రాగ ద్వేషము వీడిన మోక్ష మార్గము అన్నది సరియే మరి రాగద్వేషములు విడనాడిన ఆ విశ్వామిత్రుడు మేనక పై వలపు పెంచు కొనెడివాడు కాదు గదా అప్పుడు ఈ భారత వంశము ఉండేదా ఆ విశామిత్రుడు ఆరోజున దశరదునిపై చిరు కోపము చూపకున్న సీతారామ కళ్యాణము జరిగేదా యనుభావన
యిలలో నా ముని కౌశికుండు గొనడే యెచ్చోట నైనన్ రహిన్, వలపే మేనక మీద లేదనిన యీవంశంబు శోభిల్లునా? యలుకే యేలిక పైన లేదన వివాహం బొప్పునా సీతకున్ ? తలపోయంగవలెన్ గదా నతని సంతానమ్ముచిత్తంబునన్ కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించునిలదీయంగ నధర్మవర్తనుల నిన్నెంచంగ పాలించ పా
పులపాపమ్మె యడంచు వారిననుటల్ మూర్ఖమ్ముదాసీనతల్
కలిలో నొప్పవు, చట్టముల్ గలవయా! ఖండించ దుర్మార్గమున్
గలదే మోక్షపదమ్ము 'యోగు' లకు రాగద్వేషముల్ వీడినన్?
ఆగడముల దేహమ్మిది
రిప్లయితొలగించుభోగము రోగముల నెలవు; పొంకము తోడన్
పోగాలము వచ్చు వరకు
రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్
ప్రజలారా!
రిప్లయితొలగించుఆగడముల పగవారికి
పోగాలము దాపురించె! బుద్ధిగ నుండన్
సాగునె? యధికారమనెడు
రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్
భోగములు పెరిగి నంతనె
రిప్లయితొలగించురాగములు తరిగి పోయి రక్కసుల వలెన్
రాగాను రాగము లొకటని
రాగద్వే షమ్ముల విడరాదు మునులకున్
-----------------------------------
వలదో యీపగ బూనినంత మనమున్ వైరమ్ము పెంపొందగన్
కలతల్ మీరగ యుద్ధముల్ పెరిగి కాలుష్యమ్ము నన్ముంచగా
ఫలమే ముండును పూజలన్ గరపి పాపాలందు నన్నిండినన్
కలదే మోక్ష పదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్
రిప్లయితొలగించుపెందరాళే ఇన్ని పూరణలే :)
యోగము మేలు! విడుమికన్
రాగద్వేషమ్ముల! విడరాదు మునులకున్
క్రేగంటిచూపులు! జిలే
బీ గట్టి నియమమువలయు పిరియము తోడై!
శుభోదయం
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుగురువులు నిద్ర పోయినట్టు లేరు.
రిప్లయితొలగించుమా అందరి కోసమైనా ఆరోగ్యం చూసుకోవాలికదా ?
దీవించి అక్క .
రిప్లయితొలగించుToo many questions!/ who has the answer ?
కలదే మోక్షపదమ్ము యోగులకు? రాగద్వేషముల్ వీడినన్
లలనా కొంతయు దక్కు శాంతియకొ?మల్లాటల్ సఖీ తగ్గునో ?
యిలకల్లోలము ! విష్ణు మాయ! వలయైయీనాడు సందేహమున్
కలిగించెన్ కద !దారి యేది విభుడిన్ కారుణ్యమున్ పొందగా?
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుకలతల్ బొందుచు ," నీవు నే " ననుచు ధి
రిప్లయితొలగించుక్కారంబులన్ జేయగా ;
నలసత్వంబున దుష్టభావకులునౌ
నవ్వారికిన్ మోక్షమున్
గలదే ? మోక్షపదమ్ము యోగులకు రా
గద్వేషముల్ వీడినన్
గలుగున్ సంతతధర్మదీక్షను జగ
త్కల్యాణమున్ దల్పగన్ .
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించుఈ ప్రశ్న ఒక భార్య భర్తనడిగినట్లు... అతడు ఆమెకు సమాధానం చెప్పుచున్నట్లు భావిస్తూ.. పూరణ.. (కలదే... నిశ్చయముగా ఉన్నది అని చెప్పుచున్నాడు)
చలదంభోధి తరంగతుల్యనిజసంసారంపు రాగమ్ము కే...
వలమౌ జ్ఞానముఁ గప్పివేసినది , దివ్యంబైన ధీశక్తినీ...
యలలన్ ద్రుంచుచు , ద్వేషమందవలె దేహాత్మత్వభావమ్మునన్!
కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుయోగము పోటీ బేరము
సాగునె సాధువుగ మనగ జనపుటడవినిన్
మూగగ గనబడవలె సరి
రాగ ద్వేషమ్ముల విడ రాదు మునులకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుడా.పిట్టా సత్యనారాయణ
తొలగించుఇలలో యోగి జనాళిలో నెగురు,"రా!యిందుండె నానంద మం
చలవోకన్ గను తంబురాదుల రవాచ్ఛాదంబె బ్రహ్మంబునౌ"
కలహప్రీతి ముఠాల ప్రాపు గొనియున్ గాజేయ బ్రత్యర్థులన్;
కలదే మోక్ష పదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్
వేగ మె మోక్షము కలుగును
రిప్లయితొలగించురాగ ద్వేష మ్ములవిడ ; రాదు మును ల కున్
భోగ ము లం దాశ పెరిగి
సాగింప పరమ పదము ను జటిల తప ము నన్
అల గాధేయుడు కోపతప్త హృదయం బాలంబనంబైన,వి
రిప్లయితొలగించుహ్వలుడై నష్టము జెందె--తాపసులు శుభ్ర బ్రహ్మ వేత్తల్ గదా!
కలలోనైనను తుచ్చ వాంచ్హలకు సౌఖ్యశ్రీలకున్ లొంగునే?
కలదే మోక్ష పదంబు యోగులకు రాగద్వేషముల్ వీడినన్!
తుచ్ఛ వాంఛలకు అని 3పాదంలో చదువ ప్రార్థన
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసాగిన జీవితమంతయు
రిప్లయితొలగించుభోగములకు ధార వోయు మూఢమతులకున్,
సాగుచు సత్తున నఘముల
*"రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్"*
భోగులు బంధీలుగదా
రిప్లయితొలగించురాగ ద్వేషమ్ముల, విడరాదు మునులకున్
యోగమను ముక్తి మార్గము
నాగా భరణున్ బవిత్ర నామామృతమున్.
సాగును బ్రతుకంతయు నిల
రిప్లయితొలగించురాగద్వేషమ్ముల;విడరాదు మునులకున్
బాగగు శమదమముల దా
వీగుచు ద్వంద్వమ్ముల దుది వెన్నునిజేరన్ !
రాగ ద్వేషము వీడిన మోక్ష మార్గము అన్నది సరియే మరి రాగద్వేషములు విడనాడిన ఆ విశ్వామిత్రుడు మేనక పై వలపు పెంచు కొనెడివాడు కాదు గదా అప్పుడు ఈ భారత వంశము ఉండేదా ఆ విశామిత్రుడు ఆరోజున దశరదునిపై చిరు కోపము చూపకున్న సీతారామ కళ్యాణము జరిగేదా యనుభావన
రిప్లయితొలగించుయిలలో నా ముని కౌశికుండు గొనడే యెచ్చోట నైనన్ రహిన్,
వలపే మేనక మీద లేదనిన యీవంశంబు శోభిల్లునా?
యలుకే యేలిక పైన లేదన వివాహం బొప్పునా సీతకున్ ?
తలపోయంగవలెన్ గదా నతని సంతానమ్ముచిత్తంబునన్
కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్
యోగులు విడువగ వలయును
రిప్లయితొలగించురాగద్వేషమ్ముల,విడరాదుమునులకున్
యోగపు ధర్మము లేవియు
యోగమయది యట్లయునికి యోగులకెల్లన్
ఏ గతి నారసి చూచిన
రిప్లయితొలగించునాగమ వేదులు ఘనులు సదాచారులు న
భ్యాగతిని, మనం బం దిడి
రాగద్వేషమ్ముల, విడరాదు మునులకున్
పలుకం జాలునె సత్య దూరములు నిర్భాగ్యమ్ము సేకూరినం
గలనం దైనను నన్య దారల మదిం గామింప సంభావ్యమే
చలనం బించుక లేక నేత్రముల నాచ్ఛాదించి కూర్చున్ననుం
గలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్
భోగము కోరిన రాజులు
రిప్లయితొలగించురాగద్వేషమ్ముల విడరాదు; మునులకున్
యోగక్షేమము కోరెడి
యోగులకున్మొక్కగవల నోరిమి కలిగిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
అల గోరఖ్ పురినందునన్ వెలసితా నాదిత్య యోగీంద్రుగా
పలు మారుల్ చని పార్లమెంటునకుతా ప్రారబ్ధ కర్మంబునన్
పిలువంగా కొని సంబరంబుగను యూపీ ముఖ్యమంత్రిత్వమున్
పులి వోలెన్ చని హైద్రబాదునకుతా పూజించెగా భాగ్మతిన్;👇
"కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్?"
మం కలధౌ తాంబరముల్ త్యజించి,మునులున్ కాషాయముల్ గట్టి, యా
రిప్లయితొలగించుజలజాతాక్షుని నిష్ట గొల్చి,క్రతువుల్ సాధించి సన్మార్గులై
ఫలపత్రంబుల నారగించు తతికిన్ వాలాయమున్ దుర్గతిన్
కలదే?మోక్షపదమ్ము యొగులకు రాగద్వేషముల్ వీడినన్
ఆకుల శివరాజలింగము
వనపర్తి
తొలగించుసాగును జనజీవనమిటు
రాగద్వేషమ్ముల,విడరాదు మునులకున్
యోగము సతతము జగతిన
భోగము వీడుదురు వారు మోక్షాసక్తిన్
జగతిన విడువగ వలయును
యోగము చేయుటను సతతముర్వీ స్థలిలో
సాగిలబడి మ్రొక్క వలయు
రాగద్వేషమ్ముల ,విడరాదు,మునులకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఅలకామాంధుడు పూజలన్నియును దాదాత్మ్యంబుతోజేసిన
రిప్లయితొలగించున్గలదేమోక్షపదమ్ము,యోగులకురాగద్వేషముల్
కలలోసైతమునుండగూడదుగనే కామంపుటాలోచనల్
లలనా!వింటివె!నీవునున్జెపుమవాలాయంబుగామౌనికిన్
త్యాగమెగద నూహంచగ?
రిప్లయితొలగించురాగద్వేషమ్ములవిడ!"రాదుమునలకున్
భోగములాశించుచు సం
యోగము విడనాడి బ్రతుకు!యోగముకొరకే!
గళమున్ నాగువు నర్థభాగమున నా కాత్యాయనిన్ గల్గి తా
రిప్లయితొలగించుదలపై గంగను దాల్చినట్టి శివునిన్ ధ్యానించుచున్ నిత్యమా
యలికాక్షుండను గొల్చువారికిని సత్యాన్వేషు లౌ వారికే
కలదే మోక్షపథమ్ము , యోగులకు రాగద్వేషమ్ములన్ వీడినన్
త్యాగపు బుద్ధి పెరుగగా
రిప్లయితొలగించుయోగపు ధర్మము విముక్తి యోజన మవగా
సాగక మనసున గట్టిన
రాగద్వేషమ్ముల, విడరాదు మునలకున్!
రాగానురాగభోగము
రిప్లయితొలగించుభాగానీకేలయోగివర్యమహాత్మా!
యేగతిసదాగతియగు వి
*"రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్*
ఏగతి బ్రహ్మర్షినగుదు
రిప్లయితొలగించునీగతివధియింపబూను నీగాధేయున్
భాగావశిష్ఠ!సైపుమ
*"రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్"*
(విశ్వామిత్రుడు తనని "బ్రహ్మర్షీ" యని పిలువ లేదని కసితో, వశిష్ఠుని చంపుతానని, రాయినెత్తి చంపబూనుచు పశ్చాత్తాపం తో....)
రిప్లయితొలగించుభాగా ద్వంద్వంబువిడుమ
*"రాగద్వేషమ్ముల; విడరాదు మునులకున్"*
త్యాగముశమదమసత్యము
యాగమునిష్కామకర్మమాస్తేయంబుల్
కలదేపూజ్యులకాత్మవంచనము భోగాకాంక్షలన్వీడగన్
కలదేవీరులకాభిఘాతకుల ధిక్కారస్వరంబోర్చగన్
కలదేజారులకంగనామణుల శృంగారాంగమున్దూరగన్
*"కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్"*
సులువా సంచిత పాపపుణ్య చయమస్తోకాంబుధిన్నీదకన్
సులువేమోహమహాంధ్యమేఘమదిసజ్జ్యోతీమరుత్తున్వినా
*"కలదే మోక్షపదమ్ము యోగులకు ;రాగద్వేషముల్ వీడినన్"*
కలిలోవేంకటనాథునర్చనయె నిష్కామ్యార్థభోగంబిడున్
వలువల్ దాల్చుచు కావిరంగునవి తా వ్యామోహమున్ మున్గుచో
రిప్లయితొలగించుకలదే మోక్షపదమ్ము యోగులకు?రాగద్వేషముల్ వీడినన్
తులలేనట్టివి శాంతిసౌఖ్యములు చేతోమోదమున్ గల్గునే
తొలగన్గామము,క్రోధముల్ మదిని వైదుష్యమ్ము పెంపొందుగా!
వలదే లాభపు యోజనమ్ము,హృదయాబ్జాంతర్ని వాసమ్ముగా
రిప్లయితొలగించునలినీ షడ్రిపు వర్గమున్ దిరుగ రాదయ్యో,సదా ధ్యానమున్
సలుపన్ ధర్మము దానిచే స్థిరత,మనో చాపల్య తన్ ముక్తి యున్
గలదే? మోక్షపథమ్ము యోగులకు రాగద్వేషమ్ములన్ వీడినన్
భోగములున్నను మనుషులు
రిప్లయితొలగించురాగద్వేషమ్ముల విడరాదు, మునులకున్
సాగుని వన్నియుఁ గాంచగ,
నేగతి నందున్ననాస్తులివియే హితమున్