అమ్ములు క్రోధ కామములు యాతన జేయగ మానవాళినిన్వమ్మగు లోకచింతనపు భారము జీవుల క్రుంగదీయగాకమ్మని గీతబోధనల కర్మము జ్ఞానము భక్తియోగ సా రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
బాగుంది. అభినందనలు !💐👍👌💐
ప్రభాకర శాస్త్రి గారూ, గీతాసారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
సమస్య :-"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*ఆ.వె**దేశ ప్రజల కొరకు దేశాల సూత్రాలుకలిపి రాసి నట్టి గ్రంథ మదియెరక్ష నిచ్చు భరత రాజ్యాంగ సూత్ర సారమ్ము జనులకు శరణమ్ము గాదె ! .....................✍చక్రి
చక్రపాణి గారూ,రాజ్యాంగ సారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వ్రాసినట్టి' అనండి.
ధర్మబద్ధమైన కర్మయోగములోనివిహిత తత్త్వములను విశదపరచుకిల్బిషాంతకమ్ము గీతార్థ వేద సారమ్ము జనులకు శరణమ్ము కాదె
విజయకుమార్ గారూ,గీతార్థ వేద సారమ్ముతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రాణ భయము లేక పరులర క్షణకోరి యుద్ధ భూమి కేగు బుద్ధు లనగ గీత బోధ కన్న చేతసాయ మిడగ రమ్ము జనులకు శరణమ్ము కాదె
అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.రమ్ము అని ఆహ్వానించారు. కాని జనులకు ఏది శరణం?
వమ్ము భవమ్మునందు పరువమ్మును నమ్ముచు సొమ్ముఁ గూర్చ, వ్యర్థమ్మగు జీవనమ్ము, దరిదాపున నుండవు శాశ్వతమ్ము, ఘోరమ్మగు జీవనమ్ము, మధురమ్మగు మాధవపాదభక్తిపూరమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌకంజర్ల రామాచార్యకోరుట్ల.
రామాచార్య గారూ,మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పరమ పావనమ్ము పరమాత్మ నామమ్ముఇడుము లెల్ల బాసి ఇలను గాచుమోక్ష పధము చూపు మురహరి గీత సారమ్ము జనులకు శరణమ్ము కాదె
కృష్ణారెడ్డి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నామమ్ము +ఇడుములు = నామమ్ము లిడుములు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "పరమాత్మ శుభనామ। మిడుములెల్ల..." అనవచ్చు. '...బాసి యిలను' అని యడాగమం వస్తుంది. 'గీతాసారమ్ము' అన్నది సాధు సమాసం.
ధన్యోస్మి. పూరణ చేశాక మీ అభినందన కానీ సవరణ కానీ చూస్తే సంతోషంగా ఉంటుంది.
సమత మమత కల్గి సాత్విక భావానదైవ భక్తి దయయు ధర్మ ములు ను సత్య పాల నంబు నిత్య మౌచు మమ కా రమ్ము జనుల కు శరణ మ్ము కా దె !
రాజేశ్వర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలితోడుపాడునందించుసంసారయానమందుసుఖమునభ్యుదయముసర్దుబాటుశాంతి సహనంబుతోగాపు*"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*
శంకర్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని విష్ణుగీర్తనల గావ్యసుధాపగ లోకమంతకున్నమ్మినతీర్థమైయొసగునాత్మ నివృత్తి పిపాసనణ్చుచున్గ్రమ్మిన ద్వంద్వమోహముల కల్మషమున్ గడుగున్ విరక్తి పూ*"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీధర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్ని జన్మలెత్తి యెన్నాళ్ళు బొగడినాకానరావె నీవు కరుణజూపిబడుగు జీవి బ్రతుకు బాగుపరచవేగరమ్ము జనులకు శరణమ్ము గాదె"!!
గంగాప్రసాద్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'...బొగడినన్' అనండి.
కష్ట నష్ట చయము క్రమ్మిన సమయానదిక్కు తోచ కుండ తిరుగు వేళయఘములను దరిమెడి రఘుపతి పదశిబిరమ్ము జనులకు శరణమ్ము గాదె !
జనార్దన రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.పాప పంకమునిల ప్రక్షాళనము జేసిజన్మ సంచితముల సడలజేసిమోక్ష సౌఖ్య మునకు మూలమ్ము భక్తిసారమ్ము జనులకు శరణమ్ము గాదె.ఆకుల శివరాజలింగం వనపర్తి
శివరాజలింగం గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విలువలుడిగి వైరి కలిగించ కష్టముల్ శాంతి యంచు నిలువ సాధ్యమగునె?తగిన బుద్ధి చెప్ప ధరణిపైనను సమరమ్ము జనులకు శరణమ్ము గాదె
అన్నపరెడ్డి వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాధలందు మునిగి పరితపించెడివేళయార్తి బాపి మదికి హాయి నొసగునట్టి తావదేది యన్నరాముని మందిరమ్ము.జనులకు శరణమ్ము గాదె.
డా. ఉమాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వేళ నార్తి...' అనండి.
ఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్ వమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్ యిమ్మహి భక్తిపూరముగ నీశ్వరునమ్ముచు సాగుధర్మసారమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
సీతాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సాధకుల్ + ఇమ్మహి' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
ఓటు పదను భువికి చాటి చెప్ప కదలిరమ్ము! జనులకు శరణమ్ము గాదె మేలు గొల్పునట్టి యేలుబడిని కోరినీతిని నియమమును నిలుప నేడు!
మమత సమత పెంచి మానవ జన్మకు ముక్తి గలుగ జేయు శక్తి నిడెడు సాధనముగ వెలుగు చక్కని గీత సా రమ్ము జనులకు శరణమ్ము గాదెనిన్నటి సమస్యకు నా పూరణ వాసన పోయిన పూవులు వీసమునకు బనికి రావు ; వేనకు వేలౌకాసుల వెచ్చించి గొనిన వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ
కృష్ణారావు గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'గీతాసారమ్ము' అనడం సాధుసమాసం.
రామరాజ ! నీవు రాముని రీతిగా అడలగొట్టితయ్య ! యాంగ్లదొరల ;భరతవీరపుత్ర ! భవదీయ ధీశరీరమ్ము జనులకు శరణమ్ము గాదె !
జంధ్యాల వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి, మొన్నటి పూరణలు కూడా పరిశీలించ ప్రార్థన.వనవాసము జేసెడి రాముని గని దనుజాంగన కడు మోహము నందెన్ఇనకుల తిలకుండివ్వగ ననుమతి, సౌమిత్రి కోసె నామె ముకు చెవుల్!ఏ సుమముల తావియు తన నాసికకు పడని వధూటి నా సతి యనగానా సిగ ముడువంగ నెపుడు వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ!
శ్రీధర రావు గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అణ్వాయుము గల్గి యసువులు దీతువా?పాకుదేశమోడ పాపి గొడుక!విడుము చెడ్డ, మంచి వహించు శాంతి సారమ్ము జనులకు శరణమ్ము గాదె?
యజ్ఞేశ్ గారూ,మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని దోషాలున్నవి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.
నేను ఈమధ్య మీ బ్లాగ్ చూసి కవిత్వం పట్ల కార్యోన్ముఖుడినయ్యాను. మీరు గురువులుగా భావిస్తున్నాను. సరిదిద్ది ప్రోత్సహించ ప్రార్థన.
నా తప్పులు సరి జేస్తారని భావిస్తూ...నమస్సుమాంజలులతో..యజ్ఞేశ్
మైలవరపు వారి పూరణ రమ్ము ! సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ నిమ్మహి విష్ణుభక్తి యొకటే ! యని నమ్ముము , చేర్చు నిన్ను పా... రమ్మును , వేయునేల ? యనరా ! వినరా హరినామమున్ నరా !!క్రమ్మక మున్నె వార్ధకము కంజదళాక్షు భజింపరా ! త్వరన్ !! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ!! నమోనమః !!
ఎప్పు డెవ్విధిఁ జరియింత్రు నేర్వ గలమే ముళ్ళ మీద నడక కళ్ళు తెఱచుధన మదాంధ జనుల దగ్గర కొలువు భారమ్ము జనులకు శరణమ్ము గాదె ఇమ్ముగ నిచ్చు భక్త జను లెల్లర కెంతొ ముదమ్ము పుణ్య ధామమ్ము వికుంఠ పత్తన రమా సతి నాథు ధరా బృహచ్ఛరిత్రమ్ము గుణప్రకీర్తిత నితాంత సమంచిత కీర్తనాది వారమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ [వారము = సమూహము]
కామేశ్వర రావు గారూ,మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) కైపద దాతలకు ప్రభుత్వ హెచ్చరిక: "మద్యపానము ఆరోగ్య హానికరము"తమ్ములు సోదరీమణులు తంపట బెట్టగ నాస్తికోసమైఝమ్మని యత్తమామలును జౌరుకు బోవగ శాంతిభద్రతల్గమ్మున బారుకేగుచును కమ్మని బాటిలు కోకుతోడుతన్ రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌసుధీజనాళి = అమృతము గ్రోలు వారు
ప్రభాకర శాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమ పూజ్యమైన పండితసూక్తిసారమ్ముజనులకు శరణమమ్ముగాదెమంచిమార్గమునకు మళ్ళించిమనుజునిదేశభక్తునిగను దీర్చిదిద్దు
సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన పూరణఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్ వమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్ నమ్ముచు నీశ్వరున్ సలుపు నైగమశాస్త్రపు జీవనమ్ము పారమ్ము సుధీజనాళికి,శరణ్యము, మోక్షపథానుగుణ్యమౌ
మూడవ పాదములో సా రమ్ము గా చదువ ప్రార్ధన!
గ్రీష్మ తాపమునకు గృహమునుండగ లేకతీర ప్రాంతములకు పారిపోయిచల్లదనము కొరకు సంద్రపు జలవిహారమ్ము జనులకు శరణమ్ము గాదె
సీతాదేవి గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
షడ్రుచులుగ నుండు సంసారసారమ్ముభార్య బిడ్డలన్న? బంధమందుచింతలెన్నియున్న చెలియలకట్ట తీరమ్ము జనులకు శరణమ్ముగాదె!
ఈశ్వరప్ప గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భద్ర శైల నాధు పాద దర్శనమనికొన్ని నాళ్ళు వెడలె నన్ను వదలి,గ్రంధ ముద్రణమని గైరు హాజరుకొన్నినాళ్ళు, కావ్య గోష్టి, వెళ్ళు చుంటిననుచు వీడినావు నన్నిట కొన్నాళ్ళు,యాశ్రమమున పనుల నలస ట వలన కన లేను నిన్ను , నమ్ముమా నన్ననితెలుపు చుందువు గద తిరుగు లేకకొన్ని నాళ్ళు,కంది గురు వర్య, శంకరానీదు శరణు లేక లేదు నాదుబ్లాగు పైన దృష్టి, పండి తోత్త ములకులేదు సమయ మిచట నాదు మోముచూడ ,శంకరార్య, వేడు చుంటిని ,వేగరమ్ము ,జనులకు శరణమ్ము గాదెనీదు రాక, విడిచి నీవెపుడు వెడలబోకు, ననుచు బ్లాగు మోకరిల్లెగురువు గారి పాద పద్మ ముల పైన ఒక క్షమాపణ కుసుమము ముంచి
పూసపాటి వారూ,మీ పద్యంపై నా స్పందనను వాట్సప్ సమూహంలో చూడండి.
ఇమ్ముగయుధ్ధరంగమునగృష్ణునిసూక్తులనెన్నగాసుసారమ్ము,సుధీజనాళికిశరణ్యముమోక్షపథానుగమ్యమౌనిమ్మహినెవ్వరింటవిననింపునుగల్గుచునున్నవివ్వియేనమ్మితినామనంబునసనాతనమైనవిగావుతన్సుమా
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.. . ఇమ్మహిలోన మానవులు నించుక జేసిన పుణ్య కార్యముల్సమ్మతితోడ నీతిగను సాగిన పేదల నాదరించుచున్నెమ్మనమందు రాఘవుని నిత్యము గొల్చిన రామనామ సారమ్ము సుధీ జనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ.
లక్ష్మినారాయణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాధలందు మునిగి పరితపించెడివేళనార్తి బాపి మదికి హాయి నొసగునట్టి తావదేది యన్నరాముని మందిరమ్ము.జనులకు శరణమ్ము గాదె.కాలినడకతోడ క్రమముగా జనములునడచి వత్తురెపుడు నయము గానునఘము లణచి వేయు ననలాక్షు గిరిశిఖరమ్ము జనులకు శరణమ్ము గాదె"సహన భావమూని సాగుచుండ మనముసంహరించిరి కద సైనికులనుమౌనమింక వలదు మహిని లెండిక సమరమ్ము జనులకు శరణు కాదె.
డా. ఉమాదేవి గారూ,మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పొరుగు దేశ మెపుడు పోరుకే కవ్వించ శాంతి యనుట మనకు సాధ్య మగునె?సత్తువ నెరిగింప సాగింప గా సమ రమ్ము జనులకు శరణమ్ము గాదె.
డా. మూర్తి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్త జనుల బ్రోవ వసుధాతలమ్మున వేంకటేశు డగుచు వెలసె హరియెమహిని దివ్య క్షేత్రమౌ తిరుమల శిఖరమ్ము జనులకు శరణమ్ము గాదె.
ఇమ్మహి గాచనెంచుచు మహీపతి పంక్తిరథున్ సుతుండుగా నమ్మహి తాత్మజుండె భరతావని బుట్టెనటంచుగాథలెన్నియో బామ్మలు చెప్పిరే గుడిని భక్తినయోధ్యన గట్టగన్ వడిన్ రమ్ము, సుధీజనాళికి శరణ్యము మోక్షపథాను గుణ్యమౌ.
విరించి గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పాకువాడువచ్చి పాకవేసిననాడునులకకనుబలకక నురగమటులఎగిరెగిరి పడిపడియేలఘోషలు సమ*"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*
తిమ్మిని బమ్మిజేయుచును దేశమలందున నంగనాచిగన్సమ్మెట పోటులంచు దొర సానికి సానికి విన్నవించు బాకిమ్మహి బాతకీయగు స్వకీయ కుతంత్రపు టాటకట్టు మా*"ర్గమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*
శంకర్ గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా ప్రయత్నం :ఆటవెలదిబుగ్గి జేయ మనల పుల్వామ దాడిలోయుగ్రవాద పాకు యురిమి యురిమిదేశము దనరఁగ ప్రతీకార సైన్య ధీరమ్ము జనులకు శరణమ్ము గాదె!ఉత్పలమాలఅమ్ముని సేవలో దనరి యాగము గాచిన రామమూర్తి స్థైర్యమ్ము! జనార్దనాంచితనిరాయుధు నాయుధ ధారణా సుగీతమ్మున మాతృదేశ భవితవ్యము నెంచెడు సైన్య ధైర్య వీరమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ!
సహదేవుడు గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రవీందర్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇమ్ముగ మంచి కార్యముల నెన్నియొ జేయుచు స్వార్థమెంచకన్ సొమ్ములు దాచి పెట్టినవి సోమరి వారికి దారిఁ జూప యోగమ్మని భావనెంచి సహకారమొనర్చెడిదౌ పరోపకా"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"
అమ్ములు క్రోధ కామములు యాతన జేయగ మానవాళినిన్
రిప్లయితొలగించండివమ్మగు లోకచింతనపు భారము జీవుల క్రుంగదీయగా
కమ్మని గీతబోధనల కర్మము జ్ఞానము భక్తియోగ సా
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
బాగుంది. అభినందనలు !
తొలగించండి💐👍👌💐
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిగీతాసారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిబాగుంది. అభినందనలు !
తొలగించండి💐👍👌💐
సమస్య :-
రిప్లయితొలగించండి"రమ్ము జనులకు శరణమ్ము గాదె"
*ఆ.వె**
దేశ ప్రజల కొరకు దేశాల సూత్రాలు
కలిపి రాసి నట్టి గ్రంథ మదియె
రక్ష నిచ్చు భరత రాజ్యాంగ సూత్ర సా
రమ్ము జనులకు శరణమ్ము గాదె !
.....................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిరాజ్యాంగ సారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్రాసినట్టి' అనండి.
బాగుంది. అభినందనలు !
తొలగించండి💐👍👌💐
ధర్మబద్ధమైన కర్మయోగములోని
రిప్లయితొలగించండివిహిత తత్త్వములను విశదపరచు
కిల్బిషాంతకమ్ము గీతార్థ వేద సా
రమ్ము జనులకు శరణమ్ము కాదె
విజయకుమార్ గారూ,
తొలగించండిగీతార్థ వేద సారమ్ముతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రాణ భయము లేక పరులర క్షణకోరి
రిప్లయితొలగించండియుద్ధ భూమి కేగు బుద్ధు లనగ
గీత బోధ కన్న చేతసాయ మిడగ
రమ్ము జనులకు శరణమ్ము కాదె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రమ్ము అని ఆహ్వానించారు. కాని జనులకు ఏది శరణం?
వమ్ము భవమ్మునందు పరువమ్మును నమ్ముచు సొమ్ముఁ గూర్చ, వ్య
రిప్లయితొలగించండిర్థమ్మగు జీవనమ్ము, దరిదాపున నుండవు శాశ్వతమ్ము, ఘో
రమ్మగు జీవనమ్ము, మధురమ్మగు మాధవపాదభక్తిపూ
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పరమ పావనమ్ము పరమాత్మ నామమ్ము
రిప్లయితొలగించండిఇడుము లెల్ల బాసి ఇలను గాచు
మోక్ష పధము చూపు మురహరి గీత సా
రమ్ము జనులకు శరణమ్ము కాదె
కృష్ణారెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నామమ్ము +ఇడుములు = నామమ్ము లిడుములు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "పరమాత్మ శుభనామ। మిడుములెల్ల..." అనవచ్చు. '...బాసి యిలను' అని యడాగమం వస్తుంది. 'గీతాసారమ్ము' అన్నది సాధు సమాసం.
ధన్యోస్మి. పూరణ చేశాక మీ అభినందన కానీ సవరణ కానీ చూస్తే సంతోషంగా ఉంటుంది.
తొలగించండిసమత మమత కల్గి సాత్విక భావాన
రిప్లయితొలగించండిదైవ భక్తి దయయు ధర్మ ములు ను
సత్య పాల నంబు నిత్య మౌచు మమ కా
రమ్ము జనుల కు శరణ మ్ము కా దె !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలితోడుపాడునందించుసంసార
రిప్లయితొలగించండియానమందుసుఖమునభ్యుదయము
సర్దుబాటుశాంతి సహనంబుతోగాపు
*"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని విష్ణుగీర్తనల గావ్యసుధాపగ లోకమంతకున్
రిప్లయితొలగించండినమ్మినతీర్థమైయొసగునాత్మ నివృత్తి పిపాసనణ్చుచున్
గ్రమ్మిన ద్వంద్వమోహముల కల్మషమున్ గడుగున్ విరక్తి పూ
*"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్ని జన్మలెత్తి యెన్నాళ్ళు బొగడినా
రిప్లయితొలగించండికానరావె నీవు కరుణజూపి
బడుగు జీవి బ్రతుకు బాగుపరచవేగ
రమ్ము జనులకు శరణమ్ము గాదె"!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బొగడినన్' అనండి.
కష్ట నష్ట చయము క్రమ్మిన సమయాన
రిప్లయితొలగించండిదిక్కు తోచ కుండ తిరుగు వేళ
యఘములను దరిమెడి రఘుపతి పదశిబి
రమ్ము జనులకు శరణమ్ము గాదె !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.పాప పంకమునిల ప్రక్షాళనము జేసి
రిప్లయితొలగించండిజన్మ సంచితముల సడలజేసి
మోక్ష సౌఖ్య మునకు మూలమ్ము భక్తిసా
రమ్ము జనులకు శరణమ్ము గాదె.
ఆకుల శివరాజలింగం వనపర్తి
శివరాజలింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విలువలుడిగి వైరి కలిగించ కష్టముల్
రిప్లయితొలగించండిశాంతి యంచు నిలువ సాధ్యమగునె?
తగిన బుద్ధి చెప్ప ధరణిపైనను సమ
రమ్ము జనులకు శరణమ్ము గాదె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిబాధలందు మునిగి పరితపించెడివేళ
యార్తి బాపి మదికి హాయి నొసగు
నట్టి తావదేది యన్నరాముని మంది
రమ్ము.జనులకు శరణమ్ము గాదె.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేళ నార్తి...' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్
రిప్లయితొలగించండివమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్
యిమ్మహి భక్తిపూరముగ నీశ్వరునమ్ముచు సాగుధర్మసా
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సాధకుల్ + ఇమ్మహి' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
తొలగించండిఓటు పదను భువికి చాటి చెప్ప కదలి
రిప్లయితొలగించండిరమ్ము! జనులకు శరణమ్ము గాదె
మేలు గొల్పునట్టి యేలుబడిని కోరి
నీతిని నియమమును నిలుప నేడు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మమత సమత పెంచి మానవ జన్మకు
రిప్లయితొలగించండిముక్తి గలుగ జేయు శక్తి నిడెడు
సాధనముగ వెలుగు చక్కని గీత సా
రమ్ము జనులకు శరణమ్ము గాదె
నిన్నటి సమస్యకు నా పూరణ
వాసన పోయిన పూవులు
వీసమునకు బనికి రావు ; వేనకు వేలౌ
కాసుల వెచ్చించి గొనిన
వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'గీతాసారమ్ము' అనడం సాధుసమాసం.
రామరాజ ! నీవు రాముని రీతిగా
రిప్లయితొలగించండిఅడలగొట్టితయ్య ! యాంగ్లదొరల ;
భరతవీరపుత్ర ! భవదీయ ధీశరీ
రమ్ము జనులకు శరణమ్ము గాదె !
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండి
రిప్లయితొలగించండిగురువర్యులకు నమస్సులు, నా నిన్నటి, మొన్నటి పూరణలు కూడా పరిశీలించ ప్రార్థన.
వనవాసము జేసెడి రా
ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
ఇనకుల తిలకుండివ్వగ
ననుమతి, సౌమిత్రి కోసె నామె ముకు చెవుల్!
ఏ సుమముల తావియు తన
నాసికకు పడని వధూటి నా సతి యనగా
నా సిగ ముడువంగ నెపుడు
వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అణ్వాయుము గల్గి యసువులు దీతువా?
రిప్లయితొలగించండిపాకుదేశమోడ పాపి గొడుక!
విడుము చెడ్డ, మంచి వహించు శాంతి సా
రమ్ము జనులకు శరణమ్ము గాదె?
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని దోషాలున్నవి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.
నేను ఈమధ్య మీ బ్లాగ్ చూసి కవిత్వం పట్ల కార్యోన్ముఖుడినయ్యాను. మీరు గురువులుగా భావిస్తున్నాను. సరిదిద్ది ప్రోత్సహించ ప్రార్థన.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినా తప్పులు సరి జేస్తారని భావిస్తూ...
తొలగించండినమస్సుమాంజలులతో..
యజ్ఞేశ్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరమ్ము ! సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
నిమ్మహి విష్ణుభక్తి యొకటే ! యని నమ్ముము , చేర్చు నిన్ను పా...
రమ్మును , వేయునేల ? యనరా ! వినరా హరినామమున్ నరా !!
క్రమ్మక మున్నె వార్ధకము కంజదళాక్షు భజింపరా ! త్వరన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ!! నమోనమః !!
తొలగించండిఎప్పు డెవ్విధిఁ జరియింత్రు నేర్వ గలమే
రిప్లయితొలగించండిముళ్ళ మీద నడక కళ్ళు తెఱచు
ధన మదాంధ జనుల దగ్గర కొలువు భా
రమ్ము జనులకు శరణమ్ము గాదె
ఇమ్ముగ నిచ్చు భక్త జను లెల్లర కెంతొ ముదమ్ము పుణ్య ధా
మమ్ము వికుంఠ పత్తన రమా సతి నాథు ధరా బృహచ్ఛరి
త్రమ్ము గుణప్రకీర్తిత నితాంత సమంచిత కీర్తనాది వా
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
[వారము = సమూహము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కైపద దాతలకు ప్రభుత్వ హెచ్చరిక: "మద్యపానము ఆరోగ్య హానికరము"
తమ్ములు సోదరీమణులు తంపట బెట్టగ నాస్తికోసమై
ఝమ్మని యత్తమామలును జౌరుకు బోవగ శాంతిభద్రతల్
గమ్మున బారుకేగుచును కమ్మని బాటిలు కోకుతోడుతన్
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
సుధీజనాళి = అమృతము గ్రోలు వారు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమ పూజ్యమైన పండితసూక్తిసా
రిప్లయితొలగించండిరమ్ముజనులకు శరణమమ్ముగాదె
మంచిమార్గమునకు మళ్ళించిమనుజుని
దేశభక్తునిగను దీర్చిదిద్దు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన పూరణ
రిప్లయితొలగించండిఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్
వమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్
నమ్ముచు నీశ్వరున్ సలుపు నైగమశాస్త్రపు జీవనమ్ము పా
రమ్ము సుధీజనాళికి,శరణ్యము, మోక్షపథానుగుణ్యమౌ
మూడవ పాదములో సా రమ్ము గా చదువ ప్రార్ధన!
తొలగించండిగ్రీష్మ తాపమునకు గృహమునుండగ లేక
తొలగించండితీర ప్రాంతములకు పారిపోయి
చల్లదనము కొరకు సంద్రపు జలవిహా
రమ్ము జనులకు శరణమ్ము గాదె
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిషడ్రుచులుగ నుండు సంసారసారమ్ము
రిప్లయితొలగించండిభార్య బిడ్డలన్న? బంధమందు
చింతలెన్నియున్న చెలియలకట్ట తీ
రమ్ము జనులకు శరణమ్ముగాదె!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభద్ర శైల నాధు పాద దర్శనమని
తొలగించండికొన్ని నాళ్ళు వెడలె నన్ను వదలి,
గ్రంధ ముద్రణమని గైరు హాజరు
కొన్ని
నాళ్ళు, కావ్య గోష్టి, వెళ్ళు
చుంటి
ననుచు వీడినావు నన్నిట కొన్నాళ్ళు,
యాశ్రమమున పనుల నలస ట వల
న కన లేను నిన్ను , నమ్ముమా నన్నని
తెలుపు చుందువు గద తిరుగు లేక
కొన్ని నాళ్ళు,కంది గురు వర్య, శంకరా
నీదు శరణు లేక లేదు నాదు
బ్లాగు పైన దృష్టి, పండి తోత్త ములకు
లేదు సమయ మిచట నాదు మోము
చూడ ,శంకరార్య, వేడు చుంటిని ,వేగ
రమ్ము ,జనులకు శరణమ్ము గాదె
నీదు రాక, విడిచి నీవెపుడు వెడల
బోకు, ననుచు బ్లాగు మోకరిల్లె
గురువు గారి పాద పద్మ ముల పైన ఒక క్షమాపణ కుసుమము ముంచి
పూసపాటి వారూ,
తొలగించండిమీ పద్యంపై నా స్పందనను వాట్సప్ సమూహంలో చూడండి.
ఇమ్ముగయుధ్ధరంగమునగృష్ణునిసూక్తులనెన్నగాసుసా
రిప్లయితొలగించండిరమ్ము,సుధీజనాళికిశరణ్యముమోక్షపథానుగమ్యమౌ
నిమ్మహినెవ్వరింటవిననింపునుగల్గుచునున్నవివ్వియే
నమ్మితినామనంబునసనాతనమైనవిగావుతన్సుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.. .
రిప్లయితొలగించండిఇమ్మహిలోన మానవులు నించుక జేసిన పుణ్య కార్యముల్
సమ్మతితోడ నీతిగను సాగిన పేదల నాదరించుచున్
నెమ్మనమందు రాఘవుని నిత్యము గొల్చిన రామనామ సా
రమ్ము సుధీ జనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాధలందు మునిగి పరితపించెడివేళ
రిప్లయితొలగించండినార్తి బాపి మదికి హాయి నొసగు
నట్టి తావదేది యన్నరాముని మంది
రమ్ము.జనులకు శరణమ్ము గాదె.
కాలినడకతోడ క్రమముగా జనములు
నడచి వత్తురెపుడు నయము గాను
నఘము లణచి వేయు ననలాక్షు గిరిశిఖ
రమ్ము జనులకు శరణమ్ము గాదె"
సహన భావమూని సాగుచుండ మనము
సంహరించిరి కద సైనికులను
మౌనమింక వలదు మహిని లెండిక సమ
రమ్ము జనులకు శరణు కాదె.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పొరుగు దేశ మెపుడు పోరుకే కవ్వించ
రిప్లయితొలగించండిశాంతి యనుట మనకు సాధ్య మగునె?
సత్తువ నెరిగింప సాగింప గా సమ
రమ్ము జనులకు శరణమ్ము గాదె.
డా. మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్త జనుల బ్రోవ వసుధాతలమ్మున
రిప్లయితొలగించండివేంకటేశు డగుచు వెలసె హరియె
మహిని దివ్య క్షేత్రమౌ తిరుమల శిఖ
రమ్ము జనులకు శరణమ్ము గాదె.
ఇమ్మహి గాచనెంచుచు మహీపతి పంక్తిరథున్ సుతుండుగా
రిప్లయితొలగించండినమ్మహి తాత్మజుండె భరతావని బుట్టెనటంచుగాథలెన్నియో
బామ్మలు చెప్పిరే గుడిని భక్తినయోధ్యన గట్టగన్ వడిన్
రమ్ము, సుధీజనాళికి శరణ్యము మోక్షపథాను గుణ్యమౌ.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పాకువాడువచ్చి పాకవేసిననాడు
రిప్లయితొలగించండినులకకనుబలకక నురగమటుల
ఎగిరెగిరి పడిపడియేలఘోషలు సమ
*"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*
తిమ్మిని బమ్మిజేయుచును దేశమలందున నంగనాచిగన్
రిప్లయితొలగించండిసమ్మెట పోటులంచు దొర సానికి సానికి విన్నవించు బా
కిమ్మహి బాతకీయగు స్వకీయ కుతంత్రపు టాటకట్టు మా
*"ర్గమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండిఆటవెలది
బుగ్గి జేయ మనల పుల్వామ దాడిలో
యుగ్రవాద పాకు యురిమి యురిమి
దేశము దనరఁగ ప్రతీకార సైన్య ధీ
రమ్ము జనులకు శరణమ్ము గాదె!
ఉత్పలమాల
అమ్ముని సేవలో దనరి యాగము గాచిన రామమూర్తి స్థై
ర్యమ్ము! జనార్దనాంచితనిరాయుధు నాయుధ ధారణా సుగీ
తమ్మున మాతృదేశ భవితవ్యము నెంచెడు సైన్య ధైర్య వీ
రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇమ్ముగ మంచి కార్యముల నెన్నియొ జేయుచు స్వార్థమెంచకన్
రిప్లయితొలగించండిసొమ్ములు దాచి పెట్టినవి సోమరి వారికి దారిఁ జూప యో
గమ్మని భావనెంచి సహకారమొనర్చెడిదౌ పరోపకా
"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"