూరణలో "వర్స్టు" "వర్రెస్టు" ఎలా అయిందో? నేను ఇంగ్లీషులో పూర్ లెండి.

    రిప్లయితొలగించండి
  43. రవి గారు,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదంలో "సేయగ" అంటే గణదోషం తొలగిపోతుంది.
    రెండవ పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  44. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అత్యుత్తమ పూరణ మీది. ధన్యవాదాలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "గుల్లయుగ" కంటే "గుల్లగను" అంటే బాగుంటుందేమో?

    సనత్ శ్రీపతి గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "యశోదయున్ + ఈగతి" అని విసంధిగా వ్రాస్తే గణదోషం. "యశోద నీగతి" అంటే సరి.
    రెండవ పూరణలోను అదే దోషం. "పాలిథి నమ్మా" అందాం.
    మూడవ పూరణలో "తల్లె" అని హ్రస్వాంతం టైపాటు అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  45. జిగురు సత్యనారాయణ గారూ,
    అన్ని విధాల ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    మీ పూరణ ఉత్తమోత్తమం. అభినందనలు, ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ శ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  46. చింతా రామకృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.
    మీ ఆశీస్సులు, సలహాలు, సహకారం ఎల్లప్పుడు కాంక్షించే వాణ్ణి. మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  47. నల్లని యల్లుండనుచును
    చిల్లర సరకనుచు తిట్టి ఛీఛీ యనుచు
    న్నల్లరి జేసెడి శ్రీమతి
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    రిప్లయితొలగించండి
  48. కొల్లలు కట్నమ్ములిడెడి
    తెల్లని ధనవంతురాల్ని తెమ్మని పంపన్
    నల్లని గయ్యాళినిగొని
    తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా!

    రిప్లయితొలగించండి