6, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2922 (విధవా రమ్మనెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"
(లేదా...)
"విధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్"

98 కామెంట్‌లు:

 1. బుధవారమ్మున వైద్యుడు
  విధవా! రమ్మనెను;..సతియె విభునిన్ బ్రేమన్
  బధిరుండా తెమ్మనెనట
  దధినిన్ మార్కెట్టు నుండి దంభము తోడన్

  రిప్లయితొలగించండి

 2. కందం
  సుధలన్ జిందుచు నామది
  మధురోహల దెల్పు విరుపు మరులందవుగా
  వ్యథలన్ మఱచుచు గొన మో
  వి ధవా!రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి


 3. అధమునిగా శక్తియు లే
  క ధనధన మనుచు పరుగిడకన్ గుర్రమహో !
  విధిగా కబళము వలయును
  విధ, వారమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్ !

  విధ - గుర్రపు దాణా ( అట - ఆంధ్ర భారతి ఉవాచ )
  గుర్రపు దాణా కూర్పుగ కోరె సతి :)
  ఆ ప్రేమ గుర్రము పై పతి పై కాదని గమనింప వలె :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పరుగిడకయె' అనండి. 'వారమ్మనెను' అంటే ఏ అర్థాన్ని నిర్దేశించారు?

   తొలగించండి

  2. వారు - కూర్చు అన్న అర్థము తో నండి సరియేనా?


   జిలేబి

   తొలగించండి
 4. మధురపు భావము లందున
  సుధలూరె డుసతిని గాంచి చోద్యం బనగన్
  పధకము వేసెడి పతిగని
  విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మరి 'విధవా' అన్నదానికి అన్వయం?

   తొలగించండి
 5. అధరామృతమును గ్రోలెడు
  మధురపు వేళ పడకింట మానిని పతితో
  బుధుడవు వినరా నామన
  వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
 6. రధమున నూరేగు ప్రభువు
  ప్రధమము గావాడ లందు పరి రక్షణకై
  యధముల నాదుకొ నంగను
  వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్
  ధవ = రాజు , భర్త

  రిప్లయితొలగించండి
 7. ( కన్యాశుల్క నాటకంలో బుచ్చమ్మగా నటించిన పతిని
  మరునాటి ఉదయం సతి పిలుస్తున్నది )
  కథనం బందున స్ఫూర్తి నింపి కవితా
  ఖద్యోతుడౌ అప్పరా
  వు ధరన్ శాశ్వతమైన నాటకముగా
  వ్యుత్పన్నతన్ వ్రాసెగా
  బుధులే మెచ్చ ; మహాద్భుతంపు నటనన్
  బుచ్చమ్మగా జేయగా ;
  " విధవా ! ర " మ్మని పిల్చె నాతి విభునిన్
  బ్రేమాతిరేకమ్మునన్ .
  ( కవితాఖద్యోతుడు - కవిత్వపు సూర్యుడు )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   బుచ్చమ్మ పాత్రధారిని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ఇంకా నయం... పూటకూళ్ళమ్మను ప్రస్తావించలేదు! ఆ వేషానికైతే విగ్గు కూడా అవసరం ఉండదు.

   తొలగించండి
  2. ఔనండీ ! ఇద్దరిలో బుచ్చమ్మ ఐతే మరింత బాగా
   ఉంటుందని ఆమెనే ఎన్నుకున్నాను . ధన్యవాదాలు .

   తొలగించండి
 8. సమస్య :-
  "విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"

  *కందం**

  అధికముగా బాధ పడుచు
  విధిరాతకెదురు దిరుగుచు విలవిల లాడన్
  సుధలు కురిపింతులే మో
  వి ధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విధి వ్రాత' అనండి.

   తొలగించండి
 9. డా.పిట్టా సత్యనారాయణ
  బుధుడవె యని మనువాడితి
  నధముడ యో విగత ధనుడ,హా!వాజమవే
  బుధమతి తిట్టక దిట్టుచు
  వి.ధ.వా.(వి॥విగత;ధ॥ధనము గల;వా॥వాజమ్మ) రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి


 10. "మధురా! రావె జిలేబి రమ్మ యెదపై మాకందమై తీరగాన్ !
  సుధలొల్కంగను జీవితమ్ము లలనా శోభాయమానంబుగా
  ను!"; "ధరాభృత్తువి నీవె యందుకొనుమా నొవ్వంగ నీకయ్య మో
  వి! ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్!"


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మత్తేభవిక్రీడితము
  మధురోహాంచిత పయ్యెదన్ రెపరెపల్ మాటాడ విన్పించదే
  వ్యధలన్ బెట్టుచు దూర దూరముగ సయ్యాటాడ నారోగ్యమౌ
  సుధలన్ జిందుచు నార్తితో విరుపునన్ శోభిల్ల నందంగ మో
  వి ధవా! రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కవిపకవిపండి అవధానులు శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచనలతో సవరించిన పూరణ. శ్రీ శేషఫణి శర్మగారికి ధన్యవాదములతో సవరించిన పూరణ :

   మత్తేభవిక్రీడితము

   మధురోహాంచిత చేలపున్ రెపరెపల్ మాటాడ విన్పించదే
   వ్యధలన్ బెట్టుచు దూరదూరముగ సయ్యాటాడ నారోగ్యమౌ
   సుధలన్ జిందుచు నార్తితో విరుపునన్ శోభిల్ల నందంగ మో
   వి ధవా! రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్


   తొలగించండి
 12. వ్యధలన్ దీర్చును మరువక
  విధిగా మనమేగి కొలువ విశ్వేశ్వరునిన్
  బుధుడవు వినవేమయ మన
  వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
 13. అధరము గద లియు గద లక
  మధు ర పు భావాలు పొంగ మగ ని ని కను చున్
  సుధ లొలి కిం చ గ మో
  వి ధవా !రమ్మనె ను సతి యె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
 14. మైలవరపు వారి పూరణ

  మధుమాసమ్మిది , ధాత్రినిండె సుమముల్ , మత్తిల్లజేయంగ , ని...
  క్షు ధనుర్ధారి నిశాతశస్త్రయుతుడై శోభిల్లె , లేబ్రాయమున్
  సుధలన్ చిందెడి యూటబావి , గనరా ! సొంపైన సౌఖ్యాల దీ...
  వి ., ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 15. అధరసుధలఁ గోరగ నవ
  వధువది కూడదని చెప్ప పతితో నేడున్
  బుధయనె,నిదే మనిన నవ
  విధ వారమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
 16. కధలను జెప్పెడివాడా,
  మధురపు వంటలను మిగుల మక్కువతోడన్
  విధులను ముగించి జూడ చ
  వి,ధవా! రమ్మనెనను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి


 17. సుధలొల్కగ నే కొమరా
  ల! ధరణిలో వేరొకరు గలరకో పూబో
  డి ధగద్ధిగమనగ ? యనుభ
  వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  జిలేబి

  రిప్లయితొలగించండి


 18. అధకిమ్? నీకై వేచిన
  మధురాధరములివి సూవె! మహజరదేలా!
  సధవయు చేసెడు సేవలి
  వి! ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. డా.పిట్టా సత్యనారాయణ
  బుధవారమ్ము శబర్మలన్ జరుగు నీ పూజల్ గృహంబందునన్
  విధిగా జేతమభీష్ట సిద్ధి కిలలో విస్పష్టమౌ భక్తినిన్
  అధమం బిద్దరు "కన్నె సాముల"కు నాహా భిక్షకై బియ్య మే
  వి? ధవా!రమ్మని బిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్!!

  రిప్లయితొలగించండి
 20. బుధగణము మెచ్చురీతిని
  నధరములన్జప్పరించ ననువగు నటులన్
  సుధలను జిందుచు మెఱిసెని
  వి,ధవా!రమ్మనెను సతియెవిభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి

 21. మధురావేశ రసానుభూతి కలగన్ మాధుర్య ముప్పొంగగన్
  సుధలన్ చిల్కగ మాటలాడును గదా శోభాయమానంబుగా
  అధరం బీయగ ప్రేమమీర పతికిన్ ఖద్యోత తెజుండ. భా
  వి ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పతి, విభుడు' అని ఉన్నపుడు 'భావి ధవా' అనడం?

   తొలగించండి
 22. అధనుఁడవౌ దైవధ్యా
  న ధనము యించుక మనంబున బెరయుకున్నన్
  విధిగ యొనర్చగ పూజల
  వి ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధన మ్మించు... విధిగ నొనర్చగ...' అనండి.

   తొలగించండి
 23. మధురముగ మాటలాడుచు
  వ్యథల తరిమి వేయు వాడ! యామిని పిలిచెన్,
  సుధకై వేచెనురా మో
  వి! ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!

  రిప్లయితొలగించండి
 24. మధురావేశ రసానుభూతి కలగన్ మాధుర్య ముప్పొంగగన్
  సుధలన్ చిల్కగ మాటలాడును గదా శోభాయమానంబుగా
  అధరం బీయగ ప్రేమమీర పతికిన్ అందించె సారంపు మో
  వి ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
 25. కవన ప్రియయైన యొక సతి భర్తతో హాస్యరస జనకముగా:

  అధ రామృతమ్ముఁ జవిగొన
  మధురగ్రీవ! మృదువచన! మదన సదృశ రూ
  ప! ధన పశు ధాన్య వాహన
  విధవా! రమ్మనెను సతియె విభునిం బ్రేమన్

  [.. వాహన విధవా = .. వాహన సమృద్ధి కలవాఁడా; విధ = సమృద్ధి]


  విధి కృత్యమ్ములు వింత భర్మమృగమున్ వీక్షింపఁ, గాంచంగ రా
  దు ధరాంకమ్మున నిట్టి జింక నిజ సంతోషాబ్ధికిన్ ఖండి తా
  వధి భూనందన జానకీ సతి సుసంభావ్యుండు కాకుత్స్థు దే
  వి ధవా రమ్మని పిల్చె నాతి విభునిం బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి అభినందనలు

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

   తొలగించండి

 26. ( పర స్త్రీ ఇంటిలో ఉన్న భర్తను గని ఆమెతో అతని భార్య ఇలా పలుకుచున్నది...)


  విధి వికటించ మిగుల హత

  విధి! నీ మగడు మరణించి వేగెను దివి; నా

  దు ధవుని గోరకు, విడువుము

  విధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 27. ప్రధానమగు కుంతిగ పా
  త్ర ధరించిన మగనివస్త్రధారణ గాంచన్
  మధురమగు భావనముతో
  "విధవా! రమ్మ" నెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   మొదటి పాదం మొదటి గణం జగణ మయింది.

   తొలగించండి
  2. సవరణతో

   ప్రథమమయిన కుంతిగ పా
   త్ర ధరించిన మగనివస్త్రధారణ గాంచన్
   మధురమగు భావనముతో
   "విధవా! రమ్మ" నెను సతియె విభునిన్ బ్రేమన్

   తొలగించండి
 28. మధురమగు నీతలంపులు మధుసూదన సంతతమ్ము మదిలో నిలువన్ సుధాంశుని బావ విను మన
  వి ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి
 29. అన్నపరెడ్డి వారూ
  మీ పూరణ బాగున్నది. అభినందనలు

  రిప్లయితొలగించండి
 30. వ్యధలై దూరము హాయి వెల్లి విరిసెన్ వ్యాహ్యాళిగా మారె శ్రీ
  సుధయై జీవిత మెల్ల మీ వలపుతో శోభిల్లె సంతోష వా
  ర్నిధియై తీయని స్వప్నమై బ్రదుకు మారెన్నంచు తా జార నీ
  వి ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
 31. సుధలన్ రాల్చెడు చంద్రుడే మదనుడై శూలమ్ములన్ గ్రుచ్చగన్
  మధురోహల్ హృదయమ్ములో విరిసెనే మాధుర్యమున్ గ్రోలగన్
  నధరమ్మొల్కెడు తేనియన్ గనర నీకందింతురా, నాదు మో
  వి, ధవా రమ్మని పిల్చె నాతివిభునిన్ బ్రేమాతి రేకమ్మునన్.

  రిప్లయితొలగించండి


 32. కొట్టుకొచ్చిన అయిడియా :)


  విధి!మదన కామ రాజుని
  కధలల్లి యనేక గతుల గమకించిననూ ,
  బుధుడ ! సరసమెరుగని కవి
  వి , ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్!


  (Original credits to LRR)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గమకించిననూ' అనడం సాధువు కాదు. "గమకించిన నో బుధుడ!" అనండి.

   తొలగించండి
 33. వెధవా! నీకేమి తెలియు
  బుధులెల్లరునుడివినారు బుద్దిగవినుమా!
  మధురముగపలుకవేలా
  "విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"!!

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  ***ఇద్దరు ఆత్మీయమిత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ లో...

  రిప్లయితొలగించండి
 34. మధుమాసంబిది చిత్తజుండు మదినే మైకమ్మునం ద్రోయగన్
  మధుపంబుల్ దమిదీరగా దిరుగ వేమారుల్ బ్రసూనంబుపై
  సుధలూరన్ శిఖిపింఛమౌళివలె సుశ్రోతంబుగా నూద కో
  వి,ధవా!రమ్మనిబిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకంబునన్

  రిప్లయితొలగించండి
 35. రిప్లయిలు
  1. అధికమగు కాంతిని బడసి
   విధురపు చూపులు ముఖమున వెడలుచు నుండన్
   సుధలును బడసెను గా ప్లా
   వి, ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"
   విదురపు = బిత్తర , ప్లావి జింక

   తొలగించండి
 36. మధురామృత గడియలలో
  అధరామృతమందుకొనగ నాశించెడిదై
  సుధ!మేనత్త కుమార్తనె
  విధ వారమ్మనెను సతియె విభునిన్ ప్రేమన్

  రిప్లయితొలగించండి
 37. నేటి శంకరా భరణము సమస్య

  విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"
  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


  మాయా జింకను చూచిన సీత రాముని తెమ్మని కోరు సందర్భము

  బెరుకుచు నదురుచు బిత్తర జూపులు జూచుచు పరుగిడు చుండెనుగద,
  నొకపరి శ్వేత వన్నువు తోడ, నొకపరి పచ్చని రంగుతోన్ పచ్చి గడ్డి
  తినుచు గెంతుచు నుండె వనిలోన, కనుము రయముగ నా పొద వద్ద హరువు నొప్పు
  వసువర్ణ ప్లావి, ధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్, కనివిని యెరుగ
  నిట్టి వింతను రఘుపతీ, నిజము మదిని
  దోచె గా యీ హరిణము, సంతోష మిడును
  యీ కుటీర మందున, తెమ్ము యెటుల నైన
  యనుచు కోరె సీత రఘు రాముని ముదముగ


  రిప్లయితొలగించండి
 38. [2/6, 05:59] Shankarji Dabbikar: మధురానగరంబందున
  మధురోహల మానవతి స మాదరణముతో
  మధురిపుగని పిల్లంగ్రో
  వి ,ధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్
  [2/6, 13:47] Shankarji Dabbikar: మధుమాసంబని నూహజేసి కవి తామ్రాక్షాలి గూయంగనే
  యధరంబద్రెను మాఘమాసమున మీనాంకుండు నేదెంచెనో
  మధులిట్టుల్మరువిల్లు సైన్యమదిగో!మన్నింపుమీ యీవి,మా
  *వి!ధవా! రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్*
  [2/6, 18:44] Shankarji Dabbikar: బుధరాజా యేల్కొన మన
  *వి,ధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"*
  మధురోహాధర ముసురుల్
  సుధలొల్కు పయోధరములు సోయగమిదిగో
  [2/6, 19:11] Shankarji Dabbikar: బుధులానందమరందమో యనగ సమ్మోదంబుతో భక్తి నీ
  *వి!ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్*
  మధురానందుని నందనందనుని శ్రీమన్నాత్మ బంధున్హరిన్
  బుధవంద్యున్జగదార్తిహారి మగడౌ మోక్షాంగనాకాంతునిన్
  [2/6, 19:23] Shankarji Dabbikar: బుధవర్గంబులు మేల్భళీయన మహా మోహుండ్రు స్త్రీలోలుగన్
  మధుజిత్తున్తెగనాడుటేల చెలియా మైకంబుతో,! గృష్ణుడే
  మధుపంబాత్మలు గొల్లభామ ననలౌ మాయాంగి మిథ్యోక్తి రు
  *వ్వి ,ధవా !రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్*
  [2/6, 20:08] Shankarji Dabbikar: అధర సుధాబ్ధి, ధరాధర
  మధురపయోధరము,మగువ,మధురోహోక్తుల్
  మధువు మధుసఖుడిడెను నీ
  *వి,ధవా !రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"*

  రిప్లయితొలగించండి
 39. అధరమ్ముల్ స్రవియించుచుండె సుధ, సూనాస్త్రుండు వేయన్ సెలల్
  మధురోహల్ దహియించుచుండె మది, నున్మాదమ్ములో మున్గితిన్
  వ్యథ మిక్కుటము తాళలేను, దృతితో నర్పించెదన్ నాదు మో
  వి, ధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్

  రిప్లయితొలగించండి
 40. మధువును మించిన చక్కని
  సుధనొసగెదనీకుభక్త సులభా కృష్ణా
  మధుసూధనజవమున మో
  "వి, ధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్

  రిప్లయితొలగించండి