23, ఫిబ్రవరి 2019, శనివారం

దత్తపది - 154

కరి - గిరి - దరి - సిరి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
అన్యార్థంలో దేశభక్తిని ప్రబోధిస్తూ
స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం వ్రాయండి.  
(ఆకాశవాణిలో ఈరోజు పూరణలు ప్రసారమయ్యే దత్తపది)

30 కామెంట్‌లు:

 1. మంచు కొండల మాటున మరచి సతిని
  గుండె నిండిన బాధలు గుచ్చి దరిమి
  కరిగి వర్షించు కన్నీటి కనుల దుడిచి
  పట్టు గాసిరి గిరికీలు కొట్ట కుండ

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి:

  దరితమును వీడి తెగువ ముందరికి దూకి

  కరికరిపడుచు ద్రిప్పి గిరికముల వలె,న

  రికి రిపుగణముల మన సైనికులు మిగుల

  వెలసిరిగ దేశభక్తిని నిలిపి మదిని

  ( దరితము..పిరికితనము
  కరికరిపడు...కోపగించు
  గిరికము..బొంగురము. )


  ---ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి


 3. దేశభక్తి గలదని ఒట్టి మాటలు చెప్పక
  దామోదరదాసు మోడి వలె ప్రభోదాత్మకంగా
  In action వుండాలి  మసి రివ్వున చేసెద రిపు
  ని సంహరణ తప్పుకాదు! నెమ్మియు కరికె
  క్క సదయునిగ చేతు గిరిక
  గ సర్వదేశముల తిరిగి కష్టేఫలియై!


  మేరా భారత్ మహాన్
  వందేమాతరం


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. వాసి గిరిస్తనిన్ జనులు పంకజ నాభుని ధర్మపత్నిగా
  చూసిరి గాదె శ్రీకరిగ సుందరి భారతిఁ గొప్ప సంస్కృతిన్
  వాసిగ గల్గినట్టి ఘన భారతిఁ గేలుల మోడ్చి మొక్కుచున్
  వ్రాసిరి పండితోత్తములు భారత భవ్య చరిత్ర లెన్నియో.

  రిప్లయితొలగించండి


 5. పుల్వామా లో అమరులైన సైనికులకు నివాళి

  పద! రిత్తవడకు! కడపు ! మ
  న దేశ భద్రత కొరకు మన మళుకరియె కా
  దు! దువాడింపన్! పుల్వము
  గ దునుము! గిరికవలె నీదు కసి రివ్వుమనన్!


  వందేమాతరమ్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  ధరణి ఋణమ్ము దీర్చుకొన త్యాగమతిన్ నిజమాతృసేవలో
  కరిగిరి , యుద్ధరంగమున కన్నులు మూసిరి , దేశభక్తులెం...
  దరిని గణింతు ? వారిని సదా స్మరియింతు వినమ్రశీర్షసం...
  భరితకృతజ్ఞతన్ ఘనులు మాన్యులు వారలె జాతిరత్నముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. మోక రిల్లి భరత మాత మ్రోల మ్రొక్కి
  చె ల గిరి కద యోధ వరులు చేవ తోడ
  చె దరి బెదర క నిరతమ్ము నె దు రు కొంద్రు
  డా సి రిపు లను దేశ మ్ము కోసమంచు

  రిప్లయితొలగించండి
 8. మన(కరి)ష్టంబు కల్పించ మత్సరమున
  దాడి చేసెడు ముష్కరుల్ దా(గిరి)చట!
  వీర సైనిక! శాత్రవుల్ బె(దరి)పోగ
  నిలిచి పోరాడి పొందుమా ‘గెలుపు (సిరి)’ని

  రిప్లయితొలగించండి
 9. సాగిలపడవలె దైత్యులు
  యోగులదేశమిక రివటయో యంకసిరిన్?
  దాగిరి ముష్కురులచటన్
  వేగిరపడు బెదిరి నీవు వెనుతిరుగకుమా

  రిప్లయితొలగించండి
 10. కర*కరి* మనస్కులై దుష్ట కార్యములను
  సలుప సా*గిరి* శత్రువుల్ విలువలుడిగి
  బె*దరి*పోవక ప్రజ లవివేకియైన
  వైరికి మగ*సిరి*ని చూపి వరలవలయు

  రిప్లయితొలగించండి
 11. తల్లి, తండ్రి, భార్య, సుతులం'దరి' ని విడిచి
  పర'గిరి' విలాతి గాయ, శత్రు బాంబు విసర
  మడి'సిరి' జవాన్లు నలుబది మంది, వారి
  చాగమునకు మో'కరి'లిరి జనతయంత

  రిప్లయితొలగించండి
 12. అరిగిరి మన సైనికు లం
  దరి హితమునుగోరి వైరి దళముల మార్కొన్
  మెరసిరి రిక్కలవోలెను
  కరిగింపగ నాయువంత కాశ్మీరమునన్

  రిప్లయితొలగించండి
 13. సాగిరి యోధవర్యు లతి
  సమ్మదమందగ భారతాంబయే ;
  ఆగని పౌరుషంబునను
  నందరి గన్నుల నెక్కుపెట్టుచున్
  మూగిన పాకుసైనికుల
  ముక్కలు జేసిరి వీరభద్రులై ;
  రేగిన యుగ్రవాదమది
  రెక్కలు కట్టుక మోకరిల్లెలే !

  రిప్లయితొలగించండి
 14. తే.గీ .కసిమసంగిరి వైరుల కంగిసమున

  చెదరి పోయెను రిపుసేన చేష్ట లుడిగి
  వెలసిరి మన జవానులు విక్ర మమున
  మోకరిల్లందు భారత మూకకెల్ల.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 15. యాదగిరిసామి దయనాకు నండయౌట
  భరతమాతను రక్షింతుమగసిరినిసు
  యశ్రువులబాసినటువంటి యందరికిని
  మోకరిల్లుదువినయాన మొగమువంచి

  రిప్లయితొలగించండి
 16. అట కరిగి రిపు నుదరి విసి
  రి టెంకి వీడఁగఁ బదపడి రివ్వునఁ గడు బ్రా
  కటముగ నడిచి గెలువు నీ
  పటుతర శక్తి తెలియంగ భారత వీరా!


  ఆకాశవాణి కి పంపినది:

  సాతోదరి! యర్థ కరి! వి
  ధూ తాధర్మ చయ నిత్య తోషిత! స్వజన
  వ్రాత సుదాసి! రిపు మనో౽
  తీత వరబలాంగి! రిక్త తృష! భారతమా!

  రిప్లయితొలగించండి
 17. కరిసించు సైనికుండన
  దరికొనుశత్రువునుగాంచి ధరణీసుతుడై!
  వరమౌ వాసిరివాజులు
  గిరికొనగా దేశభక్తి కీర్తినిబెంచున్
  కరిసించు=ఢీకొను‌,దరికొను=కాల్చు,గిరికొను=కాల్చు

  రిప్లయితొలగించండి
 18. మంచు కొండల కరి గిరి మన జవాన్లు
  దేశ భద్రత కందరి యాశ నిలుప
  నరిగి మడిసిరి కద యట నాల్గు పదుల
  వీర యోధులు జనులది ఘోరమనగ

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పట్టు పంచె గట్టి పంగ నామాల్బెట్టి
  చిన్న తులసి దండ చేత బట్టి
  ధనము దండు కొనగ దారుల గాచుచు
  భజన సేయువాఁడు భక్తుఁ డగున ?

  రిప్లయితొలగించండి
 19. savitri,Narasaraopet

  తొల*కరి* గలిగెను భారత
  విలసి*త రి*పు దహ్యమాన వీరోధ్ధతితో--
  తొల*గిరి* శాత్రవ సైన్యము
  కల*సిరి* విజయేందిరన్ వికాసపు ప్రజలున్.

  రిప్లయితొలగించండి
 20. బొగ్గరం వి.వి.హెచ్.బి.ప్రసాదరావు గుంటూరు

  శాం*కరి*ని గొల్వ దేశ ప్రశాంతిఁగల్గు
  త్యా*గి రి*క్కల వలె వెల్గి,తల్లి,భరత
  మా*త రి*ష్టము తొలగించి మాన్యుడయ్యె--
  కరము వీరులు ధృతిని చే*సిరి* యనంగ.

  రిష్టము=అశుభము
  శబ్ద రత్నాకరము

  రిప్లయితొలగించండి
 21. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అరెరే! దరిద్రగొట్టులు!
  గిరికల వోలుచును వచ్చి గీరిరె పాకుల్
  కరికరి తోడను చంపుచు
  సిరిచాపల చుట్టి పంపు చీనికి మోడీ :)

  దరిద్రగొట్టు = నిర్భాగ్యుడు
  గిరిక = చిట్టెలుక
  కరికరి = కోపము
  సిరిచాప = చిన్న చాప
  చీని = చైనా

  (ఆంధ్ర భారతి నిఘంటువు)

  రిప్లయితొలగించండి
 22. కరి - గిరి - దరి - సిరి

  కరిగెడి చలిమల యపు డరి
  గిరి భటు లమరపురి కనుచు గెరలుచు మసలెన్!
  దరికొను శిఖలను గని జడి
  సిరి యరిబలగము,కడుమురిసె దివి నమరులున్!!

  రిప్లయితొలగించండి
 23. *కరి* గెను కన్నవారికల కాటికి నే *గిరి* యుగ్రదాడి నెం
  దరు *దరి* సించి రాఘనత ధారుణిరక్షకునాహుతీయ నే
  *సిరి* భరతాంబికాంబరము సేమమొసంగ జవానుతంతు కుం
  డ్రరికరిసింహస్వప్నమయి యం దరిమన్నన నంది రయ్యెడన్

  రిప్లయితొలగించండి
 24. శత్రువులు మో కరి ల్లగ సాహసమున
  గాంధి ప్రజలం దరి నొకటిగాను జేసి
  పోరి, స్వేచ్ఛ నొసం గిరి పో , మనకిల
  ధారవో సిరి ప్రాణాలు ధాత్రి కొఱకు

  రిప్లయితొలగించండి