9, ఫిబ్రవరి 2019, శనివారం

సమస్య - 2925 (దుష్టులకే దైవము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్"
(లేదా...)
"దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై"

94 కామెంట్‌లు:

 1. గురువు గారు శుభోదయము నిన్నటి నా పూరణము ఒక్క సారి చూచి సలహా ఇవ్వండి

  గర్జన నేమియున్ సలుపకన్ రణరంగము లోమురారి తా

  నర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను, కర్ణుఁ డా జిలోన్"

  గర్జును గల్గ కాదనక కంచర సారధి గా గ్రహించ గా

  పర్జును వీడనాడి తన బంధుజనమ్ముల మేలుగోరె తా

  తర్జని జూపి శల్యుడు ముదమ్ముగ సాయము జేసె నప్పుడున్

  రిప్లయితొలగించండి
 2. పూసపాటి వారూ,
  నిన్నటి సమస్యకు మీ విస్తారమైన పూరణ బాగున్నది. అభినందనలు.
  సీసం మూడవ పాదంలో 'కిరీటి' అన్నచోట గణదోషం. మణితో కిరీటికి అనండి. 'సోదరుడు + అగుచు' అన్నపుడు యడాగమం రాదు. సోదరుడె యగును అనండి.

  రిప్లయితొలగించండి


 3. నష్టంబెపుడు జిలేబీ
  శిష్ట జనాళి కనిపించి చింతను జేర్చున్
  కష్టముల గాన దోచున్
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. అష్టపు కష్టము లొదవిన
  శిష్టులకే దైవమెపుడు సిద్ధుల నొసగున్
  తుష్టియె లేకుండెడి యా
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్?

  రిప్లయితొలగించండి
 5. సృష్టిని బ్రష్టులు విరివిగ
  శిష్టుల రక్షించ గోరి శివుడే మరువన్
  కష్టము కలి నెదిరించగ
  దుష్టులకే దైవ మెపుడు దోద్పడుచుండున్

  రిప్లయితొలగించండి
 6. నష్టము కలిగించు పనులు
  శిష్టుల నవ మాన పరచి చేటొన రించున్
  స్పష్ట ము గా గమ నించి న
  దుష్టుల కే దైవ మె పు డు దో డ్ప డు చుండు న్

  రిప్లయితొలగించండి
 7. శిష్టులగు పాండు పుత్రుల
  కష్టములను గాంచినంత గలిగెను మదిలో
  విష్టపమందున హెచ్చుగ
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడు చుండున్.

  రిప్లయితొలగించండి
 8. శిష్టజన రక్షణమ్మే
  యిష్టమ్ముగ జేసి లోక హితముం గూర్చన్
  నష్ట ఖలులు దూరీకృత
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్.

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  స్రష్ట యతండె ,
  భక్తగణరక్షకుడాతడె , బంధువాతడే,
  పుష్టి యతండె , సర్వజనపోషకుడాతడె, మిత్రుడాతడే ,
  ఇష్టమునాతడే యనుచు నింపుగనెంచుచు దైవభక్తితోఁ
  దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తుష్టులకే అన్న మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


  2. వాహ్! వాహ్ !   అరసున్నతోడు విభుడా
   పరాత్పరుని మానమున్ సభాప్రాంగములో
   నరసిరి శ్రీ మైలవరపు
   మురళీకృష్ణులరె సార్థముగ మార్చి భళీ !


   జిలేబి

   తొలగించండి
 10. (ధర్మరాజు రాజసూయం - శిశుపాలవధ)
  ఇష్టము లేని వాదనల
  నెన్నియొ చైద్యుడు సల్పుచుండగా
  సృష్టికి మూలమౌ ఘనుడు
  కృష్ణుడు సాత్వతి కిచ్చినట్టి యా
  శిష్టపు మాటనే దలచి
  చీదరనిందల వందనోర్చెగా ;
  దుష్టులకే పరాత్పరుడు
  దోడ్పడుచుండును ధర్మరక్షకై .

  రిప్లయితొలగించండి
 11. సృష్టిని మెండుగా పెరిగె చోద్యమ టంచును పాపమే యనన్
  దుష్టులు హద్దులేక మది దోసము నెంచక ఘోరవా ళులై
  కష్ట మటంచు ఘోర కలి కౌగిట చిక్కిన ముప్పు తప్పదౌ
  దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడు చుండును ధర్మ రక్షకై
  ఘోరవాళులు = జంబుకములు

  రిప్లయితొలగించండి
 12. దుష్టుల నణచును దైవమె
  యిష్టులయిన భక్తుల వెతలీడేర్చునుగా
  కష్టముల బాపుచుండును
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్?
  ****)()(****
  (దుష్టులకు + ఏదైవమెపుడు...)

  రిప్లయితొలగించండి

 13. స్పష్టము సేసెమాధవుడు బాధలు బంధము లష్టకష్టముల్
  *"దుష్టులకే ;పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై
  ఇష్టముతో విచిత్రమగు హేలలు లీలలు జూపె, గాథలన్
  శిష్టులు సారెసారెకును చేతమిగిర్చ,రచించి బాడరే

  శ్రేష్టుడు జ్యేష్ఠు డచ్యుతుడుసేసె
  సహాయము పాండవేయుకున్
  పుష్టినొసంగె తుష్టినిడె పూర్ణమనస్కులకండదండయై
  నష్టము సంతుకెట్టులగు? నాశమొనర్చడు బాడియాయనన్
  *"దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై

  నష్టములేరికిష్టమగు నల్వ యొసంగెడునష్టకష్టముల్
  *"దుష్టులకే !;పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై
  శిష్టుల నష్టసిద్ధులను శ్రేయ మొసంగెడు నందచందముల్
  పుష్టిగ నిచ్చియన్నిటను పూర్ణవిభూతిని దాచె జూడగన్

  రిప్లయితొలగించండి
 14. గురువు గారు బ్లాగులో ఇచ్చిన నిన్నటి పూరణం వేరు వాట్సప్ లో ఇది వృత్తము ఒక్క సారి పరిశీలించగలరు
  గురువు గారు శుభోదయము నిన్నటి నా పూరణము ఒక్క సారి చూచి సలహా ఇవ్వండి

  గర్జన నేమియున్ సలుపకన్ రణరంగము లోమురారి తా

  నర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను, కర్ణుఁ డా జిలోన్"

  గర్జును గల్గ కాదనక కంచర సారధి గా గ్రహించ గా

  పర్జును వీడనాడి తన బంధుజనమ్ముల మేలుగోరె తా

  తర్జని జూపి శల్యుడు ముదమ్ముగ సాయము జేసె నప్పుడున్

  రిప్లయితొలగించండి
 15. పూసపాటి వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'గర్జును... పర్జును..'?

  రిప్లయితొలగించండి
 16. కందం
  శిష్టులు భరించ జాలని
  కష్టములకు జాలి జూపి కరుణించకనే
  సృష్టిని పాప గణనమున
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కరుణింపకయే" అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు
   సవరించిన పూరణ

   కందం
   శిష్టులు భరించ జాలని
   కష్టములకు జాలి జూపి కరుణించకయే
   సృష్టిని పాప గణనమున
   దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

   తొలగించండి
 17. శంకరాభరణము నేటి సమస్య

  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్"

  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

  కామ్యక వనమునకు పాండవులు వచ్చిన తర్వాత కృష్ణుడు పాండవులను చూచుటకు వెళ్తాడు అప్పుడు భీముడు భాదను మరచిపోలేక కృష్ణునితో అన్న పలుకులు

  రాముని భార్యను రావణుoడెత్తుకు పోవు చుండగ చూచె పూజితుండు,
  భూదేవిని ఘనమౌ భుజ దలమున హిర ణ్యాక్షుడు బంధించ నాకి జూచె,
  దుర్యోధనుడు నేడు దోచి మమ్ము వనము నకు నంప కాంచెగా నాకసదుడు
  కీలినిన్ దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండు నని తల పడుచు నుంటి

  నంద నందనా శిష్టుల నమ్మకమును
  కూడ గట్టగ లేరయా గోత్ర మందు,
  జనులు మరతురు దేముని, శంక వలదు
  ననుచు బలికె భీముడు వ్రజ నాథు తోడ

  రిప్లయితొలగించండి
 18. గురువు గారు నమస్కారము
  నిన్నటి నా పూరణములో మీ అనుమానమునకు
  నా వివరణము అర్ధము (గర్జు = అక్కర అగత్యము లేక అవసరము ,(పర్జు =పద్ధతి లేక ఆచారము)
  కర్ణుడు కృష్ణుడి అంతటి సారధి తనకు కావలెనని దుర్యోధనుని అడుగగా శల్యుని సారధిగా కర్ణుని రధమునకు నియమిస్తాడు. కృష్ణునికి సమఉజ్జీ కాకపోయినా అగత్యము లేక కర్ణుడు ఒప్పుకుంటాడు (గర్జు = అక్కర అగత్యము లేక అవసరము)

  సారధి అయినవాడు తన యుద్ధములో తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తిమ్చరాదు. తన యజమాని (కర్ణుడు)కిఅనుకులముగా అయన ఆజ్ఞ అనుసారము నడుచుకోవలెను అను (పర్జు =పద్ధతి లేక ఆచారము)ను శల్యుడు యుద్ధ రంగమున విస్మరిమ్చాడు అను భావన తప్పులున్న మన్నించండి


  రిప్లయితొలగించండి
 19. కష్టముల నిచ్చుచుండుట
  దుష్టులకే, దైవమెపుడుదోడ్పడుచుండున్
  శిష్టులకు గాన దేవుని
  కిష్టమగుపనులను చేయుమీశ్వరుకృపకై

  రిప్లయితొలగించండి
 20. ఇష్టములు దీరినను నా
  కష్టమని తిరుగు వెతలవి కలుగను నరులున్
  నిష్టూరములాడునిటుల
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

  రిప్లయితొలగించండి
 21. వచ్చే వారానికి ఆకాశవాణి సమస్య......

  "చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"

  మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించండి


 22. శిష్టుల వీడడమ్మ పరిశీలన చేయగ లోతుగా సఖీ
  కష్టము గాదు నమ్మగను; గావ సుమీ విభుడాడు నాటకం
  బష్టమదమ్ము లెల్ల భళి వాడి కృశించుచు వీడగానటన్
  దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును, ధర్మరక్షకై


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  దుష్టులకే దైవ మెపుడుఁ దోడ్పడుచుండున్

  సందర్భము: "వీళ్ళు చేసిన పాపాలకు మునుముందు బోలెడంత కష్టం అనుభవించాల్సియే వుంది. వీళ్ళాశించిన సుఖ మేదో యిప్పుడే అనుభవించనీ.." అంటూ అవకాశం ఇస్తాడు దేవుడు దుష్టులకు.
  దాంతో శిష్టులు భ్రమపడిపోతూ వుంటారు తప్పు దారి తొక్కిన వాళ్ళకే బోలెడు సుఖాలు దక్కుతున్నాయిగదా! అని..
  ఆ భ్రమలో పడి కొందరు శిష్టులు బలహీనతను జయించలేక దారి తప్పుతూ వుంటారు కూడ..
  అంతే కాక అలా దారి తప్పడం చేతకాని వాళ్ళు అస్తమానమూ దుర్మార్గులను శాపనార్ధాలు పెడుతూనే వుంటారు.
  ఏదేమైనా చేసింది చేసినంత అనుభవించాల్సిందే..! తప్పించుకునే దారి లేదు.. విత్తనం మొలకెత్తడానికి మొగ్గై పూవై కాయై పంట పండడానికి మధ్యలో కాలం వుంటుంది కదా! అని కర్మ సిద్ధాంతం చెబుతోంది. అందుకే పాపం పండాలి.. అంటారు.
  దీనివల్ల తేలే దేమంటే బలహీనులైన మంచివారు భ్రమపడేందుకు.. చెడ్డవారిని శపించేందుకు.. చేయబడిన ఏర్పాటులో భాగంగానే దేవుడు దుష్టులకు తోడ్పడుతున్నట్టు కనపడుతుంటాడు. అందుకే లోకంలో నేరాలకు పాపాలకు మన మనుకున్నట్టు తక్షణమే శిక్షలు పడవు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "కష్టము.. ముం దెంతో గల..

  దిష్టముగా సుఖముఁ బొందనీ
  యిపు" డనుచున్

  శిష్టులు భ్రమను శపింపగ..

  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  9.2.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 24. దుష్టపు బుధ్ధులు గలుగును
  దుష్టులకే,దైవమెపుడుదోడ్పడుచుండున్
  శిష్టుల కార్యములందున
  కష్టము లేకుండునటుల గాచుచు నెపుడున్

  రిప్లయితొలగించండి
 25. స్పష్టముగఁ బలుకుమా యే
  యిష్టుల నొనరించ నకట యీమతి నీ కే
  యష్టాంగమునఁ గలిగె నే
  దుష్టుల కే దైవ మెపుడు దోడ్పడుచుండున్


  దుష్ట హిరణ్య లోచనుఁడు దోర్బల దర్పుఁడు భాగ్య మందఁడే
  దుష్టుఁడు కాఁడె రావణుఁడు దోరపు భాగ్యములం జెలంగఁడే
  కష్టము లెన్ని కల్గినను గందక పాపము పండు నంతకున్
  దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడు చుండును ధర్మ రక్షకై

  రిప్లయితొలగించండి
 26. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అమిత్ షా మనోగతం 👇

  దుష్టుడు రావణుండికట తోషముతో పది నెత్తులిచ్చెనే!
  దుష్టుడు రాజరాజుకట తోషముతో సచి కర్ణునిచ్చెనే!
  దుష్టుడు డింపులయ్యకిట తోషముతో భళి చెల్లినిచ్చెనే!
  దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై...

  రిప్లయితొలగించండి
 27. శిష్టుల బరీక్షసేయగ
  కష్టములం గలగజేయు కరుణామయుడే
  నష్టము గలిగించుటకున్
  దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్

  రిప్లయితొలగించండి
 28. తుష్టిగ వరమొసగు శివుడు
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్
  శిష్టుల రక్షణకు హరియె
  కష్టమునొందు హరిహరుల కదియే క్రీడన్

  రిప్లయితొలగించండి
 29. సృష్టికి నష్టము జేసెడి
  భ్రష్టులె తపములనుసేయ మైమరచుచునూ
  పుష్టిగ వరముల నొసగిన
  దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

  (భస్మాసుర వృత్తాంతము)

  రిప్లయితొలగించండి
 30. గురువు గారికి నమస్సులు.
  అష్టోత్తర దూషణలున్
  దుష్టులకే, దైవ మెపుడుదొడ్పడుచుండున్,
  శిష్టాపూర్వక బండితు
  నిష్టములన్నియు సుహార నిధిగా ధరిత్రిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నిధిగ ధరిత్రిన్" అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి


 31. కష్టము లన్ భరి యించుచు
  నష్టము లెల్ల తలదాల్చి నకనక యనుచున్
  భ్రష్టుపడి పోవనా ని
  ర్దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. కష్టపు శాపవశమునన్
  శిష్టగణరక్షకుడైన సిరిపతి వీడిన్
  నిష్టగ జన్మలు ఎత్తిన
  దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్

  మునుల శాపానికి గురయిన జయ విజయులు త్వరగా విష్ణుమూర్తి సన్నిధి చేరడానికి దుష్టుల జన్మలు ఎత్తుతారు. వారిని సంహరించి, వారు వెకుంఠం చేరడానికి దైవమైన విష్ణువు తోడ్పడుతాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం రెండవ గణం జగణమయింది. 'వీడిన్' అనడం సాధువు కాదు. "శిష్టగణావనుడగుచును శ్రీపతి విడియున్" అందామా?

   తొలగించండి
  2. రెండవ, నాలుగవ పాదాలలో రెండు, నాలుగు గణములు జ ఉండకూడదు మార్చి వ్రాసే ప్రయత్నం చేస్తాను

   తొలగించండి
 33. పుష్టకి మల్బరి పురుగు ని
  కృష్టపు తిండికొరకు కృతకృత్యంబగునా?
  జేష్టాదేవిని జేర్చగ
  దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్

  రిప్లయితొలగించండి
 34. దుష్టుండొక్కడు పలికెను
  శిష్టులతో దానెపరమ శ్రేష్టుడననుచున్
  కష్టములవి తనకేనని
  దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్

  మిరియాల ప్రసాదరావు కాకినాడ

  రిప్లయితొలగించండి
 35. పుష్టిని సాధుపుంగవుల పొచ్చెము జేయగ శిక్షవేయునే
  దుష్టులకే పరాత్పరుడు; దోడ్పడుచుండు ధర్మరక్షకై
  కష్టపు వేళలన్ గొనగ కద్దగు రూపును భూమినందునన్
  శిష్టజనాళికిన్ దగిన సిధ్రము నిచ్చుచు
  శీఘ్రమౌగతిన్

  రిప్లయితొలగించండి
 36. కష్టము లకోర్చి తన య
  భీష్టము కాకున్న నేమి ప్రీతిన్ గొనినన్
  స్పష్టము పొందును సుఖమున్
  *దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్

  *తుష్టులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "కష్టమ్ముల కోర్చి తన య..." అనండి.

   తొలగించండి
 37. దుష్టములైనభావములు దొంతరదొంతరగా గలుంగుగా
  దుష్టులకే,పరాత్ఫరుడు దోడ్పడుచుండునుధర్మరక్షకై
  శిష్టులకెల్లవేళలనుసేమముగూర్చుచునుండునేసుమా
  తుష్టిని బుష్టినిన్ నిడుచు దోరముగాగరుణారసంబుతోన్

  రిప్లయితొలగించండి
 38. శిష్టులు ఎవరని ఎంచగ
  దుష్టుల పాలిట నువారుదుష్టులుయనగన్,
  శిష్టులు దుష్టులపాలిట
  దుష్టులకేదైవమెపుడు దోడ్పడుచుండున్
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుష్టులె యనగన్/దుష్టు లనంగన్' అనండి.

   తొలగించండి
  2. శిష్టులు ఎవరని ఎంచగ
   దుష్టుల పాలిట నువారుదుష్టులనంగన్
   శిష్టులు దుష్టులపాలిట
   దుష్టులకేదైవమెపుడు దోడ్పడుచుండున్
   కొరుప్రోలు రాధాకృష్ణా రావు

   తొలగించండి
 39. స్పష్టము లోకమందు కన పాపము నోడును గెల్పు మంచికే
  కష్టసు ఖమ్ములన్నవిల కావవి శాశ్వత మెంచి చూడగా
  భ్రష్టత బాపి శిష్టులను భాసిల బ్రోచుచు, నాశమందుమా
  దుష్టులకే,పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై...

  రిప్లయితొలగించండి
 40. ఉత్పలమాల
  స్పష్టము జేసె పార్థునకు పాపవినాశ ప్రణాళికార్థమై
  ద్రష్టత లోకమందు నవవతారము దాల్చెద నే యుగమ్ములన్
  శిష్టులు గావగాననె విశిష్టతఁ జూపుచు విశ్వరూపమున్
  దుష్టులకే పరాత్పరుఁడుఁ దోడ్పడుచుండును ధర్మరక్షకై

  రిప్లయితొలగించండి
 41. కష్టములుబాపు మనుచును
  నిష్టముతోవేడు సురల యిచ్ఛను వినుచున్
  స్పష్టపుటాలోచనతో
  దుష్టులకే దైవమెపుడు దోడ్పడుచుండున్.

  రిప్లయితొలగించండి
 42. కష్ట సుఖంబు లెంచి ప్రజ కర్మ ఫలంబుల లెక్క వేయుచున్
  స్పష్టముగాను మంచియను వారికి మేలులఁ జేయుచుండి, తాఁ
  గష్టము లెన్నొ గాంచి కడ కాలములో క్షమఁ గోరునట్టి యా
  "దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై"

  రిప్లయితొలగించండి