26, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2941 (వాసన లేని పూవులన....)

కవిమిత్రులారా 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ"
(లేదా...)
"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్" 

36 కామెంట్‌లు:

 1. కాసులు మోపులు పోయుచు
  రోసముతో నాడుబిడ్డ రుసరుస లాడన్
  వాసిగ పసిడిని జేసిన
  వాసన లేని పువులనిన భామకుఁ బ్రియమౌ :)

  రిప్లయితొలగించండి
 2. పూసిన తావికి నోచని
  కోసిన చాలును వాడ కుండిన విరుల్
  రాసులు పోసిన యందము
  వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  రిప్లయితొలగించండి


 3. మోసము లేని పెన్మిటిని మోహము గా మది లోన నిల్పు, తా
  దోసము లేని బంధువుల దోసిలి యొగ్గి నమస్కరించు తా
  రాసము చేయ దెవ్వరిని రాగిణి యంబురుహాక్షి, పుస్తు దు
  ర్వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్!  జిలేబి

  రిప్లయితొలగించండి 4. మోసము లేని మగండన
  దోసము లేని స్వజనులు, విదురులన మాయల్
  వైసికము లేని యా దు
  ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. మోసము జేయకు జనులను
  హాసము గాదట మనుగడ హరి పుత్రుండౌ
  రోసము పెంచుకు బ్రతికెడి
  వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 6. ( రుక్మిణి తులసీదళంతో తూచి శ్రీకృష్ణుని నారదుని సేవ
  నుండి తప్పించినా సత్యభామకు అంతరంగంలో పారిజాత
  పరిమళం పైన అనాసక్తి అధికమై అనుకొంటున్నది )
  " వాసన గొప్పదంచు మరి
  వాడని పుష్పమటంచు నారదుం
  డా సమయాన నాథునకు
  నందగజేయ సపత్నులున్ బరీ
  హాసము సల్ప నందితిని
  హా ! వ్యధ " నంచును బారిజాతపుం
  వాసన లేని పూవులన
  భామ ముదంబున జూపు నిష్టమున్ .

  రిప్లయితొలగించండి
 7. కంద పద్య పాదంలో నాలుగవ గణం ర అయింది కదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవదు.బ్రి లో రకారము తేలికగా పలుకబడడము వలన పూర్వాక్షరము లఘువే,గురువుకాదు.ఒకే పదమయిన,ఉ.దా.మిత్రుడులో మి గురువౌతుంది.

   తొలగించండి
 8. వాసమునందలి వనమున
  పూసిన పలువిధములైన పూవులలోనన్
  నాసికకు సరిపడెడు దు
  ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 9. వాసన కలిగిన పూవుల
  తో సిగపైనను ముడువగ తొందర పడుచున్
  ఈసుని పూజించుటకై
  వాసన లేనిపువులనిన భామకు బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 10. పూసల హారము,చీరలు,
  కాసిని బంగారు నగలు,కాళ్ళకు అందెల్,
  భాసురముగ కాటుక,దు
  ర్వాసన లేని పువులనిన భామకు ప్రియమౌ.

  రిప్లయితొలగించండి
 11. సవరణతో
  వాసన కలిగిన పూవుల
  తో సిగపైనను ముడువగ తొందర పడుచున్
  ఈసుని పూజించుటకై
  వాసన లేనిపువులనిన భామిని మురియున్

  రిప్లయితొలగించండి


 12. కాసింత బుద్ధి మందము
  వీసరపోవుమగడాయె వెతపడు బతుకున్
  కీసరబాసర మాటలు
  వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. వేసవినైనను పసిమిని
  వాసిగనుంచెడు బువులను వాజుననుంచన్
  వేసటలేనివి కృతకపు
  వాసనలేని పువులనిన భామకు బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 14. వ్రాసిన చక్కని పద్యము
  చేసిన సత్కార్య మిలను చెన్న గు చుండన్
  భాసిలెడి వైన నెట్టు ల
  వాసన లేనట్టి పువులని న భామ కు బ్రియమౌ?

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ


  దోసెడు మల్లెపూలు గొని , తొందరగా నిలు చేరి , సెజ్జపై
  పోసి వికీర్ణమౌనటుల , పొందగ స్వర్గసుఖమ్మునెంచితిన్ !
  మోసము జేసె వాడనుచు , ముద్దిడి పొట్లము విప్పి చూడుమీ
  వాసన లేని పూవు లన ., భామ ముదంబునఁ జూపు *నిష్టమున్*!

  ( ఇష్టము భర్తపై )

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 16. దోసిట పట్టగ సుమములు
  వీసెడు దొరుకుట గగనము వీడున నేడున్
  వాసిగ సమకొను వాడని
  వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 17. దోసముదైవారాధన
  వాసనలేనిపువులనిన,భామకుబ్రియమౌ
  వాసనగలిగెడుబూలను
  దోసముగానెంచరెపుడుతొయ్యలులెవరున్

  రిప్లయితొలగించండి
 18. దూసెను రాముడు రాక్షసి
  నాసిక కర్ణములు చుప్పనాతికి పోయెన్
  నాసాపుటములయో నిక
  వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 19. వేసరి మిక్కిలి తెచ్చితి
  వీ సంపెఁగ పువ్వు లుంచు మిచ్చోటను నీ
  దోసము లే దించుక దు
  ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ


  కోసితిఁ బ్రీతి తోడుతను గోమలి చిత్తము సంతసింపగాఁ
  జేసి తరింతు నం చకట చిత్రము మెచ్చదు నీదు దార యీ
  భాసిత పుష్ప సంచయము పంచితిఁ గోకనదమ్ము లిందు లే
  వాసన! లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్

  [లేవు +ఆసన = లే వాసన; ఆసనుఁడు = కూర్చున్నవాఁడు]

  రిప్లయితొలగించండి
 20. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మోసము జేయుచున్ జనుల మోహిని వోలుచు నాట్యమాడుచున్
  కోసుల దూరమున్ వెడలి కోరుచు దిల్లిని నాక్రమించగన్
  వాసిగ భద్రకాళికిడ బంగలు రాణిని బ్రోచుమంచుటన్
  వాసన లేని పూవులన భామ ముదంబునఁ జూపు నిష్టమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాసిగ భాగ్యలక్ష్మి తన భర్తను రంజిల మున్నురాత్రులన్
   వాసన మెండుగా గలవి వందల మల్లెల సింగరించగా
   దోసము లేకయే తనది తొంబల సంతులు సంభవించగా
   వాసన లేని పూవులన భామ ముదంబునఁ జూపు నిష్టమున్

   తొలగించండి
 21. ఏ సుమముల తావియు తన
  నాసికకు పడని వధూటి నా సతి యనగా
  నా సిగ ముడువంగ నెపుడు
  వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ!

  గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి పూరణ కూడా పరిశీలించ ప్రార్థన.

  వనవాసము జేసెడి రా
  ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
  ఇనకుల తిలకుండివ్వగ
  ననుమతి, సౌమిత్రి కోసె నామె ముకు చెవుల్!

  రిప్లయితొలగించండి
 22. వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్
  వాసనలేకపోయిననుభర్గునిబూజనుఋజేయుచుండుట
  న్దోషముగాదలంపకనుదొయ్యలి మోదమునొందెనేమొ,మా
  యాసయు,మంచివేయవియయార్యులభావననెట్లుయోగదా

  రిప్లయితొలగించండి
 23. వాసిగ పూయుచున్ తన నివాసము ముందర నుండునట్టి దు
  ర్వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్
  పూసిన పూల నిత్యమును పుష్కరనాభుని పూజచేయుచున్
  తోషము తోడ కొప్పునను దోసెడు పూలు ధరించి వెల్గెడిన్

  రిప్లయితొలగించండి
 24. ఉత్పలమాల
  చేసిన పూవులున్ సహజ సిద్ధము గాకను భక్తచిత్తమున్
  వాసిగ దైవమున్ దెలియు భావము చెప్పఁగ లేవు పూజలున్
  భాసిల వన్న తా వినదె? భక్తికి డంబమదేల? పైడివౌ
  వాసన లేని పూవులన భామ ముదంబునఁ జూపు నిష్టమున్

  రిప్లయితొలగించండి
 25. వేసవి మల్లె పూవులవి విందును గూర్చును కోమలాంగికిన్
  నాసిక బోలు చంపకము నవ్వును మీరిటు నింద సేయగన్
  దోసమదెంచి చూడ మఱి తోయలి గూరిచి యిట్లు పల్కగన్
  "వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"

  రిప్లయితొలగించండి
 26. మీ సములెవ్వరయ్య!తగుమీసములుండినవారికంటె సా
  వాసమునందుగొప్ప!యనువాదనజేయకదెల్పుచుంటి యీ
  దాసకి సొమ్ములివ్వుటన?ధైర్యముగాద సువర్ణమందియున్
  వాసనలేనిపూవులన?భామ ముదంబునజూపునిష్టమున్

  రిప్లయితొలగించండి
 27. వాసిగ తెచ్చె ప్రియుడె తన
  తో సరసము లాడ నెంచి తోటఁ జని యటన్
  పూసిన సిరిమల్లెలు, దు
  ర్వాసనలేని పువులనిన భామకుఁ బ్రియమౌ.

  రిప్లయితొలగించండి
 28. మాసము కొక్కసారి తన మానినిఁ గూడగ వచ్చు వాడు తా
  మోసుకు వచ్చె నాభరణముల్ విరి దండలఁ దెచ్చె నెన్నియో
  వాసిగ పారిజాతములు బంతులు మల్లెలు జాజులెన్నొ దు
  ర్వాసన లేని పూవులన భామ ముదంబున జూపు నిష్టమున్

  రిప్లయితొలగించండి
 29. చేసిన వాటితో మరల జేతువు పూజను చాలునేలనీ
  వాసనలేని పూవులన,భామ ముదంబున జూపునిష్టమున్
  వాసిగ పైడివై యెపుడు వాడకనుండెడి పుష్పరాజముల్
  కాసులుపోసి కొంటినయొ,కంటికినిండుగ నింపుమీరగా
  పూసినపూవు లేటికిక? పూటకువాడును ప్రాణనాథుడా!

  రిప్లయితొలగించండి
 30. చూసిన జూపుల యత్తను
  మాసిన చీరను యలుగుచు మాలిని దానున్
  చూసియు జూడక మగనిని
  వాసనలేని పువులనిన భామకు బ్రియమౌ

  రిప్లయితొలగించండి
 31. మోసమెరుంగనోడు సతిమోదము మేలును గోరువాడు నే
  దోసముదల్పనోడు సతితోడు దలంచెడు వీతరోసుడున్
  వాసిగవేసబాసలకువారథియై జరియించువాడు స
  న్నాసుల వేసబాసల ననాదర ణన్ గమనించువాడు తా
  జేసినబాసమీరకను జీవిత మున్ దరిసించు దాసుడే
  యీసునడంచి యూసులకు నూహలొసంగి భరోసనిచ్చువా
  డాసతికాసరాయనగ నంగన మెచ్చినవాడు పూజ్యుడున్
  దాసుడు కాసువీసము లుదా రత నీయగ లేనివాడునున్
  గాసట బీసటే జదివి కానిది యైనది నేరనోడు వ్య
  త్యాసము జూపనోడు పరదార మొగంబును జూడనోడు న
  భ్యాస సువాసినీవ్రత స్వభావ ప్రభావ మెరుంగనోడు వి
  శ్వాసి సువాసినీ హృదయ భాసుర భాస్కరు డాలిమెచ్చు వా
  డే సమయంబునైన దన యింతి కి సాంతమొసంగువాడు ను
  చ్ఛ్వాసము శ్వాసమంత మన సా శిరసా వచసా యొసంగినోడు నా
  శ్వాసనమిచ్చువాడు సరసంపు హృదంజలి గొన్నవాడిడన్
  *"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*

  రిప్లయితొలగించండి
 32. వాసనలేనిపూవుబుధ వర్గములేనిపురంబుమూఢస
  ద్వాసముదోసమెంచరు సువాసినిలందరుచోరకత్తియల్
  వేసముమార్చుహారులనువేపి పొలీసులు పట్టలేరు నే
  *"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*

  వాసనకైగంధంబు సు
  వాసినులును మల్లెమొల్ల పలు కుసుమాలిన్
  భాసురముగదాల్చ నెటుల
  *"వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ?"*


  వాసి సువాసినీతతులు వాసననిచ్చెసుమాలమాలలన్
  భాసురపస్పుగుంకుమల భా మలునింపగు చిహ్నపంచక
  మ్మాస ధరింతురాదరమునౌగద యిట్లనమెప్పునెట్టులౌ
  *"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*


  వాసిగముత్తైదువయై
  భాసిల వసనాభరణము ,వలపున్ తలపున్
  ఆసించుమల్లియల దు
  *"ర్వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ"*


  వాసిధరించును బంగరు
  *"వాసన లేని పువు ;లనిన భామకుఁ బ్రియమౌ"*
  నేసినవసనము గుంకుమ
  పసుపునుమట్టెలును దాళి
  వల్లభుసిరియున్


  వాసనవాసనూడ్చు సహవా సము సద్గతిదారిజూపు వి
  శ్వాసము ధ్యాసయున్ భవుని
  వాసముజేర్చుమనీషకోటికిన్
  వాసనయేసదాగతి,సువాసమె
  సంగముసత్తుచిత్తునౌ
  భాసురహర్షరూప ప్రణవాక్షర గోచర మోక్షరూపమౌ
  *"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*


  శ్వాసకుమంచిగాలితగు ,సాధనలో సహకారమిచ్చు సు
  శ్వాసపయిన్ మనంబు నిలుచ ద్దియె ధ్యానము దేవదేవుకున్
  ధ్యాస మనోజ్ఞయోగమన నంబకు వాసనపూలమోజు నే
  *"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*

  రిప్లయితొలగించండి
 33. ప్రాసలు పొదిగిన కవితలు,

  హాసము చెరగని చనవరి అవుసగు మోమున్,

  కేసరిఁ బోలు సఖుడు, దు

  ర్వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ !

  రిప్లయితొలగించండి
 34. వాసిగ పూజ చేయగను భావము నందున నెంచి చూచుచున్
  కోసిన పూలనెల్ల గని కూరిమి తోడను చక్కనేరుచున్
  భాసురమై సుగంధమును పంచెడి పుష్పము లేరుకొంచు దు
  ర్వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్"*  కోసిన పుష్పము లందుసు
  వాసన భరితంబగువిరి వాసనముద్దౌ
  భాసురమగు పూజకు దు
  వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ"*

  రిప్లయితొలగించండి