3, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2919 (పద్యములలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పద్యములలోన యతులేల ప్రాసలేల"
(లేదా...)
"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా"

121 కామెంట్‌లు:



  1. వలయు మాధురి రసనయు పరిపణముగ
    దానికి వలయును గతి సుధారసము లొ
    లుక వలయునమ్మ పులుగు!పలుకవలదిక
    పద్యములలోన యతులేల ప్రాసలేల!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. పద్యములలోన యతులేల ప్రాసలేల?
    హృద్యముగనుండి పలుకగ హృష్టినొసగి
    విద్యలను గూర్చి వినుటకు విందుగాను
    సద్యశమిడుటకు కవికి శాశ్వతముగ!

    రిప్లయితొలగించండి
  3. యతి గలదు ప్రాస లేదు గా సతము సీస
    పద్యములలోన, యతులేల ప్రాసలేల
    దండ కమున, యతియు,ప్రాస కంద పద్య
    మందు ముఖ్యము గద, విను మయ్య యనుచు
    పలికె శిష్యునితోనొక పండి తుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  4. వచన కవిత లు వ్రాసెడు వార లని రి
    భావ మొక్కటి ప్రక టిoప బంధ మేల
    పద్య ముల లోన యతులేల ప్రాస లేల
    నను చు పల్కు చు రచియింతు రాధు నికులు

    రిప్లయితొలగించండి
  5. భావ కవియొకండు సభను పలికె నిటుల
    యుండు ఛందో నియమములె యుక్తమైన
    పద్యములలోన, యతులేల ప్రాసలేల
    వచన కైతల సృజియించు భావకునకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '.నిటుల నుండు... వచన కవితల...' అనండి. 'వచనకైత' దుష్టసమాసం.

      తొలగించండి


  6. విద్య విలాసి దాయెను! ప్రవేశమమూల్యము పేర్మి తోడుగా
    హృద్యము గావలెన్ పలుకు హృచ్ఛయు‌డిన్ తలపించి కైపుగాన్
    సద్యము ప్రేయసీప్రియులు సన్నిధిసేయ మధూళికల్ తృటిన్
    పద్యము వ్రాయఁగన్, యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ( "సంస్కృతంలో లేని యతిప్రాసలు తెలుగులో ఎందుకు?"
    అని ఒక మిత్రుడు మరొక మిత్రునితో అంటున్నాడు. )
    హృద్యములైన భావములు ;
    స్మృత్యములైన విచిత్రఘట్టముల్ ;
    చోద్యములైన వర్ణనలు ;
    సుందరసూక్తులు జేర్చి శ్రోతృ నై
    వేద్య మొనర్ప సంస్కృతపు
    వృత్తములందున లేక తెన్గులో
    బద్యము వ్రాయగన్ యతులు
    బ్రాసలతో బనియేమి మిత్రమా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మీ పూరణ చాలా బాగున్నదండీ బాపూజీ గారూ! అభినందనలు! అలాగే...
      హృద్యములైన.... నేనూ ఇదే ఎత్తుగడతో నా పూరణను వ్రాశానండీ కాకతాళీయంగా...!

      తొలగించండి
    3. బాపూజీగారూ,చాల చక్కగా చెప్పారండీ!నాకు నిజంగానే సందేహమండీ యిలా యెందుకు యేర్పరచారో! పెద్దలెవవరైనా వివరణ యిస్తే సంతోషం!

      తొలగించండి
  8. రసభ రితమైన కావ్యము రాగ మందు
    విందు జేయును వీనుల వేయి విధుల
    పద్య ములలోన యతులేల ప్రాస లేల
    మతులు బోవును చందస్సు మాని నంత

    రిప్లయితొలగించండి
  9. హృద్యమగుపదములు లేక యింపొసగని
    పద్యములలోన యతులేల ప్రాసలేల?
    చప్పనైన పుస్తకముల చదువనేల ?
    చెన్నగు సమయము వ్యయము చేయనేల?

    రిప్లయితొలగించండి
  10. సేద్యము చేయగా వలయు చెన్నగు ఛందము తోడ రమ్యమౌ
    పద్యము వ్రాయఁగన్. యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా
    గద్యము వ్రాయు వారలకు, కమ్మని వాక్యములన్ ఘటించినన్
    హృద్యపు సంగతుల్ కలిసి యింపొన రించును కన్నవారికిన్

    రిప్లయితొలగించండి


  11. ఏల ? ఛందమదేల కుదేలు మనగ
    పద్యములలోన యతులేల ప్రాసలేల?
    వ్రాసెదమయ గద్యంబున వాణి రాణి
    పలుక నాల్కపైన మధుర వచనమగుచు !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    పద్యమున దిట్లు తిట్టిన పడదు చెవిని
    ఆంగ్లమున జెప్పినప్పుడే నలరు వినతి
    కవిత దిగజారె సామాన్యు కాళ్ళ కడకు
    పద్యములలోన యతులేల ప్రాసలేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నదండీ! అభినందనలు!

      నేనూ ఇదే భావనతో నా పూరణ చేశాను...కాకతాళీయంగా...!

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా మధుర కవి జీఎంఎస్ గారికి కృతజ్ఞతలు

      తొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    "పద్యము వ్రాయగన్ యతులు బ్రాసలతో బనియేల మిత్రమా"
    ఆద్యుడవీవె జెప్ప నిటు నట్లొక యింటికి వాలు స్తంభముల్
    వేద్యములంచు కప్పునిడి పెంపెరలాడ వసింపు మందులో
    చోద్యము!గూలి మీదబడ చూడరె చావగ నిన్ను మిత్రమా!
    పద్యమటన్న చట్రమున భాసిలు;మంత్రమునై శుభంబిడున్

    రిప్లయితొలగించండి
  14. పద్యములలోన యతులేల ప్రాసలేల?
    కారణమడుగు చుండిరుి కందివారు
    కమ్మని దధిబువ్వకు నావకాయ ముక్క
    వలె చెవులకు రుచ్యముపెంచు వాటిజోడు

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    మద్యము గ్రోలగా చషకమన్నదదేలనొ బుడ్డినెత్తగా !
    ఖాద్యము నోటఁజేర్చ కరకంజమదేలనొ ఫోర్కులుండగా !
    అద్యతనీనభావసముదంచితరీతిని నాంగ్లభాషలో
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మైలవరపు వారి చషకపుష్పమంజరి
      కరకజ్జము అమోఘము :)


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. మాన్యులు మైలవరపు వారి పూరణ చాలా బాగున్నది! అభినందనలు!

      నేనును ఇదే భావనతో పూరణ చేశాను....కాకతాళీయముగా...!

      తొలగించండి
    4. శ్రీ దాలినాయుడు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు...💐💐

      మనమిద్దరం కలసి జరుపుకుంటున్నాం.. నా పుట్టినరోజు కూడా నేడే 🙏

      శ్రీ శారదాంబా నమోऽస్తు తే !

      "సద్యశమిమ్మ ! అమ్మ !" యని శారద భక్తి భజించి., చిత్తనై...
      వేద్యమొసంగగా , పరుగుపెట్టుచు వచ్చియు , జిహ్వ నిల్చి , సం...
      పద్యుతశబ్దశక్తినిడి పద్యములన్ పలికించుచుండగా
      పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. జిలేబి:

      "ధన్యవాదాలండీ 🙏(ఉభయులకు)"

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  16. భావ సౌందర్య మొప్పి సబాసనంగ,
    ఉక్తి వైచిత్రి రచనల నుద్భవింప,
    కావ్య రసమయ జగతి ప్రఖ్యాతిఁగాంచ
    పద్యములలోని యతులేల? ప్రాసలేల?

    రిప్లయితొలగించండి


  17. పద్యములలోన యతులేల ప్రాసలేల?
    చోద్యము మన కందివరులే సొమరులీను
    రీతి ప్రశ్నింపగానరె!! రిత్తపుచ్చు
    టేలమా సమయము పొద్దుటేల సూవె :)

    నారాయణ!
    జిలేబి

    రిప్లయితొలగించండి

  18. కాయ్ రాజా కాయ్ :)


    తేటగీతియు లలితగతిని పదముల
    వేల! కందపద్యములాటవెలదులేల !
    పద్యములలోన యతులేల ప్రాసలేల?
    వ్రాసెద జిలేబులమరగ వరుస గాను

    ఇంతకు మించి రాస్తే అయ్యవారలిచ్చట వాయగొట్టెదరు కాబట్టి ఇవ్వాళ్టికి ఫ్యాక్టరీ బందు :)

    పునర్దర్శనం తరువాయి ....


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. ఆద్యులనాది కాలమున యద్భుత శైలిని పొందపర్చుచున్
    హృద్యముగా మదిన్ నిలుప నెంచిగదా నియమమ్ముఁ బెట్టిరే
    పద్యము వ్రాయగన్, యతులుఁ బ్రాసలతోఁ బనియేమి మిత్రమా
    గద్యముఁ వ్రాయనెంచినను కమ్మని శిల్పము చాలు దానికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాలమున నద్భుత...' అనండి.

      తొలగించండి
  20. భావ సౌందర్య మున్నచో బైమెరుగులు,
    శబ్ద రమ్యత యేల యాస్వాదనకును
    రంజిలగ జేయుచును రసరమ్య మైన
    పద్యములలోన యతులేల ప్రాసలేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యేల నాస్వాదనకును' అనండి.

      తొలగించండి
  21. పద్యము వ్రాయగో రినను భావము చక్కగ విందుచే యగన్
    హృద్యము పొంగిపో వగను హృష్టిగ సంతస మందుచున్ వినన్
    గద్యము కన్నమిన్న యగు కావ్యము నందున మెప్పుపొం దెనే
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బనియేమి మిత్రమా

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    హృద్యములైన భావమును హెచ్చిన మోదముతోడఁ దెన్గునన్
    బద్యము వ్రాయఁగా యతులుఁ బ్రాసలతోఁ బనియుండుఁ గాని, నై
    వేద్యము నాంగ్లమందునను పెట్టఁగఁ గీట్సును షేక్స్పియర్లకై,
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా?

    మధురకవి గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హృద్యమునైన... అని చిన్న సవరణతో మఱలఁ బ్రకటించుచున్నాను...

      హృద్యమునైన భావమును హెచ్చిన మోదముతోడఁ దెన్గునన్
      బద్యము వ్రాయఁగా యతులుఁ బ్రాసలతోఁ బనియుండుఁ గాని, నై
      వేద్యము నాంగ్లమందునను పెట్టఁగఁ గీట్సులు షేక్స్పియర్లకై,
      పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా?

      మధురకవి గుండు మధుసూదన్

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా.ప్రాసొడీ ననుసరించారు పూర్వాంగ్ల కవులు.అరవిందుని రచనలు ఆంగ్ల ఛందస్సు ననుసరించినవే.పి.లాల్ మీటర్ లో లేని కవితలను నిరాకరించేవారు.పారిశ్రామిక విప్లవ ప్రభావమే వతన కవితను ప్రోత్సహించినది.

      తొలగించండి
    3. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఈ రోజు శంకరాభరణము సమస్య

    పద్యములలోన, యతులేల ప్రాసలేల

    ఇచ్చిన పాదము తేటగీతి నా పూరణము సీసము
    లో మరియు కొత్త ప్రయోగము ఆంగ్లములో .

    అమెరికా లో నివసించు కుమారునికి తెలుగు గురించి ఒక తండ్రి తెలుపు సందర్భము ఈ పద్యము మొత్తము ఆంగ్లములో అల్లబడినది సరదాగా సుమీ. మీ అభిప్రాయములు తెలుప ప్రార్ధన


    డియరు సన్, ఫాలోమి, హియరు వాట్ ఐ యాము సేయింగు ప్లీజ్ డోంటు సే యె బౌటు
    తెలుగు లాంగ్వేజ్ టూ మి, దేయిరారు సోమెనీ రూల్స్ టు రైటె పొయము, ఫాల్సు ధాటు
    యూ హ్యావు హాడు ఇన్ను యువరు మైండ్, ప్లీజ్ డిలీట్ ఫ్రమ్యువర్ బ్రెయిను , ఇన్న
    మెరికా యె రేంజి వన్ మేలు ట్యూటరు ఫరు తెలుగు ఓన్లి, రిఫరు మదరు
    నేమ్, యు హావ్ టోల్డు సం రీజనింగు దట్టు
    “పద్యములలోన యతులేల ప్రాసలేల”
    ఇన్ను తెలుగు లాంగ్వేజి, టెల్మి దెన్ను, యనుచు
    బలికె నొకడు సుతుని తోడ భాష గూర్చి


    Convertion

    Dear son, follow me. Hear what I am saying. Please don’t say about Telugu
    Language to me . There are so many rules
    to write a poem .False THOUGHT you have had in your mind. Please delete from your brain. In America arrange one male tutor for telugu only. Refer mother name . You have told some reasoning that padyamula lona yatu lela prasa lela in telugu language . Tell me then. Yanuchu balike nokadu sutuni toda bhasha gurchi

    రిప్లయితొలగించండి
  24. పై పద్యము జిలేబి గారికి అంకితము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నాకేదో బెరుకు పుట్టేస్తోందండి :)

      ఓ వైపు జీపీయెస్ వారు రోజుకో పద్యం అంటూ అంకితమిచ్చేసుకుంటూ వెళ్తున్నారు :)

      మీరేమో ఇవ్వాళ జిలేబికంకితం అనేస్తున్నారు :)

      కడుపుబ్బి జిలేబి‌ ఢాం అంటే నా గతేం గాను :)

      జెకె :)

      నెనరుల్స్ మీ‌ అభిమానానికి తలచినందులకు

      ఉభయకుశలోపరి !

      చీర్సు సహిత

      జిలేబి

      తొలగించండి


    2. రిటర్ను గిఫ్టు :) టట్ గీతి :)



      మమ్మి! వై టెల్గు పీపులు మాస్టరింగు
      సచ్చె డిఫికల్టు ఛందస్ మిషనరి జీలు
      వై? ఫరే యీజి లాంగ్వేజు వై స్ట్రగుల్సు ?
      పద్యములలోన యతులేల? ప్రాసలేల?


      జిలేబి

      తొలగించండి
    3. పూసపాటి వారి, జిలేబి గారి ఆంగ్లపూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. పరమ భక్తుడు వ్రాసిన పరవశించి
    మహిమ కలిగిన కావ్యమౌ మహిన నిలుచు
    ఎంచ వలదయ దోషములెన్నడు నెఱ
    పద్యములలోన యతులేల ప్రాసలేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహిని నిలుచు' అనండి.

      తొలగించండి
  26. చోద్యము నీవు చెప్పునది సుంతయు నెక్కదు నాకు చక్కగా
    హృద్య పదమ్ములం గొనుచు నెట్టి నిబంధన లేక వ్రాయ నై
    వేద్యము కాదె కైత జనవాణికి నేల వృథా ప్రయాసలో
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా.

    రిప్లయితొలగించండి
  27. పద్యములలోన యతులేల ప్రాసలేల
    యనుచు బ్రశ్నించ శిష్యుని నయ్యవారు
    పద్య మింపుగా నుండును బాఠకులకు
    సులభ రీతిని కంఠస్ధ ములగు ననెను

    రిప్లయితొలగించండి

  28. వ్రాయు చున్న వశ్లీలమౌ వ్రాత లాయె
    పోవుచున్న సదస్సది బూతు కవుల
    దాయె నీ కేల ఛందము వ్యాకరణము
    పద్యములలోన యతులేల ప్రాసలేల.

    రిప్లయితొలగించండి
  29. పద్యమువ్రాయగన్ యతులుబ్రాసలతోబనియేమి మిత్రమా
    పద్యమనంగనే యతులుబ్రాసలకూడికగానెఱుంగుమా
    హృద్యముగారసాత్మకపు హోయలతోడనురక్తికట్టగా
    పద్యము గూరిచిన్బలుకభావ్యమె?తేలికజేసియిత్తఱిన్

    రిప్లయితొలగించండి
  30. మేనునకుఁ బట్టు వలువల మెఱపు లేల
    కర్ణములకుఁ గుండలపు సువర్ణ మేల
    తోయజాక్షుల కింపగు తొడవు లేల
    పద్యముల లోన యతు లేల ప్రాస లేల


    బద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా
    హృద్యము లై వెసం జెవుల కింపొన రింపవె యీ ద్వయమ్ములే
    గద్యమ మిన్నయౌ ననుట కాదన నొల్లరు కొంద ఱిద్ధరన్
    గద్యముఁ బద్య రాజములఁ గావ్య చయమ్ములు వ్రాయ నొప్పగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విద్యల తల్లియై వెలసి వేళల నెంచక దిద్ది తీర్చుచున్
    హృద్యపు రీతి భాసిలుచు హెచ్చులనాడక శాంతమూర్తియై
    సద్యశ శంకరాభరణ శాస్త్రిని మొట్టగ నొజ్జయుండగా
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా!

    శాస్త్రి = ప్రభాకర శాస్త్రి et al

    రిప్లయితొలగించండి
  32. పద్యముతీయతేనియగ,భావ ము వాహినిబోలుధారగా
    సద్యశమీయ హృద్యపదజాల ము వీనులవిందుసేయ మీ
    గద్యమజంతగేయమగు గావ్య ము,చోద్యమయెన్ దెనుంగులో
    *"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా"*

    రిప్లయితొలగించండి
  33. హృద్యమైనట్టి భావము నింపుగాను
    గణము లన్నియు కుదురుగా గానమొదవ
    పద్యములలోన యతులేల ప్రాసలేల
    స్వేచ్ఛ లేనట్టి బ్రతుకుల నీడ్చినట్లు!!

    రిప్లయితొలగించండి
  34. నా ప్రయత్నం :

    తేటగీతి
    పద్యములలోన యతులేల? ప్రాస లేల?
    యన మధురిమలొలికెడు హృద్యఁపు కవిత్వ
    గంగ భువిపైకి దించెడు లింగడె 'యతి'
    ప్రాణ ధారగ ప్రవహింప 'ప్రాస' వ'సుధ'

    ఉత్పలమాల
    పద్య కవిత్వధార యతి బంధము నాకస గంగ తాకగా
    హృద్యమనంగ నాపు 'యతి' యే హరు ఝూటము! ప్రాస యన్నచోఁ
    దద్యతిఁ బ్రాణధార యన దాకు వసుంధర మాధురీగతిన్
    బద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని! యేమి మిత్రమా!



    రిప్లయితొలగించండి
  35. [2/3, 06:41] Shankarji Dabbikar: పద్యముహృద్యమై కవుల వాక్కునకర్థమొసంగివర్ధిలన్
    పద్యము గద్యమొక్కటన భావ ప్రవాహముతోగవీశ్వరుల్
    *"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ ;బని యేమి మిత్రమా"*
    హృద్యపు దేవభాషయని యిభ్యులనాదరణంబు జేయరా
    [2/3, 06:55] Shankarji Dabbikar: పద్యమది తెన్గుభాషకు ప్రాణ సమము
    హృద్యగమనంబు చేతంబు గద్యమందు
    పద్యములలోన యతులేల ప్రాసలేల
    వృత్తజాత్యుపజాతుల భేద మరయ
    గాని ,వేరొండుహేతువు గానపడదు
    [2/3, 07:24] Shankarji Dabbikar: పద్యముపచ్చబొట్టు కవివ ర్యుల నాదరణంబుజేతురే
    గద్యమునందమౌ నొసట కాంతులజిమ్మనురాగ వర్ధకం
    బాద్యులు గైతవండిరి దివౌకసరాజినుతించ బద్యుకున్
    *"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా"*
    [2/3, 13:53] Shankarji Dabbikar: తెలుగు గుండ్రన తలకట్టు తేనెతీపి
    ప్రాసయతి రాగతాళము లై చరించ
    *"పద్యములలోన; యతులేల ప్రాసలేల"*
    గేయవచనాదులందు వాగ్గేయులనిరి

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పద్యములలోన యతులేల ప్రాసలేల

    సందర్భము: ఒకానొక వచన కవితాభిమాని అంటున్న మాటలు..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పరగఁ బద్యంబుయొక్క గొప్పతన మేమి?
    వచన పద్యం బనన్ వలె వచన కవిత
    నిపుడు.. త ప్పేమి? కాబట్టి.. యిట్టి వచన
    పద్యములలోన యతు లేల? ప్రాస లేల?"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    3.2.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. ప్రాసయతి ప్రాస యాసల బాసహొయలు
    యతులుగణములగతులతో మతులహత్తు
    కొను తెలంగాణ పద్దియమునకుహేల
    *"పద్యములలోన యతులేల ప్రాసలేల"*
    యనకుమీబాసయెదలోతు నరయలేక

    రిప్లయితొలగించండి
  38. మద్యము గ్రోలనెయ్యుడగు మాంసము నగ్నికిగాడ్పువోలె నై
    వేద్యమునిచ్చువేళ యెదవిచ్చి న బూవగు నిండుకుండ యీ
    *"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని; యేమి మిత్రమా"*
    సేద్యముసేయు సైరికుడు చేను కు నీరము సారమేయడా?

    రిప్లయితొలగించండి
  39. సుందరంబగు భాషకు సొంపులలరు
    తెలుగు భాషకు ఛందమ్ము దీరునిచ్చె
    యతులు ప్రాసలు తెలుగుకే; అన్యభాష
    "పద్యములలోన యతులేల ప్రాసలేల"

    మిరియాల ప్రసాదరావు కాకినాడ

    రిప్లయితొలగించండి
  40. డా.పిట్టా సత్యనారాయణ
    వద్దుర భారతమ్ము చదువన్ వలదన్న వినండు నా సుతుం
    "డద్దరి రుక్మిణీ సవతి నాయమ సత్యను గొన్న కృష్ణుడే
    దిద్దెను కాపురమ్ము ఘన దీధితి నందెను;వీలు గల్గగా
    నిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
    సద్దుల మూటగాదె"యను చక్కగ రాముని త్రోవ గానడే
    మద్దెల మ్రోత యింట నిక మా తరమా యువతన్ స్పృశించగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రుక్మిణీ సవతి' అని పూర్వపదం దీర్ఘాంతం? అది దుష్టసమాసం కదా?

      తొలగించండి
  41. విద్యనేర్చిన వాడికి వినయమట్లు
    ధర్మమందున దాగిన దానమట్లు
    ముద్దుమురిపాలు బంచెడి బాలురట్లు
    రాగభావాలునుంచు పరాకుగున్న
    పద్యములలోన యతులేల ప్రసలేల?

    రిప్లయితొలగించండి
  42. డా.పిట్టా సత్యనారాయణ
    ఇద్దరు మ్రోడులు వంధ్యలు
    గద్దరి సంతదియె లేదు కడు చిక్కినదిన్(lean)
    బొద్దుది (fat)వలుపల దాపల
    నిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ

    రిప్లయితొలగించండి
  43. సరస సంగీత రసరమ్య సరళి గలిగి
    భావ సంపద గలిగిన పదములు గల
    తేనెలొలికెడి చక్కని తెలుగు చాలు
    పద్యములలోన యతులేల ప్రాసలేల

    నిన్నటి సమస్యకు నా పూరణ

    ఇద్దరు భార్యలు మరి నా
    కొద్దుర యని కొండనెక్కి గోవిందుండే
    మద్దెల వాద్యమె గద ! యెటు
    లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ

    రిప్లయితొలగించండి
  44. ఆద్యకవిత్వపద్ధతులు నక్కర రానివి యయ్యెఁ గ్రొత్తవౌ
    నద్యతనీయరీతులవి యాదరణీయములై చెలంగె, నా
    స్వాద్యలయాత్ములౌ యతులు ప్రాసలు నాశ్రమవాసు,లీటలై
    పద్యము వ్రాయగన్ యతులు బ్రాసలతో బని యేమి మిత్రమా!

    యతులు=యతీశ్వరులు, ప్రాస=ఈటె,బల్లెము అనే అర్థం లో


    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి

  45. పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని ..యేమి మిత్రమా
    పద్యమనంగ కాదుగద పాటయొ గేయమొ భావగీతమో
    పద్యమటన్న కావ్యపరి భాషకు వేదిక, శారదాంబకున్
    పద్యమె భూషణంబగును పాయస మౌగద తెల్గువారికిన్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  46. తాళబద్ధముగానిది తాండవమ్మె?
    శ్రుతినిబాడని గీతము శుద్ధమగునె?
    పాడియె నిటులబల్కగ పండితుండు
    పద్యములలోన యతులేల ప్రాసలేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాడియె యిటుల...' అనండి.

      తొలగించండి
  47. వాహికగ మారు కవితకు భాష తాను
    నవక వనరచ నకుభావ నాబలమ్మె
    గుండె,పిదపన భివ్యక్తి చూడ,వచన
    పద్యములలోన యతులేల ప్రాసలేల?

    రిప్లయితొలగించండి
  48. పద్యములలోన యతులేల ప్రాసలేల
    యనగ నవియెసొబగు కూర్చు ననవరతము
    పద్యగరిమను పెంచెడు ప్రాస యతుల
    నీసడించుట భావ్యమే నిలను చెపుమ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భావ్యమే యిలను...' అనండి.

      తొలగించండి
  49. ఖాద్యము నందున రుచికి కారము నుప్పును కోర వేతుమా?
    వాద్యము లన్నచో శ్రవణ భాగ్యముఁ గూర్పగ కోరుకుందుమా?
    వైద్యము మాన్పదా రుజను?పాడియె కోరుట ఛందమందునన్
    పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ; బని యేమి మిత్రమా?

    రిప్లయితొలగించండి
  50. మారుమూల పదంబుల నేరి ద్రెచ్చి
    ఛందముల ధార నేలని చావగ్రుక్కి
    వ్రాసినను బాగుబాగను ప్రఖ్య గలుగ
    పద్యముల లోన యతులేల ప్రాసలేల

    రిప్లయితొలగించండి
  51. సరసశబ్దార్ధములు మధురప్రశంసనీయ
    ధారలును గల్గి నుచితజ్ఞతయును గల్గి
    హృద్యమగు నేని సంప్రదాయేతరములు
    పద్యముల లోన యతులేల ప్రాసలేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారూ,
      హృద్యమైన పూరణ. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "సరస శబ్దార్థ మధుర/సహిత ప్రశంసనీయ' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి


  52. మూల మూలల తిరుగుచు ముక్కి నీల్గి
    తప్పులను కన బెట్టుచు తాటవొలిచి
    తాండ వములాడు జనులకు తాదృశమగు
    పద్యముల లోన యతులేల ప్రాసలేల!

    రిప్లయితొలగించండి
  53. హృద్యపు భావమెంచి బహు యింపుగఁ బాఠక లోకమెల్ల నై
    వేద్యము వోలె నిష్టపడ వీలగు మేలు పదాలనెంచి యా
    "పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా"
    చోద్యము గాను మైమరిచి సూక్ష్మముగా లయ తోడఁ బాడులే

    రిప్లయితొలగించండి