19, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2935 (నారాయణ మంత్ర...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

69 కామెంట్‌లు:

 1. సరదాగా:
  ప్రేమలో పడిన మిత్రునికి ప్రేమ బాధితుడి ఉపదేశం!

  ఏరా! ప్రేమను బడితివ
  నీ రాణికి పేరు మంత్ర నిజమే కదరా!
  నా రణమును చూసితివా!?
  "నారాయణ! మంత్ర జపము నరక మొసంగున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నారాయణ! నారాయణ!
   నారదు డాదిగ మునులకు నమ్మిన కొలువే!
   ఏ రీతిని జెప్పుము యీ
   "నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

   తొలగించండి
  2. జారుడవో చోరుడవొ శ
   కారుడవో మూర్ఖుడవొ వికారపు మతివో
   నారాయణ! యనదగునా!?
   "నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

   తొలగించండి

  3. ఔరా ! మాశకారుని హైజాకు చేసేసారే‌ :)/అదురహో


   ఔరౌర విట్టుబాబు శ
   కారుని కాపీ రయిటు సకలము జిలేబీ
   దౌరౌరా చోరముతో
   నారాయణ మంత్ర జపము నరక మొసంగున్


   :)
   జిలేబి

   తొలగించండి
 2. పేరిమితో ధనమొడ్డుచు
  తేరకు వచ్చును చదువని తికమక తోడన్
  కోరుచు సీటుకు జేసిన
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 3. నారాయణమంత్రంబును
  పారాయణములను జేయ ప్రహ్లాదుడిలన్
  తీరని కష్టాల పడెను
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  పారము జేర్చును నిను సం...
  సారాబ్ధి తరింపజేసి , మహిమాన్వితమౌ
  పారాయణయోగ్యమెటుల
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్ ??

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "సమ్ సారాబ్ధి" లోని "మ్" కు "మ" కు యతిమైత్రి కలదు

   తొలగించండి
  2. "మ --బిందు పూర్వక య,ప,ర,ల,శ ష ,స,హ"

   http://919440277172b.blogspot.com/2016/01/blog-post_1.html?m=1

   తొలగించండి

  3. సమ్ "సారాబ్ధి" మహిమాన్వితమైనదే :)


   జిలేబి

   తొలగించండి
  4. హిరణ్యకశిపుని *దండోరా*


   వైరిని శ్రీహరిఁ బొగడుట
   నేరము ., మారుము , దితిసుతునే కొల్వవలెన్ !
   మారనివారికి నిపుడే
   నారాయణ మంత్ర జపము నరక మొసంగున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 5. ( చండామార్కులు ప్రహ్లాదునితో )
  ఏరా ! నాయన ! యివ్విధి
  కారాకూరపు పలుకుల కలకల మేలన్ ?
  మా రాజు కొడుక ! వినరా !
  నారాయణమంత్రజపము నరక మొసంగున్ .
  ( కారాకూరపు పలుకులు - క్షోభ పెట్టే మాటలు )

  రిప్లయితొలగించండి


 6. భారములను తొలగించును
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్
  కోరికలపుట్టయేను ! ము
  రారి పదముల శరణనుము రమణి జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. కోరుచు ముక్తిని చేయుము
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్
  దూరుచు మాతా పితరుల,
  వారవనిత పొందుగోరు పాపల కెపుడున్.

  రిప్లయితొలగించండి
 8. వారక దినమును రాత్రియు
  కోరికతో జేయుచుండ క్షుద్రార్చనలన్
  జేరి యనె తండ్రి సుతునకు
  నారాయణ! మంత్ర జపము నరక మొసంగున్.

  రిప్లయితొలగించండి
 9. ఏరా ప్రహ్లాద వినుము
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్
  కోరిక హిరణ్య జపమది
  తారక మంత్ర మ్ముకద ర దను జ కు మారా !

  రిప్లయితొలగించండి

 10. నారాయణ - నార+ అయన

  నార యనంగ పిసినిగొ
  ట్టౌర!అయన మాయె దారి ! టంకంబులకై
  నారాయణయని చేయగ
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 11. నోరారంగయనవలెన్
  నారాయణ మంత్ర జపము! నరక మొసంగున్
  హేరాలమ్ముగ తప్పుల
  నౌరా చేయంగ దండన మలకమెరుపై !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. సారాయి గ్రోలి భువిపై
  నేరములను చేయుచునను నిత్యము, ఖలుడై
  పారాయణ చేయ మనగ
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 13. నారదుడు హిరణ్యకశిపు
  ద్వారమ్మున నడుగు మోపు తరుణము నందున్
  "నారా.." యని తా ననుకొనె
  "నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరిట్లు నీయ దలచిరి
   "నారా"యను మంత్రజపము నరక మొసంగున్
   కారాదది ముమ్మాటికి
   నారాయణ మంత్ర జపము నరక మొసంగున్

   తొలగించండి
 14. నోరార నుడువ గాచును
  నారాయణ మంత్రజపము, నరకమొసంగున్
  నారోపణ సేయ తగదు,
  నారూఢిగ బలికినంత నగధరు డార్చున్

  రిప్లయితొలగించండి
 15. కందం.నారాయణ యని పతితుడు
  పారాయణ సేయ జేరు పరమ పదంబున్
  ఔరా! చిత్రంబిది యే
  నారాయణ మంత్ర జపము నరకమొసంగున్
  ఆకుల శివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 16. ఘోరము లొనరించియు తా
  నేరము నొప్పుకొనక తగ నీతుల బల్కన్
  నేరస్థుని కాపాడదు
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్!

  రిప్లయితొలగించండి
 17. కం. నారాయణ యని కొమరుని
  గారాబము తోడ బిల్వ కైవల్యం బున్
  జేరిచెనట,చిత్రం బే
  నారాయణ మంత్ర జపమునరక మొసంగున్
  ఆకుల శివరాజలింగం వనపర్తి.

  రిప్లయితొలగించండి
 18. కోరియు ముక్తిని మదిలో
  నారాటము తోడ హరిని నారాధింపన్
  వేరొకటెంచక, యెట్టుల
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్ ?

  రిప్లయితొలగించండి
 19. గురుదేవులకు శుభోదయ వందనములు
  =============********==≠======
  కోరికలు దీర్చు సతతము
  నారాయణ మంత్ర జపము,నరక మొసంగున్
  క్రూరుల చెలిమిని కోరిన,
  జేరిన కలిమి బలిమి గని శీఘ్రమె నరుడా!

  రిప్లయితొలగించండి
 20. సరదా కందం
  శాస్త్రిగారికి అంకీతం
  సారూ!యిది టైపోగద!
  నారాయణ మంత్రజపము నాకమొసంగున్ !
  పారాకున నిచ్చితిరిటు
  నారాయణ మంత్రజపము నరకమొసంగున్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబిగారికి ధన్యవాదములు!మీ వనపర్తి శాస్త్రిగారికి నా పుస్తకం హార్డ్ కాపీ పంపాను.
   చేరినట్లు జవాబు రాలేదు.కొంచెం కనుక్కోరా,ప్లీజ్ !

   తొలగించండి
  2. ప్రహ్లాదునితో తండ్రి

   ఓరీ! మూర్ఖుడ!మానుము
   నారాయణుడను విరోధి నామజపంబున్
   కూరిమి గొల్వుము కంజుని
   నారాయణ మంత్రజపము నరకమొసంగున్ !

   తొలగించండి
  3. సీతా:

   "అనపర్తి శర్మ" గారికి పంపవలసినది "వనపర్తి శాస్త్రి" గారికి పంపితే ఎలా చేరుతుంది? 😊

   తొలగించండి
  4. Malapropism! చేరెన్ అన్నారు కాబట్టి అప్పుడు అడ్రస్ సరిగానే వ్రాసిఉంటాను.

   తొలగించండి
 21. డా.పిట్టాసత్యనారాయణ
  ఏ రోటి పాటనక్కడ
  తీరా పాడంగ వలయు ధిక్కారంబౌ;
  ఘోరాటవి మృగ నామమె!
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 22. నోరార స్మరణ చేయుచు
  నారాయణ యన్న తొలగు నైమిక్తికముల్
  ఏ రీతి ని నొసగు నిటుల
  "నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

  శ్రీధర శర్మ ఇలపావులూరి

  రిప్లయితొలగించండి
 23. నారాయణ నారాయణ
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్
  ఘోరాతి శత్రువులకున్
  నారాయణుడిని కొలవగ నభయమొసంగున్

  రిప్లయితొలగించండి
 24. సారా మత్తునఁదూలుచు
  వారాంగన పొందులోన పరిహాసమునన్
  నోరదుపుతప్పి చేసిన
  *"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"*

  రిప్లయితొలగించండి
 25. డా.పిట్టా సత్యనారాయణ
  వెగట్టియునధికారము
  జలజాక్షియ సిరుల దేవి(శ్రీదేవి) దక్షుండనుచు
  న్నల నెంజియారు(ఎంజి రాంచంద్రన్ ను) గూడెను
  "తులసి వరించినది దుష్ట దుర్యోధనునిన్"

  రిప్లయితొలగించండి
 26. కందం
  వైరులు దైత్య సహోదరు
  లా రావణ కంసులంత మందున తనలో
  జేరఁగ కూరిమి నెట్టుల
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్?

  రిప్లయితొలగించండి
 27. డా.పిట్టా సత్యనారాయణ
  నిలకలబోయ భానుమతి నిష్ఠను బాసె భవిష్య మెంచకన్
  తల గల పాలకుండనుచు దా ‌సువిశిష్ఠ సుయోధనున్ గనెన్
  చలమున నిట్లు పాల్పడిన చానయె నల్లల లాడి పోయెనా
  "తులసి వరించి వచ్చెనట దుష్ట సుయోధనునిన్ ముదంబునన్"

  రిప్లయితొలగించండి
 28. నేరుగ నాకము జేర్చును
  నారాయణ మంత్ర జపము, నరకమొసంగున్
  ఆరాటపడుచు జీవిత
  పారాయణము ముడుపులకు పరుగులు పెట్టన్

  రిప్లయితొలగించండి
 29. కందం
  నేరాలన్నో జేయుచు
  ఘోరాలకు నూతమిచ్చు క్రూరుని కిలలో
  నోరాడనీయ నొప్పక
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 30. నారాయణుడను రౌడీ!
  పేరెన్నిక గన్నవాడు భీకర రూపుం
  డే రోజు కూడ బెదరడు
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్.

  రిప్లయితొలగించండి
 31. ఇంటర్ విద్యార్థి మనోగతం:

  హేరామ్! వేయించుకు తి
  న్నారు పది యయ్యెదాక నరులకు కావీ
  నీరసపు కళాశాలలు
  "నారాయణ" మంత్ర జపము నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 32. కోరిన కోర్కెలు తీర్చును
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్
  పేరిమిగల హరి నామము
  నోరారగ భక్తిమీర నుడువక యున్నన్.

  రిప్లయితొలగించండి
 33. వైరిగ నెంచుచు విష్ణుని
  శౌరికి జపము క్రతువుల జరగక నాపెన్
  యా రాక్షసపతికి సుతుని
  నారాయణ మంత్రజపము నరకమొసంగున్

  విష్ణుమూర్తిని శత్రువుగా భావించి తన రాజ్యంలో ఎక్కడ జపతపాది క్రతువుల జరగకుండా ఆపిన రాక్షస రాజు హిరణ్య కశ్యపుడికి తన కుమారుడైన ప్రహ్లాదుడు చేస్తున్న నారాయణ మంత్రజపము నరకంలాగా అనిపించింది.

  రిప్లయితొలగించండి
 34. నారాయణ మంత్ర జపము నరకమొసంగున్.

  పూరణకు నా ప్రయత్నము.

  నేరములను చేయుచు ఘన
  ఘోరములనె చేయుచుండు కుత్సిత జనులన్
  తీరము జేర్చఁగ నేరదు
  నారాయణమంత్రజపము. నరకమొసంగున్.

  రిప్లయితొలగించండి
 35. సారంబగు బ్రతుకునిడును
  నారాయణ మంత్ర జపము, నరకమొసంగున్
  దూరుచు దైవమునెపుడున్
  బీరముతో బాధపెట్ట వృధసానువులన్!!!

  రిప్లయితొలగించండి
 36. లేరే యమర వరేణ్యులు
  చూఱకొనఁగఁ బర ధనమ్ము క్షుద్ర సురాళిం
  గోరుచుఁ బరాపకారము
  నారాయణ! మంత్ర జపము నరక మొసంగున్

  రిప్లయితొలగించండి
 37. కోరిక లెన్నో కోరుచు
  దూరుచు మాతా పితరుల దుష్టుల తోడన్
  జేర ఫలమేమి చేయను
  నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్.

  రిప్లయితొలగించండి
 38. "శ్రీరామ భక్తి మరువకు
  నారాయణ"" మంత్రజపము నరకమొసమమగున్
  ప్రేరేపణ గుప్తనిధుల
  కోరికలే?నాశనాన్ని కొనిదెచ్చుటచే!"

  రిప్లయితొలగించండి
 39. (హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదునితో)

  ఔరా! మాటేల వినవు?
  నారాయణ మంత్ర జపము నరక మొసంగున్.
  హే రాక్షస కుల భూషణ!
  ధారుణి యందు నను మించు దైవము గలదే !

  రిప్లయితొలగించండి
 40. మీరుచు హద్దులు పుడమిని
  నేరములేజేయుచుండి నిరతము ప్రజలన్
  నారడివెట్టుచు నుండిన
  నారాయణ మంత్రజపము నరకమొసంగున్

  రిప్లయితొలగించండి
 41. దారులు మూయుచు వృద్ధుల
  నోరును గట్టేయు వంచ నోన్ముఖులెల్లన్
  పోరానిచోటికేగిన
  *"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"*


  బారెడుమీసలు గడ్డాల్
  జారిణితోరాసలీల,జన్నాల్జగడాల్
  వైరాగ్యాహార్యంబుల
  *"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"*

  పోరేవారాంగనలని
  పేరో‌లగమందు పెద్దపెద్దనినాదాల్
  దారిందప్పిన మిథ్యా
  *"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"*

  రిప్లయితొలగించండి
 42. నోరారగనారాయణు
  పారాయణమేవిముక్తి పరమపదంబౌ
  నీరీతినుడవ సబబే
  *"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"*

  రిప్లయితొలగించండి
 43. పారాయణమున మోక్షము
  "నారాయణ మంత్ర జపము, నరక మొసంగున్"
  నారాయణుకెదురుతిరుగి
  పోరాటము జేయబూనపోవును సుఖముల్!

  రిప్లయితొలగించండి


 44. దూరము చేయును దురితము
  నారాయణమంత్ర జపము ..నరక మొసంగున్
  సారా త్రాగుచు దుష్టుల చేరుచు సతతము తిరిగిన జీవిత మందున్
  రెండవ పూరణ


  ధారుణి యందున సతతము
  నారాయణమంత్రజపము నరక మొసంగున్
  కోరినవెల్ల యొసగు విను
  మారక్కసరాజు గొల్వ ననవరతంబున్.

  రిప్లయితొలగించండి