22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2938 (భజన నొనర్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భజన సేయువాఁడు భక్తుఁ డగున"
(లేదా...)
"భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"

53 కామెంట్‌లు: 1. సుజనుని దేశమున్ గొలుచు శూరుని వీరుని దైవమున్ సదా
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పు!నా
  నిజమగు స్నేహితుండనుచు నెల్లరికిన్ తెలుపంగ‌ వచ్చు సు
  మ్మి! జత జిలేబి యై మనసు మీరగ నెమ్మిని చూప వచ్చునే !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. నటన జేయు నతడు నలుగురి మెప్పుకై
  హంగు లెన్నొ జేసి భంగ పడగ
  సన్య సించె ననుచు చాటుమాటు దొంగ
  భజన సేయు వాఁడు భక్తుఁ డగున ?

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా ?!

  నిజమిది ! భారతాన్నమును నీటిని గాలిని గ్రోలుచుండి., యీ
  ప్రజలను రక్ష జేసెడి జవానుల మృత్యువిషాదమందు , వై...
  రిజనుల బ్రస్తుతించు ఖల రీతిని వర్తిలి , ప్రక్కదేశపుం...
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా ?!


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “ప్రక్కదేశపుం భజన” లో ను గాగమమునకుఁ దావు లేదు కదండి.

   తొలగించండి
  2. ఎత్తి చూపాలని కాదని ప్రార్థన../శంకా నివృత్తి కొరకే...


   దట్టపుఁ గ్రూర భావమున దైత్య వికారుఁడు నాంగ్ల దేశపుం
   బుట్టుక వాని పంపున నపూర్వపు రీతి నమృత్సరమ్మునన్
   గిట్టిరి మిక్కిలిన్ జనులు కేళి వనమ్మున నుండ దానికిం
   బుట్టిన రో జటంచుఁ గడుఁ బూనిక శోక సభన్ రచించిరే..

   తొలగించండి
  3. పుట్టుకలో పు పరుషము కనుక ను గాగమము వచ్చును.
   భజన లో భ పరుషము కాదు సరళము కాదు. కనుక ను గాగమము రాదు.

   తొలగించండి
  4. 🙏..ధన్యవాదాలు కామేశ్వర రావు గారు!

   తొలగించండి
  5. పూజ్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు . పరీక్షల హడావుడి లో బ్లాగ్ ఫాలో అవడం లేదండీ. ఇప్పుడే చూశాను . దోసమే... . పొరపాటు కు మన్నించండి . దానిని ..

   వైరిదేశసద్భజన ... గా మార్చగలను 🙏

   తొలగించండి


 4. భక్తి యనగ సఖియ ప్రహ్లాదుని వలెను
  భజన సేయువాఁడు భక్తుఁ డగు,న
  వాతు వలె జిలేబి పాకము పొసగుగ
  విశ్వదాభి భూజ వినవె భామ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. మనసు గుడిగ జేసి మాధవు ధ్యానించి ;
  మాటలందు శివుని మహిమ పొదిగి ;
  చేతలన్ని దేవి శ్రీమాత కీయక
  భజన సేయువాడు భక్తు డగున ?

  రిప్లయితొలగించండి
 6. నిజమగు శాంతి సౌఖ్యముల నిచ్చెడి మార్గము విస్మరించుచున్
  గుజగుజ లాడి గుంభనము గుట్టుగ జేయుచు నాస్తికోసమై
  రజతము స్వర్ణ వజ్రములు రమ్యపు రీతిని స్టాకు షేరులన్
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా?

  రిప్లయితొలగించండి
 7. వీధి రౌడి జతగ వెంట నుండి, సతము
  వాడు చేయు నట్టి పాడు పనులు
  బాగు బాగు ననుచు పలుకుచు దుష్టుని
  "భజన సేయువాఁడు భక్తుఁ డగున

  రిప్లయితొలగించండి
 8. తప్పులు సలుపుచు సతమ్మును భువిపైన
  స్వయపు లాభమందు వలపుతోడ
  కలుగు మోక్షమనుచు కపటపు భుద్ధితో
  భజన సేయువాఁడు భక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 9. అన్య విషయ మందు నా స క్తి చూపించి
  కాంత కనక మందు కాంక్ష హెచ్చి
  జగతి మోస గించ జప తప oబుల తోడ
  భజన సేయు వాడు భక్తుడ గున !

  రిప్లయితొలగించండి
 10. నిజమును పల్కకెప్పుడును నీతిని వీడుచు, దొడ్డిదారిలో
  స్వజనుల కున్ ప్రజాధనము వంచన తోడను దోచిపెట్టుచున్
  గజముఖు నండతోడ వెస కాంచగ మోక్షము స్వార్థబుద్ధితో
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా

  రిప్లయితొలగించండి
 11. కావలసిన పనుల గావించుకొనుటకై
  పదవికల్గువాని పంచజేరి
  యిలను మీకుసాటి యెవ్వరు లేరంచు
  భజన సేయువాడు భక్తుడగున

  రిప్లయితొలగించండి
 12. భజనలయందుహస్తములు వాద్యహితమ్ముగ వేయు తాళముల్
  నిజహృదయమ్ము చేరగ ననిశ్చలమై యట పాదరక్షలన్,
  భజనలతోడ గాడు స్థిరభావనతో నగు, భక్తిశూన్యుడై
  భజన నొనర్చు మానవుని భక్తునిగా గణుతింప నొప్పునా?

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల్మ్.

  రిప్లయితొలగించండి
 13. ఎలక్షన్ టైమ్!!
  కనులు దెఱచు మున్నె కండువాలను మార్చు
  కోట్లు గూడఁబెట్టుఁ గోర్కె తనది
  తగిన సమయమందు దగునట్లు పార్టీకి
  *"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిరు సవరణ:

   ఎలక్షన్ టైమ్!!
   కనులు దెఱచు మున్నె కండువాలను మార్చు
   కోట్లు గూడఁబెట్టుఁ గోర్కె తనది
   తగిన సమయమందు దగునట్లు 'పార్టీల'
   "భజన సేయువాఁడు భక్తుఁ డగున"

   తొలగించండి


 14. నిత్యము బరకటను, నియతంబుగ తననే
  భజన సేయువాడు భక్తుడగున?
  నిత్య సత్యమును పునీతము గాగాన
  భజన సేయువాడు భక్తుడగున?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఆ.వె. కరమున జపమాల కరమొప్ప ద్రిప్పచు
  జిహ్వ మంత్ర పఠన సేయుచున్న
  మనసు నిలువ లేని స్మ రణేమి స్మరణయా?
  భజన సేయు వాడు భక్తు డగున?
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 16. ఆ.వె. భుక్తి కొరకు నేడు భక్తినమ్ముక దిర్గు
  భజనపరులు చాల ప్రబలినారు
  భక్తి లేని పూజ పత్రిచేడగు వ్యర్థ
  భజన సేయు వాడు భక్తుడగున?
  ఆకుల శివరాజలిఞగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 17. మహిని జూడ నెపుడు మానవ సేవయే
  పార మార్థ మగును వేరు కాదు
  సారమెరుగ నట్టి చదువులెల్ల చదివి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 18. రాత్రిపగలు లేక రామునినామము
  భజన సేయువాడు భక్తుడగు;న
  పరిమితముగ నమ్మ బండరాయైనను
  నీటమున్గలేదు నిజముసూవె!

  రిప్లయితొలగించండి
 19. చిన్న మంత్రమదియె చికిలి వేయు మనల
  భక్తి కలిగి పలుక పగలు రేయి
  పలుక పలుక వాడు పరమాత్మయౌగద
  భజన సేయువాఁడు భక్తుఁ డగున

  రిప్లయితొలగించండి
 20. భజన సేయువాడుభక్తుడగున నను
  మాట నగ్న సత్య మదియ సామి!
  భక్తుడగుట కదియప్రముఖము మార్గమ్ము
  భజన వలన గలుగు భావసిధ్ధి

  రిప్లయితొలగించండి
 21. మనసు లోని తలపు మలిన మైన
  ముఖము పైన నగవు మోద మగున?
  పాప చింత లేక పరులను బాధించి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 22. కోరినట్టి కోర్కె తీరుచు మో స్వామి
  గుడిని గట్టి నిన్ను గొలతు నంచు
  బేరమాడి స్వామిఁ వేడుచు నిత్యమ్ము
  భజన చేయు వాడు భక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి


 23. నీతి నియమములను ప్రీతి సేవించుచు
  ముక్తి నొందు మార్గముల నడువక
  ప్రక్క దారి త్రొక్కు బాబాల నమ్ముచు
  భజన సేయువాఁడు భక్తుఁ డగున!

  రిప్లయితొలగించండి
 24. మదిని భక్తి భావమసలు లేక శివుని
  పూజ చేసి గొప్ప పుణ్యమంద
  కోరిక గలిగి మరి కోటి యుగ ములయిన
  భజన సేయువాడు భక్తుడగున

  మనసులో భక్తి భావం లేకుండా యాంత్రికంగా పూజలు చేసి పుణ్యం పొందాలనుకునే వాడు ఎన్ని రోజులు భజన చేసినా భక్తుడు కాలేడు

  రిప్లయితొలగించండి
 25. భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింపనొప్పునా
  భజనలుసేయుటేయికనుభక్తికి మార్గమునెంచిచూడగన్
  భజనలుబూజలన్నియునువారముదప్పకధూపదీపముల్
  నిజముగభక్తిమార్గములె,నేనునుజేయుదునిత్యపూజలన్

  రిప్లయితొలగించండి
 26. కరములు ముకుళించి కైంకర్య భావము
  ప్రస్ఫుటంబు గాఁగఁ బాప చిత్తు
  శీల రహితు సేవ, సేవిత తాప సా
  భ జన! సేయువాఁడు భక్తుఁ డగున

  సజనన పోషణ క్షయ విచార ర తాకలి తాత్మ పుణ్య ధా
  మ జగ దశేష సత్త్వ వర మండల రక్షకుఁ గొల్వ భక్తుఁడే
  సుజనుల వీడి దుర్జనులఁ జోద్యము మీఱఁగఁ గోరి స్వార్థమున్
  భజన మొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా

  రిప్లయితొలగించండి
 27. ఆత్మతీరుజీవులందరిన్బేరిమి
  జూచువాడుహరినిజూచువాడు
  నట్లుగాక బ్రజ ననాదరించి పరుని
  *"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*

  రిప్లయితొలగించండి
 28. చేతమాలద్రిప్పి శివునిస్మరించుచు
  చిత్తముంచు క్రొత్తచెప్పుమీద
  లాభనష్టముల ఫలాలవితర్కించి
  *"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*

  రిప్లయితొలగించండి
 29. నిజహృదిబుద్ధిమేల్కొనక నిష్ఠయమాదిగుణాల దల్పకన్
  ప్రజలసమస్తలోకముల బాగుదలంపక కీడొనర్చుచున్
  సుజనులసేవసేయకను సూనృత మింతయొనర్పకన్హరిన్
  "భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"*

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Lucknow: Feb 11, 2019

  ప్రజలిట నీదు చెల్వమును పన్నుగ జూచుచు సొమ్మసిల్లుచున్
  విజయము నీదెనంచు పలు వీధుల వాడల డప్పుకొట్టిరే!...
  భుజమున డింపులమ్మ బొమ మోయుచు దించుచు నెత్తికెత్తుచున్
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా?

  రిప్లయితొలగించండి
 31. మతము లనుచునుండు మానవత్వము లేక
  కులములనుచు జీల్చు గుత్సితుండు
  ధనిక బీద జూచు ధర్మంబు విడచి వి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున"
  మిరియాల ప్రసాదరావు కాకినాడ

  రిప్లయితొలగించండి
 32. నిండు మనము నిల్పి నిష్టతో పూజించి
  భక్తి భావమలర భాసురమ్ము
  నమ్మకమ్ములేక నాణ్యతకొరవడ
  *"భజన సేయువాఁడు భక్తుఁ డగున"*!!

  రిప్లయితొలగించండి
 33. కరుణలేని మనసు కాఠిన్యమేయది
  భజనసేయువాడు భక్తుఁ డగున
  సాటి వానికింత సాయము జేయక
  భక్తి యున్న నదియు ఫలము లేదు!!

  ****రెండవ పూరణ..

  రిప్లయితొలగించండి
 34. నా ప్రయత్నం :

  ఆటవెలది
  త్రికరణమ్ము లలరఁ దెలిసి ప్రహ్లాదుండుఁ
  గొలచి నంత వాని నిలిపె హరియె
  సాధనమెరుఁగక ప్రసాదము నాశించి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున?

  చంపకమాల
  అజుఁడగు కృష్ణమూర్తి పదమందిక నాసన మేలకో శిరో
  విజన ప్రభాంచితమ్మనెడు వేదిక నొప్పిన కౌరవేయుడున్
  భుజభల సైన్యమున్ బడసె పోరున నెగ్గెనె? స్వార్థ బుద్ధులన్
  భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా?

  రిప్లయితొలగించండి
 35. భుజబలమున్ననాడు పరము న్దలపంగదలంపులేదు నే
  నిజముగణింపలేదుధరణిన్ సిరి శాశ్వతమంటిజవ్వనం
  బు జనులకంది రాగపరమున్ని హమెన్నరు,మోహపాశుడై
  *"భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"*

  రిప్లయితొలగించండి
 36. సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
  డాంభికంబు జూపి ఢంక తోడ
  వేష భాష మార్చి వేదాలు వల్లించి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున

  యజ్ఞేశ్

  రిప్లయితొలగించండి
 37. మంచిజేయలేడు,వంచనవిడబోడు
  మానవత్వమంత మంటగలిపి!
  దైవపూజలనుచు దర్జాగ మోసాన
  భజనసేయువాడు భక్తుడగున?

  రిప్లయితొలగించండి
 38. నిజమగు ముక్తి మార్గమును నిశ్చల భక్తిని వీడి ధాత్రిలో
  ప్రజలిల స్వార్థచిత్తులగు వారికి కోరిక లెన్నియో గదా
  కుజనులు కార్య సాధనకు కోవెల జేరుచు కోర్కె గోరుచున్
  భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింప నొప్పునా?

  రిప్లయితొలగించండి
 39. తాను నమ్ము వాడు తక్క దైవము లేడు
  యనుచు నూరుకోక,నన్య మతము
  వారి నెపుడు తెగడు పద్ధతి తోడ వి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున

  రిప్లయితొలగించండి
 40. సంఘ జీవి అయ్యు సరిపోని బుద్ధిని
  డాంభికంబు జూపి ఢంక తోడ
  వేష భాష మార్చి వేదాలు వల్లించి
  భజన సేయువాఁడు భక్తుఁ డగున

  యజ్ఞేశ్

  రిప్లయితొలగించండి

 41. పవికిమాలినట్టి పనులను చేయుచు
  దేశములను బట్టి తిరుగువాడు
  తనదు బాగు కొరకు తప్పు చేసి తుదకు
  భజన సేయువాఁడు భక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 42. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  భజన సేయువాఁడు భక్తుఁ డగున

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సత్య ధర్మములను సాధింపగా లేడు..
  శాంతి ప్రేమ సరణి సాగలేడు..
  ఒరుల సేవఁ జేయ నోపలే.. డుట్టిగా
  భజన సేయువాఁడు భక్తుఁ డగున!..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  22.2.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి