15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2931 (మునిఁగిన పంట....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"
(లేదా...)
"మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్"

73 కామెంట్‌లు:

 1. కనివిని యెరుగని రీతిని
  మినుములు పండగ ననువుగ మెరియగ కన్నుల్
  కనుగొన మెండుగ ధనమున
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 2. ఘనమగు ధాన్యపు రాసికి
  మనమున సంతోష మంది మాభాగ్య మటన్
  తనరుచు మైకము నందున
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 3. వినుడో రైతులు గుందకు
  డనుమానమదేలపంట కాదరువగుచున్
  మన సర్కారే కొనునన
  "మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"

  రిప్లయితొలగించండి
 4. వనజముల సాగు కొరకున్
  ఘనముగ చెరువుల ను తవ్వి కదిలిరి కొందర్
  ననువుగ వర్షము కురియగ
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కొందర్' అని హలంతంగా వ్రాయరాదు.

   తొలగించండి
 5. చినిగిన బట్టలన్నిటికి శ్రేష్టపు వస్త్రము లిచ్చుపుణ్యులున్

  అణగిన బీదవారలకు నద్భుతవాసము గూర్చుదాతలున్
  మునిగిన ధాన్యమంతటిని మోదముతోగొని పించ,బాపురే

  "మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్

  రిప్లయితొలగించండి
 6. పనికల్పించియు ప్రభుతయె
  ఘనమగు సంపదల మత్స్యకారుల కొసగన్
  పనిపెను నదముల చేపల
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి


 7. కనుడయ్య యీయెరువుని! మ
  హిని మీ పంటల కిదేను హితమగును ! రసా
  యనికముగ పెరిగి బరువున
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. విట్టుబాబు గారు

   మన బరువులా అన్నమాట :)

   మన బరువు మనకు బంగరు కదా :)

   పప్పన్నం పెడుతున్నారని విన్నా యెప్పుడు ? :)

   జిలేబి

   తొలగించండి
  3. ఇంకా ఆ సమయము వచ్చినట్టు లేదండీ..
   ☺️🙏🏻

   తొలగించండి
 8. అనువగు గవ్యమున కలుపు
  మునిఁగిన, పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్
  తనువుల పులకలు రేగగ
  ధనమున నిండు గృహమనుచు తలచుచు మదులన్

  రిప్లయితొలగించండి
 9. తను చేయు పంటనువదలి
  ఘనముగ గంజాయి సాగు కాసు లిడునుగా
  యని నొకడు తలచ, వానకు
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యని యొకడు' అనండి.

   తొలగించండి
 10. మునుముగ నేడ్చిరి రైతులు
  మునిఁగిన పంటనుఁ గని; కడు మురిసిరి రైతుల్
  ఘనముగ పండిన పంటను
  గనుచును జనులందరును పొగడగ మిగులగన్!

  రిప్లయితొలగించండి
 11. సమస్య :-
  "మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"

  *కందం**

  కనికర మసలుగ జూపక
  మునుపటి యట్లుగ కురువక ముంచిన వానల్
  ననువున జోరుగ కురియగ
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్
  ....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 12. వనితల ముగ్గుల ముంగిలి
  కనువిందుగ పిలిచె నంట కాసులు కురియన్
  తనువులు పులకించు మోదము
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "తనువు పులకించు..." అనండి.

   తొలగించండి
 13. అనువగు వానల కు చెరువు
  మునిగిన పంట ల ను గని కడు మురిసి రి రైతుల్
  ఘనమగు దిగు బడి ధరలను
  మనమున నాశించి భవిత మనదే యను చున్

  రిప్లయితొలగించండి
 14. నెనరుగ నందినందనుల
  నేస్తము జేయుచు నేల దున్నుచున్ ;
  కనపడు గడ్డినే పెరికి
  గాఢపు నేరిమి నీరు పెట్టుచున్ ;
  ఘనమగు " జై కిసాను " బల
  గర్భితలాభములన్ మహాబ్ధిలో
  మునిగిన పంట గాంచి కడు
  మోదము నందిరి రైతు లయ్యెడన్ .

  రిప్లయితొలగించండి
 15. జనగామయొ వనపర్తియొ
  కనిగిరియో కాకినాడ కావలి పురమో
  కనగా ప్రతిచోట సిరుల
  *"మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"*

  రిప్లయితొలగించండి
 16. ఘన సస్యము గాదెల నిం
  పిన నిత్యోత్సవము గాగ పిల్లలు విద్యా
  ర్జనలో రేయింబవలును
  మునిగిన, పంటను గని కడు మురిసిరి రైతుల్.

  రిప్లయితొలగించండి


 17. కనగల రయ్య హెచ్చుగ నుగాదిని రాబడి! ఫర్టిలైజరున్
  తనరుచు వేయుడయ్య సరి తావుల! విత్తులతోడు చల్లగా
  దనదన నేపుగా పెరిగెతా! తన భారము తోడు మెండుగా,
  మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. చినమేరంగియొ పెంటయొ
  గుణానుపురమో గిజబయొ కొమరాడర్తాం,
  కనుగొన సాలూరున సిరి
  *"మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"*

  రెండోపాదం చివర కొమరాడ + అర్తాం
  అన్నీ పార్వతీపురం చుట్టుప్రక్కలనున్నవే.
  'గుణానుపురం' మా ఊరు.
  'సాలూరు' దానావారిది
  😁🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 19. ఘనమగు పంచ గవ్యమున క్రన్నన చీడల పీడ లన్నియున్
  మునిఁగిన, పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్
  కనుచును మంచి మూల్యములఁ గాంచిన పంటల కమ్మకమ్ములో
  తనయల పెండ్లి చేయుటకు తద్దయు ప్రీతిని నుద్యమించుచున్

  రిప్లయితొలగించండి
 20. కనలేదింతటివరదల
  వినలేదింతటి ధరలను,బేరములాడన్
  గొనిరట కొల్లగ ధనమును
  "మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"!!

  రిప్లయితొలగించండి


 21. కన మందమతులె సుమ్మీ
  మన మేధావులు జిలేబి! మనుగడ యననే
  మని తెలియదు! యెట్లగునే
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. జన సంక్షేమము గోరుచు
  ధనసాయము జేసె ప్రభుత తక్షణ మందున్
  ఋణమును మాఫీ చేసెను
  మునిఁగిన పంటనుఁ గని, కడు మురిసిరి రైతుల్.

  రిప్లయితొలగించండి
 23. కం. మునిగిన పంటను గని వే
  దన జెందుట కర్ష కులకు దథ్యము కానీ.
  కొనును గదా ప్రభుత యనుచు
  మునిగిన పంటను గని కడు మురిసిరి రైతుల్.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 24. పనుపుగ భూమి దున్ని, చెలువంబుగ సేంద్రియమైన యెర్వులన్
  వినుతిని వాడి,శాస్త్ర సముపేయములన్ గమనించి,రేబవల్
  కునుకును మాని,యా వరుణ గుంఫిత పూర్ణ కృపాబ్ధి లోపలన్
  మునిగిన పంట గాంచి కడు మోదము నందిరి రైతులయ్యెడన్.

  రిప్లయితొలగించండి


 25. తనరారు గ్రామపు సొబగు
  లనుగని మించారు పొలములను నేపుగ వృ
  ధ్ధినిగాంచుచు ధ్యానంబున
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. డా.పిట్టా సత్యనారాయణ
  కని రాష్ట్రము మరి కేంద్రము
  ఖనులై రాయితిల నివ్వగా మనకేమీ
  ధనరాసుల మననమునను
  మునిగిన పంటను గని మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 27. ఎనలేని కృషి మదుపుగ
  పనిజేసియు పంట సిరులు పండింప జనుల్
  కొనియాడగ నావెల్లువ
  "మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"

  రిప్లయితొలగించండి
 28. డా.పిట్టా సత్యనారాయణ
  మునుమును బట్టి దున్నుటయె మూర్ఖము మండల మందు(మండల రెవిన్యూ ఆఫీసు లో) మా పనిన్
  గనియును లంచముల్ గొనగ గాథలు పెక్కులు, వోటు పోటునన్
  పని గన సున్న "సర్వయు తపాలెయు బోయెను బర్వు దగ్గె"నా
  మునిగిన పంట గాంచి కడు మోదము నందిరి రైతులయ్యెడన్

  రిప్లయితొలగించండి
 29. ఘనమగు పార్టీలన్నియు
  ధన,ధాన్యము బంచి!దాతలుయగుటా?
  ననకుము!యెన్నికలందున
  మునిగిన పంటనుగని మురిసిరి రైతుల్ (ధనధాన్యముపార్టీనాయకులుబంచగా!ఓట్లకొరకు)

  రిప్లయితొలగించండి
 30. కనివిని యెఱుగని విధముగ
  మినుములతోాజేలుమిగుల మిలమిలమునుగన్
  బనిగా సొబగున నికయా
  మునిగిన పంటనుగనికడుమురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 31. దినకరుని తాపమునకు ప
  దునువిడిచినచో పుడమిని దున్నగరాదే
  చినుకులుపడగా నీటను
  మునిగిన పంటను గని కడుమురిసిరి రైతుల్

  పదును= తడి, పంట= భూమి

  రిప్లయితొలగించండి


 32. అయ్యలారా అమ్మలారా !


  గూగులు ప్లస్సు వాడు బిచాణా యెత్తేస్తున్నాడట! గూగుల్ ప్లస్సు ద్వారా లాగిన్ అయి కామెంట్లు వేసిన వాళ్లకున్ను , కందివారికిన్ని ముఖ్య గమనిక ! వాడు బిచాణా మూసేసాక ఆ గూగులు ప్లస్సు తో వేసిన కామింట్లన్నీ హుష్ కాకీ అయిపోతాయట.

  కావున గవనము పెట్టి ఈ బ్లాగు కామింట్లతోనే నడుస్తున్నది కాబట్టి అత్యవసర బ్యాకప్పు ( కామెంట్ల తో సహా) తీసుకొందురు గాక !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 33. అనువగునప్పుడుండిన నయాచితవర్షము కారణంబుగా
  మునిగిన పంటగాంచికడుమోదమునందిరి రైతులయ్యెడన్
  ననుముల బంటజూచుచును రైతులుమిక్కిలి సంతసంబుతో
  కనివినలేనియట్టిదిదికైవసమౌననె సర్వసంపదల్

  రిప్లయితొలగించండి
 34. మైలవరపు వారి పూరణ

  కనుమరుగయ్యె వాన , వరి కంకులు వేసెడి వేళ , నింగిలో
  ఘనములు లేవు , దైవమ ! యొకానొక మారు దయార్ద్రదృష్టితో
  గనుమని మ్రొక్కినంతనవె కారుమొయిళ్లరుదెంచె , నీటిలో
  మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతులయ్యెడన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కారుమొయిలు :) అదురహో మైలవరపు

   కృష్ణులు - నీలమేఘము వారు :)


   జిలేబి

   తొలగించండి
  2. శ్రీమతి జిలేబీ గారికి.. మీకు.. ధన్యవాదాలు 🙏🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  3. భలే!
   మైలవరపువారూ!
   నమోనమః
   🙏🏻🙏🏻

   కనుమరుగైన వానసిరి కష్టమె!, రైతుల కార్యమెట్టులన్
   ఘనములు లేక పూర్తియగుఁ? గాలగతుల్ ధర దారిఁ దప్పగాఁ
   గనుమని మ్రొక్కినంత వడిఁ గారుమెయిళ్లరుదెంచె'నా' సిరిన్
   *"మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్"*
   🙏🏻🙏🏻

   తొలగించండి
 35. కనువిం దయ్యెను మిక్కిలి
  తనివిని నేఁ గాంచ వారి తరళాననముల్
  వనమెల్లఁ గార లేచిన
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్


  ధనములు గుమ్మరించి కడు ధైర్యము గైకొని పంట వేయగం
  గనులకు విం దొనర్చుచుఁ బ్రకాశ విలాసము గాఁగఁ బంటయున్
  మనములు వొంగువాఱఁగ వినమ్రత శాలి వరంపుఁ గంకులన్
  మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్

  రిప్లయితొలగించండి
 36. కనకాంబరములు,మల్లెలు,
  ఘన సంపెంగలు విరియగ కమనీయముగా
  వనమున, సుమజాలమునను
  మునిగిన పంటనుగని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 37. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అనువుగ చంద్ర శేఖరుడు హాయి నొసంగగ పంటరక్షణన్
  మనములు పొంగు రీతినిట మాపగ నప్పులు వోట్లుగోరుచున్
  కనివిని రీతి వర్షముల కాల్వలు పొర్లగ వెల్లువందునన్
  మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్
  వినగనె తాత తండ్రులవి పెక్కులు బాధలు నాంగ్ల పాలనన్ *

  * An Era of Darkness
  (The British Empire in India)
  by
  Shashi Tharoor

  పంటరక్షణ = crop insurance

  రిప్లయితొలగించండి
 38. ఘనమైనది భరతావని
  ననయము బంగారుపంట లందించునయా
  పనలకు వరికంకులతో
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"

  మిరియాల ప్రసాదరావు కాకినాడ

  రిప్లయితొలగించండి
 39. మనమున నెన్నిభావనలొ, మాన్యులపూరణలెన్నిభంగులో
  కనివినిలేమువిన్నదియుగానగలేదు,వచించువాయికిన్
  గనుగవలేదమాయికుని గాథ రచించ ,రసాభ్రవృష్టిలో
  *"మునిఁగిన; పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్"*

  రిప్లయితొలగించండి
 40. ధనమది కోరుచు వేసిరి
  శనగలు, పెరిగెను మొలకలు జక్కగ పూసెన్
  దనరారు నీలి చాయను
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  రిప్లయితొలగించండి
 41. ఘనమగు వాయుగుండమది కష్టము లెన్నియొ తెచ్చె వాహినుల్
  జనులకు మేలొనర్చుటదె సత్క్రియ టంచు ప్రభుత్వమిచ్చెనే
  ధనమును క్షేత్రజీవులకు దండిగ నిచ్చిరి లెక్కకట్టుచున్
  మునిగిన పంట గాంచి, కడు మోదము నొందిరి రైతులియ్యెడన్.

  రిప్లయితొలగించండి
 42. అనువగు వర్షములు పడక
  పెనుగాలుల తోడ చెట్లు పెళ పెళ లాడ
  న్ననిలుని కృపచే మితముగ
  మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  చక్కని జంటగా మలచి సాగగ జేసి వివాహ బంధమున్
  మక్కువ మీర నిల్పి మనుమల్ దిగి రాగ , విచిత్ర వేడుక
  ల్లుక్కిరి బిక్కిరిన్నిడగ నుత్సుకతన్ ప్రకటించు వారికిన్
  మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్

  రిప్లయితొలగించండి
 43. నా ప్రయత్నం :

  కందం
  ఇనకుల సోముని వెంట న
  వనిజ ప్రసన్నత గనంగ ఫలపుష్ప సమృ
  ద్ధిని సస్యశోభితమ్మున
  మునిగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్


  చంపకమాల

  ఇనకుల సోముడున్ గెలువ నింపుగ వచ్చు ధరాత్మజా సతిన్
  గనుచు నయోధ్యభూములవి కమ్మని దీవెన లందినట్లుగన్
  మునుపటి కంటె మించు ఫలపుష్ప సమృద్ధిని సస్యశోభలన్
  మునిగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్

  రిప్లయితొలగించండి
 44. చనెనూరు నదిని జూడగ
  జినజిన పడుజల్లు లోన చిత్తడి దారిన్
  కనబడక నడుమ లంకన
  మునిగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్
  (నది నడిమి లంక నేలలో దేవునికి నైవేద్యంగా వేసిన పంట)

  రిప్లయితొలగించండి