13, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2929 (చుట్టల్ గాల్చిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

113 కామెంట్‌లు:

 1. కం.
  పట్టుచు చేతను చుట్టను
  గట్టిగ దమ్ము మనసార గమ్ముగ కొట్టన్
  చట్టన సంతసమాయెను
  "చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

  రిప్లయితొలగించండి


 2. తట్టని దానివలననే
  గట్టిరి మనశాస్త్రి వరులు కంద జిలేబుల్ :)
  కట్టల్ కొలదిగ సిగరెట్
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కొట్టుకు వచ్చును కవితల్
   చుట్టల్ గాల్చిన;..లభించు సుఖసంపత్తుల్
   చుట్టల్ విడుచుచు పట్టగ
   గట్టిగ రుక్మిణివి కాళ్ళు ఖర్గపురమునన్

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇంతకీ ఎవరీ 'ఖర్గపూర్ రుక్మిణి'?

   తొలగించండి
  4. ప్రస్తుతం స్వర్గముననుండి త్వరగా రమ్మని పిలిచే భామామణి. త్వరగా రండి సార్ మా ఇంటికి...శతకం మీకొరకు వేచియున్నది 🙏

   తొలగించండి
  5. Sample:

   "Sinagapore master plan for AP's capital"...March 2015

   సింగపూరు ప్లాను సింగపూరుకునబ్బు
   గంగ నీటి మురికి గంగకబ్బు
   తోలు మార్చ కరికి తొండమ్ము మారునా?
   వెంకటాద్రి సుతుడ వినుర రంగ

   తొలగించండి
  6. శాస్త్రి గారూ,
   మీ పద్యం హాస్యస్ఫోరకంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ పుస్తకాన్ని హస్తగతం చేసుకోవాలా అని ఆతృత పడుతున్నా. కాని నిన్నటినుండి కొద్దిగా నలతగా ఉంది. నిన్న జంధ్యాల వారికి 'జడ కందాలు' పుస్తకం పోస్ట్ చేయడానికి షాపూర్ వెళ్ళి అక్కడే హోటల్లో భోజనం చేశాను. దాని ప్రభావం కావచ్చు. ఆరోగ్యం కుదుటపడగానే వస్తాను. వచ్చేముందు మీకు తెలియజేస్తాను.

   తొలగించండి
  7. ఆరోగ్యం మహాభాగ్యం సార్! జాగ్రత్త. ఆ మధ్య (typhoid + pneumonia) రావడంతో ఈ సారి (malaria + dengue) రాకుండా ఉండాలని దోమలను మోసం చేయుటకు రాత్రంతా రెండు (ట్యూబు లైట్లూ + ఒక గుబ్బ లైటూ) వెలిగించి నిద్ర మాని శంకరాభరణంలో మునిగి ఉంటున్నాను. తెల తెల్లవారి మీ ప్రస్తుత సమస్యను పూరించి ఉదయం 8.30 నుంచీ 12 వరకూ కునుకు. 👇

   శంకరాభరణం సమస్య - 2693

   "రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"

   రక్తిని కట్టుగా నుడుకు రక్తము గ్రోలగ మాధురీమణీ
   శక్తిని నిచ్చుగా పెదవి చక్కగ నొక్కుచు పీల్చుచుండగా
   ముక్తిని డెంగితో నిడుదు మూర్ఖుడు పండిత శాస్త్రివర్యుకున్
   రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో!

   (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

   తొలగించండి
  8. జిలేబి గారు:

   మీ కృపతో నా బ్లాగులో ఆరు నెలల క్రితం మొదలెట్టిన "శంకరార్పణం" సరదా పూరణ వృత్తములు అతి త్వరలో వేయి (1000) కు చేరుకొన బోతున్నవి. వీలున్నపుడు ఒక సారి వీక్షించండి ప్లీజ్!

   తొలగించండి


 3. మట్టిని కలిసెదవయ్యా
  చుట్టల్ గాల్చిన! లభించు సుఖసంపత్తుల్,
  పెట్టని కోటై మారును
  దిట్టగ నారోగ్యము, వలదీ పొగ పొంకాల్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. చట్టమ్మొప్పదు బడిలో
  చుట్టల్ గాల్చిన;...లభించు సుఖసంపత్తుల్
  పుట్టంగా తెలగాణను
  కొట్టుల్ బీరువి తెరచుచు కొల్వన్ నేతన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పట్టిన శపథము విడువక
  నెట్టన స్వచ్ఛతను గోరి నిష్ఠాయుక్తిన్
  చుట్టూత నుండు చెత్తల
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చుట్టూత' అన్నది వ్యావహారికం. "చుట్టును నుండెడి చెత్తల" అందామా?

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  "ఒట్టనుచు త్రాగబోమని !
  గుట్టుగ కాల్చెద" రటంచు కోపనలగుచున్
  గుట్టలుగ పోసి యింతులు
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇంతులతో చుట్టలు కాల్పించిన మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పెట్టినవాడే , పాడెన్
   పట్టగ సంతతియెలేని వాడని, దయతో
   జట్టుగనేర్పడి శవమును
   చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్ !!

   చుట్టలు=చుట్టములు=చుట్టాలు

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 7. గట్టిగ చుట్టిన గాజర
  దట్టించి పీల్చినంత తనరున్ మనమే
  చుట్టలు చుట్టిన పొగలుగ
  చుట్టల్ గాల్చిన లభించు సుఖ సంపత్తుల్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "దట్టించియు పీల్చినంత..." అనండి.

   తొలగించండి


 8. ఎట్టెట్టెట్టెట్టా పొగ
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్?
  గట్టిగ అనమాకయ్యా
  చట్టని పోలీసు వెన్క చట్టము వచ్చున్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనమాకు' అన్నది వ్యావహారికం. "గట్టిగ ననవలదయ్యా" అనవచ్చు.

   తొలగించండి
 9. కొట్టెద నీవిక వాటిని
  ముట్టిన సిగరెట్టు బీడి ముప్పది గాదే!
  యిట్టుల చెప్పిన దెవరట?
  చుట్టులు గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 10. నేటి సినిమాలు
  పొగ, మద్యపానం త్రాగటం హానికరం అని statutory warning పెట్టేసి ఫ్రేమ్ ఫ్రేమ్ లో చేతిలో బాటిల్ నోట్లో సిగరెట్ అందరి చేతా పెట్టించేసి హిట్ పిక్చరు తీసి రాజభోగాల్ అనుభవించడం :)


  చట్టము చెప్పెను శిక్షని
  చుట్టల్ గాల్చిన ; లభించు సుఖసంపత్తుల్
  ముట్టవలదంచు పలుకుచు
  నెట్టుకొలుప ఫ్రేము ఫ్రేమునే నద్దానిన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. ( గిరీశం శిష్యుడు వెంకటేశానికి చెబుతున్న గొప్పపాఠం )
  గట్టిగ జెప్పెద ; విను మూ
  కొట్టుచు శిష్యా! మరువకు ; కొంటెగ రింగుల్
  జుట్టుచు ; గుట్టగ వదలుచు ;
  జుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్ .  రిప్లయితొలగించండి
 12. చట్టము లున్నవి కానీ
  గట్టిగ నమ లును పరచె డు కాంక్ష లు లేక న్
  కొట్టు న నమ్మె డు సిగరెట్
  చుట్టలు గాల్చిన లభించు సుఖ సంపత్తు ల్

  రిప్లయితొలగించండి
 13. పట్టెను గద శని, యెవడనె,
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్ ,
  బిట్టిగ మానుము బిడ్డా,
  తట్టు తలుపు యముడనుచు తండ్రి వచించెన్

  రిప్లయితొలగించండి
 14. నిన్నటి శంకరాభరణము సమస్య
  ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్
  ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

  భారత సమరమున భీష్ముడు ప్రచండ భానుడై శత్రు మూకలను చెండాడి శిఖండి ఎదురు రాగా అస్త్ర సన్యాసము చేస్తాడు .మరుసటిరోజు కృష్ణుడు
  పాండవులను వెంటపెట్టుకొని అతని పరాక్రమము వర్ణిస్తూ అతని దగ్గిరకు వెడలి చూడగ అతని ప్రచండ రూపము ఒక్కసారిగా హిమ గోళము గా మారి నట్లు వారికి కనబదినది అను భావన

  తీక్ష్ణజ్వలన చండ వీక్షణుoడున్ గ్రీష్మ
  మపరాహ్ణ తాలిష హర్త సముడు,

  క్రోధాగ్ని భరిత. సంక్షోభ హృదయుడు ,రి
  పు శలభ దహితుడు పోరులోన

  షండుని గని తన శరములు విడనాడి
  భీష్మ చండకరుడు పేర కూలె

  నుగ, యిన బింబము పగటిపూట హిమగో
  ళమగు న్పగిది వద నము కనబడు

  చుండె నో ధర్మ నందనా చూడు మయ్య,
  నేర్చు కొనగ వలయు రాజ నీతి శాస్త్ర
  ములును ధర్మ సూక్ష్మములని మురరిపుండు
  పాండు పుత్రుని గాంచుచు పలికెనపుడు

  ( పేర = భూమి , అంధ్రభారతి ఉవాచ )
  గురువు గారు నమస్కారము ఒకసారి నిన్నటి సమస్య పూరణము పరిశీలించండి

  రిప్లయితొలగించండి
 15. గురువుగారికి వందనము

  మట్టిచె గణపతిని నిలిపి
  గట్టిగ మనమున్ గొలుచుచు ఘనమౌ వ్రతమున్
  పట్టుచు పరిమళ అగరపు
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ద్వారకానాథ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చే' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "మట్టిని గణపతిని..." అనవచ్చు.

   తొలగించండి
  2. మట్టిని గణపతిగ నిలిపి
   గట్టిగ మనమున్ గొలుచుచు ఘనమౌ వ్రతమున్
   పట్టుచు పరిమళ అగరపు
   చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

   తొలగించండి
 16. పిట్టల్ కాల్చుట నేరము
  కట్టెల్ కాల్చుటయు నంతె,కావునఁ దినగన్
  కట్టల్ కట్టిన తేగల
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 17. ముట్టకు నాపై ఒట్టిక
  గుట్టుగ త్రాగకు పొగాకు గుండెకు చెడుపౌ,
  గుట్టలుగా పోసి బయట
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్..

  రిప్లయితొలగించండి
 18. నీటి కాలువలలో గుర్రపు డెక్క ఆకుల తీగలు పెరిగి ప్రవాహమునకు అడ్డుపడుచుండును. సర్కారు వారు
  వాటిని కాంట్రాక్ట్ ఇచ్చితీయించి కాలువ గట్టుల పైనే అటు ఇటు పడేసి వెళ్ళిపోతారు తర్వాత వాటిగుర్చి పట్టించుకోరు ఎండిన వాటిని జనులు తగలపెట్ట్టారు అను భావన


  చుట్టలు చుట్టలు చుట్టుచు
  గట్టున వేసిరి లతలను కాలువ చెంతన్
  ముట్టిం చెజనులు నగ్నిని
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముట్టించె' ఏకవచనం, జనులు బహువచనం. అక్కడ "ముట్టించిరి జను లగ్నిని" అనండి.

   తొలగించండి
 19. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  గు రు భ్యో నమః నిన్నటి పూరణ స్వీకరింప మనవి  పెనిమిటి కార్యస్థలమున

  నినబింబము పగటిపూట | హిమగోళ మగున్ ‌

  తన సతి ముఖమున వెలువడ

  గ , నిశల ననురాగ చంద్రకాంతి ‌కిరణముల్ !


  { కార్యస్థలము = ఆ ఫీ సు }


  `~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


  గు రు మూ ర్తి ఆ చా రి
  .,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,  గు రు భ్యో నమః నిన్నటి పూరణ స్వీకరింప మనవి  కన , వెలసె బెంగళూ రది

  వననిధి తీరమునకు దిగువన | వేసవిలో

  మనుజులు చల్లగ మనగల |

  రినబింబము పగటి పూట హిమగోళ మగున్ !


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి


 20. గట్టిగ జెప్పె నొకండును

  "చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

  అట్టెట్టా?యనకు సుమీ!

  చుట్టల్ గాల్చినను తనువె శుష్కించు గదా!


  🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి


 21. పండిత సభలో వేయాల్సిన ప్రశ్న పామర వరూధినీ సభలో కొచ్చెను. వివరములు తెలుప గలరు


  ఛవిమ త్కంకణమై కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై నూపుర

  ఈ పై వాక్యంలో నుదంచద్వస్త్రయై or నుందంచద్ఘంటయై ? యేది సరి ?


  అడిగిన ఆసామి అనపర్తీశులు


  జిలేబి


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాకు తెలిసినంత వరకు "ఉదంచత్ఘంటయై" సరియైనది. పూర్తి పద్యం....

   మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
   శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
   ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
   ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.(భాగవతం 8-623)

   తొలగించండి
 22. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. ఒక రైతన్న ఆవేదన

  కొట్టిన ప్రభంజనమ్ముకు
  అట్టిట్టై పంట బోయె నయ్యో!కుయ్యో!
  గట్టును జేరుట యెటులో!!!!
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్.

  రిప్లయితొలగించండి
 24. పట్టము గట్టిరి నాడే
  చుట్టల్ గాల్చిన దొరలకు జోరుగ ధనమున్
  గట్టిరి కప్పము కనుమా
  "చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

  రిప్లయితొలగించండి
 25. విట్టుకుఁ జిన్నతనమ్మునె
  మట్టముగాఁ దెలియు భోగి మంటలఁ బెట్టన్
  గట్టిన పిడకల దండలఁ
  *"జుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జిన్నతనముననె' అనండి.

   తొలగించండి


 26. బాహుబలి :)

  అనూష్కయే సుఖసంపత్తి :)


  కట్టప్పా! వెస దివిటీ
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్,
  దిట్టగ నెద్దుల కొమ్ముల
  గట్టి తరుమగ మనకే యికన్ జయము సుమీ

  జిలేబి

  రిప్లయితొలగించండి


 27. అథ యోగానుశాసనమ్

  యోగః చిత్త వృత్తి నిరోధః  చట్టని ధ్యానము చేయుము
  పట్టు విడువ వలదు సూవె పద్మాసనమం
  దట్టడుగు చెలగు తలపుల
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. చుట్టల్ కాల్వకు బాబూ!
  పొట్టల్ పాడగును నీకె పొగ నష్టంబౌ,
  నట్టేట మునుగువెట్టుల్
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మునుగుదు వెటుల్' అనండి.

   తొలగించండి
 29. ఎట్టి యిడుమ లెదురయినను
  గట్టిగ కృషి జేయవలెను గట్టెక్కంగన్
  పట్టియు నన్నిటి చుట్టియు
  చుట్టల్ ; గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 30. కం.చట్టానికి వ్యతిరేకము
  చుట్టల్ బీల్చుట. వినుండు స్రుక్కును మేనె
  ట్టుల చింతించిన భ్రమయే
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపదలున్.
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివరాజలింగం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో ప్రాస తప్పింది. "స్రుక్కును గద మే। నెట్టుల చింతించిన భ్రమ..." అందామా?

   తొలగించండి


 31. చుట్టాల్వచ్చిరి యింటికి
  పట్టమ్మా దస్కముగల బందుగులు సుమీ
  చట్టని తీపి జిలేబీ
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా సత్యనారాయణ
  చుట్టున దీపావళి నీ
  పట్టున క్రిమి కీటకాల బాయగ విధిగా
  బిట్టుగ గంధక పూరిత (భూ,విష్ణు చక్రాదులు)
  చుట్టల్ గాల్చిన లభించు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించండి
 33. తల్లి సుతుని తో....

  కందం
  పెట్టెకు చుట్టల గొనె బ
  డ్జెట్టున ధరపెరుగునంచు జేజయ్య సుతా!
  పెట్టర! కంపుకు మంటల
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 34. తిట్టుదురమ్మానాన్నలు
  చుట్టలుగాల్చిన,లభించుసుఖసంపత్తుల్
  గుట్టుగ సంసారమ్మును
  గట్టడితోజేయునెడల కలకాలమునున్

  రిప్లయితొలగించండి
 35. చుట్టల బీల్చగ జనులట
  గట్టిగ జేకూరు ధనము కప్పమురూపున్
  బిట్టుగ నొండొరుల కచట
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 36. మామ సంపదపై కన్నువేసిన ఒక
  ఇల్లరికపల్లుడు భార్యతో చెబుతున్న మాటలుగా....


  చిట్టీ! వినుమభ్యంతర
  పెట్టకు, దాచిన ధనమును విడువడు గాదే
  గిట్టును తప్పక నిట్టుల
  చుట్టల్ గాల్చిన, లభించు సుఖసంపత్తుల్.

  రిప్లయితొలగించండి
 37. ఎట్టేని గట్టి పట్టుం
  బట్టి మదిన్ దిట్టఁదనము భాసిల్లంగం
  జుట్టి యఘ నికాయంపుం
  జుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 38. గుట్టుగ సంపాదించిన
  రట్టగు అవినీతి ధనము రక్షణ కలుగన్
  యట్టుల పుణ్యపు పనులన్
  చుట్టల్ గాల్చిన లభించు సుఖ సంపత్తుల్

  ఎంత రహస్యంగా సంపాదించిన అవినీతి సొమ్ము బయట పడక మానదు పుణ్య కార్యముల కొరకు ఆ డబ్బు చుట్టలు తగలేస్తే సుఖము పుణ్యం అనే సంపద దొరుకుతుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలుగన్ + అటులన్' అన్నపుడు యడాగమం రాదు. "రక్షణ నిడగా। నట్టుల..." అందామా?

   తొలగించండి
  2. ధన్యోస్మి. బ్లాగర్ లో పెట్టిన కామెంట్ సరి చేయడానికి వీలవుతుందా?

   తొలగించండి
 39. రిప్లయిలు
  1. పట్టణమది చెన్నైలో
   గట్టిగ పట్టగను ముని యొకరువెలసె గదా
   వట్టిగ పోవలదచటకు
   చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

   తొలగించండి
  2. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 40. సంకల్పయాత్రఎలక్షన్ స్పెషల్వీడియోలుసినిమాక్రీడలు బిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్Search
  అక్కడ... చుట్టలు.. మద్యమే నైవేద్యం
  19 Mar, 2014 01:41 IST|Sakshi


  అక్కడ... చుట్టలు.. మద్యమే నైవేద్యం

  భగవంతునికి సమర్పించే కానుక ఎంత గొప్పది అన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తితో సమర్పిస్తున్నా మన్నదే ముఖ్యం. అలా భక్తితో అర్పించే వాటి వరుసలో మద్యం, చుట్టలను కూడా చేర్చారు చెన్నైలోని ‘బాడీగార్డ్ మునీశ్వరు’ని భక్తులు. ఈ మునీశ్వరుని విగ్రహానికి మద్యంతో అభిషేకం చేసి, చుట్టలు నైవేద్యం పెట్టడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటూ వాహన సౌకర్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లగలవని విశ్వాసం.

  రిప్లయితొలగించండి
 41. గట్టిగ చలి యిబ్బందుల
  బెట్టగ నడిరాత్రివేళ పీడ శమించన్
  పెట్టిపడక గది విద్యుత్
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 42. కట్టలుగ దెచ్చుకొందుము
  బిట్టుగ జన్మాంతరముల వేదనలెన్నో
  పట్టి గురుపాదము లఘపు
  జుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్!

  రిప్లయితొలగించండి
 43. "పట్టును రోగములెన్నో
  చుట్టల్ గాల్చిన" "లభించుసుఖసంపత్తుల్
  కట్టడులందున జీవన
  పట్టాలను నమ్మినడువ?బంగరుబాటౌ!

  రిప్లయితొలగించండి
 44. నెట్టన పిడకల దెచ్చిరి
  బుట్టను దండలను గ్రుచ్చి భోగిని మంటం
  బెట్టగ జుట్టిరి విను మీ
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్.


  రిప్లయితొలగించండి
 45. చట్టమిటులు సిగరెట్టులు,
  చుట్టల్ స్వస్థతకుచేటు స్రుక్కుదురనగా
  చుట్టలరాయుండిటులనె
  *"చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"*

  రిప్లయితొలగించండి
 46. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 47. కట్టా!స్వస్థత నీరగు
  *"చుట్టల్ గాల్చిన ;లభించు సుఖసంపత్తుల్"*
  ఎట్టెట్టుదానధర్మము
  లట్టట్టు పరంబునందునగు బుధులనరే

  రిప్లయితొలగించండి
 48. నిన్నటి సమస్యకు నా పూరణ. నాలుగవ ప్రయత్నంలో గణ, యతి దోషాలు లేకుండా వచ్చిందనుకుంటా.

  మనమున శివుడిని నమ్మిన
  అనలము శీతలమగు తిమిరము కాంతియగున్
  ఘనజలనిధి కాలువయగు
  ఇనబింబము పగటిపూట హిమగోళమగున్

  రిప్లయితొలగించండి
 49. మొట్టిన తనసతి మెదలగ
  పుట్టిన ఆవేశమందు పురుషుడి మదిలో
  తట్టిన ఆ నీతిపదమె
  చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  రిప్లయితొలగించండి
 50. దట్టముగ దగ్గు, పడిశము
  పట్టియు గొంతున ఖిచఖిచ ప్రారంభింపఁన్
  దట్టించిన ఓమపు పొడి
  చుట్టల్ గాల్చిన లభించు సుఖ సంపత్తుల్

  రిప్లయితొలగించండి
 51. చిరు ప్రయత్నం...

  మట్టిన గట్టిన యింటను
  వుట్టిగ నుండక ముదుసలి నూదుచు చుట్టల్
  మట్టసముగ తాగి బలికె
  చుట్టల్ గాల్చిన లభించు సుఖ సంపత్తుల్

  (మట్టసము = అధికము)

  మీ...ముడుంబై ప్రవీణ్ కుమార్...

  రిప్లయితొలగించండి
 52. పట్టును రోగాలు విధిగ
  చుట్టల్ గాల్చిన ; లభించు సుఖసంపత్తుల్
  చట్టములను జేసి ప్రభుత
  గట్టిగ శిక్షల విధించ గలిగిన నాడే

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కనగా కాశ్మీరమ్మున
  ఘన శీతల మగుట , జలము గడ్డను కట్టన్
  మనకగుపించడు గద రవి
  ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్

  రిప్లయితొలగించండి