16, ఫిబ్రవరి 2019, శనివారం

సమస్య - 2932 (చైత్రమునందు వచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్"
(లేదా...)
"చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"
(ఈ రోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

60 కామెంట్‌లు:

  1. గోత్రము లన్నిజెప్పు కొని కొండల రాయుని యాలపించి నన్
    స్తోత్రము జేయుచున్ మదిని సోమర సంబును గ్రోలు చుండగా
    మైత్రిని గోరియా తడట మైకము నందున బల్కెనీ విధిన్
    చైత్రము నందువచ్చు రధసప్తమి గొల్వ వలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాయని నాలపించినన్/పూజ చేసినన్' అనండి.

      తొలగించండి
  2. పాత్రి జలంబునే యడిగి పానము జేసెడి కాలమేది,సా
    విత్రుని మాఘ మాసమున వేడుచు పండుగ జేయు నెప్పుడో,
    పత్రిని దెచ్చి యెవ్వరిని భాద్ర పదమ్మున గొల్తుమో నిటన్
    చైత్రము నందు వచ్చు, రధ సప్తమి ,గొల్వ వలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గొల్తుమో యిటన్' అనండి.

      తొలగించండి
  3. పత్రము లేడుతో జరుపు! పన్నుగ మాసములిర్వురుండగా
    చైత్రమునందు వచ్చు రథసప్తమి;...గొల్వవలెన్ గణేశునిన్
    చిత్ర విచిత్ర రూపముల జేసిన మూర్తుల దర్శనమ్ముతో
    ఛత్రము లాసనమ్ములను చక్కిలి గింతల మూషికమ్ములన్

    రిప్లయితొలగించండి
  4. పుత్రుని కెన్నొ బుద్ధులను భూరిగ విద్దెల నేర్పనేమి యే
    మాత్రము మార్పురాక మతి మాంద్యుల స్నేహము వీడకుండ నా
    మిత్రుల చెంతజేరి తన మేధసు చూపుచు చెప్పెనిట్లుగా
    చైత్రము నందు వచ్చు రథ సప్తమి గొల్వవలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    పాత్రత గల్గినట్టి తిథివాసరయోగవిభాగమెంచి , తా...
    పత్రయమున్ హరింప మన పండుగలేర్పడె మానవాళికిన్ !
    కృత్రిమబుద్ధి హైందవము గేలినొనర్పగ బల్కరాదిటుల్
    చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  6. పత్ర ఫలాల తోడుతను బాధ్రపదంబున వచ్చు పార్వతీ

    పుత్రుని జన్మ పర్వమును పొంగుగ సల్పిన జన్మ ధన్యమే!


    చిత్రము గాదె మిత్రమ? విచిత్రమె పల్కుట నివ్విధంబుగన్!


    " చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్ "


    --- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి

  7. చిత్రవిచిత్రమౌ ధ్వనుల చెన్నుగ గోకిల విందు జేయుగా
    యాత్రము హెచ్చునట్లు జనులందఱి చిత్తము లుల్లసిల్లగన్
    శత్రుల బోలునట్టి పెను సంకటముల్ దొలగింప జేయగన్
    "చైత్రమునందు ; వచ్చు రథసప్తమి ; గొల్వవలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విందు జేయగా నాత్రము...' అనండి.

      తొలగించండి


  8. సత్యా! యగాది సుమ్మీ
    చైత్యమునన్ వచ్చును, రథసప్తమి వేడ్కన్,
    రత్యపు వేగము గా నా
    దిత్యుండు గగనములోన దెస దిద్దుకొనున్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మన్నించాలి. సమస్య తప్పుగా ఇచ్చాను. 'చైత్యము' కాదు 'చైత్రము'. సవరించాను.

      తొలగించండి

    2. ఆహా! చైత్యానికి వేరే అర్థమున్నదన్న మాట !


      జిలేబి

      తొలగించండి
    3. కాత్యాయని పూజ జరుగు
      చైత్యమునన్:..వచ్చును రథసప్తమి వేడ్కన్
      నిత్యము ప్రతి వత్సరమున
      సత్యమ్ముగ మాఘమందు జగడమ్మేలా?

      తొలగించండి
  9. ( ముఖ్యమైన మూడుప్రశ్నలు - ముచ్చటైన సమాధానాలు )
    ఛత్రము వోలె గాచు రఘు
    చంద్రుని పుట్టినరో జదెప్పుడో ?
    వేత్రముతోడ లోకముల
    వీక్షణ జేసెడి సూర్యు పర్వమో ?
    ఆత్రపు భక్తి భాద్రపద
    మందు జతుర్థిన నేమి చేతుమో ?
    చైత్రము నందు వచ్చు ; రథ
    సప్తమి ; గొల్వవలెన్ గణేశునిన్ .

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మన్నించాలి. సమస్యను తప్పుగా ఇచ్చాను. 'చైత్రము' అని సవరించాను. మరో పూరణ వ్రాయండి.

      తొలగించండి
  11. చైత్రమునందువచ్చెడిది ఛాత్రులెరుంగర, పల్కినారిలా
    నాత్రమునన్ గదా యనిరటంచు ననంగయదేలకో మదిన్
    చిత్రమదేనెరుంగకను జెప్పగ మిక్కిలి మంచిమాటలన్
    *"చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పల్కినారిటుల్' అనండి.

      తొలగించండి
  12. చిత్రపు గొంతు కోకిలలు చిత్తము దోచగ
    వచ్చు నెప్పుడో?
    మిత్రుని ముగ్గు తేరులను మేదిని దింపెడు రోజదేదియో?
    పత్రసుమాల పూజలవి ప్రప్రథమమ్ముగ జేయ నెంచినన్..
    చైత్రమునందు వచ్చు, రథసప్తమి, "గొల్వవలెన్ గణేశునిన్"

    రిప్లయితొలగించండి
  13. గాత్రము విప్పును కోకిల
    చైత్యమునన్ ;
    వచ్చును రథసప్తమి వేడ్కన్
    చిత్రము లెన్నియొ జేయు ప
    విత్రుడు రవి చలిని ద్రోల వెచ్చదనముతో

    రిప్లయితొలగించండి


  14. ఉత్పలమాల
    ధాత్రిని పాపభీతిఁగని దైన్యపు దృక్కుల భక్తిమత్తులో
    చిత్ర విచిత్ర వైనముల సేమమొసంగెడు రీతిముంచెడున్
    గృత్రిమ వేషభాషల ప్రవృత్తిఁ బ్రబుద్ధుల వక్రభాష్యముల్
    "చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"

    రిప్లయితొలగించండి
  15. పాత్ర ము గా దిటు పలు క గ
    చిత్ర విచిత్ర ముల విశ్వ సిం ప రు జనులే
    మాత్ర మణుమాత్ర మెక్కడ
    చైత్ర ము న న్ వచ్చును రథ సప్తమి వేడ్క న్?

    రిప్లయితొలగించండి
  16. గాత్రకచేరి జేయు ధర కమ్మని పాటల కోయిలమ్మలే
    మిత్రుడు మాఘమాసమున మింట జనించగ సప్తమీ తిథిన్
    స్తోత్రముతోడ భాద్రపద శుక్ల చతుర్ధిని పత్రపూజతో
    చైత్రమునందు! వచ్చు రథసప్తమి! గొల్వవలెన్ గణేశునిన్!

    రిప్లయితొలగించండి
  17. మిత్రులఁ గూడి కైతలను మేటిగ చెప్ప నుగాది యెప్పుడో?
    ధాత్రిని భాను జన్మదిన తర్పణ లెప్పుడొ యెంచి చూడగన్?
    గాత్రపు బాధఁ దీర్చుటకుఁ గాంచ నవిఘ్నము, మార్గమెద్దియో?
    చైత్రమునందు వచ్చు, రథసప్తమి, కొల్వవలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి


  18. ఆత్రంబేల యుగాదియె
    చైత్ర మునన్ వచ్చును, రథ సప్తమి వేడ్కన్,
    చిత్రరథుడు మార్చు దెస, వి
    చిత్రము గా ఖంబులోన సిరిసిరి మువ్వా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. పుత్రుడు పుట్టెనంచు కడుమోదముతో శశిపోకతెల్పుటన్
    పాత్రునిచేసి పండుగల వాసిని తెల్పుమనంగ నిట్లనెన్
    "చైత్రమునందు వచ్చు రధసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"
    శత్రువుకైన వద్దుగద సంతులు నేర్పరు లౌటనిట్లుగన్

    రిప్లయితొలగించండి
  20. చిత్రమ్మే మీరిటులన
    మిత్రమ యీ రథపు ముగ్గు మీనాక్షులిటన్
    చిత్రమ్ముగ వేసినచో
    *చైత్రమునన్ వచ్చును రథ సప్తమి వేడ్కన్*

    రిప్లయితొలగించండి

  21. ఆకాశవాణికి పంపినది


    రథసప్తమి పన్నెండు ఫిబ్రవరి శుభాకాంక్షలతో

    ఆత్ర పడంగ నేల సఖియా! సరి కొత్తగ వత్సరంబదే
    చైత్రమునందు వచ్చు, రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్,
    చిత్రరథుండు భాస్కరుని చేతులు మోడ్చుచు కాలవాహినిన్
    రేత్రము వృద్ధి గాన సయి రివ్వున సాగగ జీవితంబహో !


    జిలేబి



    రిప్లయితొలగించండి
  22. చిత్రను గూడినట్టిదగు జిత్తజు బూర్ణిమ యెన్నడేర్పడున్ ?
    మిత్రుని జన్మవేడుకది మేదినినందున జేయురెప్పుడున్ ?
    చిత్రములైన పత్రిగొని చిత్తమునందున భక్తిమీరగా
    చైత్రమునందు వచ్చు;రథసప్తమి;గొల్వవలెన్ గణేశునిన్ !

    రిప్లయితొలగించండి
  23. పులిపాక సావిత్రి,నరసరావుపేట.

    ధాత్రిని చాల పండుగలు ధాటిగ సాగు--నుగాది తొల్తగా
    చైత్రము నందు వచ్చు;రథసప్తమి,కొల్వవలెన్ గణేశునిన్
    స్తోత్రముజేయుచున్ మది విశుధ్ధ,ప్రసిధ్ధ,ప్రశస్తితో,యశ
    స్సూత్రము సంధిలన్,మధుర సుందర జీవన రాగమందుచున్.

    రిప్లయితొలగించండి
  24. గాత్రము చక్కజేయుచును గానము కోకిల జేయు టెప్పుడో?
    పాత్రము గాగ సూర్య రథ భవ్య పథం బెపు డెట్లు మారునో?
    స్తోత్ర వినాయకున్ కరుణ చూపగ,బ్రోవగ,మార్గ మెద్దియో?
    చైత్రము నందు--వచ్చు రథ సప్తమి-- కొల్వవలెన్ గణేశునిన్

    రిప్లయితొలగించండి
  25. చైత్రము నందువచ్చురధసప్తమి కొల్వవలెన్ గణేశునిన్
    జిత్రపు బల్కులన్బలికిచిత్తముమాయదిద్రిప్పుచుంటిరే
    చైత్రమునందువచ్చునదిసీతయురాములపెండ్లియేగదా
    పత్రము బూలతో గొలువభర్గుని పుత్రుని నిచ్చుసంపదల్

    రిప్లయితొలగించండి
  26. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య
    చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    ఆరు రుచుల తోడ నూరుబిండిని చేసి నార గింతురు గద నందరు కడు
    ముదముగ వత్సరము మొదటి దినమనుచు తెలుగు యిండ్లలోన్, శోభ నిడెడి
    రాముని పెండ్లి శ్రీరామ నవమి గద, రమ్యమౌ సంవత్సరాది పిదప
    నవమిలో చైత్రము నన్ వచ్చును, రథసప్తమి వేడ్కన్ జేయు భక్తి తోడ

    మాఘ శుక్ల సప్తమి దినమందు, వినుము
    మాఘ బహుళ చతుర్దశి పర్వ దినము
    నందు శివరాత్రి జాగారణమును చేసి
    పూజలను చేతురు ఘనతన్ పురరిపువును

    పచ్చడి

    పచ్చడి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
    • ఊరుబిండి, గుజ్జు, చట్ని, తొక్కు, బజ్జి, సవ్యంజనము.

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు వినమ్రవందనములు.

    చిత్రము కాదు భక్త జన క్షేమము కోరచు లోకమందునన్
    చైత్రము నందు వచ్చు రథసప్తమి, గొల్వవలెన్ గణేశునిన్
    పత్రము ,మేఘపుష్పముల పారణ పాకపు పద్య మాలలన్!
    క్షేత్రము నందునన్ నిలచు శ్రీకర భూషణుడైన గోపతిన్!

    మేఘపుష్పం = నీరు

    రిప్లయితొలగించండి
  28. డాపిట్టా సత్యనారాయణ
    గాత్రము పొగలెగయగ కవి
    నేత్రము లెర్రగను మారి నిగనిగలాడన్
    సూత్రము జ్వరమున దప్పెను
    "చైత్రమునన్ వచ్చును రథ సప్తమి వేడ్కన్"

    రిప్లయితొలగించండి
  29. చైత్రము నందు వచ్చు రథసప్తమి యన్ననె చాలచిక్కగున్
    చిత్ర మమేయమా తిథిని సిద్ధివినాయక పూజ లంచనన్
    మిత్రమ! యింత క్లిష్టమగు మేటి సమస్యను విప్పజాల నే
    చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్.

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    గోత్రము భావనా ఋషిది గొప్పకు బట్టె భవిష్య వాణినిన్
    సూత్రము దప్పి పామరుల చూడ్కుల జోష్యము జెప్పువాడొగిన్
    ఆత్రము తోడ బ్రశ్నలను హాయిగ విప్పు ప్రవీణుడే! యనెన్
    "చైత్రము నందు వచ్చు రథ సప్తమి గొల్వ వలెన్ గణేశునిన్"

    రిప్లయితొలగించండి
  31. పుత్రిక పెండ్లివేడుకలుమోదము గొల్పుచు ముచ్చటించగన్
    పత్రిక లచ్చువేసిరటుపండుగ శోభలు వెల్లువెత్తము
    న్నేత్రుని నేత్రుడౌ రవిని నీమము గొల్చుచు మాఘమాసమున్
    చైత్ర ము నందువచ్చురథసప్తమి గొల్వవలెన్ గణేషునిన్
    కొరుప్రోలు రాధకృష్ణారావు. మీర్ పేట్ రంగారెడ్డి



    రిప్లయితొలగించండి
  32. పుత్రా! వినుముర యుగాది
    చైత్రమునన్వచ్చును,రధసప్తమి వేడ్కన్
    చైత్రపు సప్తమి రోజున
    నాత్రముతోబూజజేతు నాదిత్యునకున్

    రిప్లయితొలగించండి
  33. మిత్ర ఖగసహస్రకిరణ
    చిత్రరథుడ వెలుగులదొర సీరుడతొగదా
    యత్రాహి యరసవల్లీ
    చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్

    రిప్లయితొలగించండి
  34. సూత్రీకరించి శుభ వ
    ర్ణత్రయ సంకలన రీతి నయమొప్పఁగ నా
    రాత్రి యనిద్రన్ గీసిన
    చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్

    [చైత్రము = పటము: చిత్రమునకు(బొమ్మ) సంబంధించినది; రథ సప్తమి = ఏడు రథముల గుంపు]


    చిత్ర రథమ్ము పైఁ బరఁగి శీఘ్రమ నిత్యము సంచరించు ని
    ద్ధాత్రిని సూర్య దేవుఁడు వితాన దయా రస మగ్న చిత్తుఁడై
    పాత్రము నెంచి సూర్య నుతిఁ బన్నుగఁ జేయుడి మీరు ముందుగం
    జైత్రము నందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్

    [చైత్రము = గుడి]

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పత్రము జిలేబి! వేపకు
    చైత్రమునన్ వచ్చును;...రథసప్తమి వేడ్కన్
    పుత్రిక జిలేబి! వచ్చును
    చైత్రమునన్ పెండ్లియాడి జాగ్రత విడువన్

    రిప్లయితొలగించండి
  36. పుత్రుడ! జెప్పుశీఘ్రముగ ముందు నుగాదియె వచ్చు నెప్పుడో?
    మిత్రుని గొల్చి మాఘమున మేలుగ జేసెడి పబ్బమేదియో?
    పత్రము లన్నియున్నొసగి భాద్రపదమ్మున గొల్చునెవ్వరిన్?
    చైత్రము నందు వచ్చు ; రధసప్తమి;గొల్వవలెన్ గణేశునిన్!!!

    రిప్లయితొలగించండి

  37. వచ్చే వారానికి సమస్యాపూరణ

    దత్త పది - కరి గిరి దరి సిరి అన్యార్థంలో దేశభక్తి‌ ప్రబోధకముగా


    పుల్వామా సైనికులకు నివాళి‌ -


    పద! రిపువుల నడచంగ ! మ
    నదేశ భద్రత కొరకు మనమళుకరియె కా
    దు!దువాడించుచు పుల్వము
    గ దునిమి గిరికవలె తిరిగి కసి రివ్వుమనన్ !


    వందేమాతరమ్


    జిలేబి


    రిప్లయితొలగించండి
  38. దయచేసి ఈరోజు ఆకాశవాణిలో యిచ్చిన సమస్య తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  39. ఆత్రంబేలర చిత్రమ
    సూత్రంబులఁ జూడనేల సులభములేరా
    మిత్ర యుగాది రవి పొడమె
    *"చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్"*

    రిప్లయితొలగించండి
  40. కందం
    ధాత్రిని వాహన సేవ ప
    విత్రత లలరంగ మాడ వీథుల శోభా
    యాత్రకు హరి తిరుమల యను
    చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్

    చైత్రమునన్ = ఒకానొక కొండ పై
    వేడ్కన్ = వేడుకలో

    రిప్లయితొలగించండి
  41. చిత్రమదేమి లేదు గద శ్రేష్ఠ "ఉగాది"యు నేత్ర పర్వమై
    చైత్రము నందు వచ్చు; రథ సప్తమి కొల్వవలెన్ గణేషునిన్
    మాత్రమె మర్వబోక ప్రథమంబుగ; కార్యమదేది యైననూ
    పాత్రమదౌను ముందు శివపార్వతి పుత్రుని పూజ సేయగన్

    రిప్లయితొలగించండి