శంకరా భరణము నేటి సమస్య ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ కంద పాదము నా పూరణము సీసములో
నెత్తిపై నొక్కతి, హృత్తులో నొక్కతితో మురిసెను గద తుంగు డెపుడు, కొండ క్రింద నొకటి, కోనలో నొకతె తో కోనేటి రాయుడు కులుకు నెపుడు, కుంతి మాద్రుల తోడ కూడి సంతు బడిసెను భారత గాధలో పాండు రాజు సరసన యిద్దఱు సతులున్న వానికెంతొ శమంబౌ, నిడిమట్టు తోటలోన
సత్సుత కుసుమ మాలలు సంత సముగ నల్లగా వచ్చును , వినుము పల్లవోష్ఠి, యనుచు మనువాడె నొకడొక వనితను గుడి లోన ఘనముగా పై కధలు వినిపించి
I am very glad to know that your book "Kanda Kadambamu" has been released by Guruji. Please could you send me a copy of your book?, if possible. Thanks.
V.V. BALAKRISHNA, Special Correspondent, The New Indian Express, Express Publications (Madurai) Limited, H.No. 6-3-113/1, BS Maktha Lane, Somajiguda, Near Grand Kakatiya Hotel, HYDERABAD - 500 016 Mobile No: 8885551896
ఆకాశవాణి వారి సమస్య.... "పన్నెండున రెండు వోవ ఫలితము సున్నే" మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి... padyamairhyd@gmail.com వచ్చే వారం నుండి కార్యక్రమాన్ని సమర్పించేది నేనే కనుక అధిక సంఖ్యలో కవిమిత్రులు పాల్గొన వలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
అన్నన్నా! సున్నేలర ! పన్నెండున రెండు వోవ ఫలితము సున్నే నన్నా నమ్మా గురువులు కన్నా సున్నే ఫలితము గనుమనినారే !
:) జిలేబి ఈ మధ్య పంపించినా ఆకాశవాణివారు పేరు కూడా చదవటం లేదు కాబట్టి నా మెయిలు వారి స్పాము బాక్సులో కెళ్తోందేమో అని సందేహంతో ఇక్కడ వేస్తున్నా ! నా మెయిలు కనబడక పోతే స్పాము బాక్సులో వుందేమో ఓ సారి చూద్దురూ .
నిద్దుర మేల్కొని చూడగ:
రిప్లయితొలగించండి"ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
వద్దిక టైపాట్లు మనకు:
"ఇద్దఱు సతులున్న వాని కెంతొ శ్రమంబౌ"
వత్తు వత్తేసి సమస్యను వత్తే సారు సారూ....
తొలగించండి😆😆😆😆🙏🙏
తొలగించండి🙏
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిటైపాటుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండివద్దుర భార్య లిరువురును
రిప్లయితొలగించండిమద్దెల మ్రోతలు బ్రతుకున మరి మ్రోగునురా
ముద్దుర సతి యెకతె నెటుల
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.
చద్దన్నము తిన్న సుఖముగ
రిప్లయితొలగించండిముద్దుగ నిద్దుర బోయి మొద్దై కలలన్
సద్దుకొని సరస జేరగ
నిద్దరు సతులున్న వాని కెంతొ శమంబౌ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి, రెండవ పాదాలలో గణదోషం. "తిని సుఖముగ... మొద్దుగ నిదురించి మిగుల మొద్దై..." అనండి.
ముద్దుల కైతకన్నియ ప్రమోదముతోడ వరించ సృష్టులన్
రిప్లయితొలగించండిప్రొద్దులఁ బుచ్చవచ్చు, నిలఁ బొల్పున కీర్తివధూటి కాంతయై
నద్దిర జీవితంబనగ హాయి గొనన్ సుఖియించ వచ్చు, నీ
యిద్దరు పెండ్లముల్ గలుగనేని బ్రశాంతత దక్కు నిత్యమున్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
నైవ వ్యాకరణజ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం
తొలగించండిదూరాత్ సంకుచితేవ గచ్ఛతి పున శ్ఛండాలవత్ ఛాందసం
మీమాంసానిపుణం న పుంసకమితి జ్ఞాత్వా నిరస్తాదరాత్
కావ్యాలంకరణజ్ఞమేవ కవితాకన్యా వృణీతే స్వయమ్.
పూర్వకవికృతము.
కంజర్ల రామాచార్య.
"వాణి నా రాణి" అన్నాడు పిల్లమఱ్ఱి
తొలగించండిరామాచార్య గారూ,
తొలగించండికీర్తికాంతను ద్వితీయ కళత్రంగా పేర్కొన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పెద్దల మాటను మీరి యు
రిప్లయితొలగించండితద్దయు ప్రేమించి యొక డు తరుణులిరు వు రిన్
ముద్దుగ పెండ్లాడ నెటుల
ఇద్దరు సతు లు న్న వాని కెంతొ శమంబౌ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ ప్రశ్నార్థకమైన పూరణ బాగున్నది. అభినందనలు.
పెద్దింటిని విడి చిన్నిలు
రిప్లయితొలగించండిముద్దనె; సతి కేసు పెట్ట మూడేడులుగా
నొద్దిక కారాగృహమున
నిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ.
సవరించిన పూరణ
రిప్లయితొలగించండి--------------
చద్దన్నము తిని సుఖముగ
ముద్దుగ నిదురించి మిగుల మొద్దై కలలన్
సద్దుకొని సరస జేరగ
నిద్దరు సతులున్న వాని కెంతొ శమంబౌ
అక్కయ్యా,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెద్దసతి బ్లాగు కాగా,
రిప్లయితొలగించండిముద్దుల వాట్సపు యొకసతి ముదముగ కులుకన్
మద్దెల దరువే చూడన్
ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
శంకరార్యునికి క్షమాపణ లతో
పూసపాటి వారూ,
తొలగించండినన్ను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యోస్మి గురుదేవ
తొలగించండిముద్దుగ నొక్కభామ యిలు
రిప్లయితొలగించండిముచ్చట లూరగ సర్దుబాటుతో
దిద్దుచు నుండగా ; దెరలు
దీసిన తీయని భావసంపదల్
బద్దెములందు నొద్దికగ
బంచుచు సాహితి కీర్తినీయగా ;
నిద్దరు పెండ్లముల్ గలిగె
నేని ప్రశాంతత దక్కు నిత్యమున్ .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండిమద్దెల మ్రోతలై బ్రతుకు మానసమే కడు ఖేద మొందదే?
నిద్దుర లేని రాత్రు లనునిత్యము నిన్ను దహించి వేయదే?
ముద్దుగ నొక్కరున్న సతి మోదము బంచదె? యెవ్విధంబుగా
నిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్?
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅద్దరి మాకందముగా
నిద్దరి యుత్పలముగా తనివి తనరారన్
ముద్దుగ కైపద సేవల
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ !
జిలేబి ;)
పరార్ :)
జిలేబి గారూ,
తొలగించండిసమస్యనిచ్చే విధానంపై మొదటి బాణం సంధించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
ఇద్దరి నున్న పూరుషున కెట్లు భవాబ్ధిని దాటి చేరగా
రిప్లయితొలగించండినద్దరి భార్య యన్న యనువైన మహత్తర యానపాత్రమున్
వద్దన మూఢ తర్కములు వద్దిక పెండ్లికి నొప్పుకొండు మీ
రిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్.
మిస్సన్న గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
🙏
తొలగించండిమిస్సన్నగారూ,అద్భుతమైన పూరణ!మిమ్మల్ని అనుసరించాను!ధన్యవాదములు!
తొలగించండినమస్సులు సీతా దేవి గారు.
తొలగించండి(హిడింబిని వివాహమాడిన సందర్భాన భీమునితో కృష్ణుడు పలికినట్లుగా..)
రిప్లయితొలగించండినిద్దుర కరువై పోయెను
వద్దిల నెవ్వా రికింత భామల పోరున్
ఇద్దఱు బావా!సుఖపడు
మిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!!
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హద్దునొదలి తగవాడే
రిప్లయితొలగించండిమొద్దు సతికి తోడొకరిని పొసగిన, వారే
గుద్దుకు చచ్చెదరు గనుక
నిద్దరు సతులున్న వాని కెంతో శమమౌ
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వదలి'ని 'ఒదిలి' అనరాదు. "హద్దు విడిచి తగువాడెడి" అనండి.
🙏🏽
తొలగించండిముద్దుల ధర్మపత్ని వలపున్ మురిపింపఁగ నుండి తోడుగా
రిప్లయితొలగించండిసుద్దులు చెప్పుచుండ పతి శోభిలు లోకమునందునెల్లెడన్.
ఒద్దికతోడ శాంతిసతీ యొజ్జగు పత్నిగనున్న చాలునీ
యిద్దరు పెండ్లముల్ కలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్.
రామకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
శాంతి సతి' టైపాటు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసలహాల్రావు ...😊(నేనొప్పుకోను)
అద్దరినిద్దరిన్ గలిగి యాపగ సాగును సక్రమమ్ముగా ,
నెద్దరి క్రుంగినన్ పరుగులెత్తు విశృంఖలమైన రీతి .,మేల్
వద్దనవద్దటంచు ద్వికళత్రుడు పల్కెను నన్ను జూచి" నీ...
కిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపెద్దరికపు పిన్నరికపు
రిప్లయితొలగించండిహద్దుల దెలుసుకొని మిగుల నానందముతో
నొద్దికగా మసలు కొనెడి
ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్దెల దరువౌ బ్రతుకిక
రిప్లయితొలగించండినిద్దఱు సతులున్న వాని, కెంతొ శమంబౌ
యొద్దికను గలిగియు సకల
విద్దెలు నేర్చిన కలికియె పెండ్లమె యైనన్
ఒద్దిక నే గలిగిన కా
రిప్లయితొలగించండిడెద్దుల వలెకలిసియుండె యింతులె యైనన్
హద్దులు లేనట్టి సుఖం
బిద్దఱు సతులున్నవాని కెంతొ శమంబౌ.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపొద్దు తిరుకట్టెని నొకతె
నిద్దుర పోవు సమయము గునిసి యాడి వెసన్
గుద్దు శతముఖి మరియొకతె!
యిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ :)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యం:
రిప్లయితొలగించండిపద్దతిగా నొక్క సతియె
యిద్ధరలో నాకు గలద యేమని యనెదన్
హద్దులు లేవుగ కలలకు
"నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
కఠోర సత్యం:
ముద్దుల నీయ నొకరు పిడి
గుద్దుల నింకొకరిడెదరు గువ్వల చెన్నా
పద్ధతి యిదిలే ఫో! యిక
"నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
('గువ్వల' చెన్నుడు గారి స్వానుభవము)
తెలీని విషయం గుఱించి ఏమైనా చెప్పవచ్చు గదా
సుద్దులు చెప్పగ తరమా
ముద్దులొ ముచ్చటలొ నేను మొద్దును దెలియన్
వద్దని యేలనవలె నే
"నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
😄🙏🏻🙏🏻
అద్దరి నన్నమయ్యఁ గను డాయన కీర్తనలద్భుతమ్ములే!
వద్దనలేక నిద్దరిని పద్దతిగాను వివాహమాడెనే
యిద్దరి మధ్యనేమయెనొ యిట్టులఁ బట్టెను భక్తి మార్గమే
"ఇద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్"
వేంకటేశా శరణు శరణు
🙏🏻🙏🏻
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపద్ధతి గాదందురు విను
రిప్లయితొలగించండిమిద్దరు సతులున్న,వాని కెంతొ శమంబో
నిద్ధరను జూడ నొకసతి
ముద్దౌ గానీ తగదిక ముదితలు పల్వుర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశంకరా భరణము నేటి సమస్య
రిప్లయితొలగించండిఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
కంద పాదము నా పూరణము సీసములో
నెత్తిపై నొక్కతి, హృత్తులో నొక్కతితో మురిసెను గద తుంగు డెపుడు,
కొండ క్రింద నొకటి, కోనలో నొకతె తో కోనేటి రాయుడు కులుకు నెపుడు,
కుంతి మాద్రుల తోడ కూడి సంతు బడిసెను భారత గాధలో పాండు రాజు
సరసన యిద్దఱు సతులున్న వానికెంతొ శమంబౌ, నిడిమట్టు తోటలోన
సత్సుత కుసుమ మాలలు సంత సముగ
నల్లగా వచ్చును , వినుము పల్లవోష్ఠి,
యనుచు మనువాడె నొకడొక వనితను గుడి
లోన ఘనముగా పై కధలు వినిపించి
నిడిమట్టు = సంసారము ,హృత్తు = హృదయము ,అంధ్ర భారతి ఉవాచ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివద్దనక కట్టుకొనవే
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
నద్దరి సత్యను గనుమా
ముద్దని శ్రీరాముని సతి ముద్దేమి గనెన్ ?
జిలేబి
వ్వా వ్వా
తొలగించండిత్వరలో మీకు పంపుతాను!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముద్దుగ సిద్ధియు బుద్ధియు
రిప్లయితొలగించండిఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
వద్దుర సంసారంబున
మొద్దుగ తిరుగకు వినోద మొందగ కీడౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమా అయ్యరు గారు రాయమన్నారు :)
పెద్దల మాట మీరితి గుభిల్లుమటంచు జిలేబిదక్కెనే
సుద్దుల త్రోసిపుచ్చి తన శూలపు పల్కుల కాల్చుచుండెగా !
ముద్దుగ మాటలాడెడి ప్రమోద శుభాంగియు ధర్మపత్నులై
యిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅద్దరి ధరణిగ నొకతెయు
నిద్దరి తన కాళ్లమాటుని నొకతె భళిరా
నిద్దుర యే యోగముగా
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
జిలేబి
మీకు యెలా పంపాలో తెలియజేయండి!
తొలగించండి
తొలగించండిఅన్నయ్య గారి దగ్గర వివరములు గలవు.
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అన్నయ్య గారి దగ్గర వివరములు గలవు.
తొలగించండిజిలేబి"
Secret...
హద్దులుమీరని కామపు
రిప్లయితొలగించండిబద్ధులజేసి చిరకాల బాంధవ్యమునన్
ముద్దుగ సంతానముగన
నిద్దరు,సతులున్న వారికెంతొ శమంబౌ!
బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షల నందించినందులకు ధన్యవాదములు!మీ అందరి ఆశీస్సులతో గురువుగారి చేతులమీదుగా గ్రంథావిష్కరణ సభ దిగ్విజయంగా
తొలగించండిరిగినదని తెలుపుటకు యెంతో ఆనందిస్తునన్నాను!
Respected Madam,
తొలగించండిI am very glad to know that your book "Kanda Kadambamu" has been released by Guruji. Please could you send me a copy of your book?, if possible. Thanks.
V.V. BALAKRISHNA,
Special Correspondent,
The New Indian Express,
Express Publications (Madurai) Limited,
H.No. 6-3-113/1,
BS Maktha Lane,
Somajiguda,
Near Grand Kakatiya Hotel,
HYDERABAD - 500 016
Mobile No: 8885551896
తప్పక పంపుతాను.మరోమాట మరచాను,నా పుస్తకాన్ని గురువుగారికే అంకితమిచ్చాను!
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ముద్దుల కొక చెంపను పిడి
గుద్దుల కొక చెంప నిచ్చి కూలబడవలెన్..
వద్దుర బాబూ! అనబో
"కిద్దఱు సతు లున్న వాని కెంతొ శమంబౌ"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
2.2.19
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆకాశవాణి వారి సమస్య....
రిప్లయితొలగించండి"పన్నెండున రెండు వోవ ఫలితము సున్నే"
మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
padyamairhyd@gmail.com
వచ్చే వారం నుండి కార్యక్రమాన్ని సమర్పించేది నేనే కనుక అధిక సంఖ్యలో కవిమిత్రులు పాల్గొన వలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
తొలగించండిఅన్నన్నా! సున్నేలర !
పన్నెండున రెండు వోవ ఫలితము సున్నే
నన్నా నమ్మా గురువులు
కన్నా సున్నే ఫలితము గనుమనినారే !
:)
జిలేబి
ఈ మధ్య పంపించినా ఆకాశవాణివారు పేరు కూడా చదవటం లేదు కాబట్టి నా మెయిలు వారి స్పాము బాక్సులో కెళ్తోందేమో అని సందేహంతో ఇక్కడ వేస్తున్నా ! నా మెయిలు కనబడక పోతే స్పాము బాక్సులో వుందేమో ఓ సారి చూద్దురూ .
జిలేబి
తొలగించండిసున్నుండలు దోసెలనున్
మిన్నగ తిప్పడము రాదు ! మీదు చపాతీల్
చెన్నుగ వేయగ రాదే!
పన్నెండున రెండు వోవ ఫలితము సున్నే !
జిలేబి
పంపగానే మీకు స్వయంజనిత ప్రత్యుత్తరము వచ్చును కదా.
తొలగించండిఅది రాక పోతే నిరర్థక పేటిక కేఁగినట్లేమో.
తొలగించండి:)
స్వయంజనిత ప్రత్యుత్తరము
నిరర్థక పేటిక !
మీకు మీరే సాటి !
జిలేబి
జిలేబిగారితో యేకీభవిస్తున్నాను!
తొలగించండిఈరోజు మీ పద్యం చదవలేదు కాని పేరు చదివారు. అంటే చేరుతున్నట్టే కదా!
తొలగించండిసుంద రేందిందిర బృందానంద సంచరిత కుంద మాకంద కందచ్ఛంద వందనీయ పద్య కదంబములు గూర్చిన మీకు శుభాభినందనలు డా. సీతా దేవి గారు!
తొలగించండి
తొలగించండిఅరెరే చూడండయ యు
త్తరము నిరర్థకపు పేటి దాగెనకో న
త్తరి?కంది శంకర తెలుపు
డరయగ మాకు దయచేసి టప్పున సుమ్మీ
***
అత్తరి స్వయంజనిత ప్ర
త్యుత్తరమది వచ్చినదకొ తూణీరముగా?
సత్తెము గా చేరినటులె
నుత్తర మమ్మా జిలేబి నొవ్వు బడయకే :)
జిలేబి
పూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు,నమస్సులు! దయచేసి మీ చిరునామా తెలిపినచో నా పుస్తకము మీకంపెదను!మీ సమీక్ష నాకు గౌరవకారణముగ భావించెదను!
తొలగించండిమీ అన్నయ్య గారి వద్ద ఉందండి. ఆయన పుస్తకమును నాకు పంపినా రిదివఱకు. ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిహద్దరి బన్నా నెమ్మిని
చద్దెపు వణ్ణము వలెన్ కొసరి కొసరి నిడెన్
పొద్దనక రాత్రనక నా
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితద్దయు ప్రేమను జూపుచు
రిప్లయితొలగించండినిద్దరునట కలిసిమెలిసి యిష్టముతోడన్
బెద్దల మెప్పులు బొందెడు
నిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదిద్దిన యక్షరములతోఁ
రిప్లయితొలగించండిబెద్దల సంపాదనమునఁ బే రాస్తులతో
నద్దిర కృప వాణీ రమ
లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
పెద్దగ దుడ్డు లుండగను బెంచిన తుందము తోడ నున్న యే
దుద్దున కైన నిక్కముగఁ దోటి జనమ్ములఁ గోప మూనకే
సుద్దుల నైనఁ జేతలను శుద్ధ శమేద్ధ దమమ్ము నాఁగ వా
రిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
చాలా బాగుంది కామేశ్వరరావు గారు
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.
తొలగించండిధన్యవాదములు కృష్ణ సూర్య కుమార్ గారు.
తద్దయు బ్రేమతో భువిని దల్లియుదండ్రియు వోలె మెల్గుచున్
రిప్లయితొలగించండిబెద్దల మెప్పుకోలెపుడు ప్రేమను నొందుచు నుండుచోనికన్
నిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతతదక్కు నిత్యమున్
సుద్దిది సత్యమేయనుట సూనృత వాక్యము నమ్ముడార్యుడా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
సెకండ్ సెటప్:
కద్దుగ రెండునున్నవిగ కన్నులు కాళ్ళును చెవ్లు చేతులున్
ముద్దుగ తిత్తులూపిరివి ముక్కుకు తూటులు మూత్రపిండముల్
కొద్దిగ కష్టమైన సరి కొండొక దానికి స్పేరు పార్టుగా
నిద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివద్దే వద్దు! జిలేబీల్
ముద్దని మనువాడకు! మును ముందర గండం
బద్దరి! నమ్మకు నిజమని
నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితద్దయు కష్టములు కలుగు
రిప్లయితొలగించండినిద్దఱు సతులున్న వాని, కెంతొ శమంబౌ
హద్దులలోచరియించెడి
ముద్దియ పత్నిగను చిక్కి మోదము నొసగన్
ఒద్దికగా చరించునొక యుగ్మలి పాదములొత్తు చుండగన్
రిప్లయితొలగించండిముద్దుగ శీర్షమున్ నిలిపి ముద్దియ యొక్కటి సక్థిపై దృతిన్
తద్దయు ప్రీతితో విసర తాళపు వృంతము తోడ వాని కే
యిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిముద్దులు నొకరికి మరియును
రిప్లయితొలగించండినిద్దురలో సుఖముకొకరును నియమముజేయన్
ముద్దనుకొన?"కలలోనే
ఇద్దరుసతులున్న వానికెంతొ శమంబౌ"!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహద్దులు మీరిన దేదియు
రిప్లయితొలగించండిముద్దుగ నిల నుండబోదు ముప్పున ముంచున్
వద్దుర నీకిది , యేవిధి
యిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ?!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహద్దును మీరబోకు మది యాతన పెంచునటంచు సుద్దులన్
రిప్లయితొలగించండిబెద్దలు చెప్పిరే మునుపు, వేదన తప్పదు పూరుషుండ్రకే
యిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
నొద్దిక గల్గినట్టి సపి యొక్కతి యున్నపుడంచు గొప్పగా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
శుద్ధిగ లక్ష్మి సరస్వతు
లిద్దఱు దయతోడ నింటి నేలిన ముదమౌ
సిద్ధిగ హరిహరులంపిన
లిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ
షట్కర్మయుక్తా కులధర్మపత్నీ...
ఉత్పలమాల
హద్దుల కార్యదర్శి కరణాదుల మంత్రిగ లక్ష్మిరూపమై
యొద్దిక నోర్మినిన్ ధరణి నొప్పెడు నల్గురి తోడ నామెలో
శుద్ధిగ భుక్తికిన్ జనని సొంపున రంభగ ముంచి తేల్చువా
రిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిముద్దియలా నిటలాక్షున
రిప్లయితొలగించండికిద్దరు సుతులున్న వాని కెంతరశమంబో
నొద్దికగా నా యిరువురు
సుద్దులు చెప్పగ వినుచును శూలియు మురిసెన్.
పద్ధతి గాదందురు విను
రిప్లయితొలగించండిమిద్దరు సతులున్న,వాని కెంతొ శమంబో
నిద్ధరను జూడ నొకసతి
ముద్దౌ గానీ తగదిక ముదితలు పల్వుర్
పోచిరాజు వారు ప్రత్యుత్తరం ఇవ్వటంలో కొంత జాప్యం వహిస్తారేమో! నేను పంపిన గూగుల్ invite కి సమాధానం లేదు.
రిప్లయితొలగించండిఇద్దఱుభూమిమాధవి మహోద రుడయ్యెరమాధవాహరీ
రిప్లయితొలగించండిఇద్దఱుమాధవాపగలునీశుడు,వళ్లియుదేవసేనలున్
ముద్దగుకార్తికేయునకు,బుద్ధియు శుద్ధియునేకదంతుకున్
ఒద్దికముద్దరాండ్రజతయోరిమిసౌఖ్యముగీర్తిశ్రీలిడెన్
ముద్దుగ మార్గదర్శనము ముందుతరాలకువారిబాటలో
*"ఇద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్"*
[2/2, 08:17] Shankarji Dabbikar: ముద్దుగశంకరాభరణపూరుషకోటికినిద్దరాండ్రునౌ
రిప్లయితొలగించండిముద్దుసమస్యపూరణలబుద్ధి ప్రవృత్తులగావ్యభామినీ
యొద్దికముద్దరాలుతనువుల్లమువాయిడెసూత్రబంధనన్
*"ఇద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్"*
[2/2, 08:19] Shankarji Dabbikar: ముద్దులగైతపడంతియు
సుద్దులబోధించుచుండు సుదతిసచివురా
లొద్దికసలహాలిడుధర
*"నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"*
[2/2, 08:21] Shankarji Dabbikar: హద్దులు దాటకముద్దుగ
*"నిద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"*
సిద్ధిడబుద్ధిడ,శ్రీభూ
ముద్దుసతు లుమాత్రిధార పురుషులపత్నుల్
[2/2, 09:35] Shankarji Dabbikar: పద్ధతి శ్రీనివాసునకు భామలునిద్దరు శ్రీవసుంధరల్
ముద్దుగనిద్దరాండ్రు బరము న్నిహమాత్మ విచారశీలికిన్
ఒద్దికగైతనాతిహితమున్నిడుమానినులాకవీశుకున్
*"ఇద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్"*
[2/2, 10:46] Shankarji Dabbikar: ఒద్దికసతియిహమొసగును
పద్దతిమీరినసతియిడుపరసౌఖ్యంబున్
ఇద్దరుశ్రేయోదాయులె
*"ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"*
ముద్దుగ శిగలో నొకతెను
రిప్లయితొలగించండివొద్దిక సగమున బిగియార వొత్తుచు నొకతెన్
హద్దులె యెరుగని పొద్దుల
నిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ