శివుడిని నమ్మితే అగ్ని జ్వాల చల్లని గాలి అవుతుంది, గాఢాంధకారం వెలుగు అవుతుంది, మహాసముద్రం పిల్ల కాలువ అవుతుంది సెగలు కక్కే సూర్య బింబం మంచు ముద్ద అవుతుంది ధూర్జటి వారి భావన
ఈ నాడు శంకరాభరణము సమస్య ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్ ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
భారత సమరమున భీష్ముడు ప్రచండ భానుడై శత్రు మూకలను చెండాడి శిఖండి ఎదురు రాగా అస్త్ర సన్యాసము చేస్తాడు .మరుసటిరోజు కృష్ణుడు పాండవులను వెంటపెట్టుకొని అతని పరాక్రమము వర్ణిస్తూ అతని దగ్గిరకు వెడలి చూడగ అతని ప్రచండ రూపము ఒక్కసారిగా హిమ గోళము గా మారి నట్లు వారికి కనబదినది అను భావన
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు రెండు ముఖ్యమైన పనుల మీద ఉదయం బయలుదేరి వెళ్ళి ఇంతకు ముందే తిరిగి వచ్చాను. పూర్తిగా అలసిపోయి ఉన్నందున ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
కనుడీ మిక్కిలి వింతయె
రిప్లయితొలగించండిమన యుత్తర భారతమున మంచుయె కురియన్
ఘన రవిని కప్పివేయగ
నినబింబము పగటిపూట హిమగోళ మగున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘన కార్యశూరుఁ డిడుములు
రిప్లయితొలగించండిపెనగొన లెక్కించఁడు చను విజయపథమునన్
కనువినికి పూలచెండగు
నినబింబము పగటిపూట హిమగోళ మగున్.
(కనువినికి = పాము)
🙏
తొలగించండి"కనువినికి" ...జిలేబీయము సార్!
తొలగించండిఆరు నెల్లైతే వారు వీరవుతారని సామెత :(
జిలేబి
రిప్లయితొలగించండిమనసున చంద్రుండు కలడు
కనుబొమ్మనసూర్యుడమ్మ కందజిలేబీ
కనుబడ, మదియదుపున్ బడ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...బడ నినబింబము...' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివహ్నిస్తస్య జలాయతే
జలనిధిః కుల్యాయతే తత్క్షణాత్
మేరుస్స్వల్పశిలాయతే ....
యస్యాంగే శీలం సమున్మీలతి !
ఘన సుగుణశీలికిలలో
గన వహ్ని జలంబు , జలధి కాలువ యగు , మే
రునగమ్ము స్వల్పశిలయగు
నినబింబము పగటిపూట హిమగోళమగున్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిమైలవరపు వారిలా అన్న మాట :)
జిలేబి
కనుడీ మిక్కిలి వింతయె
రిప్లయితొలగించండిమన యుత్తర భారతమున మంచుయె కురియం
గ నభమున వ్యాప్తి జెందుచు
నినబింబము పగటిపూట హిమగోళ మగున్"
రిప్లయితొలగించండిమనసున మనసై తనువున
తనువై హృదయంబులో హృదయమై గానన్
మనుగడ రతగురువున్ కెడ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఎనలేని కాంతులీ నుచు
దిన మందున మంచు పూలు దేదీ ప్యంబౌ
కనినం తనెజగ మంతయు
ఇనబింబము పగటి పూట హిమగోళ మగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపనియంచు తిరుగబోకుము
రిప్లయితొలగించండిఘనతరమగు గ్రీష్మమగుట గగనమునందా
యనలోపమభీకరమై
యినబింబము పగటిపూట హిమ! గోళ మగున్.
సంబోధనతో మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆటమొదలు సరదా పూరణ
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
చనుచున్ సతితో వీధిని
కనుగొట్టంగగ వరూధ్ని;...కంపము మీరన్
కనగా ముద్దు ముఖమ్మున
నినబింబము పగటిపూట హిమగోళ మగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కనుగొట్ట వరూధిని కడు కంపము మీరన్" అనండి.
🙏
తొలగించండికనుగొన నీ శిశిరంబున
రిప్లయితొలగించండివనజములు , వనజవదనలు వణకన్ ; డాలస్
ఘననగరమ్మున వింతగ
నినబింబము పగటిపూట హిమగోళ మగున్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ !
తొలగించండిఘనుడగు కవితా దలచిన
రిప్లయితొలగించండికనిపించును వింతలతని కావ్యము నందున్
వినువీధిని యేనుగెగురు
నినబింబము పగటిపూట హిమగోళమగున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'..వీధిని నేను గెగురు' అనండి.
రిప్లయితొలగించండిమనుజుల్ కాలుష్య నివా
రణ మదినెంచక బతుక మరణపు మృదంగం
బనుగీతియై జిలేబీ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘనకార్యదక్షునకెచట
రిప్లయితొలగించండిమినుమేర నసాధ్యమనగ మిథ్యయె గాదే!
యనలము మలయజపవనము
లినబింబము పగటిపూట హిమగోళమగున్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివన ధిని గప్పె తుషార ము
రిప్లయితొలగించండికనబదె గగన ము న నిను డు కాంతులు మెరియన్
కనుగొన కడలిని నయ్యె డ
నినబింబ ము పగటి పూట హిమ గోళ మయెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆచార్య రాణి సదాశివ మూర్తి గారి పూరణ....
రిప్లయితొలగించండికనుడీ మాఘముఖంబున
ఘనఘనఘటసుపటలంబు గప్పగ జగమున్
వనముల తుషార చయముల
నినబింబము పగటిపూట హిమగోళమగున్ !
(తావద్భా రవేర్భాతి యావన్మాఘస్య నోదయ:)
కనరా! వినరా! నరుడా!
రిప్లయితొలగించండిఘనశంకరు లిడ సమస్య, కవులందరకున్
కనని వినని రీతిన నా
*"యినబింబము పగటిపూట హిమగోళ మగున్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితన విక్రమమును చూపగ
రిప్లయితొలగించండినినబింబ ము పగటి పూట, హిమ గోళ మయెన్
జనులకు సంతసమీయగ
ఘన హరిణాక్షుడు నిశిధిన గగనతలంబున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిశిధి' శబ్దం సాధువు కాదనుకుంటాను.
ధన్యవాదాలు గురువు గారు.మార్చిన నాల్గవ పాదం పరిశీలింప మనవి
తొలగించండితన విక్రమమును చూపగ
నినబింబ ము పగటి పూట, హిమ గోళ మయెన్
జనులకు సంతసమీయగ
ఘనుడౌ శశి రాత్రిపూట గగనతలంబున్
కం.
రిప్లయితొలగించండిమన శీతల యంత్రమ్మున
గన,గోళాకార పాత్ర కతమునుంచన్
ఘనరూపంబగుచిట్టుల
"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"
రిప్లయితొలగించండికనురెప్పల నల్లార్చుచు
నునిసిగ్గుల చూచు భూజనుగనన్ కమలా
ప్తుని వంశపు రామునికై
యినబింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
రిప్లయితొలగించండిఅనుకున్నాను జిలేబీ
వినికిడి తక్కువ ఖరారు! విన్నది తప్ప
మ్మ ననంద! యెచ్చట సుమీ
యినబింబము పగటిపూట హిమగోళ మగున్?
జిలేబి
కనుమా! జిలేబి తప్పిట:👇
తొలగించండి"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"
కనగా శీతము నందున:👇
"ఇనబింబము పగటిపూట హితగోళ మగున్"
తొలగించండిఇట్లా అందరూ జిలేబి ని జాతీయం చేసేస్తా వుంటే జిలేబి యేమయ్యేది ? :)
వెంఠనే కాపీరైటు వేసేయాలె :)
జెకె :)
నెనరుల్స్
తలచినందులకు :)
జిలేబి
"jilebi" can't have a copyright. You can file for a "GI Tag" :)
తొలగించండిhttps://www.google.co.in/amp/s/krishijagran.com/news/list-of-state-wise-gi-tagged-products-in-india/%3famp=1
తొలగించండిBut Zilebi is copyrighted :)
Zilebi
కనగా నుత్తర ధృవమది
రిప్లయితొలగించండికనివిని యెఱుగని తుషార కానన మౌగా
యనుమానమేల?వినుమా!
"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"
***)()(***
(అతిశయోక్తి ; Hyperbole)
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి.,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
కన , వెలసె బెంగుళూ రది
వననిధి తీరమునకు దిగువన | వేసవిలో
మనుజులు చల్లగ మనగల |
రినబింబము పగటి పూట హిమగోళ మగున్ !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపని,పాటుల బ్రతుకుల కిల
"మన గొంగళి"(గొర్రెల ఉన్నితో నేసినట్టది)బయటి పనుల మననీ చాలున్
జనముల శీతల యంత్రమె
ఇనబింబము పగటి పూట హిమగోళమగున్
ఇనుడస్తమించు మొదలుకు
రిప్లయితొలగించండివినువీధిని గప్పునటుల ఫేనము గురియన్
ననయపు హిమపాతంబున
నినబింబము పగటిపూట హిమగోళమగున్
కన రెస్కిమోలు నచ్చటి
రిప్లయితొలగించండివినువీధిన ననుదినము సవితను ముదముగన్
కనబడి నన్వేడి తరిగి
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్
గనిలో వనిలో యలసిన
రిప్లయితొలగించండిఘన జీవుల గాంచి తానె కారుణ్యముతో
మనసు ద్రవించగ ప్రేమగ
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్!?
గురుదేవులకు , అందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి===========******===========
ఘనమగు దినమున గురువులు
తన శిష్యులకు నిడిరి గద తర్షము తోడన్
కనిపించు పూరణలలో
నిన బింబము పగటిపూట హిమ గోళమగున్
రిప్లయితొలగించండిఅనుమానంబేల మగువ
కనుకొలకుల నీరుచిమ్మి కన్నీరై ధా
రణమును గ్రమ్మగ నాణ్యమ
యిన బింబము పగటిపూట హిమగోళ మగున్!
జిలేబి
వినదగు నెవ్వరుఁ జెప్పిన
రిప్లయితొలగించండివినినంతనె వేగపడక వివరింపదగున్
వనముల గూల్చు నరుల కే
యినబింబము పగటి పూట హిమగోళమగున్?
జనహితమెరుగని మనిషికి
రిప్లయితొలగించండితన మేధయె తన విరోధి, తన చితి బేర్చున్,
దునుమాడగ అణుయుద్ధము,
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్..
మనమున శివుడిని నమ్మిన
రిప్లయితొలగించండిఅనలము శీతలమగు తిమిరము కాంతియగున్
ఘనజలనిధి కాలువయగు
ఇనబింబము పగటిపూట హిమగోళమగున్
శివుడిని నమ్మితే అగ్ని జ్వాల చల్లని గాలి అవుతుంది, గాఢాంధకారం వెలుగు అవుతుంది, మహాసముద్రం పిల్ల కాలువ అవుతుంది సెగలు కక్కే సూర్య బింబం మంచు ముద్ద అవుతుంది
ధూర్జటి వారి భావన
హనుమను జామాతను గని
రిప్లయితొలగించండితనమది ప్రేమ కలుగప్రతాపము తగ్గెన్
వినయము చూపగ బాగుగ
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్
వినిపించు కొనగ నిష్ట ప
రిప్లయితొలగించండిడని మూర్ఖుడెపుడు పలికెడి డంబము లాపన్
పనిగొని సఫలమయినచో
యినబింబము పగటిపూట హిమగోళ మగున్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ నాడు శంకరాభరణము సమస్య
తొలగించండిఇనబింబము పగటిపూట హిమగోళ మగున్
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
భారత సమరమున భీష్ముడు ప్రచండ భానుడై శత్రు మూకలను చెండాడి శిఖండి ఎదురు రాగా అస్త్ర సన్యాసము చేస్తాడు .మరుసటిరోజు కృష్ణుడు
పాండవులను వెంటపెట్టుకొని అతని పరాక్రమము వర్ణిస్తూ అతని దగ్గిరకు వెడలి చూడగ అతని ప్రచండ రూపము ఒక్కసారిగా హిమ గోళము గా మారి నట్లు వారికి కనబదినది అను భావన
తీక్ష్ణజ్వలన చండ వీక్షణుoడున్ గ్రీష్మ
మపరాహ్ణ తాలిష హర్త సముడు,
క్రోధాగ్ని భరిత. సంక్షోభ హృదయుడు ,రి
పు శలభ దహితుడు పోరులోన
షండుని గని తన శరములు విడనాడి
భీష్మ చండకరుడు పేర కూలె
నుగ, యిన బింబము పగటిపూట హిమగో
ళమగు న్పగిది వద నము కనబడు
చుండె నో ధర్మ నందనా చూడు మయ్య,
నేర్చు కొనగ వలయు రాజ నీతి శాస్త్ర
ములును ధర్మ సూక్ష్మములని మురరిపుండు
పాండు పుత్రుని గాంచుచు పలికెనపుడు
( పేర = భూమి , అంధ్రభారతి ఉవాచ )
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
పెనిమిటి కార్యస్థలమున
నినబింబము పగటిపూట | హిమగోళ మగున్
తన సతి ముఖమున వెలువడ
గ , నిశల ననురాగ చంద్రకాంతి కిరణముల్ !
{ కార్యస్థలము = ఆ ఫీ సు }
`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండిఅనఘా! వ్యాఖ్యల చేర్చెడు
యినబింబము పగటిపూట, హిమగోళ మగున్
మనసున స్మరించుచున్ రా
ముని శరణాగతిని గోరి మునివలె నౌరా :)
జిలేబి
తొలగించండి*మునివలె రాత్రిన్
కనలుచు మిక్కిలి కోప
రిప్లయితొలగించండిమ్మునఁ దాఁ జెలరేఁగు చున్న ముగ్ధుండగు వే
నను గని నంత ముఖము, నా
యిన బింబము, పగటిపూఁట హిమ గోళ మగున్
[ఇనుఁడు = మగఁడు]
స్వనిగోళముగా కనబడు
రిప్లయితొలగించండినినబింబము పగటిపూట, హిమగోళమగున్
అనిశము రాతిరిపూటన,
యనంగమున సూర్యచంద్రు లాడెడి యాటే
కనివిని యెరుగని రీతిని
రిప్లయితొలగించండిఘనముగ గురియుచును మంచు క్రమ్మగ నభమున్
జనులది గని యనిరిట్టుల
నినబింబము పగటిపూట హిమగోళమగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘన వేంకటపతి దిరుగగ
రిప్లయితొలగించండివినతాసుతు నధివసించి వీథులలోనన్
గనగా నాతని నెదుటను
నినబింబము పగటిపూట హిమగోళమయెన్
గురువుగారికీ,కవిమిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు!
తొలగించండిపదధారి అనే సమాసం సరియైనదేనా
రిప్లయితొలగించండిమనుగడయందున మార్పులు
రిప్లయితొలగించండిననవరతము నొక్కరీతి నగుపించక నే
జనవరి చలి గప్పేయగ?
ఇనబింబము పగటిపూట హిమగోళమగున్! (అరుదుగానొకరోజు)
వినుమా! చలికాలమిదియ
రిప్లయితొలగించండికనుమా ! మంచుగురియంగ ఘణఘణ మ్రోగెన్
గనుమా! హాస్టలు నందున,
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"
వినయము తోనినుని గొలువ
రిప్లయితొలగించండిననయము, ననురక్తుడగును నానందముగన్!
అనలము గురిసెడి వాడై
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"!!
***రెండవ పూరణ!
అనిలానలపావకులును
రిప్లయితొలగించండిఘనులాయనసూయసాధ్వి కట్టెదురనుని
ల్వనునడువనుభీతిల్లగ
*"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"*
అనుగు కవిప్రజాపతియై
రిప్లయితొలగించండియనువుగకవితాజగంబునరుణుని వర్ణిం
చెనిటుల్ మనోఫలకమున
*"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"*
మనసనువినువీధి బరగు
రిప్లయితొలగించండిదినమణి యీర్ష్యాభ్రమందు దెరువెరుగక దా
గిన ననిలపుటెరుకతతో
*"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"*
రిప్లయితొలగించండిఅనయము పశుపతి నెదలో
నునిచి తపము జేయ నగ్ని హుప్పని యారున్
వినుమో సన్న్యాసీ యా
ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్. ( పార్వతి కపటసన్న్యాసితో)
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు రెండు ముఖ్యమైన పనుల మీద ఉదయం బయలుదేరి వెళ్ళి ఇంతకు ముందే తిరిగి వచ్చాను. పూర్తిగా అలసిపోయి ఉన్నందున ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
పెనగునపుడు రతిలో పతి
రిప్లయితొలగించండికినబింబము, పగటిపూట హిమగోళ మగున్
వినయముగ నత్తమామల
ననయము భజియించుచు కడు హర్షము నొసగున్
అనుదిన మగపడు నింగిని
రిప్లయితొలగించండియినబింబము ,పగటిపూట హిమగోళమగున్
ఘనుడగు శశియుదయింపగ
కనులారగ గాంచిజనులు కైసేతురిలన్.
వినుమిది జగతిని నిజమౌ
రిప్లయితొలగించండిగన పురుషుడు నింట రాత్రి గాండ్రించెడి వా
డును పిల్లి బయట పోల్చగ
"యినబింబము పగటిపూట హిమగోళ మగున్"
============================
మనమెపుడైనను మిత్రమ
మన కళ్ళకుఁ జలువ జోళ్ళు మన్నిక నెన్నన్
ఘనముగఁ దిలకింపగ నా
యినబింబము పగటి పూట హిమగోళమగున్