గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పూరణ బాగుంది. అభినందనలు. కాని ఒక సందేహం ... హరి హర రాజ జగన్ అనే వ్యక్తి "శేఖర" నామ మిచ్చాడా? హరి హర రజు అనే వాడు "జగన్ శేఖర్" అని పెట్టాడ? లేక మొత్తానికే "హరి హర రాజ జగన్ శేఖర" నై పెట్టాడా?
మిస్సన్న గారూ, మీ పూరణ చాలా బాగుంది. ముందు మార్కండేయునికి "శశిశేఖరుడు" అనే పేరుందా అని అనుమానపడ్డాను. కాస్త ఆలోచించాక మీ భావం అవగత మయింది. అభినందనలు.
శంకరయ్యగారూ ధన్యవాదములు. వరపుత్రుడు కనుక హరిహరులను,వైయ్యస్సార్ అంటే ఇష్టం కనుక వైయస్,జగన్ పేర్లను కలిపి "హరిహర రాజ జగన్ శేఖర్" అని నామకరణం చేశాడని నా భావం.
హరి గారూ, మీ కందం సాఫీగా సాగింది. పూరణ బాగుంది. అభినందనలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, పూరణ బాగుంది. కాని మూడవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. కందంలో మొదటి పాదం గురు లఘువులలో దేనితో ప్రారంభ మౌతుందో, మిగిలిన పాదాలూ దానితోనే ప్రారంభం కావాలని కదా నియమం.
జిగురు సత్యనారాయణ గారూ, ఖరదూషణుల చరిత్ర తెలిసికొని, దానిని నా పూరణగా అందిద్దామని "పూర్వగాథాలహరి" పుస్తకాన్ని తెచ్చుకొని, బ్లాగు తెరిచే సరికి మీ పూరణ కనిపించింది. చాలా చక్కని పూరణ. చూసి ఆనందించాను. అభినందనలు.
ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ, "గుణశేఖర" అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
జి. శ్రీనివాస్ గారూ, "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. మీరు సూచించిన భావంతో గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ఉంది. పైన చూడండి. మీరన్నట్లు "రాజశేఖర" శబ్దాన్ని ఉన్నదున్నట్లు అక్కడ వేయలేము. మూడవ పాదం చివర "రాజశే" అంటే రగణం అవుతుంది. కందంలో రగణానికి (అది చతుర్మాతాగణం కాదు కనుక) ప్రయోగం లేదు. ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. నారదుడు "మరా మరా" అంటే మీరు "మరమరా"లిచ్చారు. సరేలెండి! తినడానికైనా పనికొస్తాయి :-)
రాజేశ్వరి నేదునూరి గారూ, మంచి పూరణ. అభినందనలు. మూడవపాదాన్ని "కరుణించి కొమరు నొసఁగ శే" అంటే గణదోషం తొలగిపోతుంది.
శంకరార్యా ! మన్నించాలి ! రామ అని ర కు దీర్ఘం కూడా పలుక లేని బోయవానికి నారదుడు బోధించినదదే ! కావాలంటే "మరమర " యని పదిసార్లు మీరు ఆపకుండా ఉచ్ఛరించి చూడండి తెలుస్తుంది అందులోని మర్మం మరమరాలో లేక తారక మంత్రమో ???????????????
మనకున్న సంవత్సరాల పేర్లన్నీ నారదుని కుమారులవి. అందులో ఒక సంవత్సరం పేరు - ఖర నామ సంవత్సరం (రాబోతోంది. పెద్దలకు తెలిసే ఉంటుంది).నారదుని (ఒకానొక) సుతునికి ఖర పేరు పెట్టాడని రాయాలని ఆలోచించాను. కుదరలేదండి.
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించుధరలో నొక్కడు గలిగిన
వరపుత్రునిచూచి తలచి వైయ్యస్సారున్
హరి హర రాజ జగన్ శే
ఖరనామము సుతున కొసగె(గడుమోదమునన్.
'హరుడే మృత్యువు నాపును,
రిప్లయితొలగించుహరుడే దీర్ఘాయువిచ్చు నాతని గొనుమా
శరణ'ని మృకండు శశి శే-
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించుపూరణ బాగుంది. అభినందనలు.
కాని ఒక సందేహం ... హరి హర రాజ జగన్ అనే వ్యక్తి "శేఖర" నామ మిచ్చాడా? హరి హర రజు అనే వాడు "జగన్ శేఖర్" అని పెట్టాడ? లేక మొత్తానికే "హరి హర రాజ జగన్ శేఖర" నై పెట్టాడా?
మిస్సన్న గారూ,
మీ పూరణ చాలా బాగుంది. ముందు మార్కండేయునికి "శశిశేఖరుడు" అనే పేరుందా అని అనుమానపడ్డాను. కాస్త ఆలోచించాక మీ భావం అవగత మయింది. అభినందనలు.
శంకరయ్యగారూ
రిప్లయితొలగించుధన్యవాదములు. వరపుత్రుడు కనుక హరిహరులను,వైయ్యస్సార్ అంటే ఇష్టం కనుక వైయస్,జగన్ పేర్లను కలిపి "హరిహర రాజ జగన్ శేఖర్" అని నామకరణం చేశాడని నా భావం.
గోలి హనుమచ్ఛాస్త్రి
నరుడైనను కరియైనను
రిప్లయితొలగించుఖరమైనను జీవులెల్ల కాటికి వెడలన్
హరి గలియునంచు నొక్కడు
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.
గురువుగారూ నమస్కారం. కొంచెం పెద్ద భావాన్ని చిన్న కందంలో ఇమిడిమ్చడం కోసం పడ్డ పాటది. నా మనస్సుని చదివినందుకు
రిప్లయితొలగించుకృతజ్ఞతలు.
హరి గారూ మీ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించుకానీ ఆ కుర్రాడే.....పాపం....
నరహరి యాసలు బండెను
రిప్లయితొలగించుసురలకు సాగిలబడిమరి సుతుని బడసెన్;
కేరను యేడుపు వినగనె
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్
సుతుని బదులుగా"సుతునే" అని రొండవ పాదం లో సరి చేసుకోవలసింది గా నా కోరిక
రిప్లయితొలగించుహరి గారూ,
రిప్లయితొలగించుమీ కందం సాఫీగా సాగింది. పూరణ బాగుంది. అభినందనలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు,
పూరణ బాగుంది. కాని మూడవ పాదాన్ని గురువుతో ప్రారంభించారు. కందంలో మొదటి పాదం గురు లఘువులలో దేనితో ప్రారంభ మౌతుందో, మిగిలిన పాదాలూ దానితోనే ప్రారంభం కావాలని కదా నియమం.
అరి వీర భయంకరుఁడగు
రిప్లయితొలగించుమురిపపు సతి పాక సుతుఁడు మును ముందనుచున్,
తరచి తరచి విశ్రవసుఁడు
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.
(రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసు, కైకసి కుమారులు కాగా, విశ్రవసు యొక్క రెండవ భార్యయగు పాకకు జన్మిచిన వాడు ఖరుడు)
పెరిగి చదువు సంధ్యలలో
రిప్లయితొలగించుస్థిరము గ గొలువున బేరు తేగలడనుచున్
పురజను లౌనన గుణ శే
ఖరనామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్.
Thana thandri "Rajasekhara" namamunaku gurthu ga oka vyakthi thana kumaruni ki "rajashekhara" ani namakarnam chesinadu ani puriste elavuntundi.
రిప్లయితొలగించుThanking you to all participants.
G. Srinivas. Hyderabad
అందరికీ వందనములు.
రిప్లయితొలగించుఅందరి పూరణలూ పసందుగా నున్నవి.
01)
________________________________________
చిరమున కొమరుడు గలిగిన
పరితుష్టిని ,బారసాల - వడి , నంకమునన్
వరసత్యచంద్రధనశే
ఖర నామము సుతున కొసగె - కడు మోదమునన్ !
________________________________________
నారదుడు కుమార సముడైన
రిప్లయితొలగించుబోయవానికి రామ నామ ముపదేశించుట :
02)
_________________________________________
మరమర మరమర యను; పా
ప రహితుడ వగుదువు నీవు; - పరమగు భక్తిన్
సురముని శ్రీ సీతా శే
ఖర నామము సుతున కొసగె - కడు మోదమునన్ !
________________________________________
(మిస్సన్న మహాశయుల స్ఫూర్తితో)
________________________________________
చిర కాలము నుండి యతడు
రిప్లయితొలగించుపరమేశుని వేడుకొనెను పుత్రుని కొరకై !
కరుణించి కొమరునీయగ శే
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్ !
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుఖరదూషణుల చరిత్ర తెలిసికొని, దానిని నా పూరణగా అందిద్దామని "పూర్వగాథాలహరి" పుస్తకాన్ని తెచ్చుకొని, బ్లాగు తెరిచే సరికి మీ పూరణ కనిపించింది.
చాలా చక్కని పూరణ. చూసి ఆనందించాను. అభినందనలు.
ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
"గుణశేఖర" అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
జి. శ్రీనివాస్ గారూ,
"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
మీరు సూచించిన భావంతో గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ఉంది. పైన చూడండి.
మీరన్నట్లు "రాజశేఖర" శబ్దాన్ని ఉన్నదున్నట్లు అక్కడ వేయలేము. మూడవ పాదం చివర "రాజశే" అంటే రగణం అవుతుంది. కందంలో రగణానికి (అది చతుర్మాతాగణం కాదు కనుక) ప్రయోగం లేదు.
ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
నారదుడు "మరా మరా" అంటే మీరు "మరమరా"లిచ్చారు. సరేలెండి! తినడానికైనా పనికొస్తాయి :-)
రాజేశ్వరి నేదునూరి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
మూడవపాదాన్ని "కరుణించి కొమరు నొసఁగ శే" అంటే గణదోషం తొలగిపోతుంది.
రాజేశ్వరమ్మ గారు,
రిప్లయితొలగించురెండవపాదంలో "ప" కు "పు" యతి కుదరలేదు.హల్ స్వామ్యము కుదిరినా, "అచ్" స్వామ్యమూ కుదరాలి.
"మురుగేశుని" లేదా "పురనాశకుఁ" అంటే సరిపోతుంది.
మూడవపాదంలో గణభంగం ఉంది.
"కరుణన్ కొమరుఁ బడసి శే" - అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.
రవి గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు. రాజేశ్వరి గారి పద్యంలో మీరు చెప్పేదాక రెండవ పాదంలో యతి తప్పిన విషయం నా దృష్టికి రాలేదు. మీ సవరణలు బాగున్నాయి.
శంకరార్యా ! మన్నించాలి !
రిప్లయితొలగించురామ అని ర కు దీర్ఘం కూడా
పలుక లేని బోయవానికి నారదుడు
బోధించినదదే !
కావాలంటే "మరమర " యని
పదిసార్లు మీరు ఆపకుండా ఉచ్ఛరించి చూడండి
తెలుస్తుంది అందులోని మర్మం
మరమరాలో లేక తారక మంత్రమో ???????????????
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించునాకూ తారకమంత్రాన్ని ఉపదేశించారు. ధన్యవాదాలు.
మనకున్న సంవత్సరాల పేర్లన్నీ నారదుని కుమారులవి. అందులో ఒక సంవత్సరం పేరు - ఖర నామ సంవత్సరం (రాబోతోంది. పెద్దలకు తెలిసే ఉంటుంది).నారదుని (ఒకానొక) సుతునికి ఖర పేరు పెట్టాడని రాయాలని ఆలోచించాను. కుదరలేదండి.
రిప్లయితొలగించుఖర వంశంబున బుట్టిన
రిప్లయితొలగించుఖర కుల సోముండు వీని గనరే యంచున్
ఖర గురుడు పలుకగా విని
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్
ఖర వంశంబున బుట్టిన
ఖర కుల సోముండటంచు ఖర గురుడనగా
ఖర మాతా పితరులు శ్రీ
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్
నరవరు డౌనని కలగని
రిప్లయితొలగించుహరి యవతారమ్ము తోడ నా జోగయ్యే
సరియగు ననుచు తిరుమలశి
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్
* జోగయ్య = రాష్త్రపతి "వరాహగిరి వేంకటగిరి" గారి తండ్రి
* రాష్ట్రపతి
తొలగించుశాస్త్రి గారూ,
తొలగించుతిరుమల శిఖర నామముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మా ఇంటిపేరు "గుర్రం":
రిప్లయితొలగించుతురగము కనగనె శిశువును
పొరలుచు ముదమున నిసుకను బ్రోబ్రో యనుచున్
సరసమునన్ హ్రీహ్రీయని
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్