కవి పుంగవులు మధుసూదన్ గారు “రాజరాజుకు /న్నర్జున” మీరు కూడ ప్రయోగించారా! నాకు నా ద్విత్వ “న” సమ్మతమే. సహజముగా నుచ్ఛారణ లోనే అది రాగలదు. కవిత్రయ ప్రయోగము లయితే కాన రాలేదు కాని అల్లసాని పెద్దన కూడా ప్రయోగించెను. సంస్కృతములో నయితే కోకొల్లలు.
అవునండీ పోచిరాజు వారూ! తప్పదనుకొన్నప్పుడు మాత్రమే చాలా అరుదుగా దీనిని ఆశ్రయిస్తాను నేను! నేను ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగాలను ఏ ఒకటో రెండో తప్ప ప్రయోగించలేదు! ప్రాచీన కవివతంసులైన పోతన, అల్లసాని వంటి పెద్దలే నాకు మార్గదర్శకులు!
శంకరా భరణము నేటి సమస్య అర్జునున కాప్త మిత్రుఁడౌ నంగరాజు
సీస ములో నా పూరణము
భారత యుద్దము తదుపరి అశ్వమేధ యాగ సమయములో యాగాశ్వమును బభ్రు వాహనుడు బంధించి అర్జునుని అతని సాయము వచ్చిన అంగ రాజగు వృష కేతుని చంపుతాడు. తన తండ్రిని తాను చంపెనని బాధ పడుతుండగా తల్లి వలదని తన మణి తో కృష్ణని ఆజ్ఞ మేరకు అర్జునుని బతికిస్తుంది అప్పుడు అర్జునుడు నేను పునర్జన్మ ఎత్తాను కానీ వృషకేతు లేకుండా నేను ఎట్లు హస్తినాపురమునకు వెడలెదను అనిబాధ పడు చుండగా ఎవరీ వృష కేతు అతను అంగ రాజేగా అర్జునుని మిత్రుడు, అతని గురించి బాధ పడుట ఏల అని శంక బరుస్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు భారత యుద్ధములో మిగిలిన కర్ణుని సంతాన మితడు తండ్రి మరణా నంతరము అర్జునుడు అతనిని అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు అని వివరణము ఇచ్చిన సందర్భము
యాగాశ్వమును బట్టి నర్జునుని సమరమున జంపె బభ్రు వాహనుడు, తనదు తండ్రి మృతికి తన తప్పిదమని తెల్సి చింతించ, వలదని చెప్పి తల్లి మణి తోడ కిరీటికి మందసానమునిడె , “మరణించె వృషకేతు తిరిగి నేను హస్తిన కేరీతి నరుదెంతునని” విజయుండు రోదించుచు నుండ ,శంక కల్గె నెల్లరకును, కాంచిన కృష్ణ్డుడు తెలిపెనిట్లు, వినుమిది వృష కేతు డర్జునున కాప్త మిత్రుఁడౌ నంగరాజు కాదు, నాతడు పుత్రుడు కర్ణునకును నీకు సోదరుడు యగును, నిక్క మిదియె బభ్రు వాహనా యనె కైట భాంతకుండు
మీ కంద పద్య కదంబము గురువారము అందింది. పుస్తకము చాలా చాలా బాగా వచ్చింది. చూడముచ్చటగా ఉంది. శంకరాభరణ బుధవర్గమునందు చేరడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పుస్తకం పంపినందుకు తమరికి ధన్యవాదములు.
స్వర్గ లోకము చేరిన ఇంద్ర తనయు గాంచి ఆహ్వానము పలికిన ఇన సుతుని చూసి అగ్రజుడని ఎరిగి ముదము పొందు అర్జుననకాప్త మిత్రుడౌ నంగరాజు
(కొంతకాలం నరకంలో గడిపి స్వర్గలోకం చేరుతారు భీమార్జున నకుల సహదేవులు. అప్పటికే కర్ణుడు అక్కడ ఉంటాడు. అతడు తమకు అగ్రజుడని కుంతీదేవి వారితో భూమి మీదనే చెప్పి ఉంటుంది. స్వర్గంలో కలుసుకున్న తరువాత భూమి మీద ఉన్నప్పటి వైషమ్యం లేకుండా ఇద్దరూ మిత్రభావంతో ఉన్నారు.)
రిప్లయితొలగించండితర్జన బర్జనేల వసుధన్ మన శత్రువు చేర్చు ధీమతన్,
ఘర్జన చేయ గానతడు గట్టిపడున్ మన ధైర్యమున్ వె సన్
కర్జము పెంపునొందు క్షణకాలములో! మరి యావిధంబుగా
నర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండి'లాజిక్కు'తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిఅక్కురుక్షేత్ర యుద్ధము నంతమగుచు
పాండవుల కందె రాజ్యము, పార్థుఁడడుగ
ధర్మరాజట తలనూపి ధారపోయ
అర్జునన కాప్తమిత్రుఁడౌ నంగరాజు
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికన్నడగునౌ జిలేబియ కదనమందు
నర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
శల్యు డామాద్రి తమ్ముని సారథిగ కు
దుర్చు కొననయ్యె నతడె మృత్యువుని దూత!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మృత్యువుకు దూత' అనండి.
ఇంతే సంగతులు ఈరోజుకు:🙏
రిప్లయితొలగించండివర్జన జేసికుణ్డలలు వాసిగ నక్త్రము దేవరాట్టుకున్
గర్జన కోలుపోయెగద గ్రక్కున చక్రము నేలకూలగా...
తర్జన భర్జనంబులిటు త్రచ్చుచు జేయగ భారతమ్ములో
నర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రీకృష్ణుడు అర్జునునితో..
దుర్జయుడంగరాజతని దుష్టవిధానమె వానిఁజంపె,నీ
గర్జనలేల చంపితినటంచు మృగాధిపు భంగి ? కుంతిచే
ప్రార్జితమైనదౌ వరమె యగ్రజులన్ బ్రతికించె నాడు, నీ...
కర్జున ! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁడాజిలోన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండివాహ్! వాహ్!
కమాల్ కర్ దియే హై జనాబ్ మైలవరపు సాబ్ !
జిలేబి
శ్రీమతి జిలేబీ గారికి.. మీకు ధన్యవాదాలు 🙏🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ
యుధ మందున భయమేల సిద్ధ మవగ
రిప్లయితొలగించండికర్ణు డండగ నుండిన కదన మందు
గెలుపు వోటము లనునవి గీత మార్చు
అర్జునన కాప్తమిత్రుఁడౌ నంగ రాజు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యుద్ధమందున' టైపాటు!
యుద్ధ మందున భయమేల సిద్ధ మవగ
తొలగించండికర్ణు డండగ నుండిన కదన మందు
గెలుపు వోటము లనునవి గీత మార్చు
అర్జునన కాప్తమిత్రుఁడౌ నంగ రాజు
అతడు సురరాజు ;దినరాజు నౌనితండు ;
రిప్లయితొలగించండినతడు ప్రాగ్రాజు ;గ్రహరాజు నౌనితండు ;
వజ్రిసుతు డొక ;డొకడేమొ భానుసుతుడు ;
అర్జునున కాప్తమిత్రుడౌ నంగరాజు .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిజరుగ బోయెడి భీకర సమర మందు
రిప్లయితొలగించండినర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
భీతి కలిగించి పడద్రోసి ఖ్యాతి దెచ్చు
దప్ప కనుచును కురురాజు దలప లేదె ?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(శకునితో దుర్యోధనుడు పలికిన రీతిగా..)
రిప్లయితొలగించండిధర్మజుని జంప శల్యుండు తగినవాడు
భీముడు మృతుడగు నాచేతి వ్రేటు వలన
నకుల సహదేవు లేపాటి నలుప,నింక
అర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[శ్రీకృష్ణుఁ డర్జునునితోఁ గర్ణుఁ డొనరించు కృత్యములను తెలిపుచున్న సందర్భము]
"కర్జముఁ జక్కఁజేయఁగను కానన మందున మీకు బన్నమీన్,
దుర్జనులంత మెచ్చఁగను, దుస్సహ యుద్ధమునన్ జయంతుచే
నిర్జితుఁడయ్యె! నిప్పుడును నెమ్మి మదిం గొని, రాజరాజుకున్,
అర్జున! మిత్రుఁడై, కడు సహాయ మొనర్చెను 'కర్ణుఁ' డాజిలోన్!!"
మధురకవి గుండు మధుసూదన్, ఓరుగల్లు
తెలుపుచున్న...టైపాటు...
తొలగించండికవి పుంగవులు మధుసూదన్ గారు “రాజరాజుకు /న్నర్జున” మీరు కూడ ప్రయోగించారా!
తొలగించండినాకు నా ద్విత్వ “న” సమ్మతమే. సహజముగా నుచ్ఛారణ లోనే అది రాగలదు. కవిత్రయ ప్రయోగము లయితే కాన రాలేదు కాని అల్లసాని పెద్దన కూడా ప్రయోగించెను.
సంస్కృతములో నయితే కోకొల్లలు.
అవునండీ పోచిరాజు వారూ! తప్పదనుకొన్నప్పుడు మాత్రమే చాలా అరుదుగా దీనిని ఆశ్రయిస్తాను నేను! నేను ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగాలను ఏ ఒకటో రెండో తప్ప ప్రయోగించలేదు! ప్రాచీన కవివతంసులైన పోతన, అల్లసాని వంటి పెద్దలే నాకు మార్గదర్శకులు!
తొలగించండిరథము నడు పు చు కృష్ణుడు ర ణ ము నందు
రిప్లయితొలగించండినర్జును న కాప్త మిత్రు డౌ ; నంగ రాజు
శల్య సారథ్యమున తాను శక్తులు డి గి
నీర సిం చె ను రణ మున నిక్క ముగను
శాప గ్రస్తుడు రవిజుడు పాప మనక
రిప్లయితొలగించండిదాన కర్ణుడు పేరొంది తనరు భువిని
సూత పుత్రుడు గానెంచి చోద్య మనుచు
అర్జునున కాప్త మిత్రుఁడౌ నంగ రాజు
పలికె దుర్యోధనుండు సభాంత రమున
రిప్లయితొలగించండిపార్థునీరీతి పొగుడుచున్ బలుకుటేల
మేటి విలుకాదు ధరణిని సాటి యతడె
యర్జునున, కాప్తమిత్రుడౌ నంగరాజు.
కవచకుండలముల గాంచి కర్ణునెరుగి
రిప్లయితొలగించండినపుడు కుంతి పాండుసుతులకైన వాని
జన్మవృత్తాంతమును రహస్యముగ తెల్ప
నర్జనున కాప్తమిత్రుడౌ నంగరాజు
అరిభయంకరు డైనట్టి యాహరియెగ
రిప్లయితొలగించండినర్జునున కాప్తమిత్రుడౌ,నంగరాజు
కర్ణ కుండల ములతోడ ఖమణివలన
కుంతి మాతకు బుట్టెను గుముదమలర
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి(సరిహద్దుపై ముఖాముఖి నెదురైన భారత, పాక్ సైనికుల ముచ్చటింపు)
తమ్ముడా!యెందుకయ్య యీ తగని పోరు
వేషమే వేరు నీ పైన ద్వేష మేది?
రాజ్యకాంక్షకు నేతల రభస యిదియ
"అర్జునునకాప్త మిత్రుడు నంగరాజు"
శంకరా భరణము నేటి సమస్య
రిప్లయితొలగించండిఅర్జునున కాప్త మిత్రుఁడౌ నంగరాజు
సీస ములో నా పూరణము
భారత యుద్దము తదుపరి అశ్వమేధ యాగ సమయములో యాగాశ్వమును బభ్రు వాహనుడు బంధించి అర్జునుని
అతని సాయము వచ్చిన అంగ రాజగు వృష కేతుని చంపుతాడు. తన తండ్రిని తాను చంపెనని బాధ పడుతుండగా
తల్లి వలదని తన మణి తో కృష్ణని ఆజ్ఞ మేరకు అర్జునుని బతికిస్తుంది అప్పుడు అర్జునుడు నేను పునర్జన్మ ఎత్తాను కానీ వృషకేతు లేకుండా నేను ఎట్లు హస్తినాపురమునకు వెడలెదను అనిబాధ పడు చుండగా ఎవరీ వృష కేతు అతను అంగ రాజేగా అర్జునుని మిత్రుడు, అతని గురించి బాధ పడుట ఏల అని శంక బరుస్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు భారత యుద్ధములో మిగిలిన కర్ణుని సంతాన మితడు తండ్రి మరణా నంతరము అర్జునుడు అతనిని అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు అని వివరణము ఇచ్చిన సందర్భము
యాగాశ్వమును బట్టి నర్జునుని సమరమున జంపె బభ్రు వాహనుడు, తనదు
తండ్రి మృతికి తన తప్పిదమని తెల్సి చింతించ, వలదని చెప్పి తల్లి
మణి తోడ కిరీటికి మందసానమునిడె , “మరణించె వృషకేతు తిరిగి నేను
హస్తిన కేరీతి నరుదెంతునని” విజయుండు రోదించుచు నుండ ,శంక
కల్గె నెల్లరకును, కాంచిన కృష్ణ్డుడు తెలిపెనిట్లు, వినుమిది వృష కేతు
డర్జునున కాప్త మిత్రుఁడౌ నంగరాజు
కాదు, నాతడు పుత్రుడు కర్ణునకును
నీకు సోదరుడు యగును, నిక్క మిదియె
బభ్రు వాహనా యనె కైట భాంతకుండు
కృష్ణుడు అర్జునునితో :
రిప్లయితొలగించండిదుర్జనుడంచెరింగియును దుష్టసుయోధను స్నేహబంధ మే
యార్జన కోరకన్ సలిపెనా పృథ పుత్రుడవంచు చెప్పినన్
తర్జనభర్జనల్ పడక తాను సుయోధను పక్షపాతియై
*"అర్జున! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్"*
భారతము చదివె నొకడు బాగుగాను
రిప్లయితొలగించండిబొంకులాడగ నేర్చెను బోకరించె
అర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
చదవవలదయ్య రాముని చరిత యంచు
జనులు వేడె పెచ్చారిని జళుకు బుట్ట
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశల్యు నెంచెను తనకది శాపమనగ
రిప్లయితొలగించండికర్ణురథసారధిగ నాడు కదనమందు
ఫల్గుణుని గెల్పు కావిధి పాటు పడగ
నర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు
నిన్నటి సమస్యకు నా పూరణ
ఆవనమున శివుడుండగ
పావని , పార్వతి గనుఁగొని ప్రార్ధింపంగా
పూనిలుతుడు వల్లె యనగ
భావజు సుమబాణమె యమపాశమ్ము గదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"కర్జము కోసమే రణము గావుము నాపతి నీదు కల్మిడిన్
రిప్లయితొలగించండితర్జని నెత్తి గెల్చితని తప్పకు మానవ నీతి నీయెడన్
గర్జన జేసి యూర్కొనుము కాదొకొ నేనొక సోదరిన్ సుమీ!" (సిపాయి యొక్క భార్య లేఖ సారాంశము;రాఖీ పౌర్ణమి సందర్భంగా)
"అర్జున మిత్రుడై కడు సహాయ మొనర్చెను కర్ణుడాజిలోన్"(ఉస్నే కహా థా హిందీ కథ ఆధారముగా)
డా.పిట్టా సత్యనారాయణ
అస్త్ర శస్త్ర విద్యా నైపు ణాదు లందుఁ
రిప్లయితొలగించండిగర్ణుఁ డెక్కుడ యగు నను నిర్ణయుండు
దుష్ట దుర్యోధనునకుఁ, దాఁ దుల్యుఁ డౌచు
నర్జునున, కాప్తమిత్రుఁడౌ నంగరాజు
అర్జును పైన కక్ష హృదయమ్మున నుండి దహించ నిత్యమున్
దుర్జయ దోర్బ లాతిశయ తుష్ట మనమ్మున జామదగ్ని గు
ర్వార్జిత మస్త్ర పాటవము నంది సుయోధను ధార్తరాష్ట్రు త
ప్తార్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్
[అర్జునము = బంగారు]
దుర్జను డైననున్ వినుముతొయ్యలి కుంతిని నూరడించుచున్
రిప్లయితొలగించండినర్జున, మిత్రుడైకడు సహాయమొనర్చెనుగర్ణుడాజిలోన్
నిర్జితుజేయలేదుగద నీదగుసోదరులెవ్వరిన్ ననిన్
దర్జన భర్జనల్వలదు తామరవిందుని బుత్రుడేగదా
పంచబాణుని జనకుడే యెంచి చూడ
రిప్లయితొలగించండినర్జునున కాప్తమిత్రుఁడౌ, నంగరాజు
కుంతికి రవివరమున చేకూరినట్టి
సుతుడు, బాల్యమున పెరిగె సూతునింట
రిప్లయితొలగించండివర్జనజేసి యస్త్రముల ప్రాజకుడాయను కృష్ణుడాలమున్
నర్జునమిత్రుడై;కడు సహాయమొనర్చెను కర్ణుడాజిలో
దుర్జనుడైన రాజునకు దోరపుజెల్మిని నంగరాజుగన్
నిర్జితుడయ్యెగాదె విధినీమములోబడి శాపమేపగా!
Madam, ప్రణతులు
తొలగించండిమీ కంద పద్య కదంబము గురువారము అందింది. పుస్తకము చాలా చాలా బాగా వచ్చింది. చూడముచ్చటగా ఉంది. శంకరాభరణ బుధవర్గమునందు చేరడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పుస్తకం పంపినందుకు తమరికి ధన్యవాదములు.
సంతోషము,ధన్యవాదములు!
తొలగించండి"కంది శంకరయ్యఫిబ్రవరి 05, 2019 10:33 PM
తొలగించండిజిలేబీ గారూ,
ఆ అన్నా చెల్లెళ్ళ పుస్తకాల డిటిపి క్రెడిట్ నాదే సుమా!"
🙏🙏🙏
తొలగించండిగర్జన నేమియున్ సలుపకన్ రణరంగము లోమురారి తా
రిప్లయితొలగించండినర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను, కర్ణుఁ డా జిలోన్"
గర్జును గల్గ కాదనక కంచర సారధి గా గ్రహించ గా
పర్జును వీడనాడి తన బంధుజనమ్ముల మేలుగోరె తా
తర్జని జూపి శల్యుడు ముదమ్ముగ సాయము జేసె నప్పుడున్
ఈ వృత్తము సోదరి జిలేబికి అంకితము
రిప్లయితొలగించండినిర్జరనాథు కోర్కెపయి నిశ్చల మైన మనమ్ము నిచ్చె తాన్,
రిప్లయితొలగించండికర్జముఁ గుందుశక్తి యని కర్ణుడెరింగియు కుండ లమ్ములన్
దుర్జన సంగతిన్ మెలగి దోషము లంటక, రాజరాజుకున్,
అర్జున! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్
స్వార్జిత పుణ్యమోయనగ పాండవ మధ్యమునండదండయై
రిప్లయితొలగించండిదుర్జననాశమున్సుజన దుఃఖహరార్థమువాసుదేవుడే
*"అర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను ;కర్ణుఁ డాజిలో"*
నార్జితయుద్ధకౌశలము నాయువు దీర గతించె పార్థుచే
వాసుదేవుడునేలనాపాండవులకు
రిప్లయితొలగించండిస్నేహహస్తంబునందించె చెల్వుడనెను?
రాధనందనునేమను రాజరాజు?
*"అర్జునున కాప్తమిత్రుఁడౌ; నంగరాజు"*
అర్జున వేల్పుఱేనికగు దాత్మజువాతడు మిత్రుమిత్రుడై
రిప్లయితొలగించండికర్జములో పరస్పరము వికారమెరుంగకనక్షిసాక్షులై
స్వార్జిత శక్తియుక్తులు ప్రపంచ ప్రవృత్తికి హేతుభూతముల్
*"అర్జున! మిత్రుఁడై ,కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్"*
ఆర్జిత తొడ్గులిచ్చె ,నభయంబిడెగావ సహోదరాళినిన్
నాగుడొసగిన యస్త్రంబు నాడు దప్పె
రిప్లయితొలగించండిశక్రుడొసగిన శక్తి ధ్వంసంబునయ్యె
చేత జిక్కినకౌంతేయు నీతడణ్చ
*"డర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు"*
(సుయోదనుడు మనసులో..)
స్పర్ధచే నర్జునునెదిర్చి సాహసించి
రిప్లయితొలగించండియంగరాజ్యాభిషిక్తుడై యాప్తుడయ్యె
దార్తరాష్ట్రునికానాడు, దగునెయనగ
*"అర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు?"*
అర్జున! మిత్రునాత్మజుడు నాజినజేయుడు దానవీరుడౌ
రిప్లయితొలగించండినర్జున !దేవరాజడిగె, నమ్మయు గోరెను పుత్రభిక్ష నో
యర్జున! యొజ్జశాపమిడె శ్యామశపించుటశల్యుచర్యనీ
*"కర్జున !మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను; కర్ణుఁ డాజిలోన్"*
స్వార్జిత భార్గవాస్త్రమును బారక శాపముతోనశించెలే
కర్జముసానుకూలముగ కాలము సాయమొనర్చె ,భీష్ముడా
రిప్లయితొలగించండిదుర్జయకర్ణునాజికిని దూరము నుంచగ ముప్పుదప్పె నో
*"యర్జున! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్"*
ఆర్జిత పుణ్యమీ తెరగు నాదరువై,విధి వాణ్ణి మ్రింగెలే
కృష్ణ దీవెనలండచే తృష్ణబెరుగ!
రిప్లయితొలగించండిఅర్జునున కాప్తమిత్రుడౌ!"నంగరాజు
రాజరాజున కనుకూల రాజుగాను
యుద్దరంగాన కర్ణుడు బుద్దిశాలి"!
కురుక్షేత్రానంతరము శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో....
రిప్లయితొలగించండిఉత్పలమాల
కర్జము నెంచకే కవచ కాయము దానమొసంగి వజ్రికిన్
యార్జిత విద్యలన్ గురుని యాగ్రహ నిందకు గుర్తు రానివై
దుర్జన సంగతిన్ బెనగి దోర్బలుఁడోడుచు నిస్సహాయుడై
యర్జున! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్
తర్జన భర్జనల్ వలదు ధర్మము నిల్పగ సింహమై యనిన్
రిప్లయితొలగించండిగర్జన జేసి శాత్రువుల కాయము ద్రుంచుమటంచు కృష్ణుడే
యర్జున మిత్రుడై కడు సహాయ మొనర్చెను, కర్ణుడాజిలోన్
దుర్జనుడౌ సుయోధనుని తోడుగ నిల్చిపరాజితుండయెన్.
తర్జన భర్జనల్దగునె దండనయే తగు దార్తరాష్ట్రుకున్
రిప్లయితొలగించండి*"అర్జున! మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్"*
దుర్జయు నాభిమన్యునిని దున్మె చతుష్టయ ప్రేరితుండునై
స్వార్జిత పుణ్యమంతయును శాపవశంబున నీరుగారెలే
కర్జముల న్సుయోధనుని గట్టిగ తోడుగ నిల్చి నిత్యమున్
రిప్లయితొలగించండితర్జన భర్జన ల్సలుపు తావు నొసంగని నమ్ము బంటుగా
నార్జన చేసె గాఢ మగు కమ్మని మైత్రిని నిష్ఠ తోడ నా
గార్జున!మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్.
స్వర్గ లోకము చేరిన ఇంద్ర తనయు
రిప్లయితొలగించండిగాంచి ఆహ్వానము పలికిన ఇన సుతుని
చూసి అగ్రజుడని ఎరిగి ముదము పొందు
అర్జుననకాప్త మిత్రుడౌ నంగరాజు
(కొంతకాలం నరకంలో గడిపి స్వర్గలోకం చేరుతారు భీమార్జున నకుల సహదేవులు. అప్పటికే కర్ణుడు అక్కడ ఉంటాడు. అతడు తమకు అగ్రజుడని కుంతీదేవి వారితో భూమి మీదనే చెప్పి ఉంటుంది. స్వర్గంలో కలుసుకున్న తరువాత భూమి మీద ఉన్నప్పటి వైషమ్యం లేకుండా ఇద్దరూ మిత్రభావంతో ఉన్నారు.)
యాజ్ఙసేనియు పూమాల నవనియందు
రిప్లయితొలగించండినెవరి మెడలోన వేసెతా నింపుతోడ
కురుపతి యెవరి కేమయ్యెకూర్మితోడ
నర్జునున కాప్తమిత్రుడౌ నంగరాజు.