4, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2920 (రారమ్మని పిలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"
(లేదా...)
"రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్"

120 కామెంట్‌లు:

  1. వారిజ నేత్రయె మారగ
    నౌరాయని బుధులు మెచ్చ నానందముతో
    నారాయణ! నారాయణ!
    రారామ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగుంది. కాని భావం బోధ పడలేదు.

      తొలగించండి
    2. వారకాంత హరిభక్తురాలుగా మారిన పిదప తన విటులనందరినీ భక్తులుగా మార్చుటకు ప్రయత్నించినదని భావము. కొంచెం "విప్రనారాయణ" లో నా ప్రియనటి భానుమతి మదిలో మెదలినది :)

      తొలగించండి
    3. నిజమే... దేవదేవి మారింది. కాని మారిన తరువాత విటులను పిలిచి రంజింపజేయలేదు కదా?

      తొలగించండి
    4. "విప్రనారాయణ" sequel నేను తీయబోతున్నాను, వచ్చే జన్మలో తప్పకుండా..

      తొలగించండి


  2. పారుని తన మగడిని తా
    రా రమ్మని పిలిచె సాధ్వి; రంజిల విటులన్
    క్షారితు లారా సరసకు
    రా రండని పిలిచె జంత! రసికత వేరౌ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. నేరము లెంచెడి పతిగని
    రారమ్మని పిలిచె సాధ్వి , రంజిల విటులన్
    కోరుచు మానస మందున
    నీరము వలెస్వఛ్చ మైన నిండు మనంబున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      విరుపుతో పద్యం బాగుంది. కాని విటులను పిలిచిందెవరు?

      తొలగించండి
  4. కోరికతో తన భర్తను
    రారమ్మని పిలిచె సాధ్వి ,రంజిల విటులన్
    కోరెను కాసులు గదిలో
    నారంగుని ముందుగాను నమ్మిక లేకన్

    రిప్లయితొలగించండి
  5. నిన్నటి సమస్యకు కొద్ది నిముషాల క్రితం పూరణలు పంపాను. వీలైతే పరిశీలించండి.

    రిప్లయితొలగించండి


  6. ఏరాళమ్ముగ నెమ్మి తోడు మగడిన్ హేరావళిన్ గట్టి తా
    రా రమ్మంచును బిల్చె సాధ్వి; విటులం రంజింపఁ జేయన్ దమిన్,
    రారండీయని బిల్చె జంత యొకటే రాణంబు ! సూక్ష్మంబు గా
    నౌరా చూడగ వేరు వేరు నెపముల్ నారాచి తీరుల్ సుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఏరాళము, హేరావళి, రాణము, నారాచి పదప్రయోగాలకు నమోవాక్కులు!

      తొలగించండి


    2. మారుమూల పదంబుల నేరి ద్రెచ్చి :)

      నారాయణ నారాచి :)


      జిలేబి

      తొలగించండి

    3. కంది వారు

      నిన్నటి కై పదానికి నేను కూడా మరో సమిధను వే సా కాస్త చూద్దురూ :)


      జిలేబి

      తొలగించండి
  7. ఆరాధ్య దైవమూ!యిటు
    రా!రమ్మని పిల్చె సాధ్వి; రంజిల విటులన్
    గారాలు పల్కి కూల్చెను
    'శారీ' తొలగించి సిగ్గు,చాటు,ను లేకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దైవమా' టైపాటు. సాధ్వి అటు దైవాన్ని, ఇటు విటులను పిలిచిందా?

      తొలగించండి
    2. ధన్యవాదములు సాధ్వి వేరు, వేశ్య వేరు
      వేశ్య పద్యంలో ఇమడలేదు

      తొలగించండి
  8. సవరించిన పూరణ
    --------------------
    నేరము లెంచెడి పతిగని
    రారమ్మని పిలిచె సాధ్వి , రంజిల విటులన్
    కోరుచు ముదముగ గణికయె
    నీరము వలెస్వఛ్చ మైన నిండు మనంబున్

    రిప్లయితొలగించండి
  9. కం.
    శ్రీరామా! నను జేరగ
    రారమ్మని బిలిచె సాధ్వి, రంజిల విటులన్
    ఘోరారణ్యములోపల
    రారమ్మనె శూర్పనఖ వలచుచును వారిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చక్కని విరుపు.స్పష్టమైన భావము బాగున్నది.
      అభినందనలు!కవివర్యులకు.

      తొలగించండి
  10. సారా నిరతము త్రాగు శ

    కారికి మతి లేదొ! కండ కావర మేమో!

    యీ రీతిగ బొంకెనుగా

    "రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      శకారుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    "పారా హుషారు!" హద్దుల
    తీరా రమ్మనుట, మేకు తే!పాతుమనన్
    ఘోరము "మేకిన్ యిండియ"
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్

    రిప్లయితొలగించండి


  12. యేయథామాం ....

    ఆ రాముడొక్కడె ప్రభువు!
    మీరెల్లరు ప్రియులు! జూదమీ బతుకాయెన్
    చేరెద కర్మగ! మనసా
    రా రమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. శ్రీరామా మము బ్రోవగ
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    జేరంగ తనదరికి నా
    వారాంగన హద్దుమీరి పైటను జార్చెన్.

    రిప్లయితొలగించండి
  14. కోరిక మీర గ మగ ని ని
    రా రమ్మని పిలిచె సాధ్వి ; రంజిల విటుల న్
    మేర య లేనట్టి కులుకు
    లారయ కను పి oపగణిక లా మో దము గన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ( అమ్మా నాన్నా అమ్మాయికి ముద్దుగా " సాధ్వి "అని పేరు
    పెట్టారు . పాపం - వాళ్ల కేం తెలుసు భవిష్యత్తు ! )
    సారంబైన వివేకయుక్తి సుతకున్
    సాపేక్షతో ముత్యపుం
    హారమ్ముల్ మెడ వైచి పేరిడిరి భ
    వ్యామోద ముప్పొంగగా
    ధీరత్వమ్మున భావెరుంగకనె సా
    ధ్వీపూత నామమ్మునే ;
    " రార " మ్మంచును బిల్చె సాధ్వి విటులం
    రంజింప జేయన్ దమిన్ .

    రిప్లయితొలగించండి
  16. చేరకుము సాని వాడలు
    కోరుచు ముక్తిపథమునిక కోవెల లోనన్
    నారాయణుఁ సేవింపగ
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్.

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    ఘోరమ్మందును శంకరార్య! యిదియే ఘోరమ్ము స్త్రీ జాతియే
    కారాల్ మీరములున్ తయారుగాన్ మనువునే గాజేతుమే యింక నా
    జారత్వంబుల నంటగట్ట శుభమే శాస్త్రంబులన్ నేర్చియున్
    కారే సాధ్వి శిరోమణుల్ విబుధలై కాఠిన్య మోర్వన్, హరీ!!
    "రా రమ్మంచును బిల్చె "సాధ్వి" విటులన్ రంజింప జేయన్ "దమిన్"?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా, కృతజ్ఞతలు
      తయారయెన్మనువునే గాజేతుమే....తోసవరణ

      తొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    ఔరా ! చక్కని భార్యలన్ వదలి వేశ్యావాటి బోనేల ? తి...
    న్నారో ? లేదొ ? నిమేషమాగ నిదె, యన్నంబింత వడ్డించెదన్ !
    రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్ !
    కారుణ్యామృతమూర్తి యార్తులకు డొక్కాసీతమాంబాఖ్యయే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా!యెంతటి అద్భుతమైన ఆలోచన!రవి గాంచనిచో కవిగాంచును!!విటులకు చక్కని భోజనము వడ్డించుటకు సాధ్వి రారమ్మని పిలు

      చుట!సర్వమానవులలోనూ భగవంతుని చూడడం అంటే అదే!డొక్కా సీతమ్మగారి గొప్పదనాన్ని వర్ణించిన మైలవరపువారికి శతాధిక వఃదసములు!!

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ఏరమణుల పొందు వలదు
    శీరాముని నామ జపమె శీఘ్రమ్మిచ్చున్
    గోరు నిరామయ సౌఖ్యము
    "రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    ఆ రమణియె సాధ్వ్యాహ్వయ!
    సారసలోచనయ! నచట జన్మించిన తా
    వారవనిత కాన, "నిటకు

    రా! ర!" మ్మని పిలిచె ’సాధ్వి’ రంజిల విటులన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండో పాదములో చిన్న మార్పుతో...

      ఆ రమణియె సాధ్వ్యాహ్వయ!
      సారసలోచనయ! యచట జన్మించిన తా
      వారవనిత కాన, "నిటకు
      రా! ర!" మ్మని పిలిచె ’సాధ్వి’ రంజిల విటులన్!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ఏరా!తమకమ్మన కడు
    ఫారా తెగగ్రోలినావు కదరా నీవే
    సారా దండిగ! యెచ్చట
    "రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్

    సందర్భము: ఒక సాధ్వి వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వారి నుద్ధరించా లనే తపనతో క్షణిక సుఖాలకు బానిసలు కా వ ద్దని బోధించే తన ప్రవచనం వినడానికి ఫలానా చోటికి రమ్మని వేశ్యలను విటులను ఆహ్వానిస్తున్నది.
    (దార ప్రవ.. *ర* తేల్చి పలుకాలి.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దారి మరలింప వేశ్యల
    రా ర మ్మని పిలిచె సాధ్వి.. రంజిల విటులన్
    రా ర మ్మని పిలిచెఁ దనదు
    సారోదార ప్రవచనముఁ జక్కగ వినగన్..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.2.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. పేరును వెట్టిరి బిడ్డకు
    తీరుగనే మంచిపేరు తెచ్చునటంచున్
    మారెను జాతకమామెది
    రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్.

    రిప్లయితొలగించండి
  24. వ్యభిచారి యనబడు వనిత దిగంబర కాయము వీక్షించ కాంక్ష కల్ల్గి
    నట్టివాడు,దివిలోన చరించు వేల్పుకైనను నొప్పు నియమము, ముని సతి అన
    సూయను కోరె విష్ణువు బ్రహ్మ శివులతో కూడిన మువ్వురకును దిగంబ
    రముగ భోజనమును తమకు వడ్డించమనుచు,మార్చి వారలను శిశువులుగ,
    నెమ్మితో రా రమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్ దిస మొలను చూపి,

    పుత్ర వాత్సల్యము కలుగ భోజనమును
    పెట్టి నా త్రిమూర్తులను తృప్తి పరచెనుగ,
    మాయ తొలగ త్రిమూర్తులు మానవతిని
    మెచ్చి మెండుగా వరముల నిచ్చెనపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయక్లేశమున్నది.

      తొలగించండి


  25. తారామణి గొప్ప నటి! సి
    తారగ రాజేశ్వరి, భవతారిణి వేషం
    బౌర! నిజ జీవితమ్మున
    రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. శ్రీరమణుని సేవించగ
    రారమ్మని పిలిచెసాధ్వి,రంజిల విటులన్
    నారమ సూరేకాంతము
    కూరిమితో బిలిచెనపుడు కోరికలలరన్

    రిప్లయితొలగించండి
  27. మీరాభజనలువినుటకు
    రారమ్మనిపిలిచెసాధ్వి;రంజిల విటులన్
    గోరెనటవారకాంతయె
    వారమ్మునకొక్కనగనువరుసక్రమమున్!

    రిప్లయితొలగించండి
  28. ఔరా వలదింక నఘము
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్
    తీరుగ జీవించవలయు
    మీరాణులనేలవలయు మీరని కోరెన్

    రిప్లయితొలగించండి


  29. ఔరా! కవివరులారా !
    ధారాళముగ యతి ప్రాస ధారల కై మీ
    రీరీ తియనద గు? నెచట
    రారమ్మని పిలిచె "సాధ్వి" రంజిల విటులన్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. కోరినపతినేగూర్మిగ
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్"
    గారాబమ్మున జవ్వని
    మారామున పిలిచెను ముద మారగమదిలో!!

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి

    """"""""""""""""""" """"""""""


    రామాయణపేట ! సీతారామమ్మ ! శూర్పనఖ !
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    మా " రామాయణపేట " మండలపు గ్రామం బందు బూర్వమ్ము " సీ

    తారామమ్మ " సుసాధ్వి యుండె | కట ! వైధవ్యంబు ప్రాప్తించగా

    మారెన్ దా నొక వేశ్యమాత యయి , సంపాదింపగా ద్రవ్యమున్ |

    రా రమ్మంచును బిల్చె " సాధ్వి " విటులన్ రంజింపజేయన్ దమిన్ |

    దారెన్ మింఠ జనాళి (న్) శూర్పనఖ చందానన్ వగల్ జిందుచున్ |

    ( మింఠుడు = విటుడు : తారెన్ = పిలిచెన్ )

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  32. ఈ రమణీ యోద్యాన వ
    రారామ విలాస తటిని నారయ లేవా
    దారానందము సూడవ
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్

    [రంజిలవు+ ఇటులన్ = రంజిలవిటులన్]


    లేరే యాపెడు వార లెందు నిఁకఁ గేలీలోల యొక్కర్తె క
    ట్టా రాజీవదళాక్షి శార్వరిని వ్రీడన్ వీడి దుశ్శీలయై
    ఘోరంబై చనఁ జూచు వారలకు వాగ్ఘోషాబలా రత్నమే
    రారమ్మంచును బిల్చె, సాధ్వి!, విటులం రంజింపఁ జేయం దమిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణలు రెండూ వివిధ్యమైన విరుపులతో అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  33. "రారా రామ యటంచు నే పలుకగా రాజిల్లు నీ నామముం
    జేర న్వచ్చితివా ప్రభూ శబరికిం జేయూత నీయంగ?" "నౌ

    నో రామా యిట వచ్చినాను విని న న్నోరార నీ యాత్మయే
    రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయం దమిన్."

    ( సాధ్వివి ఇటులం రంజింప....)

    రిప్లయితొలగించండి
  34. గారవమున పతిదేవుని
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల! విటులన్
    పారద్రోలగ బాధిత
    చేరవలదనియె తనదరి, ఛీత్కారముతో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధరరావు గారూ
      మీ పూరణ బాగున్నది అభినందనలు.
      'పారంద్రోలగ' అనండి. లేకుంటే గణదోషం ఏమండీ.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. మీరు సూచించినట్లుగా సవరించానండి
      సవరించిన పద్యం:

      గారవమున పతిదేవుని
      రారమ్మని బిల్చె సాధ్వి రంజిల! విటులన్
      పారంద్రోలగ బాధిత
      చేరవలదనియె తనదరి, ఛీత్కారముతో!

      తొలగించండి
  35. చేరి యిట రాసెను వడుగు:
    "రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"
    కారాదు తప్పు సరి యిది:
    "రారమ్మని పిలిచె సాధ్వి రంజిలు విఠలున్"

    రిప్లయితొలగించండి
  36. పోరాదంటిని సానివాడలకు కామోద్రిక్తులై యివ్విధిన్
    నారాటమ్మది యేల భోగములకై యత్నింప పాపమ్మురా
    శ్రీరామున్ మదిలోనదల్చి గుడిలో సేవింపగా భక్తితో
    రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రజింపజేయన్ దమిన్.

    రిప్లయితొలగించండి
  37. హేరంబుని బూజింపను
    రారమ్మని బిలిచె సాధ్వి;రంజిల విటులన్
    హేరాళమైన మాటల
    మారామున మథురవాణి మంటలబెట్టెన్

    రిప్లయితొలగించండి
  38. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గారాబమ్మున భక్తకోటినటనా కాశీ మహాయాత్రకున్
    రారమ్మంచును బిల్చె సాధ్వి;..విటులం రంజింపఁ జేయన్ దమిన్
    ధారాళమ్ముగ బీరు పోసి నటనల్ ధట్టించి యొప్పించుచున్
    బారుల్ దీయుచు రండు రండనెనునా వారాల కాంతామణీ...
    గారాబమ్మున వాసి లేదుగద యీ కాంతామణుల్ హృత్తునన్ :)

    "విద్యా వినయ సంపన్నే |
    బ్రాహ్మణే గవి హస్తిని |
    శునిచైవ శ్వపాకే చ |
    పండితా స్సమదర్శినః ||"

    రిప్లయితొలగించండి
  39. ఓరమ మగనిని పడకకు
    రా రమ్మనిబిలిచె సాధ్వి! "రంజిలవిటులన్
    నౌరా!చింతామణి యై
    ప్రేరేపణచేత సొమ్మువిరివిగ లాగెన్

    రిప్లయితొలగించండి
  40. నా ప్రయత్నం :

    కందం
    మీరడిగిన యాతిథ్యము
    కూరిమి యనసూయ నొసఁగుఁ కూడుమనుచు నే
    మాఱిచి త్రిమూర్తి వటులన్
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్

    శార్దూలవిక్రీడితము
    వారా వేశ్యలు పాప రోగములవే బాధించ శుశ్రూషకై
    చేరన్నిల్పి 'మదర్తెరీస'! యటకున్ సేవించు చిత్తమ్మునన్
    ప్రారబ్దంపు పరీక్షణాంచితమునన్ రాగన్ ప్రమోదమ్మునన్
    రారామ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్

    రిప్లయితొలగించండి
  41. వీరుడగు పతికి ముద్దిడ
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    వారవనిత విత్తము గొని
    మారుని పోరునకు పిలచె మాపటివేళన్

    రిప్లయితొలగించండి
  42. దారగ భర్తను కేళికి
    రారమ్మని పిలిచె సాధ్వి రంజిల, విటులన్
    వారవనితలకు పొమ్మని
    దూఱుచు వెల్పలకుపంపి దూరము చేసెన్

    రిప్లయితొలగించండి
  43. ఆ రమణీమణి సుమనో
    హరి పతి సేవా నురక్త నామె మగండున్
    కోరికన చాలు సేవలు
    రారమ్మని పిలిచె, సాధ్వి! రంజిల విటులన్

    *రంజిలవు+ఇటులన్

    రిప్లయితొలగించండి
  44. ధీరుండౌ పతినిన్ కనుంగొని నలిన్, తీర్చంగ మై తాపమున్
    రారమ్మంచును బిల్చె సాధ్వి, విటులం రంజింపఁ జేయన్ దమిన్
    ధారాళమ్ముగ పట్టుపుట్టములతో ద్రవ్యమ్ముతో చెచ్చెరన్
    రారా రాతిరివేళ నిక్కకని వారశ్రీ యెఱింగించెతాన్

    రిప్లయితొలగించండి


  45. రారా! సరసకు రారా!
    రారమ్మని పిలిచె, సాధ్వి రంజిల, విటులన్
    యేరా యని జంతయచట,
    సారము గాంచెను బడితయె సరి పతులకు పో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  46. కూరిమినేలగ బసుపతి
    రారమ్మని బిలిచె సాధ్వి;రంజిల విటులన్
    ద్వారమున మబ్బు తరినొ
    య్యారములొలికించుచు వెలయాలొకతుండెన్

    శివరాజలింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  47. ఈ సమస్య "రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్" అన్నదానిలో రంజిల అన్నది అన్వయం కావటం లేదు. ఏది రంజిల అన్నప్రశ్న వస్తుంది కదా? ఉదాహరణకు ఈ పాదం "రారమ్మని పిలిచె మనసు రంజిల విటులన్" అన్నారనుకోండి అన్వయం బాగుంటున్నది. ఒక్కసారి తులనాత్మకంగా చూడండి. ఐతే సమస్య తప్పు అని కాని మార్చమని కాని అనటం లేదు. 'రంజిల' అన్నమాటకు అన్వయం చూపటమూ పూరణలో భాగం కాక తప్పదని మాత్రం చెప్పవలసి ఉంది. ఈ 'రంజిల' అన్న మాటకు ఇప్పటికే ఉందనుకొనో లేదా అన్వయావసరాన్ని ఇతరత్రా గుర్తించకో పూరిస్తే అవి అసమగ్రం అవుతాయని అభిప్రాయం కలుగుతున్నది. ఇక్కడొక పెద్ద ఇబ్బంది ఉన్నది. కందపద్యాన్ని ఇచ్చి భారం మరింత పెద్దది చేసారన్నది గమనిస్తే కొంచెం క్లిష్టసమస్య అనే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  48. నారాయణపాహియనుచు
    *"రారమ్మని పిలిచె సాధ్వి; రంజిల విటులన్"*
    వారాంగనహొయలొలుకుచు
    ధారాళమునగు ననంగ దశలుశమింపన్

    రిప్లయితొలగించండి
  49. దారుల్వేరై మనసా
    రా రమ్మని పిలిచె సాధ్వి రంజిల విటుల
    న్నారీమానసచోరా
    నారాచీ రాధహృదయ నందకిశోరా

    రిప్లయితొలగించండి
  50. శ్రీ రాధారమణావ్యయాచ్యుత హరే!శృంగారదామోదరా!
    *"రారమ్మంచును బిల్చె సాధ్వి ;విటులం రంజింపఁ జేయన్ దమిన్"*
    కారేపూరుషకోటిభృంగములు నీకాంతాననాంభోజమున్
    జేరందాలుదురంచునెంచిబిలిచెన్సింగారమందించగా

    రిప్లయితొలగించండి
  51. శ్రీరంగాహృదయాంతరంగఖగరాజేంద్రాంగనార్కాన్వయా
    సారంగాంకుని రంగపూజశుభ గున్సత్సంగుగొండాడగా
    *"రారమ్మంచును బిల్చె సాధ్వి ;విటులం రంజింపఁ జేయన్ దమిన్"* ఘోరాఘాంధ్యదివాంధమనికిన్ గోసంగభోగంబునై

    రిప్లయితొలగించండి
  52. లేరావేశ్యలు లోకమందు పరమేలీలన్సువేద్యంబగున్
    పోరాక్షారితులాస్థలంబులకు సంభోగార్థులైనిత్యమున్
    నీరానారులగ్రోలు నీగ నరులన్ నెక్కొల్పుటాదర్శమై
    *"రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్"*

    రిప్లయితొలగించండి
  53. దారాబుత్రుల నాదరించక వృథాద్రవ్యంబు బోనాడుచున్
    నారీలోలత మద్యమాంసముల కున్నైవేద్య మున్జేయ రా
    రా!రమ్మంచును బిల్చెసాధ్వి; విటులంరంజింప జేయన్ దమిన్
    నోరారన్ననె పాండురంగడిగ నిన్జూడంగ నేనోపరా

    రిప్లయితొలగించండి
  54. ఏరాళంబుగనారిమాతయని ,యాయింతిన్మహామాతగా
    నారాధించుట భారతీయతని యభ్యాసంబుగాసంస్కృతిన్
    *"రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్"*
    నారిన్గొల్చిన,సంతసింతురట యానాకౌకసుల్ మేలిడన్

    రిప్లయితొలగించండి
  55. ఏరమణీవిటకాండ్రను
    హేరావళిగాదలంచు, నెన్నడువినమే!
    వారాంగననిట్లందురె
    *"రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"?*

    రిప్లయితొలగించండి
  56. కూరలు వలయును వంటకు
    రారమ్మని పిలిచె సాధ్వి.రంజిలవిటుల్
    కూరిమి తోడ పిలిచెనట
    వారాంగన సాగుచున్న వ్యక్తుల గనుచున్.


    శ్రీరాముని కోవెలకును
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    హారాదుల తెమ్మని యెను
    కోరికలుప్పొంగ మదిని కువలయమందున్.


    కోరిన వెల్లయు వండెద
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    కోరిక తీర్చెద వడిగా
    రారమ్మనె వారకాంత రహితో వారిన్


    ఆరామముగన వడిగా
    రారమ్మని సాధ్వి పిలిచె రంజిల విటులన్
    నేరుగ పిలిచెను గోముగ
    కూరిమితో వారవనిత కుటజము చెంతన్.


    రిప్లయితొలగించండి
  57. కూరలు వలయును వంటకు
    రారమ్మని పిలిచె సాధ్వి.రంజిలవిటుల్
    కూరిమి తోడ పిలిచెనట
    వారాంగన సాగుచున్న వ్యక్తుల గనుచున్.


    శ్రీరాముని కోవెలకును
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    హారాదుల తెమ్మని యెను
    కోరికలుప్పొంగ మదిని కువలయమందున్.


    కోరిన వెల్లయు వండెద
    రారమ్మని పిలిచె సాధ్వి, రంజిల విటులన్
    కోరిక తీర్చెద వడిగా
    రారమ్మనె వారకాంత రహితో వారిన్


    ఆరామముగన వడిగా
    రారమ్మని సాధ్వి పిలిచె రంజిల విటులన్
    నేరుగ పిలిచెను గోముగ
    కూరిమితో వారవనిత కుటజము చెంతన్.

    రిప్లయితొలగించండి